వీరాజీయం

కార్పొరేటు ఫీ‘జులుం’పై ‘కాషాయ’ సమరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్తవ మిషనరీ స్కూళ్ళు, ప్రైవేటు కార్పొరేటు విద్యాలయాలు- వీటికి వున్న ప్రత్యేకతలేమిటి? వీటికి రెండు కొమ్ములు అదనంగా వచ్చాయా? ప్రభుత్వ రంగంలో వున్న స్కూళ్ళు కేవలం మధ్యాహ్నం బువ్వ పెట్టడానికేనా పరిమితం? ఏటా ఎండాకాలం వచ్చినట్లే ప్రైవేటు స్కూళ్ల బాసులు వాళ్ల శక్తిననుసరించి ఫీజులు ఇంకా రకరకాల స్పెషల్ ఛార్జీలను కూడా ఎడాపెడా పెంచేస్తారు! ఇంచుమించు మన మహానగరాలన్నింటా ఇదే తంతు. ఈ దెబ్బకి మధ్య తరగతి పేరెంట్స్ కుదేలయిపోతారు. తల్లిదండ్రుల సంఘాలు, విద్యార్థి పరిషత్ వాలంటీరు దళాలు- ఊరేగింపులు, ఉద్యమాలు లేవదీయడం- ఇదీ ఒక ఆనవాయితీ అయిపోయింది. ప్రైవేటు యాజమాన్యాలకి రూలూ రైమూ పద్ధతీ పద్దూ వుండవు- ఇంగ్లీషు మీడియం ఎరగా చూపెట్టి జనాల్ని ఎన్ని రకాలుగా నిలువుదోపిడీ చేయాలో అన్ని రకాలుగా నిలువుదోపిడీ చేసి పేరెంట్స్‌ని పాపర్లుగా చేసేస్తారు. పోయిన ఏడాది ఢిల్లీ పాపాయిల స్కూళ్ల కథ సుప్రీం కోర్టు దాకా పోయింది. కోర్టువారు గవర్నమెంటు అనుమతి లేకుండా ఫీజులే కాదు పుస్తకాల అట్టల ధరలు కూడా మార్చవద్దన్నారు. అలా మీరు పెంచారో ఇలా గ్రాంటులు, లైసెన్సులు కూడా లాగేసుకుని కథ ఫినిష్ చేసేస్తామని బెదిరించారు. ఏతావతా చెప్పవచ్చేది ఏమిటీ అంటే, ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ స్థాయిదాకా ‘అకటా దయలేనివారు మీ విద్యా సంస్థల జమీన్దారులు’ అన్నట్లుగా తయారైంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోర్టువారి సూచనల మేరకి జిల్లా స్థాయి ఫీజు నియంత్రణ కమిటీలు వేశారు. అయితే విద్యాబోర్డు పరిధి, కమిటీల అధికారం అన్న మీమాంస తెలంగాణలో సైతం వచ్చింది. మళ్లీ కోర్టువారి సూచనతో ఫీజుల నియంత్రణ ‘యావ’ ఉన్నదే కాని చట్టం లాంటిది రావాల్సి వుంది. ఇప్పుడు యుపిలో ముఖ్యమంత్రి ‘యోగి’ పుంగవుడి సంస్కరణలను చూసి మన రాష్ట్రాలు కూడా సీరియస్‌గా ఏదో ఒకటి చేస్తాయేమో? అది అట్లుండనిండు తమిళనాడు, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో చట్టాలున్నాయి కాని ఫీజుల మహమ్మారి అరికట్టబడదా? అన్నది డౌటే.. యుపి సిఎం అక్కడ ‘తీన్‌తేరాగా’ వున్న ప్రైవేటు విద్యారంగానికి ముక్కుతాడు