వినమరుగైన

చెక్కగారున్నారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ అదృష్టం బాగుంది మీకో మంచి పదవి దక్కిందనుకోండి. మీ ద్వారా ఎన్నో పనులు చేయించుకోవచ్చు. ఇప్పుడల్లా మీకిచ్చే బిరుదుపైనే తర్జన భర్జనలు జరుగుతున్నాయ్. చెక్కగారంటే మీరు బిక్కమొగం పెడ్తారేమో. పోనీ పేకముక్కగారంటే పేలవంగా వుంటుందేమో. ఇలా రకరకాలుగా అనుకుంటున్నా. మీ స్పందన కోసం అందరూ ప్రస్తుతం చెక్కగారని పిలుస్తున్నారు. ఘంనగా, గట్టిగా, స్ట్రాంగ్‌గా వుంటుందేమోననుకొని. లేదంటే కార్యనిర్వాహక సభ్యులు మరేదైనా సూచించవచ్చు’’ అంటూ ఆపాడు గోవింద గోపాలం.
‘‘మీరు చెప్పిందంకతా బాగనేవుందండీ! కానీ నాకీ సన్మానాలూ, సత్కారాలూ పెద్దగా ఇష్టం లేదండీ! బిరుదులకు నేనెప్పుడూ దూరమే! ఎందుకంటే అందరూ మహానుభావుడు మహానుభావుడు అంటూ దణ్ణం పెడ్తారే గానీ, ఇంత అన్నం పెట్టేవారెవరన్నా వున్నారుటండీ! మన దేశంలో ఎన్నో బిరుదులు సంపాదించిన వాళ్ళలో చాలామంది పూట గడవక పస్తులున్నారంటే వినడానికి ఎంత బాధాకరం. అందుకే నాలాంటివాళ్ళంతా ప్రతి నిమిషం పదవులకోసమే పరుగులు తీస్తుంటారండీ! పైసలుంటేనే కదండీ అందరూ పలకరించేది’’ అని ఆపాడు రమణ.
‘‘మీరలా అని తప్పించుకోవడం ఏం బావులేదు. నాకన్నా చిన్నవారు. బాగా పైకి రావాల్సినవారు. మీరు ఒప్పుకు తీరాల్సిందే’’
‘‘మీరు మరీ మొహమాటపెట్టేస్తున్నారు’’ అంటూ కాఫీ తెమ్మని లోపలికి కేకేవేశాడు రమణ.
రాజు మాత్రం చెక్కగారు బిరుదేమిటని చిక్కి శల్యమయ్యేలా ఆలోచిస్తున్నాడు. మహాలక్ష్మి కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ తాగాడు గోవింద గోపాలం.
‘‘ఎప్పుడు చేయాలనీ, ఎక్కడ చేయాలనీ’’ అడిగాడు ఆసక్తిగా రమణ.
‘‘ఇప్పుడే ఇక్కడే!’’ అంటూ వాకిలివైపు చూశాడు గోవింద గోపాలం. ఓ పదిమంది శరవేగంగా కర్రలతో లోపలికొచ్చారు.
రమణ, రాజూ, ఇంట్లోని అత్తా కోడళ్ళూ గజగజా వణుకుతూ, గిగిజా తన్నుకోసాగారు.
ఆ వచ్చిన వాళ్ళలో ఇద్దరు ఓ బరువైన చెక్కను మోసుకొచ్చి రమణ నెత్తిపైన పెట్టి గట్టిగా పట్టుకొని ‘ఇప్పట్నుంచీ మీ పేరూ, బిరుదూ అంతా ఈ చెక్కే. ఇహనుంచి మిమ్మల్ని ఎప్పుడూ చెక్కగారనే పిలుస్తారు. ఒకవేళ మీరు ఎన్నికల్లో పోటీ చేయాలనుకొన్నా మీ ఎన్నికల గుర్తుగా ఈ చెక్కే బాగుంటుందని చెప్పడానికే మేమంతా వచ్చాం’’ అంటూ మెల్లగా ఆ చెక్కను తీసేసి ఓ ప్రక్కన పెట్టారు.
‘‘ఎందుకండీ! అడ్డదిడ్డంగా మాట్లాడి ప్రజల్ని మోసం చేస్తారు. ఏ ఎండకాగొడుగు పడ్తే, మీకు పదవి కట్టబెడతారనుకోవడం మీ అపోహ మాత్రమే! ఈ కాలంలో అంత అమాయకులెవరూ లేరండీ! అన్ని విషయాల్ని పూర్తి స్థాయిలో గమనించే శక్తి అందరిలోనూ వుంది. అలా ఇంకెప్పుడూ నటించకండి. ఇది సమాజానికి మంచిది కాదు. దేవుణ్ణి దేనికిబడితే దానికి వాడుకోవడం మీ లాంటివారి దేహాలకూ, గృహాలకూ, దేశానికీ మంచిది కాదు’’ అంటూ గోవింద గోపాలం వచ్చినవాళ్ళను తీసుకొని రమణవైపు అదోలా చూసి వెళ్లిపోయాడు.
చెక్కమొహం పెట్టుకొని కూర్చుండిపోయిన రమణవైపు అసహ్యంగా చూశారంతా! ఆత్మాభిమానం లేని జనె్మందుకన్నట్లు.
-అయపోయంది

-షణ్ముఖశ్రీ ఆకాశవర్షిణి నుంచి..