వీరాజీయం

వాడిన పూలు.. కుళ్లిన కూరలు..రిక్తహస్తాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వాడిపోవురా పువ్వులు... కుళ్లిపోవురా కూరగాయలూ...’’ వాడుట, కుళ్లుట వాటికి సహజమురా!’’అంటూ పాడుకుంటూ వచ్చాడు ఒక రిటైర్డ్ ప్రొఫెసర్.
‘‘ఏం, పాపా? శీతాకాలం కదా, నీళ్లు లేకపోవడం సమస్య కాదుకదా?’’అంటే- ‘‘ఓరి నీ తెలివి శ్రీమాన్ మోదీ తోలుకెళ్లా... పూలు, కూరలూ- అవి మొక్కమీదా, చెట్టుమీదా వున్నప్పుడే వాటికి ప్రాణం- దానికి అవసరం నరం-కోసిన తరువాత వాటికి నేల తడి కాదు- మరొక రకం తడి కావాలి. అంటే పైకం కావాలి.
గ్రామాల్లో పూచిన, కాసిన పూలు, కాయగూరలూ పట్టణాలకు చేరాలంటే రవాణా సదుపాయాలూ వుండాలి. వాటికి నగదు మద్దతు కావాలి. నగదు అన్న మాట ‘తగదు’ యిప్పుడు. ‘కనీసం మీమీ మనుషులు పెద్దాళ్లైనాక గానీ యివాల్టి సంస్కరణల బంగారు ఫలితాలు కానరావు’ అని శ్రీమాన్ మోదీగారు పదే పదే చెప్పినా తలకెక్కటం లేదా?
ఎందుకు ఎక్కడం లేదు? తలనుండి తోక దాకా మంట ఎక్కిపోతోంది!
‘వాడిన పూలే వికసించునే’ అని పాడావో. రాలిన పూలు ఎలాగా రాలిపోయాయి. నీ పళ్లు రాలగొడతాను’’-అంటున్నాడు పూల వర్తకుడు. కార్తీకమాసం ఏడుస్తూనే వెళ్లిపోయింది. పెళ్లిళ్లకి కాగితం పూలు కూడా వూరికే దొరక్క ఒడలిన పూలు కట్టలేక - డబ్బున్న ముష్టి వాళ్లల్లాగా- ‘‘వాయించండర్రా... వాయించండి’’-అంటూ బాజాల వాళ్లని హుషారు చేస్తూ మూడుముళ్లూ వేయించేస్తున్నారు-
పైసలున్నాయి... ఎక్కడ? బ్యాంకుల్లో పాత నోట్ల కట్టల రూపంలో- వున్న డబ్బులు చెల్లవనీ, ఎప్పటికేనా తిరిగి తీసుకోకపోతామా? అనుకుని, అకౌంట్లలలో త్రోసేసి- యింటికి రాకుండా మార్గమధ్యంలోనే సొమ్మసిల్లిపోయిన సోమశేఖరాలు చాలామంది వున్నారు.
వినాయకుడి బొడ్లో వేలెట్టినట్లయింది!
ఆ పాత నోట్లు వున్నా బాగుణ్ణు? బ్యాంకులో యిరుక్కుపోయాయి. ముప్ఫై లేదా నలభై శాతం కమిషన్‌కి కొత్త నోట్లు కొనుక్కుందుం కదా? గానీ, అవి ఒన్‌వే ట్రాఫిక్‌లో దిగంతాలకవతలకు- ‘‘మోదీగారూ! శరణు శరణు!’’ అంటూ వెళ్లిపోయాయి- రీసైక్లింగే గతిట!
బ్యాంకుల్లో కొత్త కరెన్సీ లేదా? మరి బంగళూరులో బ్యాంకులోనుంచి ఆరు కోట్ల రూ. మొత్తం చేసే సరికొత్త రెండు వేల రూపాయల నోట్లు ఎలా వెళ్లాయి? హైదరాబాద్ నారాయణగూడాలో దొరికిన తొంభై లక్షల కొత్త రెండువేల రూపాయల నోట్లు ఎక్కడనుంచి వచ్చాయి? అవన్నీ బ్యాంకుల్లోనుంచి గాక?- మింట్‌నుంచే నేరుగా పోయాయా? బ్లాక్‌మనీ పోయె (జై మోదీ! జైజై జైట్లీ!) ఓల్డ్ మనీ పోయె... బ్లాక్ మార్కెట్ మనీ- ధైర్యం, స్థైర్యం, ఓపిక వున్నవాడికి దొరుకుతున్నాయ్!-
మోదీగారు చెప్పినట్లు కుళ్లిపోని, చిరిగిపోని చివికిపోని వస్తువుల్ని మనవఁలు వాడుకుంటారని వొగ్గేద్దాం- కానీ, కూరలూ, పళ్లూ, పూలూ- యివన్నీ యిప్పటికిప్పుడు అనుభవిస్తేనే సంతోషం. దీనికి రైతుల తర్వాత కూలీల దగ్గరనుండీ వర్తకుల దాకా, అందరికీ కొత్త కరెన్సీ నోట్లు దొరికితేనే గానీ మోక్షం లభించదు-
కడియం- అంటే తూర్పుగోదావరి జిల్లా- కడియపులంక పూల మార్కెట్- దేశంలోనే, పూలూ, పూలమొక్కలూ కూడా కన్నుల పండువగా- మనసుల నిండుగా- ఎగుమతిచేసే అతి పెద్ద- ‘సుమదళ శోభనం!...’ అత్యంత కమనీయ దర్శనీయ స్థలం. ఇక్కడి మార్కెట్‌నుంచి ఈమధ్య ఎక్కువగా పూలు తెచ్చారు రైతులు. కారణం తమిళనాడులో తుపాను కారణంగా- ‘పూలు ఇల్లే’! అక్కడికీ మన పువ్వులే సువాసనలు వెదజల్లుకుంటూ ఎగుమతి అవుతున్నాయి- సారీ! అయ్యేవి....
