వినమరుగైన

శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తి రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్ళజోడు జారిపోతున్నా పట్టించుకోకుండా, ఆదివారం వార్తా పత్రికల్లోని వివాహ ప్రకటల్ని ఆదరాబాదరాగా చూసేస్తున్నారు వాసుదేవరత్నంగారు. తన కుమార్తె అరుణ అర్హతలకు సరిపోయే వరుల వివరాల్ని నిశితంగా పరిశీలించి, గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడిక కళ్ళజోడును తీసేసి, ఏదో పెద్ద విజయాన్ని సాధించబోయే వారిలా కుర్చీలోంచి లేచి వంటింటి వైపు చూశారు.
‘‘కాయా! పండా!’’ అంటూ ఉరిమినట్లుగా అరిచింది వసంతమ్మ.
‘‘పండే!’’ తృప్తిగా అన్నారు రత్నంగారు.
‘‘అయితే టిఫిన్ త్వరగా కానిచ్చి, ఆ ఫోన్ దగ్గర కూలబడండి నేను వంటా వార్పూ చూసుకుంటాను.’’ అంటూ కాస్త ఎక్కువ మోతాదులోనే టిఫిన్ తెచ్చి పెట్టింది.
‘‘ఇంత టిపినా!’’ అన్నారు రత్నంగారు.
‘‘తినండి. ఫోన్‌లో వాగేసరికి అరిగిపోతుంది. ఆ వెంటనే వంటయిందా అంటూ అరుపులూ, పెడబొబ్బలు. దాంతో నేను అన్నీ ఉడికీ ఉడక్కుండా దించడం, మళ్లీ దానిమీద విమర్శలు. డైనింగ్ టేబుల్ దగ్గర ఫైటింగ్ సీన్లు, మనకు మామూలేగా’’ అంది వసంతమ్మ తడుముకోకుండా.
‘‘సరే! సరే! టైం వేస్టు చెయ్యకు నీ పని చూసుకో. నేను ఫోన్ దగ్గర కూర్చుంటా’’ అంటూ టిఫిన్ వేగంగా తురుముకొని, ఆ వెంటనే ఫోన్ దగ్గరకెళ్ళి కూర్చున్నారు. డయల్ చేశారో నంబర్.
‘‘హలో’’
‘‘హలో’’
‘‘హలో’’
‘‘హలో’’
‘‘ఏం ఫోన్లో ఏం గోలో. ఇదివరకు ఏదో కార్డులో నాలుగు ముక్కలు రాసుకునే వాళ్లం. అయిందానికీ, కానిదానికీ అన్నిటికీ ఫోనే. స్పీడుట. స్పీడు. ఏం స్పీడు నా బొంద స్పీడు. అని విసుక్కుంటూ ఫోన్ పెట్టేశారు రత్నంగారు. కాసేపటికి మళ్లీ చేశారు. ఫోన్ రింగయింది.
‘‘హలో!’’ అన్నారు రత్నంగారు.
‘‘హలో! సుధాకరాన్ని మాట్లాడుతున్నాను. పెళ్లి సంబంధం విషయంగానే చేశారనుకుంటాను’’ అంది అవతలి కంఠం.
‘‘అవునండీ! నా పేరు వాసుదేవరత్నం. మా అమ్మాయి అరుణకు సంబంధాలు చూస్తున్నాం. పేపర్లో మీ ప్రకటన చూసి చేశాను.’’
‘‘ఓ! అలాగా! చాలా సంతోషం. మీ అమ్మాయి వివరాలు చెప్పండి’’.
‘‘నాకు ముగ్గురాడపిల్లలండీ! ఈ అమ్మాయి ఆఖరమ్మాయి. ఏడేళ్ళ గ్యాప్ తరవాత పుట్టింది. నేనో ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైరయ్యాను. పి.జి. చేసింది. ఫెయిర్‌గా వుంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తోంది. బహుశా ఓ నెల రోజుల్లో రావచ్చు’’ అన్నారు రత్నంగారు.
‘‘ఇంకా ఉద్యోగ ప్రయత్నంలోనే వుందా? ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కావాలని మా రిక్వైర్‌మెంట్స్‌లో చెప్పాం కదండీ’’ అన్నారు సుధాకరంగారు.
‘‘తప్పకుండా వస్తుంది. పదివేల దాకా జీతం. అందుకే మిమ్మల్ని కదిలించాను’’.
‘‘హైటెంత?’’
‘‘అయిదడుగుల ఆరంగుళాలు’’.
‘‘అమ్మో అంత హైయిటే! మావాడు షూస్ వేసుకుంటేనే నాలుగడుగుల నాలుగంగుళాలు తేలడు. పైగా మా వాడి జీతం అయిదువేలే. అబ్బాయికన్నా, అమ్మాయి సంపాదన ఎక్కువ. దానికి తోడు, అబ్బాయిని మింగేసేటంత హైటు. ఇవన్నీ చాలా నెగటివ్ క్వాలిఫికేషన్స్. సారి మాకవసరం లేదండీ’’ అని ఫోన్ పెట్టేశారు సుధాకరం గారు.
‘‘ఓరి వీడి దుంపతెగ. సాంతం మాట్లాడనివ్వకుండానే ఫోన్ పెట్టేశాడే. కక్కుర్తి వెధవలా వున్నాడు. తనింకా చాలా చెప్పాలనుకున్నాడు. ఇద్దరూ పొట్టివాళ్లయితే, వాళ్లకు పుట్టే పిల్లలు ఇంకా పొట్టిగా పుడతారనీ, ఇద్దరి జీతం కలిపితే పదిహేను వేలు కనుక, సంసారం సజావుగా వెళ్తుందనీ ఎలాగోలా సరిచేసుకోవచ్చునని చెప్పాలనుకున్నాడు. ఫూర్ ఫెలో’’ అనుకుంటూ మరో నంబరు డయల్ చేశారు.
‘‘హలో!’’
‘‘హలో! చెప్పండి’’.
అరుణ విషయాలన్నీ చెప్పారు రత్నంగారు.
‘‘మా అబ్బాయి ఉద్యోగం చేసే అమ్మాయిని ఇష్టపడడం లేదండీ. అందుకే మేం ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని ప్రకటించలేదు’’.
‘‘అది నిజమేననుకోండీ! మీ కిష్టం లేకపోతే మా అమ్మాయి ఉద్యోగం చెయ్యదండీ’’.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

షణ్ముఖశ్రీ కథలు 8897853339