వినమరుగైన

శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తి రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతలో అప్పటిదాకా వంట పనులు చూసుకుంటూనే రత్నంగారి ఫోన్ కాల్స్‌నూ, ఆయన ఫీలింగ్స్‌నూ గమనిస్తున్న వసంతమ్మ అక్కడికి వచ్చి ఓసారి ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని చూసి,
‘‘పెట్టేశారు’’ అంటూ తనూ ఫోన్ పెట్టేసింది.
‘‘్ఫన్ల గోల అయిపోయిందా? ఇంకా వుందా?’’ అడిగింది వసంతమ్మ.
‘‘అన్నట్లు మరిచాను. సంబంధాలు చూసే సాంబశివరావు కొన్ని నంబర్లిచ్చాడు. అవి గూడా కనుక్కుంటే అప్పటికి ఈ ఫోను సంబంధాలు అయినట్లే’’ అన్నారు ఏదో గుర్తొచ్చిన వారిలా రత్నంగారు.
‘‘ఇంతకూ ఇప్పటిదాకా ఏం వెలగబెట్టారు’’.
‘‘ముందా వెలగపండ్ల పచ్చడి చూడు. భోజనాలయ్యాక అన్నీ మాట్లాడుకుందాం’’
‘‘అంతేగా నా బతుకెప్పుడూ వెలగపండ్ల పచ్చడే ఏదీ వెంటనే చెప్పరు. నే పోతున్నా’’ అంటూ రుసరుసా వెళ్లింది వసంతమ్మ.
మళ్ళీ ఓ నంబరు తిప్పారు రత్నంగారు.
‘‘హలో!’’
‘‘హలో నేనే ప్రకాశరావును. ఏమిటి విషయం?’’
‘‘మీ అబ్బాయి పెళ్లికున్నాడని సాంబశివరావు గారు చెప్పారు. ఆ విషయంగా మాట్లాడుదామని...’’
‘‘మా అబ్బాయికి పెళ్ళయ్ ఏడాదయింది. ఎవడా సాంబశివరావు’’ అంటూ విసుగ్గా అవతలి నుంచి ఫోన్ పెట్టేసిన శబ్దం.
‘‘పెళ్లికాక ముందు తమ పిల్లల వివరాలు అందరికీ ఇచ్చినవారు వాళ్ళ పిల్లల పెళ్ళయ్యాక, ఆ విషయాన్ని వివాహ వేదికల వారికి తెలియపరచకపోతే ఇలానే ఏడుస్తుంది.’’ అనుకున్నారు రత్నంగారు. ఆ సాంబశివరావు చెప్పిందే ఇంకో నంబరు. వీడేం అఘోరిస్తాడో అనుకుంటూ తిప్పారు.
‘‘హలో!’’ అంటూనే
‘‘జ్ఞానప్రసూనాంబగారా!’’ అని అడిగారు రత్నంగారు.
‘‘కాదు. కాదు. అజ్ఞాన ప్రసూనాంబను. రాంగ్ నంబర్’’ అంటూ ఓ మగ కంఠం ఫోన్ పెట్టేసింది.
మొత్తానికి ఈ సాంబశివరావు బలే వాడేనే. ఆ మధ్య ఆయన చెప్పిన సంబంధమేనని, ఆయన చెప్పిన అడ్రసుకే విజయవాడ వెళ్లి వచ్చాడు తను. అసలా అడ్రసులో ఈయన చెప్పిన వాళ్ళెవరూ లేరు. ఏమీ సరిగా తెలుసుకోకుండా, ఈ సంబంధాలు చెప్పే వాళ్లు తప్పుడు సమాచారాన్ని ఇస్తే, సంబంధం కావాల్సిన వాళ్లు నాలాగా ఇలా అగచాట్లు పడాల్సిందే కదా! వివాహ వేదికలకంటూ వెళితే, పేర్లు నమోదు చేసుకోవడాలూ, జాతకాల పరిశీలనలతో గడిచిపోతుంది. ఒకటి కుదిరితే ఒకటి కుదరక, ఎవరికి వారు చెదిరి పోవడం తప్ప ప్రయోజనం లేదాయ ఎప్పటికీ సమస్య పరిష్కారం అవుతుందో ఏమో, కాసేపు తల పట్టుకొని, బల్ల మీదున్న వక్కపొడి పొట్లం తీసుకొని, కొంచెం నోట్లో వేసుకొని, కాసేపు లేచి అటూ ఇటూ నడిచి కూర్చొని ఇంకో నంబరు నొక్కారు.
‘‘హలో!’’
‘‘హలో నేనే శేఖరాన్ని మాట్లాడుతున్నాను. నే చెప్పేది ముందుగా వినండి. మాకు రెండు లక్షలు కట్నం కావాలి. మా అబ్బాయి ఎప్పుడు ఫారిన్ వెళ్లి రావాలన్నా ఆ ఖర్చులు మీరే భరిస్తుండాలి. నేనూ, మా ఆవిడా ఇండియాలోనే వుంటాం గనుక, మా మంచి చెడ్డలు మీరే కనుక్కుంటుండాలి. మాకా అమెరికా పడలేదు.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

షణ్ముఖశ్రీ కథలు 8897853339