ఐతే, పైసలు బిగిసిపోడంతో మార్కెట్లకు యిబ్బడిముబ్బడిగా పూలు చేరినా- కొనేవాడు లేక, మార్కెట్లలో మిగిలిన పళ్లూ, కూరలూ, పూలూ- అంతే సంగతులు అయిపోతున్నాయి.
కడియం వెళ్లి చూస్తే- పాల కడలి లాంటి నర్సరీల ప్రాంతం కడగండ్ల కడలిగా మారిపోయింది. పెంటకుప్పల మీద పూలు కుళ్లిపోయి- ‘విలపిస్తున్నాయి’. పరిమళాలు దుర్గంధంగా మారిపోయాయి. రైతులు పొలాల్లోవేసి దునే్నస్తామంటున్నారు రుూ పూలని-
నాలుగువేల నర్సరీలు ‘కునారి’పోతున్నాయి. పది పదిహేను లక్షలుంటే తప్ప పనివాళ్లందరికీ జీతాలు బట్వాడా చేయలేని స్థితిలో వున్నదీ వ్యవస్థ.
రెండువేల రూపాయల నోటు లెవెల్లో దేశం పెరగాలీ అంటే మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ డ్రింకింగ్, రుూటింగ్ యివన్నీ చెయ్యాలీ అంటే- మరి అన్ని మొబైల్స్ ఎక్కడ? వాటికి యింటర్నెట్, ‘వై-ఫై’ సౌకర్యాలూ- డేటా కార్డులూ ఎక్కడనుంచి వస్తాయి?
మొబైల్ ఆండ్రాయిడ్ అంటే పాటలు వింటాం. బూతు దృశ్యాలు చూస్తాం, హస్క్ కొడతాం- ‘‘యాప్’’లు దింపుకుంటాం- ‘జగతిని నేనూ, నా మొబైల్ మాత్రమే వున్నాయనుకుంటాం. గానీ వాటిలో పప్పూ, ఉప్పూ, మిరపకాయలూ, విక్సూ, ఏస్ప్రిన్ కొనుక్కు తెచ్చుకోగలమా?
‘పూల బాసలూ తెలుసు ఎంకికీ’ అన్న నాయుడుబావ యివాళ వుంటే - ‘‘యెంకి కూడా - నాకో మొబైల్ కొనెట్టు బావా!’’అని వుండేదేమో!
‘‘పూలు బాసలూ తెల్సునూ ఎంకికీ- తోట పూల మనసులూ తెలుసునూ ఎంకికీ’’అని వూసులాడే రోజులు పోయాయి.
పూల బాసలేమిటో మోదీగారికి తెల్సా? డిజిటల్స్ తెలుసు.
అంతేమరి! అన్నాడో భాజపా భక్తుడు.
మోదీగారికేటి తెలుస్తుందో మనకీ అదే తెలియాల. పూలూ, కాయలూ కూడా డిజిటల్ అయిపోవాల. కూరల మార్కెట్‌లో వంకాయలొకచోటా- పచ్చిమిర్చి యింకో గంప కాడ- కొబ్బరికాయలు గేటు కాడ- ఇలా కొంటాం. మరి రుూ హోల్ మొత్తానికి మొబైల్ నొక్కుకుంటూ పోవాలా?’’ అడిగాడు, వాళ్లావిడ తరఫున ఒక కాలేజి టీచరు మార్కెట్‌లోకి వచ్చి!
‘‘అదంతా తెలవదు. క్యాష్‌లెస్ దేశం అయిపోవాలి. అంతే!’’నన్నాడు భాజపా కార్యకర్త.
‘‘ఓ టెన్ కొడతావా?’’ ఆ వెంటనే అడిగాడు. ఆ వెంటనే మిత్రుణ్ణి!
చంద్రబాబు నాయుడుగార్ని అడగాలి. ‘‘నా దగ్గర రెండువేల రూపాయల నోటుంది. అది కావాలంటే, చూసి మళ్లీ యిచ్చేయ్!’’ అన్నాడు కాం.పా. మిత్రుడు-
బై ది బై ‘నాయుడు’అంటే మన చంద్రబాబు నాయుడుగారు పేదలందరికీ మొబైల్స్‌ని పంచిపెడతాడంట! ‘‘దానికేంటి కావాలి. క్వాలిఫికేషన్? ఏ కార్డా?
‘‘ఎవడబ్బ సొమ్ము?’’అని అడిగేవాడు మన ఎన్.టి.ఆర్. వుంటే! ’’ అన్నాడో టెక్కీ!-
కడియంలో పూలమొక్కలకి బదులు మొబైల్ తోటలు వేయిస్తారేమో?
‘‘వాళ్లు పాలకులా, అయ్యా! నువ్వు పాలితుడివి... కీప్ క్వయిట్!’’ అనగానే, మిత్రుడు ముక్కున వ్రేలేసుకున్నాడు- అలాగే వుండు
గో స్లో.... స్పీడ్‌బ్రేకర్స్ అహెడ్!!- *