జాతీయ వార్తలు

మాకూ.. హోదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభలో ఎంపీ వినోద్ ప్రైవేట్ బిల్లు
ఆర్థిక ప్యాకేజీతో ఆదుకోవాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: తెలంగాణకూ ప్రత్యేక హోదా కల్పించి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలన్న డిమాండ్‌తో తెరాస ఎంపీ బి వినోద్‌కుమార్ శుక్రవారం లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రతిపాదించారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర ప్రభుత్వం పోరాటం చేయటం తెలిసిందే. ఆంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంటులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చినా, ఇంతవరకు అమలు కాకపోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ కూడా ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రం ఆర్థిక, సామాజికాభివృద్ధికి ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేయటం గమనార్హం. తెలంగాణలోని షెడ్యూల్డు కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన కులాల ప్రజల అభివృద్ధి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, రాష్ట్రంలోని అన్ని రకాల వనరులను సక్రమంగా ఉపయోగించుకోవటం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు తెలంగాణకు ప్రత్యేక హోదా ఇచ్చి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉందని వినోద్‌కుమార్ తన ప్రైవేట్ మెంబర్ బిల్లులో సూచించారు. కేంద్ర ప్రభుత్వం గ్రాంటులు, రుణాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, రాయితీల రూపంలో ఆర్థిక సాయం అందించాలని బిల్లులో సూచించారు. ఎక్సైజ్, కస్టమ్ పన్నులు, ఆదాయం తదితర పన్నుల్లో రాయితీలు ఇవ్వాలన్నారు. ప్రత్యేక ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక ఆర్థిక వనరులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక హోదా ఎంతో అవసరమని వినోద్‌కుమార్ వాదిస్తున్నారు. రాష్ట్భ్రావృద్ధికి అవసరమైన రుణాలను వివిధ సంస్థల నుంచి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతివ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ప్రజలు దాదాపు 50ఏళ్లపాటు అవిశ్రాంత పోరాటం చేసిన అనంతరం గత ఏడాది జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం ఊపిరి పోసుకుంది. తెలంగాణలోని మొత్తం పది జిల్లాల్లో తొమ్మిదింటిని వెనుకబడిన జిల్లాలుగా కేంద్రం గుర్తించిందని వినోద్‌కుమార్ బిల్లులో వివరించారు. అవిభాజిత ఆంధ్రలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందంటూ, దాన్ని సరిదిద్దాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. స్పీకర్ కేటాయించే సమయం మేరకు వినోద్‌కుమార్ శుక్రవారం ప్రతిపాదించిన బిల్లుపై తరువాత చర్చ జరుగుతుంది. ప్రభుత్వం మద్దతివ్వని ఏ ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా లోక్‌సభ ఆమోదం సంపాదించలేదనేది అందరికీ తెలిసిందే. వినోద్‌కుమార్ శుక్రవారం ప్రతిపాదించిన తెలంగాణకు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే బిల్లు చర్చ అనంతరం వీగిపోవటం లేదా ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు దీనిని ఉపసంహరించుకోవటం ఖాయం. కేంద్రం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా కల్పించకూడదనే నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే అన్ని రాష్ట్రాలకు నిధుల పంపిణీ జరుగుతున్నందున, ప్రత్యేక హోదా కల్పించటమనేది ఇకమీదట జరిగే పని కాదు. ఈశాన్య రాష్ట్రాలకు ఎప్పుటినుంచో అమలు చేస్తున్న ప్రత్యేక హోదాను కేంద్రం పదహారవ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో ఇటీవల తొలగించటం తెలిసిందే.