వీరాజీయం

గుట్టు రట్టు అయిన గ‘మ్మత్తు’ మత్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ సిటీలో మిగతా జనాల మాట ఎలా ఉన్నా, వ్యాపారస్తులకి విలాస వంతులకి, అర్ధరాత్రి బార్లనుంచి తప్పతాగి బయటికి వచ్చి కారెక్కి పిచ్చి పీరులాగా తోలేవాళ్లకు హుక్క, బిర్యాని కబుర్లు మజాగా ఉంటాయి. బార్లలో బౌన్సర్లు బయటపడేసిన వాళ్ల కబుర్లు, మందు వాసనతో దొరికిపోయిన మోటారు యోదుల విషయాలు-రింగు రోడ్డుమీద యాక్సిడెంటు చేసో, చేయించుకుని ప్రమాదానికి గురి ఐపోయో, పరలోకాలకు పోయిన వాళ్ల వార్తలు చప్పరిస్తు పొద్దునే్న కాఫీ సేవించడం అలవాటు. కానీ ఈ వారంలో గమ్మత్తు మత్తుతో ఇహ పర లోకాలు రెండింటికీ మధ్య వేలాడ దీసి గంజాయిని మించిన ‘ఎల్‌ఎస్‌డి-‘తొన’లకి బానిసలైపోయిన మత్తు దాసుల కథలు- వాళ్లకి ఈ మత్తును గమ్మత్తుగా అందించి దోచుకుంటున్న వాళ్ల గురించి అధికారులు వెల్లడించిన వార్తలు ఘాటుగా అందేసరికి బద్ధకం పటాపంచలైంది. ఎల్‌ఎస్‌డి చప్పరింత బిళ్లలు వుంటాయని వాటిని నాలికమీద ఇలా పిపర్‌మెంటు బిల్లలాగ పెట్టుకున్న వెంటనే ‘చెప్పలేని ఆ హాయి ఎంతో గమ్మత్తుగా’ ఉంటుందని అలాంటి స్వర్గ గులికల్ని రెండో కంటికి తెలియకుండా చీకటి అంతర్జాలం ద్వారా తెప్పించి (తెచ్చి కూడా కాదు) ఇంటికే నేరుగా అంపించే మాయల మరాఠీలు ఇద్దరు దొరికిపోవడంతో-్భల్లున తెల్లారింది-కానీ అంతకన్నా ఘోరమైన విషయం ఏమిటి అంటే, ఈ భయంకర మత్తు మందులకి సినిమా తారలు, బడా రాజకీయులు, సంపన్నులు-మాత్రమే నర్సింగ్ హోమ్స్‌లో బార్లు రెస్టారెంట్లు ద్వారా బానిసలు అవడంలేదు. కాలేజీ విద్యార్థులు, చివరికి స్కూలు విద్యార్థులు బలి అయిపోతున్నారు. ఒక చిన్న బాలిక తొమ్మిదో తరగతిలో ఉన్నది తనకి ఈ మత్తు బిళ్లలు ఇవ్వమని బ్రతిమలాడుతూ-వొంటిమీద నూలుపోగు లేకుండా ఫోటోలు దిగి ఇంటర్నెట్ మీద పంపించిందట! హుక్క బిర్యానీ సెంటర్లలో ప్రచ్ఛన్నంగా గంజాయి వ్యాపారం సాగడం వేరు. బడిపిల్లలు కళాశాల పిల్లలు ఇవి రహస్యంగా తెప్పించుకుని తినే దుస్తితికి దిగజారిపోయారని, పరిశీలనలో, దర్యాప్తులో బయటపడ్డది. రంగారెడ్డి జిల్లా పరిధిలో-ఈ ‘దమ్ మారో దమ్’ కనీసం తొమ్మిది కార్పొరేట్ స్కూళ్లలోను-పద్దెనిమిది బడా కాలేజీల్లోను దూరి-పిల్లల నరాలు పిండేస్తున్నదని అధికారులు పసిగట్టారు. ఇంతకాలం నైజీరియన్ల ధర్మమా అని హద్దులు సరిహద్దులు దాటి వచ్చే ఈ ఘోర విష వ్యాపారం ఇప్పుడు అటువంటి ఆటంకాలతో పనిలేకుండా రహస్య అంతర్జాల మార్గంలో కొరియర్లో రవాణా అయిపోతున్నదట. దీనికో రహస్య (చీకటి వల) యాప్ కూడా ఉన్నదిట. రేపు అమేరికాకో ఆస్ట్రేలియాకో పోయి డాలర్లు రాసుల మీద నృత్య గానాదులను చేస్తారన్న ఆశతో-పోష్ స్కూళ్లలో కాలేజీలలో రూపాయల కుప్పలు సమర్పించి- తమ సంతానాన్ని-తెలుగుకి, తాతా అవ్వలకి ఎడంగా పెట్టి చేర్పించిన తల్లిదండ్రులకి-ఈవార్తలు గుండెల్లో బాంబులు పేల్చాయి. క్రైం కబుర్లు మిర్చీ మసాలాలు చేర్చి కమ్మగా చెప్పే చానల్స్ పేరెంట్స్ గుండెల్లో శతఘు్నలు పేల్చాయి. మామూలు స్కూళ్లకి పిల్లల్ని తోలేస్తే-వాళ్లు తెలుగు బూతులే తప్ప