వినమరుగైన

లకపికమక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లంబోదర లకుమిరా’ అని పాడుకుంటూ వచ్చిన రామశాస్ర్తీ, ఆ ఇంటి గేటు ప్రక్కన గూటిలో వినాయకుడికి పూజా కార్యక్రమం నిర్వహించి హారతి ఇచ్చి తలుపేయబోతుండగా, ఇంటాయనవచ్చి హారతి కళ్ళకద్దుకొని, తన సూట్‌కేసుతో లోపలికెళ్లాడు.
ఆ వెంటనే ఆ లోపల్నుంచే వచ్చిన కూర్మావతారంగారు ‘‘రేపు సాయంత్రం ఆనందహేల హాలులో సన్మాన కార్యక్రమం. షరా మామూలే. సన్మానమెవరికో ముందుగా తెలియదు’’ అన్నారు. ‘‘అవునవును. ఇంటాయన వచ్చారుగా! మన ఇళ్ళల్లోని వాళ్ళమంతా రేపు సాయంత్రం అక్కడే!’’ అన్నాడు రామశాస్ర్తీ.
‘‘లంబోదర లకుమిరా! అని పాడుతుంటారుగా! ఆ లక్కు మీకేరా! అని గణపతి అన్నట్లు. బహుశా ఆ సన్మానం మీకే కావచ్చు’’ అంటూ వెళ్తున్న కూర్మావతారం గారితో పాటే కదిలాడు రామశాస్ర్తీ నవ్వుకుంటూ.
***
ఆ ఇల్లు పాతిల్లే అయినా, కళాకారులు, కుల వృత్తులవారితో ఎప్పుడూ కళకళలాడుతూంటుంది. ఇంటాయన ఒక్కడే పైఅంతస్థులోని పెద్ద భాగంలో వుంటాడు. ఏం పేరో ఎవరికీ తెలియదు. కాసిమ్ అని, కాశయ్య అనీ, కాశీ అని అంటూంటారు. ఏ మతంవాడికి ఆ మతం వాడిగా, ఏ కులంవాడికి ఆ కలంవాడిగా అనిపిస్తూ, అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు.
క్రింద వున్న అయిదు వాటాల్లోని మొదటి వాటాలో రామశాస్ర్తీ ఆయన భార్య వున్నారు. చూసేవాళ్ళంతా అనురాగ దంపతులనే అనుకుంటారు. చీకటి పడ్డాక మాత్రం చిటపటలాడుతుంటారు. పూజలకూ, శ్రాద్ధాలకు వెళ్లి వచ్చిన రోజున దాంపత్యం కూడదన్న నియమంవల్లనే మానసికాందోళనతో రగిలిపోతుంటారు. మూఢమి రోజుల్లో, శూన్య మాసాల్లో మాత్రం శృంగారకేళిలో కరిగిపోతుంటారు.
రెండో భాగంలో సినిమాల్లో స్టంట్ సీన్లలో నటించే గోపాల్రాజున్నాడు. మూడో భాగంలోని లింగిశెట్టి తను వున్న పోర్షన్‌లోనే ఓ కిరణా కొట్టు నడుపుకుంటున్నాడు. అతనికి భార్యా కూతురూ వున్నారు. దంపతులిద్దరూ నల్లగా వుంటారు. వాళ్ళ అమ్మాయి పద్మ మాత్రం తెల్లగా వుంటుంది. ప్రతివాళ్లూ ఈ విషయంగా మాట్లాడుతుంటే, లింగిశెట్టికి ర్యాగింగ్ బారిన పడినట్లుగా వుంటుంది. నాలుగో భాగంలో పెద్ద రోడ్డులో చిన్న వినాయకుడి గుడి ప్రక్కనే ఫుట్‌పాత్ మీద చెప్పులు కుడుతూనే ప్రభుత్వం వారిచ్చిన ఆర్థిక సాయంతో చెప్పుల షాపు పెట్టుకున్న పెద్దిగాడున్నాడు. అతనికి పెళ్లికావాల్సిన అక్క, తల్లీ వున్నారు. అక్కకు సినిమాలూ, టీవీ సీరియల్స్ మీదనే ధ్యాస. చదువుమీదకన్నా, కనిపించిన కుర్రాళ్లను కవ్వించడం హాబీ. వాళ్ళు నిజంగానే వెంటపడితే