వినమరుగైన

సౌందర నందము - పింగళి లక్ష్మీకాంతము, కాటూరి వేంకటేశ్వరరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటువంటి పద్యాలు, పాత్రలు మానసిక సంఘర్షణమును, చిత్త వివర్తములను స్పష్టంగా చూపే పద్యాలు ఎన్నో ఉన్నాయి. ఇవి కవుల భావనకూ, దానినుండి జనించిన భావాలకూ సాక్ష్యాలుగా నిలుస్తాయి.
ఆంధ్రకావ్యంలో చిత్రలేఖన లక్షణం నెలకొన్నది. కవితాపరమార్థాన్ని పసిగట్టగలిగినుత్తమ చిత్రకారుడు మనోహర చిత్రాలుగ రచింపదగ్గ పద్యాలెన్నో ఈ కావ్యంలో ఉన్నాయి. బుద్ధ్భగవానుడు లోకంలోని దైన్యాన్నీ, దుఃఖాన్నీ నందునకు వివరించే సందర్భంలో పలికిన పద్యం అక్షర రూప చిత్రమే-
‘‘ఆకలిసెకకు కాయమున మాంసాదులు
హరియించి పోవ శల్యములు మిగిలి
పొలుసెత్తి, పాలి, కన్నులగుంట లేర్పడి
బోరయెండఁగ బొజ్జ బూరటిల్ల
పుడక కాళుల తోడ నడయాడుచల్లన
పెరటిలోనికి నేగి బిడ్డడచట
మంటిపెళ్లలు దినుచుండ గన్గొనియును
వల దని వారింప వాక్కు రాక
కుత్తుకన్ నల్లపూసయు, కుండలోన
వడ్లగింజయు, కనుల బాష్పములు లేక
కడుపు చుమ్మలు చుట్టగా నడలుచున్న
తల్లులం గాంచవో నీవు తమ్ముగుణ!
ఆంధ్ర సౌందరనందంలో నాటక లక్షణం ఎక్కువ. దీనిలోని తొమ్మిది సర్గలూ తొమ్మిది రంగాలు. ఈ రంగాల్లోని పాత్రల మనస్తత్వాలను గుణమయిన వాచికాభినయం, దానికి తగిన ఆంగికాభినయం, దానికి వెనె్నపెట్టే సాత్త్వికాభినయం పాఠకుల మనశ్చక్షువునకు గోచరమై రసానుభూతిని కలిగిస్తాయి. ఒక్కొక్కరి కవులే ఆంగీకాభినయాన్ని సాత్త్వికాభినయాన్నీ సూచిస్తారు. సమాజ సంకటస్థితిని కన్నులకు కట్టేట్లు వర్ణించిన బుద్ధ్భగవానునకు సమాధానం చెప్పటానికి ‘అల్లన నిల్చి రాకొమరడానతుడై తొలుదొల్త సుంత తొట్రిల్లియు కొం కొకింత యధరీకృతమైన కొలంది మాటలన్ తొల్లిటి మాధురీ మహిమ దోపగ నంజలి పట్టి’’నాడట!
సౌందరనందంలో ప్రధాన పాత్రలు మూడే. బుద్ధ్భగవానుడు, నందుడు, సుందరి. సుందరీనందుల హృదయ పరివర్తన నాటకానికి సూత్రధారి బుద్ధ్భగవానుడే. అందువల్లనే కావ్యం ఆశాక్యసింహుని ప్రశంసతో ప్రారంభమై ఆదేశికోత్తముని జయకారంతో అంతమవుతుంది. ఈ కావ్యంలో బుద్ధ భగవానుడు చేసిన బోధలు మూడు. కపిలవస్తు పురంలో ఆ తథాగతుడు సందర్భాన్ని బట్టి తన్ను చేరవచ్చిన సామాన్య ప్రజలకు సత్యం, దయ, శీలం, సమత్వం, అస్తేయం, అహింస, బ్రహ్మచర్యం మొదలయిన వాటిని మాత్రమే బోధిస్తాడు. దీనికంటె ఆ గురుపుంగవుడు నందునకు చేసిన రెండు బోధలూ జీవిత పురుషార్థాన్ని నిర్దేశిస్తాయి. మొదట బుద్ధ్భగవానుడు నందునకు నియతమయిన మృత్యువును గూర్చీ, అశాశ్వతమయిన సౌందర్యాన్ని గూర్చీ బోధిస్తాడు. రెండవ బోధలో బౌద్ధమతానికీ, సమాజానికీ గల గాఢ సంబంధం ప్రకాశిస్తుంది. ఇక్కడే ఆయన ‘‘మమత లేనట్టి ప్రేమ నిత్యము కుమార’’! అని అన్నాడు.
తానొక గడ్డకట్టుకొని, తత్పరతన్ శిలలై నశించు
జ్ఞానుల కేడనోయి సుఖసంగతి! తాఁదనయాలు నాత్మసం
తానము తోడబుట్టువులు, తల్లియు దండ్రి కులమ్ము దేశమున్
మానవులెల్ల ప్రాజులు కుమాం! సమస్తము తాను గావలెన్
అని మానవజాతి గమ్యాన్ని వివరించాడు.
‘‘జీవకారుణ్యమే మాకు జీవగఱ్ఱ’ అనీ,
ప్రేమ కన్న సత్యము లేదు భిక్షుకులకు
పరమసత్యము కన్న సుందరము లేదు’’
అనీ వ్యాఖ్య చేశాడు. బుద్ధ్భగవానుని తృతీయోపదేశమే సౌందరనందం గావించే ఉపదేశం.
ఉన్నవ లక్ష్మీనారాయణగారన్నట్లుగా ‘‘యన్మహా త్యాగ మహిమమ్ము నాలకించి, మూడుకాలముల్ రోమాంచమును వహించు’’ అంటూ ప్రారంభమయిన సౌందరనందం కావ్యం వంటి కావ్యం వేయి సంవత్సరాలకు వెనుక పుట్టలేదు. ఇక వేయి సంవత్సరాలకు ముందు పుట్టబోదు’’.
-అయపోయంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-నాగళ్ల గురుప్రసాదరావు