వినమరుగైన

చెక్కగారున్నారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీడి సావాసమే మా అబ్బాయికీ అబ్బి, మంత్రినవుతా, మంత్రినవుతా నంటూ ఉబ్బితబ్బిబ్బై వాళ్ళావిడ దగ్గర గంతులేస్తున్నాడు. ఆవిడ అంతకన్నా అపుడే ఆవిడ మంత్రిగారి భార్య అయిపోయినట్టు, మాటా పలుకులేకుండా గాల్లో తేలిపోతోంది. ఈ గర్వాలేమిటో ఈ గోలలేమిటో, నాడు ఏనాడన్నా మేం ఇవన్నీ ఎరుగుదుమా, ఏదో ఇంత తిన్నామా, ఓ మూల పడున్నామా అంతే’’.
‘‘అవునవును అంతే. అంతే. అబ్బో చాలా చెప్పేశారు. మరి నే వస్తానండీ!’’ విషయ సేకరణ బాగానే చేసినందుకు సంబరపడిపోతూ.
‘‘ఇంతకూ మీరొచ్చిన పనేమిటో చెప్పారు కారు’’
‘‘మీ అబ్బాయిగార్ని గురించి అందరూ అనుకొంటున్న మాటలన్నీ చెప్పేశారండీ! మీ అబ్బాయిగారు మంత్రి కావడానికి నా చేతనయినంత సాయం చేద్దామనే వుంది. కాలం కలిసి రావాలిగా. మీ అబ్బాయిగారి స్టయిలే వేరండి. ఆ స్టయిలేమిటో మీరే చూస్తారుగా’’ అంటూ వెళ్ళడానికి లేచాడు.
‘‘నేను మంత్రి తల్లినైతే, మీలాంటివాళ్ళందర్నీ మా అబ్బాయిలానే చూసుకొంటాను. మీకేం కావాలన్నా మొహమాటపడకండి’’ అందామె. ఆయన వెళ్ళగానే తలుపేసుకుంది.
***
మరొకరోజూ ఉదయం 9 గంటలు కావస్తుండగా ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. తలుపు తీసింది మహాలక్ష్మి.
‘‘ఓ అన్నయ్యగారా! రండి కూర్చోండి’’
‘‘రమణ ఇంకా పారాయణ చేస్తూనే వున్నాడా!’’
‘‘అలవాటైన విష్ణు సహస్రనామ పారాయణమేగా అయిపోయింది. పూజ కూడా అయిపోవచ్చింది, కూర్చోండి’’- ఇలా ఆవిడ అంటూ వుండగానే లోపల్నుంచి రమణ రానే వచ్చాడు. ఆమె లోపలికి వెళ్లింది.
‘‘నిన్నూ, నీ చేష్టల్ని చూస్తుంటే నాకు కడుపులో తెమిలినట్లుంటుంది’’ అన్నాడు వచ్చినతను, అదో రకంగా మొహం పెట్టి.
‘‘ఎందుకు రాజూ!’’
‘‘అవున్రా అలా అనక ఎలా అనమంటావ్. బయటకొచ్చి జనం దగ్గరేమో కులాల్లేవ్, మతాల్లేవ్, మనుషులంతా ఒకటే, మమతలన్నీ ఒక్కటే, దేవుడు లేడు గీవుడు లేడు అంటూ ఉపన్యాసాలిచ్చి ఊదరగొడుతుంటావ్. ఇంట్లోనేమో మహాభక్తుడిలా పూజలతో ఊగిపోతుంటావ్. జనాన్ని ఇలా మోసం చేయడం తప్పు కదా!’’ అన్నాడతను.
ఇంతలో మహాలక్ష్మి కాఫీలు తెచ్చి ఇద్దరికీ ఇస్తూ.
‘‘అందుకేనేమో! ఈమధ్య చాలామంది మావారి పేరు మార్చేసి చెక్కగారున్నారా అని అడుగుతున్నారు’’ అంది.
‘‘చూచాయగా ఈమధ్యనే నేనూ వింటున్నా!’’’ అన్నాడు రాజు కాఫీ త్రాగి.
‘‘రాజకీయల్లా ఇవన్నీ మామూలే!’’ గిట్టనివాళ్ళెవరో అలా పిలుస్తుంటార్లే’’ అని సరిపెట్టుకొనే ధోరణిలో అన్నాడు రమణ.
