వినమరుగైన

లకపికమక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంత గొడవ జరుగుతున్నా ఆనాటి సన్మానం తమకేనన్న ఆనందంలో కవి, పండిత, గాయక, నృత్య ప్రవీణులు మాత్రం ఒకరినొకరు పరమద్వేషంతో చూసుకుంటూ, గ్రుడ్లు మిటకరిస్తూ, గుటకలు మ్రింగుతూ, గుండ్రాళ్ళలా, ఉండ్రాళ్ళకోసం వచ్చిన వినాయకుళ్ళలా కదలక మెదలక కూర్చున్నారు. పోలీసువాళ్ళు వచ్చి గావుకేకలు వేశాక గానీ, వాళ్ళకు ప్రాణభయం కలుగలేదు. ఓ గంట వరకూ నానాగోల జరుగుతూనే వుంది. ఆ తరువాత బాంబులేదని తేలడంతో, బాంబుల నిపుణులు వెళ్ళారు. పోలీసులలో కొందరు మాత్రం ఇంకా ఏవో పరిశోధనలు చేస్తూ, వచ్చేపోయే జనాన్ని పరిశీలిస్తూనే వున్నారు. ఇక మన జనం సంగతి చెప్పేదేముంది. అన్నిట్లోనూ ముందుండాలి. అన్నీ మనకే దక్కాలి. ఇంకెవరికీ ఏమీ మిగలకూడదు. ఒకవేళ ఎవరన్నా తమకన్నా అన్నిట్లోనూ గొప్పగా వుంటే వాళ్ళను చూసి లోపల ఏడవడమే కాకుండా, పైకే పెద్దగా ఏడవడం. పక్కవాళ్ళమీద చీదడం, ఎవరు చీదరించుకున్నా దులుపుకుపోవడం. ఇటువంటి మహదానందకరమైన మనోవికాసం కలిగిన ఈ జనం ఒళ్ళు మరచి, ఒకరిమీద ఒకరు పడి, పిల్లా జల్లా, ఆడ మగ, ముసలీ ముతకా అన్న తేడా లేకుండా, ముందు సీట్లకోసం విరగబడి లోపలికి రావడం మొదలెట్టారు. ఈ భయంకరమైన త్రొక్కిసలాటలో ఓ వ్యక్తి తూలిపడగా, ఎవరూ మానవతా హృదయంతో లేవదీయకపోగా, అతన్ని తొక్కుకుంటూనే లోపలికి జొరబడ్డారు. ఇంతలో ఆ హాలు యాజమాన్యం, తమ హాలు పరువు ప్రతిష్ఠలకు భయపడి, అంబులెన్సును పిలిపించి, ఆ వ్యక్తికి మరో వ్యక్తిని తోడుగా ఎవర్నన్నా పంపాలని అడిగితే, ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఓ కార్యనిర్వాహకుడు ఆ క్రిందపడిన వ్యక్తిని చూసి తనకు కావాల్సినవాడుగా గుర్తించడంతో, ఆందోళనతో అతని వెంట వెళ్ళాడు. కాస్త నిశ్శబ్దం ఆవరించింది. ఎందుకంటే సభా ప్రారంభ సూచనగా, వింత సంతల సాంస్కృతిక సంఘం కార్యదర్శి కూర్మావతారం గారు వేదికమీదకు వచ్చి కూనిరాగం తీస్తూ మైకు పట్టుకున్నారు.
