వినమరుగైన

తిండితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘జుస్సూ! ఆ సామ్రాజ్యం నిన్నక్కడే దెబ్బకొట్టింది. మాట్లాడకుండా ఆ అయిదువేలు తీసుకొస్తే సరిపోయేది. అందుకే మనవాళ్ళన్నారు దురాశ దుఃఖమునకు చేటని. ఈ రోజుల్లో పెద్దలెవరిక్కావాలి. వాళ్ళ మాటలెవరిక్కావాలి. ఎవరికి వారే పెద్దలు. ఏం చేస్తావులే వారం వారం వెళ్లి పీల్చిరా!’’ అన్నాడు కఫై.
‘‘ఇక నా బ్రతుకు పొగేనా’’ అంది ఏడుపు మొగం పెట్టి జస్సు.
‘‘ఏడవమాకు పద భోంచేద్దాం!’’ అంటూ జస్సుని తీసుకొని వంటింట్లోకి నడిచాడు కఫై నీరంసగా.
***
జఫై, కఫైలిద్దరూ ఆఫీసునుండి ఇంటికి వెళ్తుండగా వాళ్ళ బాల్య స్నేహితుడు కారులో వెళ్తూ వీళ్ళను చూసి ఆగాడు. ఎన్నాళ్ళకెన్నాళ్లకంటూ అతను కారును ఓ ప్రక్కన నిలిపి దిగాడు. ముగ్గురూ కలిసి దగ్గర్లో వున్న హోటల్లోకెళ్ళారు.
కాఫీలయ్యాక ‘‘నాకు ఎన్నాళ్లనుంచో మంచి హోటలు పెట్టాలనుందిరా!’’ అన్నాడు ఆ కారులో వచ్చినతను.
‘‘మీ నాన్న కోట్లు గడించి నీకిచ్చాడు కదా!’’ అన్నాడు జఫై.
‘‘ఇంకా హోటలెందుకంటావ్! కోట్లు గడిస్తే హోటలు పెట్టకూడదని వుందా’’ అన్నాడతను.
‘‘ఇంతకూ నువ్వు హోటలు పెట్టడానికి మా సలహా కావాలి అంతేగా!’’ అన్నాడు కఫై.
‘‘అంతే! అంతే!’’అన్నాడతను.
‘‘ఈ రోజుల్లో నీటి ఎద్దడి బాగా వుందని నీకు తెలుసు కదా! బాగా నీళ్ళున్న బావి చూసుకొని, ఓ కావిడి వేసుకొని, ఆ నీరు తోడుకొచ్చి, డ్రమ్ముల్లో నిల్వ చేసుకో’’ అన్నాడు కఫై.
‘‘నీ మొహమల్లే వుందా సలహా, మినప్పప్పు ఎంత మండిపోతోందో తెలుసా! ముందు మినపప్పు కొనుక్కొచ్చి నానబోసుకొని కూచో’’ అన్నాడు జఫై.
‘‘ఏదీ! నీ ఇంటికోసం నువ్వు ఇటుకలు కొనుక్కొని పెట్టుకొన్నట్లా- వాడికేం ఖర్మ. ఎంత డబ్బయినా ఖర్చుచేసి హోటలు పెట్టగలడు’’ అన్నాడు కఫై.
‘‘బాగా చెప్పావ్! నా దగ్గర కోట్లు మూలుగుతున్నయ్. జీవితాంతం కోట్లు కోట్లు గురించి, అవి బీరవాలలో పడి మూలుగుతుంటే, చూసి ఆనందించడం మా నాన్న కోరిక. ఆయనకు బిపి, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్ ఇన్ని వున్నా, ఆ డబ్బు చూసుకుంటుంటే ఆయన ఆయుర్దాయం పెరిగిపోతుంటుంది. ఆదాయానికీ, ఆయుర్దాయానికీ ఏదో దగ్గర సంబంధం వున్నట్లుంది. ఆయన కోరిక తీర్చడమే ధ్యేయంగా పెట్టుకున్నాను. మీకెంతైనా డబ్బిస్తాను. మీరే ఆ హోటలు మెయిన్‌టెయిన్ చేయండి. చేస్తున్న ఆ చిన్న జీతాల ఉద్యోగాలు మానేయండి. మీ జీవితాల్ని మెరుగుపరచుకోండి. మీకు సహాయం చేయాలనిపించి చెప్తున్నాను’’ ఊరించాడతను.
‘‘నువ్వూ, మీ నాన్న నిజమైన తిండితులు’’ అన్నాడు జఫై.
‘‘తిండితులా అదేమిటి ఎవరన్నా పండితులంటారుగానీ’’ అన్నాడతను.
‘‘సంస్కారవంతుల్నీ, వున్నదాన్లో తృప్తిపడేవాళ్ళనూ, జీవిత పరమార్థాన్ని తెలుసుకున్న వాళ్ళనూ పండితులంటారు. డబ్బే లోకమనుకునేవాళ్ళను తిండితులంటారు’’ అన్నాడు జఫై.
‘‘మావి చిన్న జీతాలైనా, మాకు తృప్తివుంది. జేబు బరువుకన్నా, జీవితం పరువు ముఖ్యం. నేను కారు కొనుక్కోవాల్సిన యోగమున్ననాడే కొనుక్కుంటాను. అతను ఇల్లు కట్టుకోవాల్సిన యోగమున్నపుడే కట్టుకుంటాడు. అవి వుంటేనే జీవితం అని మేం అనుకోవటంలేదు’’ అన్నాడు కఫై.
‘‘నువ్వు చేస్తానన్న సహాయానికి ధన్యవాదాలు’’ అంటూ కదిలారు జఫై, కఫై.
వాళ్ళ మాటల్లోని అంతరార్థాన్ని అనే్వషిస్తున్న వాడిలా వాళ్ళను చూసి తన అజ్ఞానానికి సిగ్గుపడి తన కారు దగ్గరకు వెళ్లి కారెక్కాడు.
‘‘జానెడు పొట్టకు ఎంత కావాలి. ఆకలికి కావాల్సింది ఆహారం కానీ, ధనాగారం కాదు. నోట్ల కట్టలు నోట్లో వేసుకుంటే ఆకలి తీరదుగా! కోట్లు కావాలనుకునే వాళ్ళంతా తిండితులే. అవసరానికి మించిన ఆదాయం అక్కర్లేదనుకొనే మధ్యతరగతివారూ, ఏ పూటకాపూట కాయకష్టంతో పొట్ట నింపుకొనే పేదవారూ, నిజమైన ధనవంతులు. అవును, వీళ్ళే ధనవంతులు. తృప్తిలో వున్న ఆనందం ఎందులోనూ లేదు! ఇది తెలుసుకున్న వాళ్ళే పండితులు’’ తన స్నేహితుల నుండి నేర్చుకున్న గుణపాఠాన్ని నెమరేసుకుంటూ కారు స్టార్టు చేశాడు ఆ డబ్బున్నవాడు.

ఆకాశవర్షిణి నుంచి...

-అయపోయంది

-షణ్ముఖశ్రీ