వినమరుగైన

సతీ ఉక్కుబాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అకస్మాత్తుగా మూడు మారిన కోడలు మాటలతో నోట మాట రాక నిర్ఘాంత పోయిన హనుమాయమ్మగారు ఎందుకొచ్చిన గొడవనుకొందో ఏమో, కోడలు చెప్పిన పనులన్నీ హడావిడిగా పూర్తి చేసింది. మరి కాసేపట్లో గది నుండి బయటకు వచ్చిన సక్కు అత్తగార్ని చూసి తనలో తాను నవ్వుకొని గబగబా బత్తాయి రసం తీసుకొచ్చి ‘‘మొహమాట పడకండి అత్తయ్యగారు. మగవాళ్లు ఆఫీసులకెళ్తే ఇంట్లో వుండేది మనమే. మనమిలా కొట్టుకు చావడం ఏం బాగుంటుంది. తాగండి’’ అంటూ బలవంతంగా తాగించింది. హనుమాయమ్మగారు మాటామంతీ లేకుండా గుటకలు మ్రింగుతూ గ్రుడ్లు మిటకరించి చూస్తూ కూర్చుంది. వాళ్లాయన చేసిన హెచ్చరికను గుర్తు చేసుకుంటూ.
‘‘ఏమిటాలోచిస్తున్నారు అత్తయ్యగారు’’.
‘‘అబ్బే ఏం లేదమ్మా! ఏం లేదు.’’
‘‘నాకు తెలుసండీ! ఏమిటా ఈ కొత్తకోడలు మొదట్లోనే రంకెలు వేస్తోందనుకుంటున్నారు. అవునా చెప్పండి’’ పెద్దగా అరిచింది సక్కు.
‘‘ఆ!ఆ! నిజమే!’’ అంది సిక్కయిన మొహం పెట్టిన హనుమాయమ్మగారు.
‘‘వయసు పెరిగే కొద్దీ మనసు వికసించాలండీ. సంకుచిత భావాలతో ప్రవర్తిస్తే ఎవరికీ మనశ్శాంతి వుండదు. కావాలని వియ్యమందుకున్నప్పుడు వియ్యంగానే వుండాలిగానీ, కయ్యంతో వుండకూడదు. ఒకరి లోపాల్ని ఒకరు సరిదిద్దుకుంటూ సర్దుకుపోవాలి. అంతేగాని అనవసరపు ఆధిపత్యాన్ని ఎవరి మీదా చలాయించకూడదు. అలా చలాయిస్తే అలగాజనానికీ మనకీ తేడా ఏముంటుంది. కొత్తగా, పెళ్లయిన వాళ్లు కులాసాగా, విలాసంగా ఊళ్లు తిరుగుతూ, సినిమాలకూ, షికార్లకూ వెళ్తుంటే, ఒకప్పుడు మనమూ అలా వెళ్లిన వాళ్లమే కదా! అనుకోవాలి. ఒకవేళ వెళ్లి వుండకపోతే ఎవరి అదృష్టం వాళ్లదనుకోవాలే గానీ, అసూయపడుతూ, అవస్థలు పెట్టడం, ప్రతిబంధకాలు కలిగించడం తప్పు. ఇంటికొచ్చి పోయే ఆడపడుచులు కూడా పండుగలు పబ్బాలు గడుపుకొని, పసుపు కుంకాలతో వెళ్ళాలేగానీ, పనికట్టుకొని పుట్టింటివారి ఇంటి సమస్యలలో జోక్యం చేసుకొని బజారుకీడ్చే ప్రయత్నాలు చేయకూడదు. ఆ రోజుల్లో మా అత్తగార్లు మమ్మల్ని కాల్చుకు తిన్నారు గనుక మేం కూడా మా కోడళ్లను కాల్చుకు తినాలనుకోకూడదు. తిండికి లేక చస్తున్న వాళ్లకు మల్లే కోడలు వైపు నుంచి కట్నాలు కానుకలు ఆశిస్తూ అల్లరి పెట్టకూడదు. ఎవరి హద్దుల్లో వాళ్లుంటే ముద్దుగా వుంటుంది. అయిందానికీ, కానిదానికీ మొహాలు మాడ్చుకుంటుంటే ప్రతి ఇంట్లోనూ సక్కుబాయికి బదులుగా ఉక్కు పిడికిలి బిగించే ఉక్కుబాయిలు వెలుస్తారు. ఒక్కొక్కళ్ల వంటి తొక్కల్ని, బత్తాయి తొక్కల్ని తీసినట్లు తీసి, చుడీదారులు కుట్టించుకొని ఎవరి దారిన వాళ్లు వెళ్తారు’’. కొన్నాళ్ల జీవితం కోసం ఎందుకండీ ఈ కుళ్ళుబుద్ధులూ, కళ్ళు పొడుచుకోడాలూ. లేకి మూకల్లా వుండే ఇళ్లల్లో లేగదూడల్లాంటి పిల్లలెలా పుడాతారండీ! కొంచెం ఆలోచించి చూడండి హనుమాయమ్మ అత్తయ్యగారు. నే చెప్పిన దాంట్లో నిజమెంతో, అబద్ధమెంతో మీకే తెలుస్తుంది’’ అంది దీర్ఘోపన్యాసం ముగిస్తూ సక్కు.
‘‘తల్లీ నీ మాటలతో నన్ను చంపకు. అన్నీ నిజాలే’’ అంటూ లెంపలేసుకుంది.
‘‘అయితే ఇప్పుడు చెప్పండి. మీకు సక్కుబాయి కావాలో ఉక్కుబాయి కావాలో’’.
‘‘సక్కుబాయే కావాలి. మనింట్లోనే కాదు. ఎవరిళ్లలోనూ ఉక్కుబాయిలొద్దు. అందరూ ఆ పాండురంగడి దయవల్ల పదికాలాల పాటు హాయిగా వుండాలి’’ అన్నారు హనుమాయమ్మగారు సక్కువైపు ఓ అందమైన లుక్కు వేసి. సక్కుబాయి తన సర్కస్ ఫీట్ సక్సెస్ అయినందుకు సంతోషంగా తన బాడీ వైపోసారి చూసుకుంది. ఉక్కులానే వుంది సక్కు.
-అయిపోయి ది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

షణ్ముఖశ్రీ కథలు 8897853339