వినమరుగైన

నేనొక మానవుణ్ణి... జిజ్ఞాసకుణ్ణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(కొత్తపల్లి వీరభద్రరావుతో తాపీ ధర్మారావు- 1972 జూలై)

తా.్ధ:వెలికిలబండి, దృష్టి
గృహ భిత్తిక నొక్కట నిల్పి, యెట్టి సం
చలనము లేక దుస్సహ
విషాదములం గణియించుచుండ కన్
కొలకుల జాఱి కర్ణములకుం
దిగు నీరు తలాపి నింకఁగా
వలవల యెల్ల నేడ్వఁగల వార
లదెంత తపంబొనర్చిరో..

కనుగవ నశ్రు గోళములు
గ్రక్కునఁ జిప్పిలు వేళ ఱెప్పలన్
గననగు బాగుఁ జెక్కులు డిగంగఁ
గవోష్ణతరంగ మిచ్చు స్ప
ర్శన సుఖ, మక్కునందు పడి
చల్లగ తాపము నార్చు సొంపునున్
బనుపడునట్టు లేడ్వగల
వారలదెంత తపం బొనర్చిరో..
కొ.వీ: చాలా బాగుంది. వచన కవిత్వమేమన్నా రాస్తున్నారా?
తా.ద: మనం రాసిన వచనమంతా కవిత్వమే నా ఉద్దేశంలో. హ్హహ్హహ్హ (నవ్వు)
కొ.వీ: ఇప్పుడూ, మీరు చదివిన పద్యాల్ని చూస్తే గ్రాంథిక భాష బాగా ఆరోజుల్లో మిమ్మల్ని..
తా.్ధ: గ్రాంథిక భాషొకటే కాదు, ఒక్క అపుష్ఠాంతం ఉండదు. ఒక్క అనవసరమైన పదముండదు. ఏదైన ఒక శబ్దాన్ని ప్రయోగించామంటే ఆ శబ్దమే నాలుగింట్లో.. ఆ శబ్దమే ప్రయోగించవలసినటువంటి అవసరం ఉండకుండా పోదు. అలాగ ప్రబంధ కవుల అడుగుజాడల్లోనే.. ఎక్కడైనా జారితే జారుండొచ్చును గాని.. ఆ అడుగుజాడల్లో వేసినటువంటిదే. చదవడం అలాగే చదువుతున్నాం. విమర్శన కూడా ఆ మోస్తరుగా చేసీ ‘తా, రసపుష్టియై, ప్రతిపదంబున జాతియు, వార్తయున్, చమత్కారము, నర్ధగౌరవము’ అని చెప్పాడే ఆ పద్ధతిలోనే మనం కూడా ట్రై చేద్దామూ అని.
కొ.వీ: ట్రై చేయడమేమిటి? సక్సెస్‌ఫుల్‌గా చేశారు.
తా.్ధ: గాంధీజీ పేపర్ రన్ చేస్తూన్నప్పుడు.. ‘ఇండియాస్ పావర్టీ, హౌ ఇట్ హాజ్ రాబ్డ్ బై సో మెనీ ఫెలోస్..’ అని చెప్పేటప్పటికి గుండెల్లో పెద్ద కలవరమొచ్చింది. ‘ద్యోయానము’ అని పేరు పెట్టి.. ఈ కలవరమెలా ఎక్స్‌ప్రెస్ చేస్తానే్నను?..
ఉన్నది కన్నటు వ్రాయుట / కన్నఁ గవికి మేలు లేదు గద, తాత్పర్యా
భ్యున్నతి నారసి రసజ్ఞ/లెన్న నలంకార రచన లేలా నాకున్?
‘స్వాంత విస్ఫూర్తి లేని వాస్తవము కన్న..
కొ.వీ:‘స్వాంత విస్ఫూర్తి లేని వాస్తవము కన్న
తా.్ధ: కన్న, ‘సత్యబుంబోలు కల్పిత సరణిమేలు’. అందుచేత, ఏం చేస్తామూ, కల్పనా, సత్యమూ రెండూ మేళనం చేసి, నిజమే రాసెద చదివి చింతింపుడనుచు..
కొ.వీ:బాగుంది.

చెరగని స్ఫూర్తి తాపీ ధర్మారావు విశే్లషణల సమాహారం నుంచి. (సౌజన్యం:ఆకాశవాణి, హైదరాబాద్) -సశేషం

సంపా. డా.నాగసూరి వేణుగోపాల్, డా.సామల రమేష్‌బాబు