వినమరుగైన

ఆధునిక మహాభారతము - గుంటూరు శేషేంద్ర శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేషేంద్ర ఆధునిక మహాభారతం అవతారికలో చెప్పుకొన్నట్లు ‘‘కావ్యయాత్ర అంతిమ చరణంలో అన్ని పర్వాలు కలిసి ఒక్క కావ్యం మాత్రమే అవుతుంది’’. కాబట్టి కవిగా పరిణామం చెందడంలో చేసిన పద్య సాధనలో అటు శ్రీనాథుణ్ణి, ఇటు విశ్వనాథనీ ఒజ్జబండిగా పెట్టుకొని పద్యాలు రాశారు.
ఘనాఘనా ఘనగజ
గ్రైవేయ ఘంటికా
టంకారములకు ఘంటాపథమ్ము
శుక్రచాపొదగ్ర శార్దూలపాలనా
విభవోన్నతికి బూరి విపిన సీమ
చటుల ఝంఝామరుచ్ఛత కోటి భేతాళ
లుంఠన క్రియలకు రుద్రభూమి
పటుతటిద్విలసన బ్రహ్మరాక్షస కఠో
రాట్టహాసమున కాహార్య బిలము
గగన భాగమ్ము ప్రావృషద్విగుణ రోష
ఘటి తనటనోగ్రధా టీ విఘటిత ప్రకట
కుటిల ధూర్జటి ఘనజాట పటలనిటల
వికట భ్రుకుటీ కుటీర ముద్విగ్నమాయె.
క్రింద సంతకం లేకపోతే శ్రీనాథుడి పద్యమే అనిపిస్తుంది. అది పద్య నిర్మాణ సాధనలో శ్రీనాథునితో స్పర్థతో రాసినట్లు అన్పిస్తుంది.
వర్షాగర్జద మోఘ మేఘ పటలీవాః పూరధారా సము
త్కర్ష మర్ష నిపీడ్య మాన జనతా కంఠరవంబైనభః
శీర్షాంతః పురభోగభాగ్య వనితా శే్లష ప్రభాహర్షదు
ర్ధర్షాగార బిడాలమై నడచె నౌరా కాలముద్వేలమై
ఇది విశ్వనాథ వారి శైలిలో రాసిందని వేరే చెప్పాలా- ప్రజాకాండ, చంపూకాండ, యుద్ధకాండ జనవంశంలోని ఋతుకాండ, భ్రమరకాండ, చమత్కరకాండ ఆరు కాండాలున్నాయి.
ఇది రామాయణంలోని ఆరు కాండలన్న స్పృహతోను, రఘువంశం అని స్ఫురించేలా జనవంశం అని పేరు పెట్టడంలోనూ కన్పిస్తుంది.
దీని మొత్తాన్ని ఆధునిక మహాభారతానికి అనుబంధ కావ్యంగా ప్రకటించడంలోనూ కవి ఇతిహావాణి వినిపిస్తుంది. రామాయణ మహాభారతాలవలే ఈ రెండూనూ అని కవిగారి భావన.
శేషేంద్ర జీవితకాలంలో విభిన్న సమయాలలో చెప్పిన కవిత్వాన్ని ఒక సమాహారంగా క్రపటించి ఇదే నా కావ్యయాత్ర- ఇదే నేను ప్రవచించే ఇతిహాసం అని శేషేంద్ర ప్రకటించేశారు. ఇక దాన్ని అనుశీలించి కవి యొక్క అభివ్యక్తిలోని వైచిత్రి, తాత్త్విక నేపథ్యం, ప్రతిపాదించిన సందేశం మనం రాబట్టుకోవాలి. నాటి రామాయణ మసాభారతాలు గాథలు- అందులో కథ ప్రధానం. కవిత్వం అనుషంగికం. సందేశం ప్రధానం, శైలి అనుషంగికం. ఈనాటి శేషేంద్ర ఆధునిక మహాభారతం, జనవంశంలో సాంప్రదాయికమన కథ లేదు. ఉన్నదం కవిత్వమే. ఉన్నదం కవి తనను ఖండించుకుంటూ పోతూ తన స్వీయ అనుభవాలకు స్పందిస్తూ అనే్వషిస్తూ, దూషిస్తూ, విభేదిస్తూ, ఆగామి కాలానికి ఏమి కావాలో నిర్దేశిస్తూ రచిస్తాడు ఫలశ్రుతిగా సమాజానికి.
వర్గ చేతన సిద్ధి - ఆత్మ గౌరవవృద్ధి / జనవైరి నిర్మూలన సమతా సమున్మలన
సత్కాలవర్షాళి - సస్య సంధ్యాకేళి /క్షామరహిత గ్రామ ప్రాభాతవ్యాహాళి
పశుపక్షి వృక్షాదిప్రాణి కోటికిహాయి / పూర్ణ విగళితరుజ దేశ దేశ ప్రజ
ధన ధాన్య సమృద్ధి విద్యాన్న గృహలబ్ద /ఆబాల గోపాలమూ అనోన్య భూగోళము
ఇవి కావాలనే ఆకాంక్షిస్తాడు. ఇవి అనాది నుంచి అందరు కవులూ ఆకాంక్షించినవే. వీటి సాధన కోసం ప్రజలను ప్రేరేపించేందుకు శేషేంద్ర చేసిన ప్రయత్నం ఎంతవరకు సిద్ధించింది? అని కాసేపు పరిశీలిద్దాం.
శేషేంద్ర తన వైజ్ఞానిక శక్తిని షోడసి, కాలరేఖ, స్వర్ణహంస వంటి వ్యాస సంకలనాలలో ప్రదర్శించారు. అది వారి మేధాపార్శ్వం. ఆధునిక మహాభారతం కవిత్వ పార్శ్వం అంటే భావుకత పార్శ్వం. చాలామందికి శేషేంద్ర ఎర్రజెండా పట్టుకున్న వాల్మీకిలా కన్పిస్తాడు. కార్ల్‌మార్క్స్ ముసుగేసుకున్న వేదవ్యాసుడనీ అంటూ అతనిలో కాన్‌ప్లిక్ట్ ఉందంటారు. అది సంపూర్ణ అసత్యం.
శేషేంద్ర ఒక యుగాన్ని సమగ్రంగా చూసి నికార్సుగా స్పందించే భావుక మేధావి. ఫలితంగా విభిన్న సిద్ధాంతాల గీతలపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. అతని నడక చేరదలుచుకున్నది ఫలశ్రుతిలో అతడు ప్రకటించుకున్నవే. వాటిలో కొన్ని సాధించడానికి కొన్ని సిద్ధాంతాలు ఆలంబనగా తీసుకున్నట్లు అనిపిస్తుంది. కమిటెడ్ పొయెట్స్‌కు సొంతం చేసుకునే వీలు లేని కవిగా విహరిస్తుంటాడు. ఇతడు సంప్రదాయవాది అందామనుకునేసరికి హఠాత్తుగా ప్రజాస్వామ్యం పేరు చెప్పి ఎందరి ప్రాణాలు తీశారో లెక్కవెయ్యాలి.
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
*
-సశేషం

-రాళ్లబండి కవితాప్రసాద్