ఇంగ్లీషు ‘బుల్‌షిట్’ నేర్చుకోరు (పరువుపోదూ) మహాయితే మనం ఇచ్చే జేబుకర్చుతో పానీపూరి, మిర్చీ మసాలా ఆలూ భాలో లాంటివి ఏవో కొని తింటారు. కానీ, కార్పొరేటు స్కూళ్లలో పిజ్జాలు, బర్గర్లు, ఫ్రాన్కీలు, మూరేడు బారెడు పాకం కారే పెద్ద చాక్లెట్లు వగైరా లాగిస్తూ వుంటే మనకి మజా. మినిస్టర్లు గవర్నమెంటు బాసులు, బడా వ్యాపారుల సంతానంకి ఏమీ తీసిపోకుండా బోలెడు మోడరన్ స్ట్ఫ్ నేర్చుకుంటారు-ఔనా? వీళ్ల ఇళ్లకి వెళ్లామో-వాళ్ల పిల్లలు స్మార్ట్ ఫోనుల మీద ఆడే గేమ్సు, చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు, తీసుకునే సెల్ఫీలు చూసి యూ-ట్యూబు విద్దేలు-వాట్సాప్ లైవ్ చాట్లు (అగచాట్లు), ఫేసుబుక్ పోస్టింగులు ఇవే హరి కథలుగా వినిపిస్తారు. అప్పోసప్పో క్రిందో మీదో -ఫ్రంటూ బ్యాకు కెమెరాలు వున్న సెల్పోనులు జీవన పరమావధి. (ఎందుకు అంటే స్టేటస్ సిమ్బలట). అవునూ అంత లెవెల్ ఉన్న స్కూళ్లల్లో లక్షలు సంపాదించుకునే ఆసాములున్న విద్యారంగంలో వ్యసనాలు కూడా ఆ లెవెల్లోనే ఉండాలా? వద్దా? అవి దుంపల బడులు కాదు- ఇంటర్ నేషనల్ గ్లోబల్ స్కూళ్లు-అంతా ఇంటర్నెట్టే..వ్యసనాలు ఆ లెవెలే వుండాలిగా? ఎసీ బస్సులు ఏసీ గదులు ఏసీ తిండి అంతా డీలక్స్-మరి, నాటు బాపతు స్మోకింగు పాన్ చూయింగు వాళ్లు నేర్పుతారా? తెల్గు కంపు తగలకుండా ఫారిన్ ట్రైనింగు-మన పిల్లల ఫారిన్ భవిష్యత్తు కోసమే వాళ్లు నేర్పుతారు. లేకపోతే మమీ అస్సలు ఒప్పుకోదు-డమీ సారీ డాడీకి తన కొడుకు లేదా కూతురు అమెరికాలో ‘షైను’ అవ్వాలని చిరకాల వాంచా. అందుకనే సాంకేతిక స్థాయి ఉన్న మంత్రివర్యులు ‘వైఫై’ అంతటా ఇస్తాం అంటూ ఉంటే విద్యామంత్రిగారు సెల్ స్కూలుకి తీసుకెళితే-వీపు సాపుచేస్తా అంటున్నాడు. నిజమే, పిల్లలకి ‘నయా జమానా పేరెంట్సు’ ఇచ్చే స్మార్ట్ ఫోనులు మామూలు ఫోన్లా? అరచేతిలో స్వర్గాలు-వీటివల్ల పిల్లలు హోలు మొత్తం గ్లోబల్ సంబంధాలు కలిగి వుంటారు. సిసి కెమెరాల స్థాయిలో కుర్రకారు వీడియోలు తీసి కనుతెరిచే లోపల అప్లోడ్ చేస్తారు. ఆ మధ్య తమ పిల్లలు అయిదు రూపాయలకే చాక్లెట్లు కొనేసుకున్నారని నామోషి ఫీలు అయిన ఫాదర్సు మదర్స్ అవి గంజాయి గ్రుచ్చేసిన-మిఠాయిలని తెలిసి ఆర్తనాదాలు చేసారు. ఇప్పుడు, ఈ మాదక ద్రవ్య విష వలయంలో చిక్కుకున్న పిల్లల మాటేమిటి? స్కూళ్లని గాని, పిల్లలమీద బంగారు కలలు కంటున్న పేరెంట్స్‌ని గాని, బద్నాం చేయడం అస్సలు ఎవరికీ ఇష్టం లేదు-కాని, వూళ్లో తాజా పండ్లు కాయగూరలు దొరుకుతూవుంటే గొప్పకి పోయి డబ్బా ఫుడ్, క్యాండ్, కర్రీసు, సూపులు తెచ్చి తినమంటే? ఎట్లా? అంటారు పెద్దలు. ‘అలాగే అంటారండి-వాళ్ల రోజుల్లో ఏమీ లేవుగా-జేబులో సనగలు పోసి సుమతీశతకం శేతిలో పెట్టి ఎక్కాలు వల్లే వేయించి స్కూలుకి తోలేసేవారు..ఇవాళ -ఏమడిగినా-క్యాలుకులేటరు; గూగుల్ సెర్చ్ ఇంజను తీస్తున్నాడు మా చిన్ని- మా బుజ్జిగాడికి ఇంకా టెన్ ఇయర్సే-ఏమి కావాలన్నా యూట్యూబు కోసం పరుగులు తీస్తాడు అంటుంది మేనత్త తన లెగ్గీ చిరిగిపోకుండా జాగ్రత్తగ కూర్చుని వాడి మొబైల్ మీద గేముపెట్టుకుని మరీ.
