వినమరుగైన

శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తి రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పాపయ్యగారు ఇవాళ్టికి ఈ సంబంధాలు చాలు. మరోసారి కలుద్దాం’’ అసహనంగా లేచారు రత్నంగారు.
‘‘అమ్మాయ్ నువ్వేమంటావ్!’’ అంటూ పాపయ్యగారు కూడా లేచారు.
‘‘మనిషి బాగా వుంటే ఏం లాభం? బాగా మనీ లేకపోతే ఎలా బ్రతుకుతాం? ఈ కరువు రోజుల్లో’’ అంది అరుణ ఆ ఫోటోను పాపయ్యగారికి ఇవ్వలేక ఇవ్వలేక ఇస్తూ, లోపల ఏడుస్తూ.
‘‘సరేనండీ! రత్నంగారు. మరో సంబంధం వివరాలు ఇస్తున్నాను. మీరే స్వయంగా ఎంక్వయిరీ చేసుకోండి. నేను ఇంకా విచారించలేదు.’’ అంటూ ఓ కాగితం రత్నంగారి చేతుల్లో పెట్టి వెళ్లిపోయారు.
‘‘ఇంతకీ దీన్ని చేసుకునేవాడెవడో? ఎక్కడ పుట్టాడో! అయ్యో రామచంద్ర’’ నీరసంగా లేచింది వసంతమ్మ.
‘‘అమ్మా నేను ముందే చెప్తున్నాను. అన్నీ ఉన్న అందగాడు. ఏ బాదరబందీ లేనివాడు దొరికితేనే చేసుకుంటా. లేకపోతే నీకూ, నా పెళ్లికీ టాటా’’ అంది అరుణ విసురుగా లేచి వెళ్తూ.
‘‘ఇదేమన్నా సినిమానా. అనాథ పక్షిలా పెరిగి, ఐశ్వర్యవంతుడితో డ్యూయెట్లు పాడుతూ తిరగడానికి. ఇది జీవితం తల్లీ జీవితం’’.
‘‘పిచ్చి భ్రమలతో, నువ్వూ మీ నాన్న పేట్రేగిపోతున్నారు’’ అంది వసంతమ్మ.
‘‘బాగుంది మధ్యలో నన్ను కలుపుతావెందుకు. బాధ్యత ఎలా తీరుతుందిరా భగవంతుడా అనుకొంటూ బావురుమంటుంటే. ఇక ఒక్క క్షణంకూడా ఆలస్యం చేయను. ఈ సంబంధం విషయం కూడా ఏమిటో కనుక్కొని వస్తాను’’ అంటూ బయటకు అడుగు వేశాడు రత్నంగారు.
***
ఆపసోపాలు పడుతూ, రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు వాసుదేవరత్నంగారు. దాహంగా వుంటే, ప్లాట్‌ఫాంలో వున్న మంచినీళ్ళ కుళాయి దగ్గరకు వెళ్లి, అక్కడున్న ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక ముక్కు మూసుకొని, నోరు తెరచుకొని నీళ్ళు తాగారు. ఆ తర్వాత వచ్చి ఆ ఫ్లాట్‌ఫామ్‌మీదున్న బల్లమీద కూర్చొని, పాపయ్యగారిచ్చిన కాగితంలోని వివరాల్ని ఓ మారు మళ్లీ చూసుకున్నారు. క్షణకాలం తర్వాత ఓ పోర్టర్ కనిపిస్తే ‘‘బాబూ కోటేశ్వరరరావు అనే అతను ఈ ఫ్లాట్‌ఫాంమీదకు వస్తారని, స్టేషన్ మాస్టర్‌గారు చెప్పారు. ఎప్పుడొస్తాడు’’ అని అడిగాడు రత్నంగారు.
‘‘సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రాగానే వస్తాడు’’ అని చెప్పి వెళ్లాడు అతను.
‘‘మరి కొద్ది నిమిషాల్లో సింహాద్రి ఎక్స్‌ప్రెస్ అయిదవ నంబరు ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చి చేరును’’ అన్న ఎనౌన్సుమెంటు రావడం మొదలెట్టి ఓ గంటపైనే అయింది. అయినా ఇంకా రాలేదు. విసుగొచ్చిన రత్నంగారు కాఫీ తాగాలనిపించి క్యాంటీన్ వైపు వెళ్లారు. అప్పుడే అక్కడికి ఈయనకు తెలిసినాయన వచ్చారు.
‘‘అరే! ఎన్నాళ్లయింది నిన్ను చూసి’’’ అన్నాడాయన.
‘‘ఓ మాణిక్యమా!’’ అంటూ పలకరించారు రత్నంగారు.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

షణ్ముఖశ్రీ కథలు 8897853339