‘‘సభకు నమస్కారం. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మన కాశిమ్‌గార్ని, అదే మన కాశయ్యగార్ని, అదే మా ఇంటాయన్ను ప్రార్థిస్తున్నాము. అలాగే పరిమళాన్ని వచ్చి ప్రార్థనాగీతాన్ని పాడమని కోరుతున్నాము’’ అన్న కూర్మావతారంగారి మాటలతో కాశిమ్‌గారు వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. పరిమళం మైకు దగ్గరకు వచ్చి ‘‘తెలుగే తేట తెలుగు, తెలివే తెల్లని వెలుగు, దేవుడే జీవుడు, జీవుడే దేవుడు, అభిమానమే కళకు ప్రాణం, దోమలుంటేనే రోగులు, దోషులే లేకుంటే అంతా ఋషులే, ఈ దేశమే పరిమళం, మనమంతా పరవశం’’ అని పాడి వెళ్లి తన సీట్లో కూర్చుంది. ‘‘ఇప్పుడు మన సంఘ కార్యకర్త పెద్దిగాడు వచ్చి ప్రసంగిస్తాడు’’ అని కూర్మావతారంగారు చెప్పగానే పెద్దిగాడు వచ్చి కాశిమ్‌గారి కాళ్ళకు నమస్కరించి, ఆయన చెప్పిన మాటను చెవిలో వేసుకొని, ఓ నవ్వు నవ్వుకొని, మైకు దగ్గరకు వచ్చి, ‘‘మానాభిమానాలున్న మీ అందరికీ కళాభివందనాలు. మనందరి మద్దెన, మనమున్న ఇంట్లోనే వుంటూ చక్కని క్రాఫింగ్‌లు చేస్తూ, కటింగ్‌లో కింగ్ అనిపించుకుంటున్న కటింగ్ ఫింగర్ లీలయ్యకు ఇయ్యాల సమ్మానం చేయాల్సిందిగా మన కాశిమ్ అనబడే కాశయ్యగారు, పెద్దయ్యగారు చెప్పారు’’ అని చెప్పి వెళ్లి తన సీట్లో తానున కూర్చున్నాడు. కొందరు చప్పట్లు కొద్దిగా కొట్టి ఊరుకున్నారు. మరికొందరు క్షణమాగి అనుకోని ఆనందంతో చాలాసేపు చప్పట్లు కొట్టారు. మిగతా జనం, గుసగుసలు, విసవిసలు. ఈ అనుకోని సంఘటనకు విస్తుపోయిన లీలయ్య, క్షణకాలం అయిసయిపోయి, ఎక్కడో దూరంలో నిల్చుని సభను చూస్తున్నందున, మెల్లమెల్లగా జనాన్ని దాటుకుంటూ స్టేజీ ఎక్కేసరికి మరికొంత సమయం తీసుకుంది. వెళ్తూనే పెద్దాయనకు పాదాభివందనం చేసి సభవైపు తిరిగి నమస్కరించాడు. కాశిమ్‌గారి చేతికి ఓ పూలమాల, ఓ కవరు, శాలువా అందించారు కూర్మావతారంగారు. ఆయనగారు ఆ శాలువాను లీలయ్యకు కప్పి, పూలమాల వేస్తూ, ‘‘రెండు లక్షల రూపాయల చెక్కును సంఘం తరఫున లీలయ్యకు అందజేస్తున్నాను’’ అని చెప్పి ఆ కవరు అతని చేతిలో వుంచారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ, ‘‘ఎన్ని డిగ్రీలున్నా, ఈనాడు ఉద్యోగాలు రావడంలేదని వార్తలు వింటున్నాం. అందువలన ఇటువంటి కార్యక్రమాల ద్వారా కులవృత్తుల్ని ప్రోత్సహించడం మంచిదని మా అందరి ఉద్దేశ్యం. కుల మతాల మాట ఎలా వున్నా, కులవృత్తులు మాత్రం చెక్కు చెదరకుండా వుండాలి. అప్పుడే ఈ దేశానికి పురోగతి. లేకుంటే అధోగతే. ఇది సత్యం’’ అని చెప్పి ఆయన కూర్చున్నారు. కూర్మావతారంగారి సైగతో లీలయ్య మైకు దగ్గరకు వచ్చాడు. ‘‘పెద్దోళ్లందరికీ వందనాలు. ఈ అయ్యగారికీ మరీ మరీ దండాలు. -సశేషం

-షణ్ముఖశ్రీ ఆకాశవర్షిణి నుంచి..