స్కూలుకి మొబైల్ ‘నో’ అంటే టీచర్లు హర్ట్ అవుతారు. పిల్లలు ఏడుస్తారు-స్కూల్లో ఇంటర్నెట్ విద్యా బోధ కావాలన్నారుగా/మీ ‘లాప్టాప్స్ తెరువుడీ’ అంటుంది మాడ్రన్ టీచరు-ఆమెమాత్రం తన లాప్టాప్‌లో--ఇష్..ఏవో సైట్లు చూసుకుంటుంది. ఆమె ఫండమెంటల్ రైటు అది. వీల్లకి హోం వర్కు ఇస్తుందిగా. మగ టీచర్లు పిల్లలతో ఫ్రీగా ఉంటారట. .వాళ్లు విద్యార్థులతో ఫ్రీగా ‘అన్నీ’ డిస్కస్ చేస్తారట. ఇంటర్నెట్ వ్యసనాలు అనగా నేమి? అబ్బో అదో చాప్టరు-వర్క్‌షాపు, సెమినార్స్ గట్రా పెట్టి సాంకేతిక శాఖా మంత్రిగారిని పిలిచి ఓ కమిట్టీ వేయించుకోవాలి అని చెప్పాడు మాఫ్రెండు. మాదక ద్రవ్యాల వల్ల ఏమేమి నష్టాలు వాళ్లకి చెప్పాలి-వీడియోలు తీసి చూపెట్టాలి. అసలు, ఓ లెస్సను ఇంగ్లీషులో చేర్చాలి అని కూడా కొందరు సూచిస్తున్నారు. స్కూలు యాజమాన్యాలకి ఈ మాదక ద్రవ్యాలు స్కూల్లోకి రానిచ్చేదెవరో తెలుసుకుని చెప్పమని తాఖీదు కొట్టాలి. తల్లిదండ్రులు ఇంగ్లీషులో ఎమ్మే బియ్యేలయినా స్కూలు బాసులకి ఆనరు. ‘బేసికల్లీ, బుల్‌షిట్, డామ్మిట్, గాట్టడూ, ఓహ్ మై గాడ్, హోప్‌ఫుల్లీ’ లాంటి ఊతపదాలు అభ్యాసం చేసి-ఇంటర్‌నేషనల్ స్కూలుకి వెళ్లాలి పేరెంట్స్. మీ పిల్లల గురించి ఇంగ్లీషులోనే అడగాలి తెలుసుకోవాలి వాళ్ల గ్రామర్‌ని తప్పుపట్టకూడదు. టీసి ఇచ్చేయగలరు. లేదా? ఇంగ్లీషు పేరున్న మనవాల్ల స్కూళ్లలో-(తెలుగు మాట్లాడితే ఫైను వేసే బడిలో) మీ పిల్లల్ని వేసి మురిసిపోవాలి. భయంకర వ్యసనాలకు దూరంగా పిల్లల్ని పెంచుకునే బాధ్యత మీదే. వాళ్ల ఫీజులు పెంచుకునే హక్కు వారిది. ‘పెద్దకార్పొరేటు స్కూలు మా పిల్లల’ది అని గొప్పగా పేరు చెప్పుకునే స్టేటస్ మీకు కావాల వద్దా?-
దెన్, జాయిన్ యువర్ కిడ్స్ ఎట్ యువర్ ఓన్ రిస్క్!
then, join your kids at your own risk