పెద్దగా ఏడవడం, పెద్దిగాడు వెళ్లి వాళ్ళకు నాలుగు తగిలిచ్చి రావడం మామూలు. అయిదో భాగంలో వున్న లెక్కల మాస్టారు బద్దల్లే సన్నగా వున్నా, డెబ్భై ఏళ్ళ వయసులో కూడా ఇంటింటికీ వెళ్లి ట్యూషన్లు చెబుతుంటారు. మహాభయస్థులు. ఇప్పటికీ ఇంట్లోకి గ్యాస్ పొయ్యి కొనక, కిరోసిన్ స్టౌవ్‌నే వాడుతున్నారు. ఎంత దూరమైనా నడిచే వెళ్తారుగానీ, బస్సెక్కరు. దిగేటప్పుడు పడుతానేమోనని భయం. వాళ్ళావిడ వసంతమ్మకు అరవేయ్యళ్ళు నిండినా ముఖం కళగా వుంటుంది. ఏ పోరగాడన్నా ఆమెను ప్రేమిస్తాడేమోనని, గది కిటికీ తలుపులు తెరవరు.
మేడపైనున్న మొదటి భాగంలో వున్న కూర్మావతారంగారు నాటకాలకు సంగీతం, దర్శకత్వం నిర్వహించడమే కాకుండా ‘వింతసంతల సాంస్కృతిక సంఘం’ వ్యవహారాలు కూడా చూస్తుంటారు. ఆయన హార్మోనియం వాయించడం మొదలుపెడితే ప్రతివాడి వంట్లోని హార్మోనులన్నీ సునామీ కెరటాల్లా కేకలేస్తయ్. రెండో భాగంలో జూనియర్ ఆర్టిస్టు పరిమళం వుంటోంది. వెకిలివేషాలులేని కళాభిమాని. మూడో భాగంలో అగ్రవర్ణంలో పుట్టి, డిగ్రీలూ, మెడల్సు వుండి కూడా ఉద్యోగం లేక గోళ్ళు గిల్లుకుంటున్న శ్రీహరి వున్నాడు. నాలుగో భాగంలో చాలా కాలంగానే ఓ క్షురకర్మ ప్రవీణుడుంటున్నాడు. అందమైన క్రాపులు చేయడంలో సిద్ధహస్తుడు. వెంట్రుకవాసి తేడా రాకుండా కత్తెరేస్తుంటాడు. హస్తవాసి మంచిది. ఎక్కడా గాటుపడదు. ఇన్ని రకాలవాళ్ళంతా ఈ ఇంట్లో వుంటున్నా, ఏ ఒక్కనాడు ఎవరూ ఏ విషయంలోనూ ఘర్షణ పడకపోవడం విశేషం. ఎందుకంటే అన్ని భాగాల్లోనూ ఎవరికీ ఏ విధమైన ఇబ్బందీ లేకుండా, అన్ని వసతులూ వున్నాయ్. ఇంటాయనకూడా ఎప్పుడూ ఎవర్నీ నిర్బంధించి ఫస్టు తారీఖునే అద్దె ఇవ్వమని అడగడు. ఇచ్చినపుడే తీసుకుంటాడు. అందుకే ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ పట్టించుకోరు.
***
ఆనాటి సాయంకాలం ఆనందహేల హాలు హాలు హడావిడిగా వుంది. సన్మానం ఎవరికో ముందుగా ప్రకటించకపోవడమే ఆ ‘వింత సంతల సాంస్కృతిక సంఘం’ ప్రత్యేకత. అందుకే ఆ సన్మానమేదో తమకే ఎందుకయ్యుండకూడదనుకొంటూ, కవులూ, కళాకారులూ, ప్రముఖులూ తండోపతండాలుగా రాసాగారు. ఇంత జనాన్ని అదుపు చేయడం ఆ సంఘ కార్యనిర్వాహకులకు ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు అదే సమయంలో ఆ హాలు యాజమాన్యానికి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. దాంతో అదిరిపడి పోలీసువారికి కబురుపెట్టగా వాళ్ళు బాంబుల నిపుణులతో, కుక్కలతో వ్యానులో వచ్చి తనిఖీలు మొదులుపెట్టారు.

*
ఆకాశవర్షిణి నుంచి...
*
-సశేషం

-షణ్ముఖశ్రీ