వీరాజీయం

మండుటెండలో పండువెనె్నల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసారి శ్రీరామనవమి నాడే క్రికెట్ జాతర ఐ.పి.ఎల్ కలిసి వచ్చింది. రాజకీయ నాయకులకు ఉదయం అటు తలంబ్రాల పండుగ, యిటు బాబూ జగజ్జీవన్‌రామ్ జయంతి వేడుక- దేశం అంతా క్రికెట్ వ్యామోహంలో మొహం మొత్తిందా? అన్నట్లుగా ‘పిచ్’ మీద ఇండో- ఆస్ట్రేలియన్ వార్ చండ ప్రచండంగా సాగింది. మండుటెండలకు స్వాగతం పలుకుతూ వెళ్లిపోయింది. ఇంత పరుగుల సంబరం కొండొకచో రోత కలిగించేలా ఎంత వాగ్యుద్ధం కూడా జరిగిపోయినా- మొహం మొత్తలేదు క్రికెట్ వ్యామోహంలో. ‘ఐపియల్- ఐపియల్’ అంటూ మామిడిపండ్ల సీజన్ కోసం ఎదురుచూసినట్లు ఉవ్విళ్లూరిపోయారు! రానే వచ్చింది. మండుటెండలో ప్రారంభమై, చీకటి పడ్డాక ఫ్లడ్ లైట్- జ్వాలాకాంతుల రంగుల హంగుల్లో ‘బంతీ బ్యాటు’ సమరం- ఈసారి ఐపియల్ స్పెషల్.
పదేళ్లయిపోయింది ఈ వినోద క్రీడ మొదలై. ‘మూడు వికెట్‌లు ఆరు సిక్సర్‌లు’గా కాసులు దండుకుంటూ.. అంచేత మొన్న ఇది మన అంతర్జాతీయ లెవల్ వేడుకలతో మన హైద్రాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియమ్‌లో యాభైవేల మంది ఆబాలగోపాల గణానికి కిక్ ఇస్తూ ఆరంభం అయింది. హైదరాబాద్ స్టేడియం చాలా పెద్దది- హైద్రాబాద్ సన్ రైజర్స్ రాయల్ ఛాలంజర్స్‌ని రంగురంగుల రథాలనెక్కించారు. గ్రామ పురాణగాథల్ని రంగుల తెరకెక్కించినట్లుగా జేగీయమానంగా ముంబాయి తార అమీజాక్సన్ బృందం వెయ్యి ఐటమ్ డ్యాన్స్‌ల పెట్టుగా అందాలు ఆరబోసుకుంటూ వుంటే- బెల్లం ముక్క దగ్గరికి చీమలు చేరినట్లు కోట్లాది మంది దానాపీనా ఏర్పాట్లుకూడా చేసుకుని టి.వి. సెట్‌ల ముందుకు పాక్కుంటూ చేరారు.
