వినమరుగైన

దీపం దర్శయామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏమిటి వదినా ఒక్కత్తెవూ ఇలా..?’’ అంది దీప.
‘‘ఏం చెప్పను దీపా! మీ అన్నయ్యను అరెస్టు చేసి తీసుకెళ్ళారు’’ అంది పుట్టెడు దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ లక్ష్మి.
‘‘ఆ! ఏమిటీ! రమేష్‌ను అరెస్టు చేశారా? ఏమైందమ్మా లక్ష్మీ! ఏమైంది?’’ ఆదుర్దాగా అడిగాడు ప్రమోద్.
‘‘ఏం చెప్పమంటారన్నయ్యగారూ, దర్జాగా బతుకునీడ్వాలన్న ఆలోచనతో ఆఫీసుల్లో లంచాలూ, అవి చాలక అందరి దగ్గరా అప్పులూ, వీటన్నింటికీ తోడు దొంగ కరెంటు వాడడం, ఇదీ చాలక స్మగ్లింగ్ వాళ్ళతో సంబంధాలు. ఇన్ని నేరాలున్న వాళ్ళను ఊరికే వదిలిపెడ్తారా?’’ అంటూ భోరుమంది లక్ష్మి.
‘‘అరెరే! ఎంత ఘోరం జరిగిపోయింది?’’ అంటూ దీపవైపు చూశాడు ప్రమోద్. చూశావుగా, గొప్పలకు పోతే వచ్చే తిప్పలన్నట్లు.
‘‘ఘోరం జరిగిపోయిందని ఊరుకుంటే ఎలాగండి? ఎలాగోలా మా అన్నయ్యను విడిపించేందుకు ఏదన్నా ప్రయత్నం చేయండి?’’ అంటూ విలవిల్లాడింది దీప. క్షణకాలం దీర్ఘంగా ఆలోచించాడు ప్రమోద్.
‘‘అమ్మా లక్ష్మీ, నువ్వేం దిగులుపడకు. నేర చరిత్రలున్న నాయకులు పదవుల్లో ఉన్నంతవరకూ, మీ అన్నయ్యలాంటి ఆధునిక భావాలున్న ప్రజలకు ఏ మాత్రం ఇబ్బంది లేదు. ఈపాటికే మీ అన్నయ్యను బెయిల్‌మీద విడుదల చేయించి ఇంటికి తెచ్చే ఉంటారు. ఎవ్వరూ కంగారు పడక్కర్లేదు’’ అన్నాడు ప్రమోద్ వాళ్ళకు ఊరట కలిగిస్తూ.
‘‘నిజంగానా! అంది సంతోషంగా లక్ష్మి.
‘‘అంతేనంటారా!’’ అంది దీప కూడా ఆనందంగా.
‘‘అంటే ఏమిటి? అంతే! మీరే చూస్తారుగా!’’ అన్నాడు ప్రమోద్.
‘‘అబ్బ ఎంత చల్లనిమాట చెప్పారండీ!’’ అంది దీప.
‘‘నామాట ఎప్పుడూ చెల్లనిమాట కాదు. చూశావా దీపా! మా అన్నయ్య ఎంత దర్జాగా వెలిగిపోతున్నాడో అన్నావు, ఇప్పుడేమైంది? ఉన్నదాంట్లో సర్దుకుపోవడంలో వున్న తృప్తి, ఆనందం ఎందులోనూ లేదు. ఆడంబరాలకు పోయి, ఇటువంటి అవస్థలు కొనితెచ్చుకొని, పరువు మర్యాదల్ని మంటగలుపుకొని, అశాంతిగా బతకడం కన్నా, నీతి నిజాయితీగా బతకడంలోనే మనశ్శాంతి ఉంది. మనీభ్రాంతిలో పడి మానవుడు పశువుగా ప్రవర్తిస్తున్నాడు. మానవుడుగా జీవించలేకపోతున్నాడు. పరువుకన్నా జేబు బరువు ముఖ్యమను కుంటున్నాడు. ఇటువంటివాళ్ళకు ఎన్ని రకాలుగా సంపాదించినా కరువు తీరదు. కూలీ నాలీ చేసుకుంటూ ఏ పూటకాపూట గింజలు కొనుక్కుని గంజి తాగేవాళ్ళకన్నా వీళ్ళుచాలా బీదవాళ్ళు. ఇప్పటికైనా తెలిసిందా దీపా! నేనెందుకింత కఠినంగా ఉంటున్నానో! మాట్లాడుతున్నానో’’ అంటూ తను చెప్పవలసిందింకేం లేదనట్లు చూశాడు ప్రమోద్.
‘‘తెలిసిందండీ, మీ ప్రవర్తనలోని పరమార్థం ఇప్పుడర్థమైందండీ! మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఏమేమో అనుకున్నాను. ఏమేమో అన్నాను. నన్ను క్షమించండీ!’ అంది దీప.
‘‘కూర్చోమ్మ లక్ష్మీ! అంటూ లక్ష్మి కూర్చున్న తర్వాత ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాడు ప్రమోద్.
‘‘ఏమిటి మీరు ఫ్యాన్ వేశారా!’’ అడిగింది ఆశ్చర్యంగా దీప.
‘‘కొత్తగా వచ్చిన పెళ్ళానికి పొదుపు అలవాటు చేయకపోతే, నేను కూడా మీ అన్నయ్యలాగే వేరే దార్లు వెతుక్కోవాల్సి వస్తుందని అలా ప్రవర్తించాను. పొదుపు చేయాల్సిందే. కానీ సమయం సందర్భం కూడా చూసుకోవాలి’’ అన్నాడు ప్రమోద్.
ప్రమోద్‌లోని సద్గుణానికీ, అన్నయ్య విషయంలో కలిగిన ఊరటకు ప్రశాంతి చెందిన దీప అందరికీ కాఫీలు తేవడానికి లోపలికి వెళ్లింది. అందరూ ప్రమోద్‌లాంటి మనుషులే ఉంటే దేశమంతటా ‘దీపం దర్శయామి’ అని అందరూ అనుకుంటారని లక్ష్మికి తన మనసులో మెరిసిందో మెరుపు. -అయపోయంది

-షణ్ముఖశ్రీ ఆకాశవర్షిణి నుంచి..