వినమరుగైన

నేనొక మానవుణ్ణి... జిజ్ఞాసకుణ్ణి (కొత్తపల్లి వీరభద్రరావుతో తాపీ ధర్మారావు- 1972 జూలై)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుల నెరిగించి, సంస్కృతము / తో మిళితంబుగ, పల్కనిచ్చి, భూ
తలపతి కొప్పగించి చనె / ధాత విధించిన రీతి గాక; నా
వల, మన తిక్కనాది కవివర్యులనేకులు / ముద్దుమాటలన్
దెలపగ నేర్చి, బాలిక గ / తిన్నుతి కెక్కుచు, నల్లసాని వా
క్కుల గల చిత్రవస్తువుల / గుంభనలంగని, ప్రౌఢరీతి, రా
యల వరియించి, మ్లేచ్ఛకుల / మన్విపినంబును గాల్చి, సంపదన్
కులుకుచు, దిక్కులెల్లదన / కుం బొలిమేరలు గాక నిల్చి శో
భిలె; నయిన స్సుఖంబు కడు / వేగము పోవుచు గాదె ధాత్రిలో
పల; నటు, రాయలేగిరి ది /వంబునకుం, దదనంతరంబు కో
మలిపడుపాటు లెన్న మన / మా, మన ధాతయు జాలడే కదా
కొ.వీ: (చిన్న నవ్వు)
తా.్ధ: ఖలులు తురుష్కులొక్క మొగి /గా దన దేహము గాల్పనెంచి, బా
ముల నిడి రూపుమాపదల / పోసిరి; చేసిరి ఘోర కృత్యముల్
తలపడినారు, రాజ్యముల /్ధ్వంసము జేసిరి, గ్రంథముల్ దవా
నలమున ద్రోసినార; లిక / నా గతి యేమగునో యటంచు బె
గ్గిలి, యొక మూల డాగి .. కడు / గ్రించు దరంబున నున్న యింతి నాం
గలవిభు లత్యుదారతను / గాంచి తలంచి, తలోదరీ, భయం
బలమగనీకు, నీ కభయ / హస్తము నిచ్చితి, మింకస్వేచ్ఛగా
నిలకల యన్నినాళ్ళు మను / మీ చనుమీ ఘనమార్గమందు నే
కలకల మందకుండ నని / కాచిరి.. పిమ్మట నీ మెలంతకున్
చెలియలు కర్ణచారి తన / సేమము నారయ ముద్దురూపుతో,
నలరెడు కీర్తితో గలిమి / నాకసమంటుచు, వచ్చి విన్ననై
వెలవెలబోయి, యట్టె పృథి / విం గనుచుండెడి తన్వి జూచి, చిం
తిలి, యిదియేమి నేడకట / దీని చరిత్రము చోద్యమాయె, నీ
కలవరమేమి హేతువున / గల్గెనొకోయని చేరి, యక్కరో
కలకల మేటి కమ్మ? మము / గాంచి వచింప విదేల కొమ్మ? నీ
చిలుకల బోని పల్కు లెటు / జేర్చితి వమ్మ / విభూషలేవి? సం
స్ఖలనము లేని మందగతి / కానగ రాదిదియేమి కొమ్మ? నీ
కొ.వీ:ప్రబంధ ఛాయలు కనపడుతున్నాయి.
తా.్ధ:చెలువము శయ్యము న్విడిచి / చేడ్పడియుంటి విదేల యమ్మ?’ యం
చలికచ పల్క, వెక్కి, యక / టా! యని, హా యని ‘యేమి చేయుదున్,
తొలుతటి బాధ పోయెనని / తోచె దురుష్కుల బాధ తగ్గె నం
చలరితి గాని, చెల్లి, విప / దంబుధి ద్రోయ గడగి నాదు పు
త్రులె యకటా; ప్రతిజ్ఞ గొని / రూపును మాపుచు నున్నవారు. నా
కిల నిక దిక్కు లేదు గద / టే? వలవంతను మానుటెట్టు? లే
వలన సుఖంబు గాంచెద? న / పారముగా గనుపట్టు దుఃఖమే
నలుగడ, రూపు పోయెను, ఘ /నంబగు వృత్తులు మాయమాయె, భూ
షలు కరవాయె, శయ్యలొక / సారిగ మింటికి బారిపోయె, సూ
నులు నను బిల్వరాయె నిక / నూయియొ గోయియొ చూచుకొందు, నన్
