వీరాజీయం

గాడిద జున్ను.. యమా భేష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాడిద కన్నా గాడిదపాలు మిన్న- అన్నది నమ్మండి. ఇది ఆధునిక సత్యము. కొంతమంది గాడిద అనంగానే ఇలా మొహం పెడతారు. అది తప్పు. గాడిద పాలు గ్రేట్-అంతేనా? అది కుక్కలాగే ఆదికాలం నుంచి మనిషికి పర్సనల్ అసిస్టెంటు కూడా. పెట్టనికోట లాగ -కరగని అరగని చెరగని మంచు కప్పుకొని ఉన్న, హిమాలయసానువుల మీద -మనసరుకులు ఎవడు మోస్తాడు? అయితే గాడిద కేవలం సరుకులు- మురికి దుస్తులు మోయడం కన్నా చాలా గొప్పది.
గాడిదల విలువ చైనా వాడికి తెలుసు. అది అంటే వాళలు పడి చస్తారు - ఆఖరికిపాకిస్తాన్ దగ్గర కూడా గాడిదల కోసం చేజాచారు.. గ్రేట్ చీనీయులు. ఆ కథంతా మనకి తెలుసు. కానీ, గాడిద పాల గొప్పతనం సైంటిఫిక్‌గా కూడా ఖరారయింది. మహరాష్టల్రోని నాందేడ్ గాడిదలు- ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఉపవేష్టించి ఉన్నాయి - నిజామాబాద్‌కో వైజాగ్‌కో లేదా ఇక్కడ - బెజవాడకో. పిడుగురాళ్లకో ఏది వీలైతే దానికి పొండి- మరీ మిల్లిగరిటెడు కాదు కాని ఓ చటాకుడు తెచ్చుకోండి.. అస్తమా దగ్గు ఆయసం - కీళ్ల నొప్పులు వున్న వాళ్లకి ఇవ్వండి.. తల్లిపాలు లేని లేదా తల్లిపాలు పడని పసికూనలకి పట్టండి- ఒకే. ఇకనేం? ఓ నాలుగు లీటర్లు కొని ఫ్రిజ్‌లో పడేసుకుంటారా? ‘‘అవేమిటి? ఆవుపాలు బఱ్ఱె పాలు లేదా లొట్టిపిట్ట పాలు అనుకున్నారా? గార్ధ్భ క్షీరము’’. డిమాండుని బట్టి రెండు నుంచి నాలుగు వేల రూపాయల దాకా ఉంటుంది ఒరు లీటరు. కాకపోతే, గాడిదపాలు కూడా ఎక్కువగా వాటి పెయ్యలు, దూడలూ తాగేస్తాయి - మన పిల్లలకి మిగలవు.. పైగా గార్ద్భ మాతలు రెండు రెండున్నర ఏండ్లకోసారి
మాత్రమే ఈనుతాయి. అసలు గాడిద పిల్ల కోమలం అంటారు. ఎంత ముద్దుగా వుంటుందో? కారణం ఇంత దూరం చదివాక అడగొచ్చా?-అది సరే, సందర్భం ఏమిటి? అంటే - ఐరోపా దేశపు గంగి గోవు ‘‘గాడిదే’’ అనుకున్నాంగా -
ఆ మధ్య ఫ్రాన్సులోని స్త్రాస్బర్గ్‌లో ఐరోపా గాడిద సంరక్షణ కేంద్రాల పార్లమెంటు జరిగింది. అక్కడ గాడిద పాల ఔషధీ గుణగణాలను గానం చేస్తూ ఒక పెద్ద గాడిద క్షీర శాస్త్ర గ్రంధాన్ని విడుదల చేశారు - ఈ ఉద్గ్రంధాన్ని ఇటలీలోని మిలాన్ యూనివర్శిటీ వైద్య నిప్నులు ముగ్గురూ, బ్రిటన్‌లోని ‘సిడ్మౌత్ గార్ద్భ సంరక్షణాలయం’ వారు సంయుక్తంగా తయారు చేశారు. దీనినిబట్టి ఎవరయినా గాడిద పాడి పరిశ్రమలని పెంపొందించుకోవచ్చు. గాడిద క్షీరం తో సౌందర్యపోషకాలు ఉన్నవి కనుకనే, వెనుకటికి గుఱ్ఱాలు - దండిగా ఉన్నా, అందాలరాణి క్లియోపాత్రా బాత్ టబ్ నిండా గాడిద పాలు నింపుకొని జలకాలాడేది. ఐదొందల ‘‘గాడిదల దొడ్డి’’ ఉండేదిట. ప్రపంచవ్యాప్తంగా - ఈ సంజీవనీ ఔషధ ప్రదాయిని అయిన గాడిద పట్ల ఆసక్తి ఎక్కువ అవుతోంది.