రాజ్యసభకు వెళ్లడానికి తీరిక లేకపోయినా ‘్భరతరత్న’ అవార్డు గ్రహీత సచిన్ టెండుల్కర్ సహా క్రికెట్ వీరులంతా గ్రామవీరుల్లాగ హాజరైనారు. సచిన్ అన్నాడు- ‘2007లో నేను యిరవై ఓవర్‌ల వింత షోలోకి అడుగుపెట్టినప్పుడు యింత ‘యిది’గా భూనభోమండలాన్ని యిది ఆక్రమించేసుకుంటుందని వూహించలేకపోయాను’ అని. అవును బి.సి.సి.ఐ. కూడా అనుకోలేదు- ఎంతమందో నిరసించారు- అవతల ఎండలు- యివతల పిల్లకాయలికి పరీక్షలు మధ్యలో ఛస్తూవుంటే సంధ్యమంత్రం అన్నట్లు రుూ ‘‘దోపిడీ’’ ఏమిటీ? అని అనుకొని- అది దేశాతీతం- కాలాతీతం- అయిపోయిన కాలక్షేపం అయిపోయింది- మామిడి పండ్ల సీజన్‌లో వాటితోపాటు ‘కొత్త ఆవకాయ’కూడా మానవుడు మహా రుచిగా ఆరగిస్తాడు. అలాగే యింత చేటు వ్యాపార క్రీడ- పాశ్చాత్య దేశాలలో ఫుట్‌బాల్ లీగ్‌లకు వుందేమోగానీ మనకి లేదు- నానా గో త్రస్య టీములలో మళ్లీ టీముకి నలుగురుకన్నా ఎక్కువ యితర దేశీయలుండరాదు అన్నారు. ‘లోకల్స్’కి ఛాన్స్ ఇవ్వాలి అన్నారు- పైగా సం తలో గొడ్డుల్ని వేలం పాడుకున్నట్లు క్రికెటర్‌లని ప్రాం చైజీలు కోట్లాది రూపాయలతో పాడుకుని - తమ యిష్టం వచ్చినట్లు ఆడించుకుని పైసలు చేసుకుంటున్నారు. బంతి విసిరినా, బ్యాట్ వూపినా కరతాళ ధ్వ నులు కేరింతలు ఏ స్థాయిలో ప్లేయర్‌కి పడతాయో రూపాయలు అదే స్పీడులో అందుతున్నాయి. అందుకనే పగలు అగ్ని కురుస్తూ వుంటే - చీకటి పడ్డాక ఫ్లడ్ లైట్‌లో దానికి ఉపశమనం కలగిస్తూ వుంటే- ‘‘వెనె్నల రేరుూ! ఆహా ఎంతో హాయి!’’ అ న్నట్లు కాళ్లూచేతులు డోక్కుపోతున్నా- దాహం దాహం అంటూ డ్రస్సింగ్ రూమ్ వైపు బొటన వ్రేలును స్కూలు పిల్లకాయల్లాగ వూపుతూ, సన్‌రైజర్స్ ‘వార్నర్’ నాయకత్వంలో యువరాజ్ సింగ్ విజృంభణతో ఆడేశారు- పాత ‘‘విన్నర్స్’’ గెలిచారు. రన్నర్స్ బెంగళూరు ‘్ఛలెంజర్స్’ చతికిలబడ్డారు- భేష్! ఈ ఎండల వేడుక మీద తినుబండారాలు, పానీయాలు అమ్ముకునే వ్యాపారం మొదలు- ప్రేక్షకుల మొహాలకి పెయింట్‌లు పూసి చేతికి బూరలు, గొట్టాలు యిచ్చి పైసలు దండుకునే వాళ్లదాకా ఎం దరో బాగుపడుతున్నారు. శ్రీ రామనవమి పందిళ్లు రాత్రి అలా ‘జాగారం’ చేశాయి. ఈసారి అరివీర భయంకరుడయిన క్యా ప్టన్ ధోనీ వికెట్ కీపర్‌గా మాత్రం దర్శనం ఇచ్చా డు. కూల్‌గా వికెట్ కీ పింగ్ చేసి ఆదర్శప్రాయుడయిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియన్ అయిన క్యా ప్టన్ స్మిత్‌కి ఊతం యిచ్చాడు. ఇలాగ అంతర్జాతీయ క్రీడాస్ఫూర్తి, మైత్రీభావం రుూ కార్నివాల్ భాగంలో ఆటవల్ల అనూహ్యంగా పెరిగిపోయాయి. క్రికెటర్‌లు సూపర్ స్టార్స్ అయిపోయారు. మిలియనీర్లు అయిపోయారు. ‘క్రిస్ గేల్ ఒక సుడిగాలి. అతని ఆట చూడటానికి నేను వెస్ట్‌యిండీస్ నుంచి వచ్చా. టిక్కెట్ కొనుక్కుని అయినా చూస్తాను.’’ అన్నాడు లెజెండరీ వివియన్ రిఛర్డ్స్. ఈసారి టోర్నమెంట్‌లు జరిగే అన్ని పట్టణాలలోను రంగుహంగుల లేజర్ షోలు, సినీతారల నృత్య గానాదులతో పం డుగ చేసుకునిమరీ ఆటలు కొనసాగిస్తున్నారు.
