వీరాజీయం

‘మెజార్టీ’ వుంటే చాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరసత్వ (సవరణ) చట్టం 2019ని అమలు చేయబోమని కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీశ్‌గఢ్ రాష్ట్రాలు ప్రకటించాయి అమలు చెయ్యాలి అన్న నిబంధన ఏమీ లేదని- ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారికంగానే భారీ ఎత్తున ఉద్యమం లేవదీసింది.
అసోంలో కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా స్పందన విముఖంగా వుంది. సమితి సంస్థలు ఈ సవరణ బిల్లుని నిరసిస్తున్నాయి-పైగా ఇప్పుడు రాజధాని ధిల్లీ మొదలు హైదరాబాదు ఉర్దూ యునివర్సిటీ దాకా విద్యార్ధులు ఆగ్రహోదగ్రులై పోలీసులతో నిరాయుధులుగానే యుద్ధం చేస్తున్నారు.
అమిత్ షా అంటే హోమ్‌మంత్రి పర్యటనలు రద్దు చేసుకోవలసిన దుస్థితి, బండ మెజారిటీ వుంటే చాలా? ఏది పడితే అది చేసెయ్యడమేనా? అని మాజీ రాష్టప్రతి ముఖర్జీగారి నుంచి సామాన్యుని దాకా మోదీ గవర్నమెంటుని నిలదీస్తున్నారు. జపాన్ ప్రధాని మొదలు ఎంతో మంది విదేశీ అధినేతలు ఇండియా అంటే చాలు.. ద్విగుణీకృత ఉత్సాహంతో వచ్చి భారత ప్రధాని ఆతిథ్యానికి మురిసిపోయేవాళళు. ఇప్పుడు తెనాలి రామలింగడి పిల్లి లాగ అయిపోయారు. ఈశాన్య రాష్ట్రాలలో అశాంతి దేశానికి అన్నింటికన్నా ప్రమాదకరం. అటువంటప్పుడు అక్కడ మనం అల్లర్లు గా భావించేది జరుగుతున్నది. ఒక రకంగా తిరుగుబాటు.. విద్యార్థులు ప్రతీచోట.. రెండు వర్గాలైపోయి పరస్పరం కత్తులు నూరుకొనే స్థితి ఎవరు కల్పించారు? అప్పోజిషను కాంగ్రెస్సా? ముస్లిం పార్టీలా? లేక మరొక విదేశీ దుష్ట శక్తియా? అన్నది ప్రశ్న కాదు.. కొంపలు అంటుకున్నాయి, మంటలు చల్లార్చాలి.. దేశంలో ఇతర ప్రాంతాల అమాయక జనం.. గవర్నమెంటుని సంజాయిషీ అడగటం లేదు.. శాంతి పునరుద్ధరణ మొదట కోరుకుంటున్నది. ఇవాళ ఎన్నో సమస్యలు ఉండగా.. ఆర్థికస్థితి ప్రమాదకరం అని నిపుణులు అంటున్న దశలో.. ఈ చట్టాన్ని మరికొంత అధ్యయనం చేశాక రంగంలోకి తేవాల్సి వుందేమో? ఇది కేవలం అధికార పార్టీ తొందరపాటు చర్య ఏమో అంటూ సీనియర్ పౌరులు కూడా ప్రతి కూడలిలోనూ, మార్నింగు వాక్ సమయంలోను చర్చించడం.. ప్రస్తుతానికి ప్రశాంతంగా వున్నా రాష్ట్రాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నిజానికి ప్రతిపక్షమెక్కడ? ఇవాళ చావు తప్పి కన్ను లొట్టపోయింది అన్నచందాన వున్న కాంగ్రెస్ పార్టీ మీద ధ్వజం ఎత్తడం మోడీ వర్గాలకు ప్రధాన లక్ష్యం కాదు. పార్లమెంటులో ఒక వివాదగ్రస్త బిల్లుని చట్టం చేయడానికి ముందు చేయవలసిన సన్నాహక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేసిందా? అని తటస్థ ప్రజానీకం అడుగుతున్నారు? వెబ్‌లో, పత్రికలలో ఈ అంశం చర్చించి ‘‘ఆమ్‌ఆద్మీ’’ ని కన్విన్సు చెయ్యకుండా, ఎన్నడో 1904 బెంగాల్ విభజన నాటి నుంచి పీడిస్తున్నా ఈ సమస్యకు పార్లమెంటు చట్టాలే పరిష్కరిస్తాయి అనుకోడం తొందరపాటే? అన్నది జనవాక్యం..
