వినమరుగైన

రాష్టగ్రానము -తుమ్మల సీతారామమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరవయ్యో శతాబ్దపుటాంధ్ర కవుల్లో విలక్షణకవి అయిన కీ.శే. శ్రీ తుమ్మల సీతారామమూర్తి ‘రాష్ట్ర సిద్ధికొరకు రక్తమ్ముగార్చిన కవిని నేను’ అనీ ‘నేనఁగాఁ ద్రిలింగధరణీ హిత గాఢతపోగ్ని దుర్భరగ్లాని సహించినట్టి ఋషికల్పుఁడు మామక రాష్టగ్రామనముల్ వీనుల సోఁకి, రుూ తెలుఁగు విశ్వము మేల్కొనె’ననీ ధీర గంభీరంగా ఆత్మవిశ్వాసంతో చెప్పుకొన్నారు. వారి కావ్య స్రవంతిని సూక్ష్మంగా పరిశీలిస్తే అది మూడు పాయలుగా ప్రవహించినట్టు గ్రహింపవచ్చు. వాటిల్లో మొదటిది గాంధేయ కవితావేణి, రెండవది రాష్ట్ర కవితావేణి, మూడవది యుగ కవితావేణి. శ్రీ సీతారామమూర్తి మొదట గాంధీకవి కావచ్చు. రసికులయిన ఆంధ్ర కవితాప్రియుల ప్రశంసలు పొందియుండవచ్చు. కాని తెలుగు మాగాణంలో వాడవాడలా వారి పేరు వ్యాపించటానికి రాష్ట్ర కవిత్వమే ప్రధాన కారణం. ఆ రాష్ట్ర కవితా సరస్వతికి నిలయం వారు రచించిన రాష్ట్ర కవిత్వమే ప్రధాన కారణం. ఆ రాష్ట్ర కవిత సరస్వతికి నిలయం వారు రచించిన రాష్టగ్రానము. ఈ పద్యకావ్యం 1938వ సం. ఏప్రియల్ మాసంలో ముద్రితమైంది. అప్పటికి దానిలో అంకిత పద్యాలు నాలుగిటిని వదలితే డెబ్భైయారు పద్యాలు ఉన్నాయి. ఈ లఘు కావ్య రచనలకు ఒక ప్రబల కారణం కనబడుతుంది. దాన్ని వివరిస్తాను.
భారతదేశంలో ప్రప్రథమంగా భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనను కోరినవారు ఆంధ్రులే. ఈ కోరిక ప్రబలమై ఆంధ్రోద్యమ రూపాన్ని ధరించింది. ఆంధ్రోద్యమం 1902-1903 సంవత్సరాల్లోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. 1913లో మొదట బాపట్లలో ఆంధ్ర మహాసభ జరిగే నాటికి ఆంద్రోద్యమం ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సంతరించుకొన్నది. అకలక్రమాన ఇది ఎన్నో అంతరాయాలన ఎదుర్కొన్నది. మొదట ఉన్న ఊపు తర్వాత చచ్చుబడింది. ఇంతలో 1937వ సం. రానే వచ్చింది. ఆ యేడు అక్టోబరులో చల్లపల్లి జమీందారు శ్రీమంతు రాజా యార్లగడ్డ శిరామప్రసాద్ బహద్దూర్ ఆహ్వాన సంఘాధ్యక్షుడుగా ఆంధ్ర మహాసభ జరిగింది. ఆ సభకు శ్రీ సీతారామమూర్తి వెళ్లారు. వారిలో ఆంధ్ర భావవేశం వరదలు వారింది. ఉద్యోగం చేస్తున్నా బాపట్లకు తిరిగి వచ్చి వారు ఒక్క రోజులో 76 పద్యములు రచించి 1938 ఏప్రిల్‌లో ప్రకటించారు. కావ్యమునకు రాష్టగ్రానము అని పేరు పెట్టారు. దీనిని చల్లపల్లి రాజాకే అంకితమిచ్చారు. ఇదే రాష్టగ్రానము ప్రథమ ముద్రణము. ఆరేళ్లలో రాష్టగ్రానం నాలుగుసార్లు అచ్చునకెక్కింది. రెండవ ముద్రణలోనే ఎనభై పద్యాలు అదనంగా దీనిలో చేరాయి. ఆంధ్రోద్యమ సమస్యలు పెరిగినకొలదీ రాష్టగ్రానంలోని పద్యాలు పెరుగుతూ వచ్చాయి. 1955వ సం. నాటి ఆరవ ముద్రణం సంపూర్ణ సుందరరూపాన్ని పొందింది. ఇదే 1973లో ఏడవసారి అచ్చయింది.
ఎందరో కవులు ఆంధ్రదేశాన్ని గూర్చీ, ఆంధ్రోద్యమాన్ని గూర్చీ కావ్యాలు రచించినప్పటికీ వాటన్నింటికంటె ఎక్కువగా రాష్టగ్రానం ప్రశస్తికెక్కింది. సీతారామమూర్తిగారు కంటే ముందు రాష్ట్ర కవిత్వం రచించినవారున్నారు. రాయప్రోలు సుబ్బారావుగారు 1914లోనే ప్రాచీనాంధ్ర వైభవాన్ని వర్ణిస్తూ పద్యాలు రచించారు. శ్రీ సీతారామమూర్తి ఆ పద్యాలు చదివి ఆంధ్ర వైభవాన్ని ఆకళించుకొన్నానని సందేశసప్తశతి కావ్యంలో
‘నా తెనుఁగు జాతి నడతలోఁ బలుకులోఁ
గడిమిలోఁ గడింది గౌరవమ్ము
సంతరించుకొన్న జాతిరా యనుకొంటి
రాయప్రోలువారి రచనలరసి’
అనే పద్యంలో సత్యప్రీతితో స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర కవిత రచించిన ఇతర కవుల పోకడలు వేరు.

-నాగళ్ల గురుప్రసాదరావు