వినమరుగైన

చత్వారాలు - చంపస్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్న అనగా వాళ్ళాయన ఇచ్చిన శుభలేఖను పని హడావిడిలో చదవడానికి వీలుపడలేదు. పెళ్లికి వెళ్లేందుకు ముస్తాబై వివరాలు చూద్దామని చదవసాగింది కాంతమ్మ.
‘‘హంతకరావుకు బాధారమణిని ఇచ్చి’’ అని చదువుతుండగానే, అది వింటూ అహోబిలంగారు లోపలికొచ్చారు.
‘‘ఇంకా శుభలేఖ చదవడంలోనే ఉన్నావా, అవతల ముహూర్తానికి టైమవుతుంటేను. హంతకరావేంటి బాధారమణేంటి నలభైదాటి పధ్నాలుగేళ్లయినా కళ్ళు చూపించుకోవు. వొళ్ళుమాత్రం నీళ్ళ డ్రమ్ములా పెంచేసుకుంటావ్. నాలుగు వెంట్రుకలు నెరిసినయ్యో లేదో తలంతా డైయ్యేసుకొని, నా టై లాగుతుంటావ్ హీరోయిన్‌లా. హనుమంతరావుకు రాధారమణిని ఇచ్చి అని చదువు’’ అంటూ కాంతమ్మ చేతిమీద గిచ్చారు అహోబిలంగారు చిలిపిగా.
‘‘మీ ఫ్రెండ్ ప్రసాదరావు కొడుకు పెళ్ళని చెప్పారులెండి. వివరాలు చూద్దామని తీశాను. నేను రెడీగా వున్నాను పదండి’’ అంది శుభలేఖ ఆయనకిస్తూ.
‘‘గిఫ్ట్‌కవర్ ఎక్కడ’’ అడిగారు.
ఇదిగోనంటూ టేబిల్‌మీదున్న కవర్ ఇచ్చింది.
‘‘గమ్! గమ్!’’ అని అరిచారు.
‘‘ఇపుడెక్కడ వెతుకుతాంగానీ’’ అంటూ వంటింట్లోకి వెళ్లి అన్నం మెతుకులు తెచ్చి ఇస్తూ ‘ఇంతకూ ఎంత పెడుతున్నారు’’ సాగదీసింది కాంతమ్మ.
‘‘ఎంతేమిటి మనందరం కలిసి హోటల్లో ప్లేటు మీల్స్ చేసినా కనీసం రెండొందలవుతుంది. రెండొందలేలే..’’ అంటూనే నాలుగు యాభై కాగితాలు ఆ కవర్‌లో వుంచి ఆ మెతుకులతో కవరు అంటించి జేబులో కుక్కుకున్నారు.
‘‘పిల్లల్ని డైరెక్టుగా అక్కడికే రమ్మన్నాను. మనం బయల్దేరదాం’’ అంటూ ఇంటికి తాళం బిగించి, కాంతమ్మతో వీధిలోకొచ్చారు అహోబిలంగారు.
అహోబిలంగారు ఆఫీసులో బలంగా వుంటారు. ఆయన హోదా అటువంటిది. ఇంట్లో పెత్తనమంతా కాంతమ్మగారిదే. ఆమెను అందరూ అయస్కాంతమ్మగారని పిలుస్తుంటారు. వాళ్ళ ఇంటి గొడవల్ని వెళ్ళబుచ్చుకొని, ఈవిడ సలహాల్ని వెంట బెట్టుకొని వెళ్ళాలనుకొని వీళ్ళింటికొచ్చే ఆడంగులతో సంభాషణ ఆరంభించిందంటే అలానే అతుక్కుపోతుంది. టీవీ సీరియల్స్ ఎపిసోడ్స్‌కన్నా, ఈవిడ మూడ్స్ చాలా హైలెట్‌గా వుంటాయి.
ప్రాచీన గ్రంథాల పట్ల ఆయనకున్న మమకారం కారణంగా పెద్దబ్బాయికి భారతం అనీ, రెండోవాడికి భాగవతం అని పేర్లు పెట్టారు. పెద్దవాడు మహాభారత యుద్ధంలా ఇప్పటికీ ఇంటర్‌మీడియెట్ చదువుతూనే వున్నాడు. రెండోవాడు మాత్రం భాషాప్రవీణ పూర్తిచేసి తెలుగు పండితుడిగా స్థిరపడ్డారు.
పాండవ వనవాసం సిడి చూస్తున్నపుడు ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో ఆ పాత్రధారిణి హేమమాలినికి శ్రీకృష్ణుడు చీరలు పంపిస్తుండగా కాంతమ్మకు నొప్పులొచ్చి ఆస్పత్రిలో చేరి ఆడపిల్లను కన్నది. అందుకని ద్రౌపది అని పేరు పెట్టుకున్నారు. అసలే ఇది కీచకుల కాలం గనుక మరోసారి శ్రీకృష్ణ తులాభారం చూస్తున్నపుడు సత్యభామ పాత్రధారిణికి జమున శ్రీకృష్ణ పాత్రధారి ఎన్టీఆర్‌ను కాలితో తంతుండగా కాంతమ్మకు నొప్పులొచ్చి ఇంట్లోనే ఆడపిల్లను ప్రసవించింది. మొగుణ్ణి అదుపులో పెట్టుకొనే జ్ఞానం వస్తుందని సత్యభామ పేరు పెట్టుకున్నారు. ఇద్దరూ పోస్టుగ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. కాగానే సంబంధాల వేట ఆరంభించాలనుకుంటున్నారు, అనుక్షణం అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకొనే అహోబిలంగారు.
వీళ్ళిద్దరూ వీధిలోకి వచ్చి నుల్చోగానే, వీళ్ళముందు ఆటోలు ఆగి వెళ్తున్నాయ్. నిజానికి వీళ్ళు ఆటోకోసమో నిల్చున్నారు. అయితే అహోబిలంగారు ఏ ఆటో పడితే ఆ ఆటో ఎక్కరు. ఆ ఆటోకు అంటించిన దేవుళ్ళ ఫొటోలు చూస్తారు. ఆ ఆటో అతనికి సెల్ వుందా లేదా అని కనుక్కుంటారు. కళ్ళజోడు వున్నవాణ్ణి అసలు పిలవరు. కాసేపటికి తనకు నచ్చిన దేవుళ్ళ ఫొటోలున్న ఆటోవాణ్ణి చూసి ఆపారు.
‘‘నీకు సెల్ వుందా’’ అన్నారు ఆటోవాణ్ణి చూసి.
‘‘వుంది కావాలా సార్!’’ అన్నాడతను ఫోన్ చేసుకోవడం కోసం అడుగుతున్నారేమో అనుకుని.
‘‘అయితే నువ్వెళ్ళు’’ అన్నాడాయన. అర్థమైందతనికి. డ్రైవ్ చేసేటప్పుడు సెల్ వాడతానేమోనని ఆయన భయమని.
‘‘మీకా భయం అక్కర్లేదు. ఈ సెల్ మీ దగ్గరే వుంచుకోండి’’ అంటూ ఆయనకిచ్చాడు. అహోబిలంగారు తృప్తిగా ఆ సెల్ అందుకొని, కల్యాణ మండపం పేరు చెప్పి, అతను కోరిన దానికన్నా పది రూపాయలు తగ్గించి మాట్లాడుకొని, కాంతమ్మగారితో ఆటో ఎక్కారు. ఆటో కదిలింది.
*
-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-షణ్ముఖశ్రీ