వినమరుగైన

ఈగోల గోల - ఈశ్వర లీల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే తను వౌనంగా వున్నా ఎవరూ లేచి వెళ్ళనందున, తను అంతకుముందు విసరిన ఛలోక్తికి తిరిగి ఆనందించి ఉంటారని, సంతోషంగా సమాధానపడి మళ్లీ మొదలెట్టారు. జంతువులన్నీ ఒకే ఆకారం కలిగి వుండవనీ, గుఱ్ఱం, గాడిద, సింహం, పులి, పిల్లి ఇలా రకరకాల రూపాలు కలిగి వుంటాయనీ, మానవులు మాత్రమే ఒకే రూపంలో వుంటారనీ, అందుకే మానవులంతా ఒకటేననీ, మానవులు మాత్రమే ఒకే రూపంలో వుంటారనీ, అందుకే మానవులంతా ఒకటేననీ, అయితే ఎవరి మనసు మాత్రం, వారిదేననీ, అది పూర్వజన్మ సుకృతాన్నీ బట్టి, సిద్ధిస్తుందనీ, దానిని బట్టే తమ ప్రవర్తనా నియమావళిని ఏర్పాటుచేసుకోవడం జరుగుతుందనీ, దీనిని ఎవరికి వారుగా మంచి చెడులను బేరీజు వేసుకుంటూ, మార్చుకోవడానికి ప్రయత్నించాలనీ, అందుకే ఈ వేదాంతాలూ, మతాలూ, సిద్ధాంతాలూననీ, వీటిని సవ్యమైన దిశలో అర్థం చేసుకున్నవారు మాత్రమే తమ అంతరాత్మ ప్రబోధాన్ని, దైవ సహాయంతో దివ్యంగా తెలుసుకోగలుగుతారనీ, వారే దివ్య జ్ఞాన సంపన్నులనీ, అందర్నీ ఉర్రూతలూగించేలా ఉపన్యసించి విరమించారు ఉమామహేశ్వరంగారూ.
సరిగ్గా అదే సమయానికి కుండపోతగా వర్షం ఆరంభమైంది. ఉమామహేశ్వరంగారు వెంటనే ఫ్లయిట్‌లో వెళ్ళవలసినందున వార్ని కార్యకర్తలు కారెక్కించి పంపించివేశారు. వచ్చినవారిలో కార్లున్నవాళ్ళు కూడా కొంతమంది వెళ్ళారు. మిగతావాళ్ళంతా వాన ఎప్పటికి వెలుస్తుందోనని కంగారుగా చూస్తున్నారు. అప్పటికి రాత్రి 8.30 గంటలయింది.
విశే్వశ్వరరావు కూడా తన కారెక్కుతూ, ఓ వృద్ధుని వైపు చూశాడు. ఓ నవ్వు నవ్వి ఊరుకొని, తన భార్యతో వెళ్లిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడున్న కార్య నిర్వాహకులలో ఒకరు ‘‘మీరుండేది ఆయన వీధిలోనే కదా! అసలే పెద్దవారు, అనారోగ్యవంతులూ, మిమ్మల్ని కూడా ఆ విశే్వశ్వరరావుగారు కారులో తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే బావుండేది. మరీ ఆలస్యం అయితే ఆటోలు దొరకడం కూడా కష్టమవుతుంది’’ అన్నాడు.
‘‘ఆ విశే్వశ్వరరావు మా వీధిలో వుండడమొక్కడే నీకు తెలిసుంటుంది. అతను మావాడి క్లాస్‌మేట్. మావాడిది మామూలు చదువు, మామూలు గుమాస్తా ఉద్యోగం శ్రీశైలంలో. ఈ రోజుల్లో డబ్బూ, హోదాలూ ముఖ్యం కానీ, స్నేహాలూ పరస్పర అనురాగాలూ ఎవరికీ అక్కర్లేదు’’ అన్నాడు వృద్ధుడు.
ఆ మాటతో అతనికి ఎక్కడాలేని ఆవేశం వచ్చింది. ‘‘ఈ శరీరం ఓంకార నాదాను సంధానం కావాలిగానీ, అహంకారనాదాను సందోహం కాకూడదు. మీ అంత గొప్పవాళ్ళు లేరనగానే, ఎక్కడలేని ఈగోతో ఊగిపోతూ, మిగతావాళ్ళంతా బుడతలైనట్లూ, పరమ దరిద్రంగా పిడతల్లో భోంచేస్తున్నట్లూ భావించడం నిజంగా అహంకారానికి పరాకాష్ఠ! ఎవరైతే తమ బంధుమిత్రుల్లో, ఆర్థికంగా, సామాజికంగా తమకన్నా వెనుకబడి వుంటారో, వాళ్ళను ఆదుకోవాలనే తాపత్రయంలో వుంటారో వాళ్ళంతా ఈశ్వరాంశ సంభూతులు. సంస్కారవంతులు. కొన్నాళ్ళ జీవితం కోసం ఎందుకండీ ఈ ఈగోలు. ఈ ఈగోల, గోలలో ఈశ్వరలీలను ఎవరు అర్థం చేసుకోగలుగుతారు. బెల్లం చుట్టూ ఈగల్లా ఈగోలంతా తిరుగుతుంటారు ఇంకాస్త ఈగో పెంచుకునేందుకు. ఈ జన్మలో ఇలా తిరిగేవాళ్లంతా, వచ్చే జన్మలో ఈగల్లాగానే పుడ్తారేమో మరి. ఏదో ఏడవనీయండి! వాన మరీ పెద్దదయ్యేలా వుంది. మీరిక్కడే వుండండి. ఆటో పిలుచుకొని వస్తా!’’ అంటూ అతను తన ఆవేశాన్ని నిలుపుకొని, తలపై కండువా వేసుకొని ఆటోకోసం వెళ్ళాడు.
ఓ పావుగంట తరువాత ఆటోతో అతను వచ్చాడు. ఆ వృద్ధుణ్ణి అతను చెయ్యి పట్టుకొని ఆటో ఎక్కించి పంపించివేశాడు. ఆటో వృద్ధుని ఇంటి దగ్గర ఆగింది. దిగాడు.
‘‘వుండు బాబూ! లోపలికి వెళ్లి డబ్బు తెచ్చి ఇస్తాను’’ అన్నాడు.
‘‘అతను ఇచ్చేశాడండీ!’ అంటూ ఆటో అతను వెళ్ళాడు. ఆ వృద్ధుడు ఆశ్చర్యపోతూ ‘‘అయ్యో! అతను మా అబ్బాయికన్నా చిన్న ఉద్యోగం చేస్తున్నాడే! పాపం అతనికి అనవసరమైన ఖర్చు. ఎలాగైనా రేపు వెళ్లి అతని డబ్బు అతనికి ఇవ్వాలి’’ అనుకున్నాడు.
లోపలికి వెళ్లి ‘‘్ఫ్లయిటు ఖర్చులతో హైదరాబాదునుంచి పిలిపించి, చెప్పించిన ఆ ఉమామహేశ్వరంగారి ఉపన్యాసం కన్నా, ఆ సభ నిర్వహణ బాధ్యతను చేపట్టిన ఆ కుర్రవాని ఉపన్యాసం అద్భుతంగా వుందని’’ జరిగినదంతా చెప్పాడా వృద్ధుడు.
ఈగో అంటే అర్థం తెలియని తన ఇల్లాలికి ఈశ్వరలీలగా!

-అయిపోయంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)