దలపకు చెల్లి, యంచుగను / దమ్ముల గార్చెను బాష్పధారలన్ అని కథ చెప్పి-
వివిధ భాషల నేర్చిన యాంధ్రులార, రుూ
తెలుగును గావ బూనుడల / తెంపరి రీతి జరించి గ్రామ్యమున్
గలుపగ బోకు డీగతిని / కట్టడి మార్పుల చేర నీకుడీ
చెలగి తెలుంగు సంస్కరణ / సేయగ బూనితిరేని, పెక్కు భం
గులు గల, వందు భావముల / గ్రొత్తలు సేయుడు, శైలి మార్చుడీ
పలుగతుల న్మహా ప్రకృతి / వర్ణన సేయుడి; యంశ నైజముల్
మిళితము చేయ బూనుడి; ర / మింపగ జేయు డికెట్టులైనగా
ని, లయము జెంద గ్రామ్యమును / నిక్కపు పాదరసంబు గూర్చి వ
నె్నల కనకంబు మా ఎతలగు / నీరసవౌనటు జేయకుండ మ
మ్మలరగజేసి మీరు సుఖ /మందుచు నుండు, డటంచుగోరి దో
సిలి నొనరించి మ్రొక్కెదను / చేకొను డార్యులు, ధర్మరాయడన్
కవులు ప్రజల్లో విశేష వ్యాప్తి చెందుతూ ఉండి, వాళ్ళ నోట పట్టడానికి అవకాశమున్నటువంటి రచనలు, అందరికీ తెలిసే భాషలో ఉండాలి. దానికి వేమన మొదలైనవాళ్ళంతా ఉన్నారు. నేను నాటకంలో గుర్రిగాడు, జడ్జిగాడు, అప్పిగాడు అని గురజాడ అప్పారావును మూడు ముక్కలు చేసి వాళ్ళను పాత్రలను చేసి దోషమే ప్రతిభాదోషం.
కొ.వీ (నవ్వు)
తా.్ధ: ప్రతిభా పాటవాలున్నపుడు ఇలాంటివన్నీ.. అలాగ.. చూస్తున్న తరవాతను, ఇలా కదా. మన పాండిత్యం, అప్పటికప్పుడే, ప్రబంధ కవిత్వం. వృద్ధ కవిత్వం అనేటప్పటికే వెనుకపడుతూ ఉన్నారు. ఇది చూసేటట్టుగా లేదు. ఎవరైనా వినాలి అంటే మన పద్యం చెప్పి, కూచోపెట్టి, ఆ పద్యానికి అర్థం చెప్పి, ఆ అర్థంలో ఉన్న భావం కూడా చెప్పితే ఆ తలకాయకు ఎక్కుతుందో యేమో, చెప్పలేమా ఆ పద్ధతుల్లో ఉందీ అని. అక్కర్లేదులే.. (ఇక అప్పుడు) కొత్త పాళీ. ఆ కొత్తపాళీని పెట్టి రెండు దారప్పోగులతో కట్టాను. ఈ రెండు దారప్పోగులూ రెండు సూత్రాలు. ఒకటి భాషదీ; ఒకటి భావానిదీన్ని.
కొ.వీ: మీరు మిమ్మల్ని గూర్చి ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని ఎవర్నిగా మేం గ్రహించి, గౌరవిస్తే మీకెక్కువ ఆనందం? అది మాక్కావాలి.
తా.్ధ:నన్ను గురించి నేననుకోవడం నేనొక మానవుణ్ణి అని.
కొ.వీ:మహా మానవులు.
తా.్ధ: యావజ్జీవితం సంగతుల్ని గ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండినటువంటి ఒక జిజ్ఞాసకుణ్ణి అని. ఇక నేననుకోవలసినటువంటిది, ఇందాక మనవి చేసినట్టుగా, నేర్చుకుందాము, ఇంకా పదేళ్ళు ఉన్నట్టయితే, మరొక, పారిజాతాపహరణం వ్యాఖ్యానం కూడా పూర్తిచేసేద్దాము.
కొ.వీ:బాగుంది. శుభం. తప్పకుండా జరగాలి.
తా.్ధ:ఉంటే, చేస్తాను, లైఫ్ హిస్టరీ కూడా‘రాలూ రప్పలూ’ అని పేరు పెట్టి రాస్తున్నాను. బి.ఏ పరీక్ష పాసయినంత వరకూ రాశాను.
కొ.వీ: అబ్బో! ఇంకా చాలా వెనకున్నారు, తొందరగా రాయాలి.

(సౌజన్యం:ఆకాశవాణి, హైదరాబాద్)

-అసంపూర్ణం