వేయడానికి వెంటనే నడుం బిగించి సంబంధిత వ్యక్తులనీ వ్యవస్థలని కూడా పదిహేను రోజుల్లో నివేదిక అందజేయమని హుకుం జారీ చేశాడు. రాజు అదే- యోగిరాజు తలచుకుంటే దెబ్బలకి కొదువా? అన్నట్లు తీగ లాగంగానే డొంక కదులుతోంది. ఆదిత్యనాథ్ టెక్నిక్ ఏమిటి అంటే కీలెరిగి వాతపెట్టడం.. వాళ్ల పిలక వీళ్ల పిలక కూడా చెరో చేత్తో పట్టుకుని ఇపుడు, బిల్లు చర్చా అనే చూయింగ్ స్టైలుకి పోకుండా అత్యవసర ఉత్తరువు శ్రీమాన్ మోదీ స్టైలులో జారీ చెయ్యబోతున్నాడు. ఇక్కడ జనాలకి యోగీజీ మీద ‘ఇతన్ని ఎవరూ ప్రలోభపెట్టలేరు- ఆశ్రీత పక్షపాతం, మొహమాటాలు ఇప్పుడే దరిచేరవు’ అన్న విశ్వాసం ఒకటి ఏర్పడ్డది. ఉత్తమ రాష్టమ్రా? ఉత్త రాష్టమ్రా? అంటే ముందు విద్యారంగ ప్రక్షాళన అవసరం. అంచేత స్టడీ ఫస్ట్, స్టెడీ సిస్టం నెక్స్టు అన్నట్లు యజమానులతోపాటు గవర్నమెంటు టీచర్లమీద కూడా దుర్బిణీ తిప్పాడు యుపి కొత్త ముఖ్యమంత్రి.
కొంతమంది గవర్నమెంటు డాక్టర్లు అయినా, ప్రైవేటు ప్రాక్టీసులు పెట్టకుండా వుంటారేమోగాని ట్యూషన్ పాయింట్లు, కోచింగ్ సెంటర్లు పెట్టుకోకుండా గురువులు ఎవ్వరూ వుండరు- అలా ఎవరైనా దొరికారో వాళ్లమీద ఎఫ్‌ఐఆర్‌లు తగిలించమని కొరడా. ఈ కాషాయాంబరధారితో వచ్చిన చిక్కు ఏమిటీ అంటే ‘అనడం, ఆచరించడం’ వెంట వెంటనే చేసేస్తాడు. అసలు ఏప్రిల్ నాలుగున మూకుమ్మడి కాపీయింగ్ వ్యవహారం ముఖ్యమంత్రి నోటీసులోకి రావడంతో సదరు కేంద్రాలమీద ‘సారు’ కనే్నశాడు. తనయుడు తప్పు చేసినా తండ్రి తప్పు అన్నాడు నృసింహ శతకర్త.. అలాగే శిష్యుడు తప్పుచేసినా గురువుని పట్టుకోవాలి అన్నట్లు టీచర్లందరి జాతకాలూ ఆరాతీశాడు ముఖ్యమంత్రి.
రెండో వైపు ఫీజులకి సంబంధించి స్కూలు ఓనర్ల వాదన కూడా ఒకటి ఉంది- వాళ్లేమీ ‘్ధర్మసత్రాలు చలివేందర్లు’ నడపడం లేదుగా? గవర్నమెంటు వారి విద్యా సంస్థల్లో విద్యార్ధి ఒక్కడికి తలసరిన కొన్నివేల రూపాయలు-అఫ్‌కోర్స్.. ప్రజల ఖజానా నుంచే అనుకోండి, వెచ్చిస్తున్నారు. పైగా ఫ్రీ లంచ్ అనగా మధ్యాహ్న భోజనం ఉచితం అన్నారు; అంటే అదో అదనపు ఖర్చు-వీటికి దీటుగా మేమూ అలా చెయ్యడం సాధ్యమా? అంచేత మా గల్లా పెట్టెలు పేరెంట్స్ ఇచ్చే పైసలతోనే నిండాలి. అదీ వాళ్ల గోడు. ‘మేము పస్తులుండి పిల్లలకి విద్యా సంతర్పణ చేయడం మా వల్ల కాదు’ అంటారు వాళ్లు.