‘‘అలా అని ఊరుకొంటే ఎలా? నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. నువ్వు మంత్రి కావడం మాటెలా వున్నా, నువ్వో కంత్రీవనుకొని నిన్ను మామూలు మనిషిగా కూడా చూడరు’’ అన్నాడు రాజు.
‘‘ఏం ఎందుకని?’’
‘‘ఎందుకేమిటి. దేవుడు లేడనే నీకు దేవుడు పేరేంటని వాళ్ళ ప్రశ్న. అందుకే నిన్ను చెక్కగారంటున్నారేమో!’’
‘‘చిన్నప్పుడు పెద్దవాళ్ళు పెట్టిన పేరు. అంతమాత్రం చేత నాస్తికుడుగా వుండకూడదని రూలుందా?’’
‘‘రూలంటూ ఏం లేదుగానీ, దేవుడు లేడనేవాళ్ళ దగ్గర లేడనీ, ఉన్నాడనే వాళ్ళ దగ్గరున్నాడనీ నాటకాలాడితే ఎప్పుడో అప్పుడు జనం నాలుగ తగిలిస్తారు’’
‘‘రాజకీయమంటే ఇదే. లేడనే వాళ్ళ ఓట్లూ, వున్నాడనేవాళ్ళ వోట్లు కావాలిగా’’
‘‘అందుకే అందర్నీ కలుపుకుపోవాలంటావ్. అయిడియా బాగానే వుంది కానీ, నిజం తెలిసిందంటే నిన్ను కలుపు మొక్కలా తీసిపడేస్తారు’’.
‘‘అన్నయ్యగారు బాగా చెప్పారు. ఇప్పటికైనా ఆయనకు జ్ఞానోదయం అయితే సంతోషిస్తాను. మంచి దారిలో మంత్రి కావడం గౌరవప్రదం. దేశానికి అటువంటి మంత్రులు గర్వకారణం’’ అంటూ కాఫీ కప్పుల్ని లోపలికి తీసుకెళ్లింది మహాలక్ష్మి.
ఏదో ఆలోచిస్తూ రమణ, రాజూ ఒకరి ముఖాలొకరు చూసుకొంటుండగా-
‘‘చెక్కగారున్నరా!’’ అంటూ బయటనుంచి కేక వినిపిస్తుంది.
‘‘ఎవరూ!’’ అంటూ తొంగి చూశాడు రమణ అయోమయంగా. లోపల్నుంచి రమణ తల్లి చూసి గుర్తుపట్టింది.
‘‘రండి! రండి! గోవింద గోపాలంగారూ!’’ అంటూ లేచొచ్చి లోపలికి పిలిచింది. అతను లోపలికి వచ్చాడు.
రమణ, రాజూ అతనివైపు ఎవరా అన్నట్లు చూశారు.
‘‘కూర్చోండి’’ అందామె. కూర్చున్నాడు.
‘‘ఆ! అన్నట్లు చెప్పడం మరిచాన్రా! నువ్వు తిరుపతి వెళ్లినపుడు నీ కోసం వీరొచ్చారు. గోవింద గోపాలంగారట’’ అంటూ పరిచయం చేసి లోపలికెళ్లిందామె.
‘‘ఏం చేస్తుంటారు ’’ అడిగాడు రమణ.
‘‘విష్ణాలయంలో అర్చకుణ్ణి’’
‘‘నా పేరు మీకు రమణ అని తెలీదా’’
‘‘నాకే కాదు మీ పేరు మన పేటలో అందరికీ తెలుసండీ! అతే ఈ మద్య మీ ఉపన్యాసాలూ, పేపర్లో మీరు రాస్తున్న సందేశాలు చూసి, ఉబ్బి తబ్బిబ్బైపోతున్న జనం మీకు కొత్త బిరుదునిచ్చి సత్కరించాలని తలపోస్తున్నారండీ! ఆ సత్కార సభ నిర్వహణ బాధ్యతను నా నెత్తిపైన పడేశారు. ఏదైనా ఓ కార్యక్రమాన్ని చేపట్టానంటే అది పూర్తయ్యేవరకూ నిద్రపోను. పైగా నా అదృష్టం, -సశేషం
ఆకాశవర్షిణి నుంచి...

-షణ్ముఖశ్రీ