వీరాజీయం

నగదు రహిత జీవనరాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారమంతా మార్నింగ్ వాకర్స్‌కి ఓ కొత్తరకం కాలక్షేపం తటస్థపడ్డది. ‘ఏం సామీ..! రైట్ అబౌట్ టర్న్ కొట్టేస్తున్నారా?’ అంటూ పలకరించాడు ఓ పెద్దమనిషి. నవ్వుతూ చూసిన ఆ మొదటి సీనియర్ సిటిజనుడు ‘ఎక్కడైనా ఏటిఎమ్ లేవేనా తెరిచి వున్నాయా? మీరొచ్చేదారిలో! అనడగాలనేగా.. మీ ఉద్దేశం?’ అంటూ ఎదురుప్రశ్న వేశాడు.
అట్లాంటి ఆశలు పెట్టుకోవద్దన్నట్లు జాలిగా చూసి- ‘‘నో ఛాన్స్! ఉప్పల్ నుంచి ఓయు క్యాంపస్ దాకా లాగించాం. ఎక్కడా ఎ.టి.ఎమ్‌లు నిద్రలేవలేదు’’ అన్న అవతలి పెద్దమనిషికి ‘్థంక్స్’ చెప్పాడు ఇవతలి ‘వాకర్’ నిట్టూర్చి.
నగరంలో ఎవరి ఏరియా వారికి ‘పోష్’. బోలెడన్ని మోటారు కార్లు, అంతకు రెట్టింపుసంఖ్యలో ఊరకుక్కలు రోడ్లమీద బద్ధకంగా పడివుంటే ‘‘యింకా తెలవారదేమీ’’ అనుకుంటూ ‘వాక్కుంటూ’ పోవాల్సిందే.. అదీ సిటీ!
‘‘నోట్ బందీ’’ అని శ్రీమాన్ మోదీగారు ముద్దుగా పెట్టుకున్న పేరు- కేవలం కష్టార్జితం.. కాస్తో కూస్తో పిత్జ్రారితం మాత్రం వున్న సామాన్య జనాల్ని లీగల్‌గా ‘ఎందుకు?’ అని అడగలేని రీతి వెన్నుపోటు పొడిచి నాలుగు మాసాలయింది. బ్యాంకులలో కూడా ‘క్యాష్’ లేదుట. ఎ.టి.ఎంలలో పెట్టడానికి కూడా ‘క్యాష్’ లేదుట. కేష్‌లెస్ సొసైటీ అన్నమాట.
అటుగా వస్తున్న ఒక ఆటోవాలా చెప్పాడు- ‘బంద్’ల కాలంలో ఎక్కడేనా ‘చాయ్ డబ్బా’ వుందా? అని అడిగితే- ‘ఆ గల్లీలో ఓ డొక్కు కొట్టుంది’’ అని చెప్పేవాళ్లు ధర్మాత్ములు, కొందరు. అలాగా ఓ పరోపకారి రుూ ‘ఆటో అన్న’.
‘‘ఒక్క జాగాలో వుందన్నా ఒక ఎ.టి.ఎమ్. కాని, అందల అన్నీ టూ తౌజండ్ కాయితాలే వస్తున్నాయ్ మల్ల..’’ అన్నాడు.
‘‘సరే పద.. ఆడికే!’’ అన్నాడు యివతలి శాల్తీ ఆశగా. ‘‘అయి కూడా అయిపోయినాయ్.. నాదే లాస్ట్’’-
‘‘ఇదేమిటండీ బాబూ! పిల్లలందరికీ పరీక్షలు, బోలెడు ఖర్చులు కదా! పాలబ్బాయిని ‘స్వయిప్ మెషీన్’ తెచ్చుకో.. డెబిట్ కార్డు పెట్టి గోకుతాను’’ అన్నదిట ఓ ఇల్లాలు. ‘‘నె లంతా నీకు పాలు సప్లయ్ చేసింది చాలక స్వయిప్ మెషిన్ తేవాలా? అది లేదుగానీ క్యాష్ రాంగానే ‘సెల్’ కొట్టమ్మా. అందాకా మీ గల్లీ మొగన ఆ డెబిట్ కార్డుమీద ఇస్తాడేమో, పాల పేకెట్లు తెచ్చుకోండి’’ అన్నాడు ధూధ్‌వాలా.