మళ్లీ వరుణదేవుడు కరుణించి జల్లులు పడేదాకా ప్రేక్షకవరేణ్యులకు ఫోర్లు, సిక్సర్‌లు యివే జడివానలు. ‘సిక్సర్! సిక్సర్!’ అని అరుస్తారు జనం. అవే ముఖ్యం. అందుకే రుూ మైదానాలలో బౌండరీలైన్ చాలా చిన్నదిగా వుంటుంది. సరే, రికార్డుల ‘మోత’వినండి... మొత్తం 2017 టోర్నీలోగా క్రిస్ గేల్ 251 సిక్సర్‌లు బాదేశాడు- వీరబాదుడే రుూ ఆటకి ప్రాణం. అతగాడే అందరికన్నా ఎక్కువ ఐదు సెంచరీలు బాదేశాడు. కాగా విరాట్ కోహ్లీ పరుగుల పంట (411) దక్కించుకున్నాడు. శ్రీలంక వీరుడు మలింగా 143 వికెట్‌లు జేబులో వేసుకున్నాడు. అమిత్ మిశ్రాకి హ్యాట్రిక్కుల రికార్డుదక్కింది. క్యాన్సర్ వ్యాధిని జయించిన యువరాజ్ సింగ్‌కి 2015లో అత్యధిక వేలం పాటను కూడా జయించి 15కోట్ల రూపాయలు కొత్త కారు ఈసారి బోణీ మ్యాచ్‌లో ఉప్పల్ స్టేడియంలో వీరబాదుడుతో ‘సన్‌రైజర్స్’కి మాటదక్కించాడు యువ.
కాకపోతే రుూ జాతరవల్ల క్వాలిటీ క్రికెట్, దేశభక్తి వగైరా దెబ్బతింటున్నాయి. దేశాల మధ్య ‘క్రీడాస్పర్ధ’ సన్నగిల్లకుండా వుండాలి అంటే కొంతమంది క్వాలిటీ ప్లేయర్స్‌ని దీనికి దూరంగా అట్టేపెట్టాలి అనుకున్న బోర్డువారిని కూడా అభినందించాలి. అశ్విన్, జడేజా, విజయ్, రాహుల్ లాంటి కిలాడీలు సీట్లలోనుంచి ఆటచూస్తూ కరతాళ ధ్వనులకే పరిమితం చేయబడ్డారు. సునీల్ గావస్కర్ అన్నట్లు యిది ‘బ్యాట్స్‌మన్’ గేమ్-వాళ్లు బ్యాట్ ఝుళిపించిన కొద్దీ జనం వెర్రెత్తి, మరిన్ని కాసులు కురిపిస్తారు. కాని నాలుగు ఓవర్‌లు మాత్రం వేసే బౌలర్‌ల కన్నా బూట్లున్నా నడవడానికే వేడిగా వున్న మైదానంలో డేకడం ప్రాకడం చేసే ఫీల్డర్స్‌దే అసలు కష్టం.
తడారిపోయే గొంతులతో ఐనా కేరింతలు కొడుతూ జేబులు ఖాళీ అయెనే! అంటూ ఉద్వేగంగా యిండ్లకు రాత్రి ప్రొద్దుపోయాక చేరుకునే ‘్ఫ్యన్స్’కి కూడా మనం ‘విసనకర్ర గాలి’ లాంటి అభినందనలు అందించాలి! అందుకు ‘్ఛర్ లీడర్స్’ వున్నారుగా అంటారా?
ఐపియల్ హాజ్ కమ్ టూ స్టే! ఛీర్స్!
*