ఈ చట్టం అమలుకు సంబంధించి రాష్ట్రాల పాత్రపై చర్చించడానికంటే ముందు పౌరసత్వ (సవరణ) చట్టం 2019కి సంబంధించి కొన్ని విషయాలు మనకి ఎంతవరకు తెలుసు? ఒకవేళ మోదీ గారన్నట్లు ఇది కాంగ్రెస్సు చేయించగల చేయిస్తున్న ‘‘అల్లర్లే’’ అయనా వాటిని ‘‘అణచి’’ వేసి శాంతి స్థాపన, దేశ ఆస్తుల రక్షణ చేయడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం కాదా? అని సామాన్యుడు ఘోషిస్తున్నాడు!? ఇప్పుడిప్పుడే మైనార్టీలు అల్ప సంఖ్యాకులు ఎట్సెట్రా అంటూ జనజీవన కళ్యాణ్ స్రవంతి వైపు మొగ్గు చూపెడుతున్న దశలో ఇంతటి నిరసన ఉద్యమం లేవడం దారుణం. దీనికి మతం రంగులు అద్దే ప్రయత్నాలకు అడ్డుకట్ట్ట వెయ్యాల్సిన అగత్యం ముఖ్యం. చర్చలు లాజిక్కులు వగైరాలు కాదు.. శాంతి, ఆస్తులు, ప్రజల మనోభావాలను కూడా దుయ్యడం మీద మోడీ గవర్నమెంటు స్పందించాలి. దీదీ అభిమానులు మాత్రమే వెస్ట్ బెంగాల్లో దీనిని వ్యతిరేకిస్తున్నారు అనడం ఓదార్పు కాదు. అట్లా కాదని భాజపా థింక్ ట్యాంకుకి తెలియదా? ఉన్న చట్టాలతోనే ఈ సో కాల్డ్ అత్యవసర సమస్యను పరిష్కరించవచ్చును అన్న మేధావి వర్గాలను ఒప్పించే పని అమిత్ షా గారి యంత్రాంగం చేసిందా? ఇక రాష్ట్రాలతో పోరాడే దుస్థితి రావాలా? ఆలోచించండి.
పౌరసత్వం అనేది కేంద్ర జాబితాలోని అంశం. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే పార్లమెంటు ఆమోదం తెలిపింది. రాష్టప్రతి ఆమోదంతో ఇది చట్టంగా మారింది. కేంద్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. పౌరసత్వం అనేది కేంద్ర జాబితాలోని అంశం కాబట్టి, ఈ చట్ట సవరణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(2) పరిధిలోకి రాని ఏ బిల్లుకూ రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 54, 55, 73, 162, 241, ఐదవ భాగంలోని చాప్టర్ 4, ఆరవ భాగంలోని చాప్టర్ 5, పదకొండవ భాగంలోని చాప్టర్ 1, ఏడవ షెడ్యూల్‌లోని జాబితాలను మార్చాల్సి వచ్చినప్పుడు, పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని మార్చాల్సి వచ్చినప్పుడు మాత్రం.. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన బిల్లును రాష్టప్రతి ఆమోదించడాని కంటే ముందే.. దేశంలోని కనీసం సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాల్సి ఉంటుంది. అలా ఆమోదం పొందిన బిల్లులే చట్టం అవుతాయి అని మీడియా వివరంగా రాస్తున్నది.
ఈ చట్టం ప్రకారం భారతీయ పౌరసత్వం కోసం అర్హులైన వారు నేరుగా కేంద్ర హోం శాఖకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను పరిశీలించి, నిర్ణయం తీసుకునే బాధ్యత నేషనల్ రిజిస్ట్రేషన్ అథార్టీకి చెందిన నేషనల్ రిజిస్ట్రార్‌ది. రిజిస్ట్రార్‌కు సహకరించేందుకు అవసరమైన సిబ్బంది, అధికారులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కేంద్ర జాబితాలోని చట్టాన్ని అమలును నిరాకరించడానికి రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేవు. ఒకే... కానీ తిరుగుబాటు స్థితిని- మతం రంగుని ఎట్లా అరికడతావు? ఇది కేంద్ర హోం శాఖకి సూటి ప్రశ్న. న్యాయ నిపుణులు సైతం కేంద్ర ప్రభుత్వ వాదన సరైనదేనని అంటున్నారుట. ఒకవేళ కేంద్ర చట్టాన్ని అమలు చేయకుండా రాష్ట్రాలు తిరస్కరిస్తే.. దానిని అమలు చేయాలని ఆదేశించే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 256 ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆ ఆదేశాలను కూడా రాష్ట్రాలు పాటించకపోతే.. అప్పుడు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒక మార్గం కాగా, రాజ్యాంగ సూత్రాలను పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందుకు ఆర్టికల్ 356 ప్రకారం రాష్టప్రతి పాలన విధించడం మరొక మార్గం అని వారు వివరిస్తున్నారు. ఇవాళ సుప్రీమ్ కోర్టు ముందు జోక్యం కోరితే ఏమంటున్నది? ప్రశాంతి ముందు ఆనక విచారణ అంటున్నది సముద్రంలో అలలు తగ్గడమెప్పుడు? స్నానం చెయ్యడం ఎప్పుడు? ఎప్పుడు ముందు మారణహోమం.. ఆస్థి రక్షణ ప్రజల మనుగడలకు ఏర్పడ్డ ముప్పును నివారించండి. తరువాత ఆక్షన్ తరువాత.. ఈ చట్టం జనాల్ని భయాందోళనలకు.. ముఖ్యంగా సెన్సిటివ్ సరిహద్దులలో దారితీసింది. ఇది ఒక ఎమర్జెన్సీ.. కొన్నాళ్ళు ఈ చట్టాన్ని అట్లా అట్టే పెట్టండి. ‘‘మారుటోరియం’’ ప్రకటించరాదా? జనాల సంశయాన్ని తొలగించడం తక్షణ కర్తవ్యం.. వై నాట్ దీని అమలుకు మారుటోరియం ప్రకటించరాదా?
స్టాప్ బ్లేం గేం.. బ్రింగ్ పీస్ బ్యాక్ హోం...

veeraji.columnist@gmail.com 92900 99512