‘‘సరే కుదరదా? తప్పుకోండి మరొకరు వస్తారు అంతేకానీ, విద్యాలయాల్లో ‘అక్రమ శిక్షణ’ లాభాలు మాత్రం చేసుకునే వ్యాపార పోకడ ఇంకానా? ఇక మీదట ‘దట్ పప్స్ వోంట్ వుడుక్’ అంటున్నాడు యోగీజీ. అసలు, ఇంగ్లీషుకి ముఖ్యమంత్రి తన గవర్నమెంటు స్కూళ్లలో దేవిడీమన్నా చెబుతాడేమో-ఇవతల మన రొట్టె విరిగి నేతిలో పడుతుందీ-మరిన్ని ఇంటర్‌నేషనల్, ఇంటర్ కాంటినెంటల్ ఇ-స్కూల్లు...అనుకున్నారు కాని, యోగి గారు ముందర కాళ్లకి బంధం అన్నట్టు అర్జంటుగా -ఒకటో క్లాసునుంచే క్యాట్ మ్యాట్ ర్యాట్‌లు నూరి పొయ్యమన్నాడు-దీనితో వాళ్ల ఆశలు పటాపంచలు అయ్యాయి. ఎలిమెంటరీ ఇస్కూల్లోనే ఇంగ్లీషు కంపల్సరీ అన్నాడు.
దీన్ని అమలు చేయడం మీద కమిటీ వేసి చర్చలు మొదలుపెట్టి అధికార్లు, అనధికార్లు అందరూ తలలు ఏకం చెయ్యండి అన్నాడు. కాకపోతే ఇందులో విద్యార్థి పరిషత్ ప్రతినిధులు ఉండడం కొందరికి ‘ఐసోరు’ అయింది. కాని, కట్టింది కాషాయాలే అయినా, చూపుత్రినేత్రుడి చూ పు-ఎండలు ముదరక ముందే, ముచ్చెమటలు, పరీక్షలయినాక కూడా పరీక్షల టెన్షను పట్టుకున్నాయి అక్కడ. చావుకి పెడితే గాని లంఖనాలకి దిగదు అన్నట్లు- టీచర్లకి పంచ్ కార్డులు, లెస్సన్స్ చెప్పకపోతే వాళ్లకే ‘లెస్సన్సు’.. పైగా సిలబస్ 200 రోజుల్లో అయిపోయి తీరాలి.. అదీ ఆర్డినెన్సు తాత్పర్యం! మిషన్ బడులకి పాతిక చేతులు ముప్పయి కాళ్లు ఉన్నాయా? మనం కూడా ఆ లెవెల్‌కి వెళ్లగలం... అంటున్న సిఎం ‘యాంటి రోమియో స్క్వాడ్స్’ని ఎలా వదిలాడో అంతా చూశారుగా..ఇప్పుడు స్కూళ్ల మీదకి ఫ్లయింగు స్క్వాడ్స్ అడపా తడపా వెళ్తాయన్నమాట..
రాష్టవ్య్రాప్తంగా లక్నో మొదలు నోయిడా దాకా నిప్పులు చెరుగుతూ పేరెంట్స్ సంఘాలు రోడ్డెక్కి హాహాకారాలు చేస్తున్నాయి. నోయిడాలో ఓ స్కూలు కొత్త ఫీజులు కట్టలేదని 45 మందిని సస్పెండ్ చేసింది- కాని అందులో 43మందిని చేర్చుకుని, కొత్త ఫీజులు ఆర్డర్లువచ్చే దాకా బుట్టలో దాచుకోమని ఆదేశాలు అందాయి. మిషన్ స్కూల్స్ లాగ చదువులు.. సర్కారు బడుల లాగ రుసుములు అంటే మేము ఈ ఫీల్డు వదిలిపెట్టి మిర్చి బజ్జీ, ఆలూటక్కి బండ్లు పెట్టుకుంటామని అన్నాడో స్కూలు యజమాని. మాకు నాలుగు వేళ్లు నోట్లోకి పోవాలి.. జేబులకి కాస్త ‘బరువు’ తగలాలి అన్నాడో ఇంటర్‌నేషనల్ స్కూలు డైరక్టరు. జనాల మోజుని సొమ్ముల మోజుగా చేసుకోవడం-విద్య ప్రమాణాల పెరుగుదల తర్వాతే-అందుకనే నేరుగా ఆర్డినెన్సూ-బిల్లూ, చర్చా ఆనక వాకవుట్లు, కోర్టులూ ఇవన్నీ వేరే కాలక్షేపాలు గాని-విద్యచేత పిల్లిమొగ్గలు వేయించకూడదు అన్నదే యుపి యోగి సూక్తి...
‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నది పాత చింతకాయ పచ్చడి! నేటి విద్యార్థులే రేపటి పౌరులూ, ఓటర్లూ-అన్న నినాదం అమలు కావాలి. అదే రైటు.. విద్యకి పెద్ద పీట వేసే భారతదేశంలోనా? ‘విద్య’ ప్రైవేటు రంగంలోనూ, ‘సారా’ ప్రభుత్వ రంగంలోను రాణించడం? నో..నెవర్. పక్కలో బల్లెం లాగ మన పక్కన వున్న పాకిస్తానులోనే! ఫీజుల దోపిడీ సాగదు ఖబర్దార్! అంటూ ప్రయివేటు స్కూళ్ల మీద-అయిదు శాతం కన్నా నెల జీతం (్ఫజు) పెంచితే లోపలపడేస్తాం అని ఆర్డినెన్సు జారీ చేశారు. ‘మనం కూడా వెనుకబడకూడదు’ అని సంతోషించింది ఓ మాతృమూర్తి..
ఏదిఏమైనా వుంగరాల వేళ్లతో మొత్తితేనే ‘ఆను’తుంది.. యోగీజి ఉంగరాలు ధరిస్తున్నాడా?-తెల్దు! కాని, ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే కాదు అదే మాదిరి విద్యారంగ సంస్కరణలు అంతటా రావాలి. సిలబస్సులు చాలా ఆర్భాటంగా అన్నప్రాసన నాడే ఆవకాయ ముద్దలా? అన్నట్టు-చిత్ర విచిత్ర పద్ధతులు పెట్టి ఇటు టీచర్లనూ అటు స్టూడెంట్స్‌నీ చావ చంపకుండా-రివిజనుకి రీజనుకి అవకాశం ఇవ్వాలి. స్కూల్ టీచర్లకి సరుకువుంటే లేదా వాళ్లు కష్టపడి కృషి చేసి సబ్జెక్టు మీద కమాండ్ సంపాదిస్తే విద్యార్ధిని బెత్తం లేకుండానే కంట్రోలు చేసి మంచి మార్కుల వీరుణ్ణి చేయవచ్చు. దీనిమీద దృష్టి పెట్టాలి. ఎంతసేపూ ఫీజులూ, సదుపాయాలూ హంగూ ఆర్భాటం-వీటివల్ల ఆదాయం ఉంటుంది కానీ సంఘ ప్రయోజనం లభించదు! అంటూనే అప్పో సప్పో చేసి తల్లిదండ్రులు పిల్లల్ని ‘అతి ఖరీదయిన’ స్కూల్లో చేరుస్తున్నారు-ఈ పెట్టీ బూర్జువా బుద్ధులు మారాలి అంటే ప్రాథమిక స్థాయిలోనయినా సరుకు సదుపాయాలు వుండే బడులకు పునాదులు వెయ్యగల ఖరోడా చట్టాలు రావాలి. అంచేత యోగిగారి సంస్కరణలవేపు అందరూ చూడడం అవసరం!
లెట్స్ హోప్ హిస్ విజన్ హాజ్ ఏ రెయిన్బో హియర్ అండ్ నౌ!
*