వినమరుగైన

చెక్కగారున్నారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలింగ్ బెల్ విని తలుపు తీసింది మహాలక్ష్మి. ఎదురుగా పంగనామాలతో, పంచెకట్టుతో, లాల్చీ ధరించిన వ్యక్తి నిల్చున్నాడు. ఆ కాసేపట్లోనే జేబులోంచి, నశ్యం డబ్బా తీసి నాలుగుసార్లు పీల్చి, అయిదుసార్లు తుమ్మాడు. ఆరోసారి వచ్చే తుమ్మును ఆపుచేసుకుంటూ, తలుపు తీసి వచ్చిన ఆవిడవైపు తేరిపార చూసి తనలో అచ్చు మహాలక్ష్మిలానే వుంది అని లోపల అనుకోబోయి పైకే అనేశాడు, ఆమె విన్నది.
‘‘నా పేరు కూడా మహాలక్ష్మేలే! ఎవరు కావాలి’’ అడిగింది.
‘‘చెక్కగారున్నారా!’’ అడిగాడు ఆ వ్యక్తి కావాలనే అలా పిలిచి.
‘‘చెక్కలూ, తలుపులూ ఇక్కడేం లేవు. ఏదన్నా కలప అడితీకిపోతే అక్కడ దొరుకుతయ్’’ అంటూ చివాలున తలుపేసుకొని లోపలకెళ్లిందామె. విషయాలన్నీ తెలిసినా, ఎవరూ గమనించకుండా తెలియనట్లు నటిస్తూ, ఆ వచ్చిన వ్యక్తి సణుక్కుంటూ ఓసారి అక్కడున్న నేమ్ ప్లేటును చూశాడు. అందులో వెర్రి వెంకటరమణ అని వుంది. అడ్రసు కరెక్టేనే అనుకొంటూ మళ్లీ కాలింగ్ బెల్ నొక్కాడు. ఈసారి ఓ ముసలావిడ తలుపు తీసింది.
‘‘చెక్కగారున్నారా!’’ అడిగాడు.
‘‘లేడు నాయనా! ఈమధ్యనే గండుచీమ కుట్టి కాలంతా వాచి నానా యాతన పడ్డాడు. తిరుపతి వెంకటేశ్వరునికి మొక్కుకున్నాడు. తగ్గింది. మొక్కు తీర్చుకునేందుకు తిరుపతి వెళ్ళాడు’’ అంటూనే తలుపేయబోయిందావిడ.
‘‘ఆయన మీకేవౌతాడు’’
‘‘మా అబ్బాయే’’
‘‘మీ అబ్బాయి పేరు రమణ కదా! చెక్కగారంటున్నారంతా ఎందుకు’’
‘‘ఇదివరకలా అనవాళ్ళు కాదు. ఇప్పుడేమిటో అదో ఫ్యాషన్‌లా అలానే పిలుస్తున్నారు. చిన్నప్పట్నుంచీ అరగదీసిన గంధంలా చక్కగా ఘుమఘులాడుతుండేవాడు. అందుకని మేం ముద్దుగా గంధపు చెక్క అని పిలుస్తుండేవాళ్ళం. ఈ పేరెలా బయటకు పొక్కిందోగానీ, అందరి నోళ్ళలోనూ మావాడి పేరు పోకచెక్కలా నానుతోంది’’.
‘‘మీ అబ్బాయి నిజంగానే మంచి గంధపు చెక్కలాంటివారేనండీ’’ కాస్త పొగిడాడు నశ్యండబ్బా తీసి పీలుస్తూ.
‘‘అయ్యో నిలబెట్టే మాట్లాడుతున్నాను. లోపలికి రా నాయనా’’ అంటూ లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి మంచినీళ్ళు కూడా ఇచ్చి మర్యాద చేసింది.
‘‘మీరు చెప్పినవన్నీ బాగున్నాయండీ. ఆ మహాలక్ష్మిగారు మీ కోడలా! చెక్కగారున్నారా అని అడిగితే విసుగ్గా లేరని తలుపేసుకొన్నారు. మీ కోడలికీ, మీ అబ్బాయికీ మధ్య ఏవైనా గొడవలా’’ సందేహంగా అడిగాడు.
‘‘మా కోడలే! అలాంటివేం లేవు గానీ, వాళ్ళాయన్ను అందరూ అలా పిలుస్తుంటే చిరాకేస్తోంది. ఎవరి మొగుణ్ణయినా చెక్కగారూ, కుక్కగారూ అని పిలిస్తే కోపం రాదూ. అంతే, ఇంతకూ నీ పేరు చెప్పావుకావు’’ అందామె.
‘‘నా పేరు గోవింద గోపాలం. నా పేరులోనూ ఓ చిక్కుంది’’
‘‘ఏమిటో’’
‘‘పుణ్యమొస్తుందని ఇంట్లో అందరూ గోవింద గోపాలం అనే పిలుస్తారు. కానీ,బయట మాత్రం అందరూ పొడి పొడిగా గోగో అని పిలుస్తూ రమ్మంటారు. ఇంట్లోనేమో ప్రాచీన హోదాలో తెలుగు, బయటనేమో ప్రాపంచిన భాషలో గోగో వివరించాడు.
‘‘నిజమేలే! ఇప్పుడంతా అలానే వుందిలే నాయనా. మా పిన్ని కొడుకు ఒకడున్నాడు. వాడు ఇంట్లో భగవద్గీత చదువుతాడు. బయటకెళ్ళేటప్పుడు బైబిలు చదువుకొంటూ వెళ్తాడు. ఇంటికొచ్చేటప్పుడు మసీదు నుంచి వస్తాడు. అదేమిట్రా అంటే నీకు తెలీదులే పెద్దమ్మా. దేవుడు ఏ రూపంలో వచ్చి మన కోర్కెలు తీరుస్తాడో ఈ రోజుల్లో ఎవరూ చెప్పలేరు. అందుకని ఎవర్నీ విడిచిపెట్టకూడదు అంటాడు’’.
‘‘అతనేం చేస్తుంటాడేమిటి’’
‘‘ఆ ఏం చేస్తాడు. చదువూ లేదూ చట్టుబండలూ లేదు. కొన్నాళ్ళు బ్లాకులో సినిమా టిక్కెట్లు అమ్మే ఉద్యోగం చేశాడు. ఆ డబ్బుతో జల్సా చేస్తూ, రికార్డు డాన్సులనీ, బార్లలో బీర్లనీ, రోడ్లలో వెళ్ళే పోర్లతో ప్రేమలనీ, ఇంకా ఏమిటో వాడి బొంద, వాడి బోలే. చిట్టచివరగా ఇపుడు ఓ రాజకీయ నాయకుడికి వెంట పెంపుడు కుక్కలా తిరుగుతూ, బక్కచిక్కి ఛస్తున్నాడు.

ఆకాశవర్షిణి నుంచి... -సశేషం

-షణ్ముఖశ్రీ