Others

ఆమె నవ్వింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రి: ఈయనెవరు?
వై: జ్ఞాపకం లేదూ- రైల్లో జేబుదొంగ! రామారావు గారు (నవ్వుతుంది)
తండ్రి: బాగుంది వరస! వాసంతి ఎవడో సూర్యారావంటుంది. నువ్వు రామారావంటావు. ఎవరే రుూ మేరంగి మేళం అంతానూ!
వై: ఆ సూర్యారావు మూలానే ఇవాళ ఇంత గొడవ జరిగింది ముందు వాసంతికి వార్నింగ్ ఇవ్వాలి. (బిగ్గరగా) వాసంతీ! వాసంతీ!
వాసంతి: (ప్రవేశిస్తూ) ఏం అక్కయ్యా?
వై: ఆ సూర్యారావు ఎవడో వివరాలు తెలుసునే?
వా: తెలీదు, ఏం?
వై: ఏవేమిటి? పోలీసుకి రిపోర్టు ఇద్దావని. ఇంకెప్పుడూ వాడితో మాటాడకు. పలకరిస్తే దగ్గిరున్న పోలీసుకి అప్పచెప్పు. తెలిసిందా?
వా: ఏం జరిగింది? నీకు కనబడ్డాడా?
వై: చాలా జరిగిందిలే. నింపాదిగా మాటాడుకుందాం. ముందు భోజనాలు కానిద్దాం.
రా: నేను వెళ్లిరానా, వైదేహిగారూ!
వై: అదేమిటండీ. ఇవాళ మీరు కూడా యిక్కడే భోజనం. మొహమాటపడకండి.. వాసంతీ, ఆయనకి నీళ్ళ గది చూపించు.
***
వా: అక్కయ్యా! అక్కయ్యా! మరేమోనే..
వై: ఏవే? ఎందుకంత కంగారు?
వా: ఏం లేదక్కయ్యా! అందరం కలిసి ఎగ్జిబిషన్‌కి వెళుతున్నాం- లలితగారూ, నేనూ, ఇంకా నా క్లాస్‌మేట్స్ కొందరున్నారులే - వాళ్ళూనూ..
వై: వెళ్ళూ! దానికంత గొడవ దేనికి?
వా: నువ్వూ రా అక్కయ్యా.. నిన్ను కూడా తీసుకురమ్మని లలితగారు మరీ మరీ చెప్పింది. నిన్ను చూడాలని నా క్లాస్‌మేట్స్ కొందరు ఎంతో సరదాపడుతున్నారు.
వై: వీల్లేదు వాసంతీ! ఇవాళకి మీరు వెళ్లిరండి. ఇంకెప్పుడైనా వస్తాలే. నాకు పనుంది
వా: ఏంపని? ఆఫీసునుంచి వచ్చేశావుగా!
వై: రామారావుగారు వస్తారు, క్షణంలోనో మరు క్షణంలోనో. ఆయనతో సినిమాకి వెళతానన్నాను.
వా: నిన్ననేగా ఎక్కడికో వెళ్ళారు
వై: నిన్న సినిమాకి కాదు వెళత- ఊరికే షికారు వెళ్ళాం.. అదిగో! రండి రండి రామారావుగారూ!
రా: మీరే నయం నాకంటే. అనుకున్న వేళకి తయారవగల్గారు. ఆలస్యం చేశానా?
వై: చేశారనుకోండి. అయినా ఫర్వాలేదు బయలుదేరదామా?
రా: రండి
వై: పదండి. వాసంతీ.. నేను కొంచెం ఆలస్యంగా వస్తానేమో! నాన్నతో చెప్పు
(పాజ్)

రా: వైదేహిగారూ! ఇప్పుడీ సినిమాకి వెళ్లకపోతే ఏం?
వై: ఎందుకలా అనిపిస్తోంది మీకు?
రా: ఏవిటో! ఉండుండి పాత భయాలు కొన్ని తలలెత్తుతూ ఉంటాయి. మనిద్దరం ఇలా తిరుగుతూ ఉంటే నలుగురూ ఏమైనా..
వైదేహి: ఏడిశారు! నలుగురూ నలభైమందీ- అనుకుంటే ఏం?
రా: నేను భయపడుతున్నది నా గురించి కాదు
వై: నా గురించి అసలే భయం అక్కరలేదు ఇలాంటివి నేను అసలు పట్టించుకోను..
రా: మీరు పట్టించుకోకపోవచ్చు.
వై: మా ఆయన సంగతా మీరు ఆలోచిస్తున్నది? మీ దయవల్ల మాది చాలా అనుకూల దాంపత్యం. ఆయన ననే్నమీ తప్పర్థం చేసుకోరు. మన హృదయాలు నిర్మలంగా ఉన్నంతవరకూ మనం ఎందుకు భయపడాలి రామారావుగారూ! ఏవిటి అలా చూస్తున్నారు?
రా: అబ్బే! ఏం లేదు. మీకు ఇంత ఆత్మవిశ్వాసం ఎలా అలవడిందా అని.
వై: అంతరాత్మకి వ్యతిరేకమైన పని నేనెప్పుడూ చెయ్యను ఇంకోళ్ళు ఏదో అనుకుంటారని నాకు మంచి అని తోచినదాన్ని చెయ్యడానికి భయపడను, అంతే.
- సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)