వినమరుగైన

ఆధునిక మహాభారతము - గుంటూరు శేషేంద్ర శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వభావే వర్తతే లోకః తస్య కాలః పరాయణం లోకం తన స్వభావం చేతనే నడుస్తోంది. ఆ స్వభావానికి కాలం ఆధారం. ఆదికవి వాల్మీకి రామాయణం కిష్కంధకాండలో ఈ శ్లోకం చెప్పాడు. లోక స్వభావాన్ని అంచనా వేసి దాని తత్త్వాన్ని శాస్ర్తియంగా అంచనా వేయడం ఉత్తమ కవిత్వ లక్షణం. అందుకే కవులు ద్రష్టలు, స్రష్టలు తత్వాన్ని దర్శించి కవిత్వాన్ని సృష్టించాలి. ఏ తాత్త్విక నేపథ్యమూ, తాత్త్విక చింతనా లేకుండా స్వీయానుభూతుల ప్రదర్శనను ఉత్తమ కవిత్వంగా పరిగణించలేం.
ఆది కవి నుంచి ఆధునిక కవి దాకా కాలం పరీక్షనాళికలో కవిత్వాన్ని శాస్ర్తియ దృష్టితో మైక్రోఎనాలసిస్ చేస్తే ఒక ప్రగతిశీలమైన తత్త్వ చింతనకు ప్రాతినిధ్యం వహిస్తూ రచించిన సృజనా స్వరూపాలే శాశ్వతత్త్వాన్ని పొందుతున్నాయి. సమాజనిష్ఠం కాని వైయక్తిక అనుభూతుల సృజనా స్వరూపాలకు ఆయువు తక్కువే. వేదాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ఖండకావ్యాలు, వచన కవిత్వం, మినీ కవిత్వం-హైకూలు - నానీలు- ఇలా విభిన్న రూపాలలో సృజన జరిగింది. జరుగుతోంది. ప్రతిరూపం వెనుక సమకాలీన సమాజం యొక్క కాలం యొక్క స్వభావం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.
సమర్థంగా ప్రతిబింబంచినవి ప్రజల నోళ్లకెక్కాయి. అసమర్థంగా ప్రతిబింబించనివి అజ్ఞాతంగా మిగిలిపోయాయి. సమర్థత- అసమర్థత అన్నవి కవి యొక్క పరిణతిపై ఆధారపడి వుంటుంది. ఇతివృత్తం, తీసుకున్న చందం- అలంకారిక పదబంధ ప్రయోగ నైపుణ్యం, అన్నింటికి మించి కవి చిత్తశుద్ధి- అతనికిగల మేధాశక్తి, ఆత్మశక్తి అన్నీ కలిసి శక్తివంతమైన అభివ్యక్తిగా రూపొందుతాయి.
వేదకాలపు సమాజంలోవున్న అభివ్యక్తి ఈ కాలానికి పనికిరాదు. అభివ్యక్తి సమాజ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఉండాలి కూడా.
అలాగే ఒక కవి తన జీవన కాలంలో రచించిన కవిత్వం అంతా ఒకేలా ఉండదు. శైలీ వైరుధ్యాలు, సిద్ధాంత వైరుధ్యాలు ఉంటాయి.
కవి తన జీవితంలో రాసిన కవిత్వంలో సింహభాగాన్ని ఒక చోట చేర్చి సింహావలోకనం చేసుకుంటే అందులో తాను కనిపించకూడదు. తను నివసించిన సమాజం కన్పించాలి. కాల స్వభావం కనిపించాలి. అప్పుడే అతడు కవిగా సఫలమైనట్లు.
ఈ నేపథ్యంలో శ్రీ గుంటూ శేషేంద్ర శర్మగారి ఆధునిక మహాభారతాన్ని అనుశీలిద్దాం.
గుంటూరు శేషేంద్ర శర్మ సంప్రదాయ సాహిత్యంపై ఎంతో ప్రభుత్వం ఉన్న కవి. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారిగా ప్రజలతో సాన్నిహిత్యం గల కవి. మరే ఇతర కవికీ లభించని సమాజం ప్రత్యక్షానుశీలనం శేషేంద్ర శర్మగారికి ఉంది. పైగా విభిన్న దేశాలు, సంస్కృతులు ప్రత్యక్షంగా దర్శించిన కవి. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, ఉర్దూ భాషలలోని కవిత్వంతో తలస్పర్శి పాండిత్యం వున్న కవి. ఫలితంగా శేషేంద్ర శర్మగారి కవిత్వం యొక్క ఆలోచనా నేపథ్యానికి వైశాల్యం ఎక్కువ అయింది. ఆయన కలమెత్తితే అందులోంచి నక్షత్రాలు అక్షరాలుగా రాలతాయి. సూర్యుడు, చంద్రుడు జెండాలెగరేసే శక్తులుగా పర్వత శిఖరాలు నిశ్శబ్ద పరీవాహ ప్రాంతంలోని నిలువెత్తున నిల్చున్న మహర్షుల్లా- వృక్షాలు, అరణ్యాలు శక్తిని నిస్వార్థంగా, చైతన్యశీలంగా వినియోగించే మనుషుల్లా- ఇలా పాంచభౌతిక దేహమూ, పంచభూతాత్మక ప్రపంచమూ రెండూ కవి ఊహా యవనికమీద విశ్వరూపంలో ప్రదర్శితవౌతాయి.
అంతటి భావనోల్బణాన్ని వ్యక్తీకరించడానికి కవి కొత్త పరిభాష కోసం సహజంగా తహతహపడతాడు. ఆ పరిభాష కొన్ని సందర్భాలలో అయత్న కృతంగాను, కొన్నిచోట్ల ప్రయత్న పూర్వకంగాను వ్యక్తమవుతుంది.
శేషేంద్ర ఆధునిక మహాభారతానికి అనుబంధ కావ్యంగా జనవంశం అనే కృతిని సంకలనం చేశారు. అందులో కవిగా శేషేంద్ర అభివ్యక్తికోసం చేసిన ప్రయత్నాలన్నీ కనబడతాయి.

*

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-సశేషం

-రాళ్లబండి కవితాప్రసాద్