వినమరుగైన

నేనొక మానవుణ్ణి... జిజ్ఞాసకుణ్ణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(కొత్తపల్లి వీరభద్రరావుతో తాపీ ధర్మారావు- 1972 జూలై)

కొ.వీ: ఓహో! చాలామందికి తెలియదది.
తా.్ధ: బి.ఏ. పాసయి వస్తూనే, బండి దిగేటప్పటికే, టీచర్‌గా ఉద్యోగమిచ్చారు... ప్రిన్సిపల్‌గారు.
కొ.వీ: లెక్కల మాష్టారుగా ప్రారంభించారు.
తా.్ధ: లెక్కల మేష్టారు... ఎప్పుడైనా పది నిమిషాలు నాకు ఖాళీ టైమ్ వచ్చిందంటే లైబ్రరీలోనికి వెళ్ళిపోయేవాడిని.
కొ.వీ: అక్కడ లెక్కలు చూసేవారు కాదు.
తా.్ధ: ఇంగ్లీష్‌లో మంచి, చక్కని కవిత్వంగానీ, చక్కని రచనగానీ కనిపించినట్లైతే అబ్బ! ఇలాంటిది మన భాషలో కూడా ఉంటే, బాగుంటుంది కదా... అని దృష్టెంతసేపూ అలాగ...
కొ.వీ: తెలుగు అభివృద్ధికి రావాలి.
తా.్ధ: తెలుగు అభివృద్ధికి రావాలని.
ఇంగ్లీష్‌లో గోల్డ్‌స్మిత్ రాశాడు- ‘‘ఏన్ ఎలిజీ ఆన్ ది డెత్ ఆఫ్ ఎ మాడ్ డాగ్’
కొ.వీ: ... ఆఫ్ ఎ మాడ్ డాగ్... అవును...
తా.్ధ: అది చూశాను. ఇట్లాంటిది లేకపోయిందే. ఎందుకు చేయకూడదూ అని నేను కారుణ్యము అనీ... ఎలిజీకి మాట. తెలుగులో ఏమిటీ... అప్పుడు కాయిన్ చేసుకుని, కారుణ్యము అని. ‘చచ్చిన నల్లి మీద కారుణ్యము’ అని...
కొ.వీ: హ్హ... హ్హ! (నవ్వు)
తా.్ధ: ఇక ఈ కారుణ్యాన్ని - అప్పుడు, ‘ఆంధ్రపత్రిక’, బొంబాయిలోంచి రన్ అవుతూండేది- వారపత్రికగా. ఇది, అక్కడికి పంపించాను. అక్కడికి పంపిస్తే, వారు, పేపర్‌లో బోర్డర్ లాంటిది ఒకటి కట్టి ‘చచ్చిన నల్లిపై కారుణ్యము- తాపీ ధర్మారావు బి.ఏ...
కొ.వీ: బి.ఏ. ఉండాలి కదా (నవ్వు)
తా.్ధ: బి.ఏ. ఉండాలి కదా... రాత్రింబవళ్ళు కష్టపడి... సంపాదించింది కదా. (నవ్వు)
తా.్ధ: అంచేత, ట్యూషన్, స్టడీ, టీచర్, ఇవి సైడ్ బై సైడ్ రన్ అవుతూనే ఉన్నాయి.
కొ.వీ: చాలా సహాయంగా...
తా.్ధ: అదొకటే కాదు. ఇవి సైడ్ బై సైడ్ రన్ అవుతూంటే... ఏదో పత్రిక నడిపించాలి...
కొ.వీ: ఔను పత్రికేవిటీ?
తా.్ధ: ఒకటా విశాఖపట్నంలో టీచర్‌ని కొన్నాళ్ళు. అక్కడ సెట్టి మాష్టరుగారు, పి.టి. శ్రీనివాసయ్యంగారు వాళ్ళ అధికారం కొంచెం విమర్శనీయంగానే కనిపించింది. అప్పుడు ‘కొండెగాడు’అని పేరుతో ‘పత్రార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః’ అని ఒక అర పేజి, ప్రతివారం అచ్చువేసి... కుర్రవాళ్ళుండేవారు. మేష్టర్ని నేను. ఒరే ఇది రెండు కాసులురా’అంటే, రాగానే అందరూ కొనేసుకునేవారు. అక్కణ్ణుంచి మద్రాసులో ఉండిన ‘న్యూయింగ్టన్ ఇన్‌స్టిట్యూషన్’... తర్వాత, ‘రాజ్‌కుమార్ కాలేజ్’ కాబోయినటువంటిది... అందులో, ట్యూటర్ ఎండ్ గార్డియన్ కావాలి. దానికేవో ఆటలు, పాటలు రావాలి. పాడాలి, గుర్రమెక్కాలి... అంచేతను టీచర్‌లు అనేటటువంటి మాట... దీనికితోడు, ఇందాక చూసిన సాహిత్య సేవగానీ, ఇంతకుముందు సజెస్ట్ చేసినటువంటి పత్రికా నిర్వహణగానీ, ఆ సినిమా- వాటికి పాటలు రాయడం గానీ... ఇవన్నీ చేస్తూన్నప్పుడు కూడా ఈ పని జరుగుతూండేది.
కొ.వీ: అందుకే విశ్రాంతి కావాలి ఏదేనా గొప్ప పని జరగాలంటే...
తా.్ధ: విశ్రాంతి పనిలోనే ఉన్నదనే నా అభిప్రాయం.
కొ.వీ: ఆరోజుల్లో కవిత్వమేమన్నా రాశారా మీరు?
తా.్ధ: ఓయబ్బ! కావల్సినన్ని ఉన్నాయి (చిన్ననవ్వు గొంతులో)
కొ.వీ: ఏదొక్క పద్యం చదవండి. -సశేషం

చెరగని స్ఫూర్తి తాపీ ధర్మారావు విశే్లషణల సమాహారం నుంచి. (సౌజన్యం:ఆకాశవాణి, హైదరాబాద్)

సంపా. డా.నాగసూరి వేణుగోపాల్, డా.సామల రమేష్‌బాబు