అయితే ఎందుకుటా? ఇలా అయ్యింది? క్యాష్ బాగా వుంది అనుకున్నాంగా. నగదు రహిత యాతన నుంచి కాస్త తప్పించుకున్నాం అనుకుంటూ వుంటే మరి యింత ఇదేమిటి? ‘‘ఆఫ్టర్ ఫోర్ మంథ్స్’’ మళ్లీ రుూ యిక్కట్లు అంటూ సీనియర్ వాకర్స్ నలుగురూ ఓ బ్యాంకు అరుగుమీద చతికిలబడ్డారు.
శ్రీమాన్ మోదీగారు యు.పి టూర్‌లో జనాల్ని ఓ ఊపు ఊపేస్తూ లెక్చర్లు దంచేశాడుగా. అంతే- ఇవతల ఎవడిష్టం వాడిది. బ్యాంకుల వాళ్లు అప్పులు యివ్వడం కోసం ఆరాటంలో.. ఖాతాదారుల్ని కనె్నత్తి చూడటం మానేశారు’’ అన్నాడో రిటైర్డ్ ప్రొఫెసర్.
‘‘అవును మరి వాళ్లకి ‘‘టార్గెట్లుంటాయి’’. మళ్లీ అక్కడా మోదీగారే బాదేస్తాడు- ‘‘టార్గెట్లు ఫెయిలైతే’’ అన్నాడు బ్యాంకు సీనియర్ మానేజర్‌గా చేసిన పెద్దాయన ‘‘కాస్త, సింపతీ యిస్తారా?’’ అన్నట్లు చూస్తూ..
‘‘అది కాదు బాబూ! ‘యాప్’లు, బహుమతులు గట్రా తెగ పెట్టి జనాల్ని ఎక్కేశాడు పి.ఎమ్.గారు. దాంతో అంతా ‘మనీలెస్ ట్రాన్‌శాక్షన్స్‌లు’’ దంచేశారుట! అంచేత బ్యాంకు ‘చెస్టు’లు ఖాళీ అయినయ్. అంచాత జనానిదే తప్పు. మొన్నటిదాకా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ, పాపం సామాన్య జనం వున్నదంతా వూడ్చి మొత్తం మీద పనె్నండు లక్షల పైచిలుకు కోట్ల రూపాయలు బ్రతిమాలుతూ, ప్రాధేయపడుతూ బ్యాంకు ‘కంతల’లోకి త్రోసేశారుగా? అదంతా తిరిగి మనకి మార్చేసిన కొత్త కరెన్సీనిగా యిచ్చేయకూడదా?’’ యోగా మ్యాట్ సహా కమ్యూనిటీ సెంటర్ నుంచి తిరుగుముఖం పట్టిన ఓ జీన్ ప్యాంట్ పడతి వ్యాఖ్యానించింది.
‘‘సరిపోయింది.. ఆంఫట్ అంటే అవన్నీ కొత్త నోట్లుగా మారిపోతాయా? అచ్చు గుద్దాలిగా?’’
‘‘అది కాదండీ- నా దగ్గర కరెన్సీ లేదు. నా నెల జీతం కూడా బ్యాంకులో వేయించేసుకున్నావ్. పుండుమీద కారం జల్లినట్లు అది చాలక యిప్పుడేమో ఏప్రిల్ ఫస్టు నుంచీ కొత్త సర్వీసు ఛార్జీలు, కొత్త నిబంధనలు అంటూ ముళ్ల కచీ దెబ్బల్లాంటి స్టేట్‌మెంట్లు యిస్తున్నావ్. ఎట్లాగయ్యా చచ్చేది? ఎంత అభిమానం వున్నా యింకా చాలదంటే ఎట్లా?’’
‘‘క్యాష్‌లెస్ అన్నమాటకి యిప్పుడు ఫుల్ మీనింగ్- పరిపూర్ణత సిద్ధించింది’’ అన్నాడు మరో పెద్దాయన.
మొత్తంమీద మోదీగారి బంగారుకల ‘నగదు రహిత మహావిప్లవం’ సాధ్యం అయింది. అసలు నగదే రుూ జగతిన అవినీతికి కారణం అన్న విశ్వాసం ఫలించింది సార్!’’ అన్నాడు మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ సెంటర్ బాస్- మొబైల్స్‌లో పైసలు వెయ్యడంలో బిజీగా ఉంటూనే.
‘‘అద్సరే! కోట్లాది జనాలలో ఎంతమందికి యింటింటా నెట్- ఎంతమందికి స్మార్ట్ ఫోన్లు- ఎంతమందికి నొక్కు బిజినెస్‌లో సాంకేతిక సమర్థతా వున్నాయి? స్టాటిస్టిక్స్ చెప్పనా?’’ అడిగాడు డ్యూటీమీద పోతున్న కుర్రాడు బైక్ ఆపి.
