వినమరుగైన

ఈగోల గోల - ఈశ్వర లీల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ గోల తట్టుకోలేక తన లాంటి ఈగో వున్న మరో తెలిసిన ఆమె ప్రక్కన వెళ్లి కూర్చుంది. ఆవిడ ఈవిడను చూసి ఆవిడ తింటున్నంత ఆనందంగా ‘‘నేను లలితా సహస్రనామ పారాయణం వెయ్యిసార్లు చేశాను. ఎంతమంది చేతతోనో చేయించాను’’ అంది. అంతకన్నా రెట్టింపుగా ఈ శోభిత మీకు తెలీదేమో నేను రామకోటి పుస్తకాలు రాస్తూనే వున్నా. ఇక ఆ రాముడొచ్చి తీసుకెళ్ళడమే తరువాయి’’ అంది. మరోచోట చేరిన స్ర్తిలు ఇలా మాట్లాడుకుంటున్నారు.
‘‘నా కోడలు బత్తాయితొనలు వొలిచి నోట్లో పెడుతుంది’’.
‘‘మా కోడలు పడక గదినుంచి వస్తూనే మీ కాఫీ ఎంత బావుంటుందో! అంటూ బెడ్ కాఫీ అడిగి తాగుతుంది!’’
‘‘నేను సత్యసాయి బాబాను చాలా దగ్గరనుంచి చూశాను. ఆయనే స్వయంగా, ఆయన చేతులమీదుగా విభూతి ఇచ్చారు’’- ఈ మాట విన్న మరొకామె- ‘‘ఆహా! ఏం మనిషండీ! పేదరికంలో వున్న ఆడపడుచులను పిలిచి, ఓ నాల్గు రోజులుంచుకొని ఓ రవికల గుడ్డయినా పెట్టదు. తన పుట్టింటివారిని మటుకు నెలల తరబడి పిలిపించుకొని, గంగిరెద్దుల్ని మేపినట్లు మేపుతుంది. పైగా అన్నదానాలు కూడా చేస్తున్నానంటుంది’’ అని మనసులో అనుకొంది.
‘‘మా పనిమనిషి అప్పడిగితే అయిదువేలు వడ్డీ లేకుండా ఇచ్చాను. జీతంలో కట్ చేసుకోమన్నాను’’.
‘‘మేం ఉత్తరాది యాత్రలన్నీ చేశాం. ఆ ఉత్తరాది దేవుళ్ల దయవల్ల మా వారికి ఆఫీసులో పై డబ్బులు కోకొల్లలుగా వస్తే దక్షిణాది యాత్రలు కూడా చేసుకోవాలనుకుంటున్నాం’’- ఇలా వీళ్ళ సంభాషణ సాగుతుండగానే మరొకామె వీళ్ళ దగ్గరకు వస్తూనే ‘‘ఏమిటోనర్రా! ఇన్నాళ్ళూ లేదుగానీ బ్లౌజులు మరీ లూజవుతున్నయ్.. చాలామంది బిగువవుతున్నయ్ అనడం విన్నాను. ఏమిటో అర్థం కావడంలేదు. పెద్దవాళ్ళం అవుతున్నందువలన శరీరంలో వస్తున్న మార్పేమో!’’ అంటూ వాళ్ల మధ్యలో ఖాళీగా వున్న ఓ కుర్చీలో కూలబడ్డది.
ఆడవాళ్ళ మాటలు ఇలా సాగుతుండగా మరో ప్రక్కన మగవాళ్ళు కూడా ఒకరిని మించి ఒకరు గొంతులు పెంచుకొని, ఎవరడిగినా సరే పదో పరకో చేతిలో పెట్టందే నా చెయ్యి ఊరుకోదనీ, రక్తదానం చేశాననీ, నేత్రదానం చేశాననీ, ఆ దానం ఈ దానం అంటూ యావద్భారత దేశం వినిపించేలా అరుస్తున్నారు.
ఇంతలో ఉపన్యాసకర్త ఉమామహేశ్వరంగారూ, విశే్వశ్వరరావు కార్యనిర్వాహక సభ్యులు సభావేదికను చేరారు. సభలో సంభాషణల సందడి ఆగిపోయింది. విశే్వశ్వరరావు జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు. శాలువ సత్కారాలు ముగియగానే, ఉమామహేశ్వరంగారు తమ ప్రసంగాన్ని ఆధ్యాత్మికానంద స్వరూపులై ఆరంభించారు. భగవద్గీత నుంచీ, భాగవతం దాకా ఎన్నో విషయాల్ని వివరిస్తూ ‘‘ఏ పూజకైనా ముందు అందరూ సంకల్పం చెప్పుకుంటారు. ఒకరు తమ సంకల్పంలో ‘్భర్తవర్షే, భర్తఖండే’ అన్నారు. ‘్భరత వర్షే, భరత ఖండే’ అని కదా అనాల్సింది! పూజను తొందరగా ముగించే సంకల్పం వలన, సంకల్పం అలా మార్పు చెందింది. కాబట్టి భగవద్భక్తులారా, భాషా దోషాలు లేకుండా పూజలు చేసుకోండి. అప్పుడే మన దోషాలన్నీ తొలగిపోతాయి. లేకపోతే కొత్తవి వచ్చి చేర్తయ్. ఆ తర్వాత మీ ఇష్టం’’ అన్నారు అందరూ నవ్వుకున్నారు. కరతాళ ధ్వనులు చేశారు.
విశే్వశ్వరరావుకు ఈ ప్రసంగం ఏ మాత్రం చెవికెక్కడంలేదు. ఇంకా ఇంకా కోట్లు గడించే మార్గాల్ని గురించి విపరీతంగా ఆలోచిస్తున్నాడు. ఒక్కసారిగా అందరూ చప్పట్లు కొట్టేసరికి, విషయం అర్థంకాని విశే్వశ్వరరావు తనూ చప్పట్లు కొట్టాడు. అప్పటికే అందరి చప్పట్లు ఆగిపోవడం, ఉపన్యాసకులు తిరిగి ఉపన్యాసం ఆరంభించడం కూడా జరిగిపోయింది. ఉన్నట్లుండి విశే్వశ్వరరావు చప్పట్లు కొట్టేసరికి, ఆయనెందుకు చప్పట్లు కొట్టారో అర్థంకాని జనం, విశే్వశ్వరరావు లాంటి విఐపి చప్పట్లు కొడితే తాము కొట్టకపోతే బాగోదని అందరూ అంతకుముందుకన్నా ఎక్కువ శబ్దంతో మళ్లీ కొట్టారు. ఉమామహేశ్వరరావుగారు అర్థంకాక అయోమయంగా అందరివైపు చూస్తూ ఒకవేళ తన ఉపన్యాసం రక్తికట్టనందున ఉపన్యాసాన్ని ఆపమని కోరడానికి సంకేతంలా అలాంటి ధ్వని తరంగాల్ని తనపైకి వదిలారని అనుకొని క్షణకాలం వౌనంగా వుండిపోయారు.
- సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)