ఫలానా కాఫీ ఇంచుమించు ఫిల్టర్ కాఫీకి సమానం అన్న ప్రకటన లాగ గాడిద పాలు ఇంచుమించు ఆవుపాలకి, అమ్మపాలకి సమానం అన్న నమ్మకం ఏర్పడిపోయింది. అంతెందుకు? అమెరికన్ డెమోక్రటిక్ పార్టీ గుర్తు ఏమిటి? అని అడిగాడో జి.కె. ప్రియుడయిన బాలుడు. గాడిద కేవలం చాకిరేవు మూటలు మొయ్యడానికి మాత్రమే అయితే - ఇవాళ, మడేలన్న అక్కడా యిక్కడా, ఆటోలనే అందుకు వాడుతున్నందువల్ల - ఈ జాతి అంతరించిపోవచ్చు.- కాని గాడిదగ్రేట్ కనుకనే - లక్నోలో బ్రహ్మాండమయిన రీసెర్చ్ సెంటరుంది - మొట్టమొదటి గాడిద క్షేత్రం కేరళలో వెలిసింది. కాగా తమిళనాడులో పుదుక్కొట్టై గాడిద శాలలు అవశ్యం దర్శనీయాలు.అదంతా చరిత్ర -ఇప్పుడు వర్తమానమునకు రండు.. -గాడిదకన్నా గాడిద జున్ను మిన్న - అబ్బో ! ఏంతో ఎంతో మిన్నా ఎట్లన్నన్.. ఈ జున్ను చితికేదయిననూ -దాని ధర అదురుతుంది .. పైగా ,పదండి సిర్బియా వెళ్లి వద్దాం -ఇది టెనిస్ ప్లేయర్ జేచోవిచ్ సొంతా ఊరా? సారీ దేశమా? అతడు త్రాగునా గాడిద పాలు లాంటి సిల్లీ క్వశ్చన్స్ -గూగుల్ భయ్యాని అడగండి.. తప్పో వొప్పో ఠక్కున .... అదీ అట్లు ఉండనిండు ... జున్ను -అనగా బర్రె జున్ను-లోట్టిపిట్ట జున్ను - గాడిద జున్ను చాలా పరిమితంగా దొరుకుతుంది. కేజీ జున్ను ధర రూ.78 వేలు (1100 డాలర్లు) మాత్రమే వుంటుంది.. పైగా దీనికోసం సిర్బియాకో, కీన్యాకో వెళ్ళాలి . జున్ను ముక్క ఎంత చిన్నదయినా - ఐ మీన్ గాదిద జున్నుముక్క -బోలెడు ఖరీదు..
ఐరోపాలోని సెర్బియాలో (దాని రాజధాని బెల్ గ్రేడ్) ఈ వ్యాపారం చేసే స్లోబోడన్ సిమిక్ అనే పెద్ద మనిషి మామూలు మనిషా ?కాదు .. సెర్బియా ప్రాంతీయ పార్లమెంటు (మాజీ )సభ్యుడు. కాని గాడిదలను అమూల్య సంపదగా భావిస్తాడు వెధవది - లేదా గట్టిగా చెప్పాలి అంటే -వెధవన్నర వెధవది. -రాజకీయాల కన్నా -ఈ గార్ధ్భ జున్ను వాణిజ్యం ఎంతయో మేలు- అయితే అంత వీలు అనగా సులువు కాదు.....50 గ్రాముల చొప్పున మేం తయారుచేస్తాం. ఇది పది మంది తినొచ్చు. నాకు తెలిసి ఎవరూ ఇది అర్ధ కేజీ లేదా కేజీ తినరు...అని సిమిక్ వివరించారు. చాలా దేశాల్లో వస్తురవాణాకు, వ్యవసాయ పనులకు గాడిదలను వాడతారు.
అనేక ప్రాంతాల్లో గాడిద పాలను తాగుతారు. కానీ వీటి నుంచి జున్ను తయారు చేయడం చాలా కష్టం. పాలు తోడుకోవడానికి అవసరమైన ప్రొటీన్ గాడిద పాలలో లేకపోవడమే దీనికి కారణంమని చెబు తున్నారు.దీనిని దృష్టిలో ఉంచుకొని, గాడిద పాల నుంచి చీజ్ చేయడానికి ఒక సాంకేతిక పరిష్కారం కనిపెట్టాలని ఓ నిపుణుడిని పురమాయించారు. ఈ చీజ్ తయారీ విధానం ఒక చిదంబర రహస్యం. ఒకేఒక్కడు ఉన్నాడు- అతడిని పట్టి రహస్యం తెలుసుకోవాలి- ట్రైనింగు ఇప్పించు కోవాలి. అనగా.. ఎప్పుడూ ఆవుమీదే కాకుండా గాడిద మీద కూడా మనం ఇంగ్లీషు మీడియంలో కాంపోజిషన్ రాయించాలి. అన్నాడో సీనియర్ సిటిజనుడు.
‘ఓరి.. నీ సంప్రదాయం మండిపోనూ- ఆవు అంటే ఏమిటి? ‘‘అంటున్నడయ్యా... నీ టెల్గు బాలుడు. మనం అప్పుడు ఆవు అనగ ‘‘కవ్’’ అని చెప్పాలి - ఓహో అలాగా అంటాడు వాడు - నిజంగా గాడిదమీద గౌరవమే వుంటే - వయాగ్రా లాగ కూడా పని చేస్తోంది అంటున్నారు గనుక - రామ్‌దేవ్ బాబాని సెర్బియా పంపాలి- దీనిని ప్రమోట్ చెయ్యాలి. గౌ సబ్బులు, గౌ పేస్టులు లాంటివే గాడిద జున్ను కూడా మార్కెట్‌లోకి అతి త్వరగా రావాలి .. జై గాడిదా..!
సో.. జెంటిల్మన్! సే- ‘‘డాంకీ చీజ్’’ అండ్ టేక్ ఎ సెల్ఫీ స్నాప్!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512