అది సరే, ఈ లెక్కలు వినండి. సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగులతోపాటు అందరికీ కరువుభత్యం పెంచినంత ఆ నందం కలుగుతుంది మనకి కూడా-- అంటూ చెప్పాడు ఆర్.బి.ఐలో అధికారిగా రిటైరైన పెద్దాయన శర్మగారు.
‘‘మొత్తం హోల్ టోటలుగా 5259 బ్య్రాంకు బ్రాంచీలు వున్నాయి. కాగా గ్రామీణ ప్రాంతాలలో టాయిలెట్స్ కల గ్రామాలతో సహా 1,819 బ్యాంకు శాఖలున్నాయి. 8482 ఎ.టి.ఎమ్‌లు, అన్నిచోట్లా లాండ్ మార్కులుగా భాసిస్తున్నా యి. వాటిలో సగం మహానగరాలలో వున్నాయి. వీటన్నింటికీ కరెన్సీ నోట్లు సప్లయ్ చెయ్యాలా? వద్దా?’’ అడిగాడాయన.
‘‘సారీ! చెయ్యలేరు. నా మాట వినండి. స్వామీ. నేను నాలుగు రోజులైంది. మొత్తం మా యింట్లో వాళ్లందరి డెబిట్ కార్డులు పట్టుకుని ఉప్పల్ నుంచి హిమాయత్‌నగర్ చక్కర్లు కొట్టేశా. డోంట్ వర్రీ కాసిన్ని ‘కాపర్స్’ వున్నాయి నా దగ్గర. చాయ్ కొట్టేసి యిళ్లకు పోదాం.. రాండి’’ అంటూ అందర్నీ తీసుకుని చాయ్ బండి వైపు పోయాడు- ఒకాయన.
‘‘అవును మరి. అంతగా ‘అసలు’ క్యాష్ లేకనే కదా ఢిల్లీ నగరంలో కొన్ని ఎ.టి.ఎమ్‌లలో పిల్లల కోసం చేసిన రెండు వేల రూపాయల నోట్లు పై కొస్తున్నాయ్..
‘పొంగల్..’ అయ్‌మీన్ ‘సంకురేత్తిరి’ నెల కొంచెం వెసులుబాటుగా పైకం తిరిగింది. అంతా ‘అమ్మయ్యా’ అనుకుంటూ, నగదు లావాదేవీలు చేసుకున్నారు. సుమారు 87 శాతం వినియోగదారులు కార్డులు, యాప్‌లు లేకుండా హాయిగా రొక్కం కళ్లజూసి మూరిసిపోయారు. కానీ అంతలో రుూ ‘నగదు రాహిత్యం’ దాపురించింది. జీతాలన్నీ బ్యాంకు పొట్టలో వేసుకున్నారు బలవంతంగా- చేతికి పైకం యివ్వరుగా?
వినాయకుడి బొడ్లో వేలెట్టినట్లయింది బ్రతుకు. లోవర్ మిడిల్ వాళ్లకి ముద్దు పేరు ‘సామాన్యుడు’. వీడెలా చావాలి? యాప్‌ల మాయాజాలంలో యిరుక్కున్నాడు సామాన్యుడు. అయ్యా అలా అనకూడదు. మోదీగారి ‘్ఫన్స్’ వింటారు. మీరేమీ చావనక్కరలేదు. చేబదులుగా వడ్డీకి యిచ్చే టిఫిన్ సెంటర్ అన్నలున్నారు. రాండి అన్నాడు ఓ గుడ్ సమారిటన్- ‘్థంక్యూ’ అన్నా.
ఈలోగా రిజర్వ్ బ్యాంకు సరికొత్త పది రూపాయల నోట్లు అచ్చొత్తిస్తోంది, త్వరలో విడుదల చేస్తుందిట- అంటూ ధైర్యం చెప్పాడు ఆపద్బాంధవుడు సుబ్బారావు ఒకడు. కానీ, ‘టెన్స్’ ఎ.టి.ఎమ్‌లో ఇముడుతాయా? పైగా ఏప్రిల్ ఫస్టు నుంచే కొత్త రూల్స్, కొత్త సర్వీస్ ఛార్జీలు కొత్త నిబంధనలు ఎందుకుటా? ఎందుకంటే?...
‘ఏప్రిల్ ఫస్ట్ ఈజ్ ఆల్ ఫూల్స్ డే!’
*