వినమరుగైన

పానశాల -దువ్వూరి రామిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్రాక్షరసాన్ని ఆస్వాదించి ఆనందించుదాము అనే ఉమర్ ఖయ్యాముగారి భావాన్ని రామిరెడ్డిగారు వర్ణిస్తూ-
గతము గతంబె యెన్నటికి కన్నులగట్టదు, సంశయాంధసం
వృతము భవిష్యదర్థము, వివేకవతీ! ఒక వర్తమానమే
సతత మవశ్య భోగ్యమగు సంపద, రమ్ము, విషాదపాత్రకీ
మతమున తావులేదు క్షణమాత్ర వహింపుము పానపాత్రికన్
అని వివరిస్తారు.
మన జీవితాలు పుష్పాలవలె రాలిపోయేవి గదా. కాబట్టి మనం కష్టాలను ప్రక్కకునెట్టి పుష్పాలవలె నవ్వుతూ ఉందాం అనే ఉమర్‌ఖయ్యాం భావాన్ని రామిరెడ్డిగారు అనువదిస్తూ-
మన ప్రియ జీవితంబు కుసుమంబుల పోలిక చంచలంబు కా
వున, పువులట్లు కాలమును బుత్తము నవ్వుల నాట పాటలన్,
గొన గొనబారు కాలువల కోసల దియ్యని, పానమాని, జీ
వన భరణ ప్రయాసమొక ప్రక్కకు రువ్వుదమోయి ప్రేయసీ
అని వర్ణిస్తారు.
ఓ సఖీ!
పూడ్చిపెట్టిన తరువాత మళ్లీ వెలుపలకి తీసేదానికి నీవు బంగారు ముద్దవు కాదు గదా. అందువలన మృత్యువు నీపై దాడి చేయకముందే ద్రాక్షరసాన్ని ఆస్వాదించి ఆనందించమంటాడు.
కనుమెపుడో అకాండముగా, కాలమునీపయి దొమ్మిపోటు సే
యని యపుడే, గులాబి జిగులారెడు ద్రాక్షరసంబు నానుమా,
తనువు నశించి దుమ్మగుట తథ్యము, నీవు పసిండి ముద్దవా?
జనులొకసారి పూడ్చి మరుసారి నినున్ పెకలించి యెత్తగన్
అని గానం చేస్తాడు.
స్వర్గం ఉందంటారు. అది ఉన్నా అందరూ అక్కడికే వెళ్తారని నమ్మకమేంటి? అందువలన భూతలానే్న స్వర్గం చేయి అంటూ
అలవడదస్తినాస్తుల యదార్థత, నాకము సత్యమన్న పె
ద్దలనుడిమెప్పుకొన్నను, పదంపడి నమ్మకమేమి అందరా
స్థలమునకేగువారలని? చచ్చిన ఎవ్వరికెవ్వరో? వృథా
పలుకులికేల, భూతలము స్వర్గమొనర్పుము సాఖి పాత్రికన్
అని వర్ణిస్తాడు.
ఎవరైనా మంచి హృదయాన్ని కలిగి ఉండాలి. అలా లేకుంటే అనురాగమనేది పూర్తిగా కరువైపోతుది అంటూ హీనమగు రుూ ప్రపంచము ననంతముగా సృజియించి ధాతచే
సెనె శిలతోడ మానవుని చిత్తము? సద్యృదయంబు లేనిచో
జనుల పరస్పర ప్రణయ సఖ్యము మందునకైన చిక్కునే?
అని గానం చేస్తాడు.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-కోట రాజశేఖర్