వీరాజీయం

వెక్కిరింతలకు వెలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం అంతగా పట్టించుకోము కాని, క్రికెట్ మైదానంలో ఆడుతున్న 11 మంది మీదే వుంటుంది మన దృష్టి. కానీ మరో ఇద్దరు అక్కుపక్షిగాళ్లు ఉంటారు. వాళ్లకి మెయిన్ అంపైర్, లెగ్ అంపైర్ అని నామధేయాలు. అవి ఓవర్ ఓవర్‌కీ తారుమారవుతుంటాయి గాని-వాళ్లకి ఇస్తున్నది అక్షరాలా నిలువుజీతం. ఆఖరికి మోకాళ్లమీద కూడా కూర్చునే చాన్సు వుండదు పాపం. కళ్లు విప్పార చేసుకుని-బౌలర్ కాళ్లవేపు, ఆనక బంతిమీద తర్వత బ్యాట్స్‌మెన్ వేపు- అలా అతని కళ్లు పరుగులు తీస్తూనే ఉంటాయి. నిజానికి వెనకటి రోజులతోకన్నా ఇది ఎలక్ట్రానిక్ యుగం కనుక అదనపు సదుపాయాలొచ్చినా - వీళ్లమీద రిఫరీలు వీళ్ల అందరిమీద అంతరిక్ష కెమెరా సహా 15 కెమెరాల నిఘా వుంటున్నాయి. కాని ఫీల్డులో అల్లరి ఆగం చేసే ఆటగాళ్లకే స్వేచ్ఛ ఎక్కువ-
క్రికెట్ ఆట భలే తమాషా- ప్లేయర్ స్వెట్టర్, టోపీ ఒక్కోసారి చలువ కళ్లద్దాలు కూడా ఇలా విసురుగా అంపైర్కి అందించి బౌలింగ్ క్రీజు వేపు పరిగెడతాడు ఆటగాడు. ఓసారి అజయ్ జడేజా అన్నాడు ‘మేము కూడ మహా నటులకేమీ తీసిపోము. వాళ్లు ఓ కెమెరా ముందు నటిస్తారు. రీటేకులుంటాయి. మాకు 14 కెమెరాల ముందు నటించడం అలవాటైపోయింది. నో రీటేక్స్. ‘రీప్లే’లే వుంటాయి’ అని. అయితే మొన్న 28 నుంచి కొత్త రూల్స్ అమలు చేస్తోంది అంతర్జాతీయ క్రికెట్ కంట్రోల్ మండలి. దీనితో అంపైర్‌కి అపీలు లేకుండా చెయ్యెత్తి - ఫీల్డు మీద నుంచి ఏ ప్లేయర్‌నైనా బయటికి తోలేసే అధికారం వచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్‌కి ఇది వర్తించడం లేదు. పుట్బాల్ హాకీ క్రీడల పోటీలలో లాగ ‘్ఫల్’ అన్నది మొదటిసారి అవతరించింది. స్లెడ్జింగ్‌కి చెల్లుచీటీ ఇచ్చేసినట్టే. రవీంద్ర జడేజా బ్యాటుతో గాలిలో కత్తిసాములు గట్రా ఇక సాగవు. వెక్కిరింతలు తర్జనితో బెదిరింపులు పెవిలియన్‌కి దారి చూపడాలు - వెనకనుంచి వికెట్ వెనకనుంచి ఏడ్పించడాలు వీటికి స్పీడ్ బ్రేకర్లు వేసింది ‘క్రికెట్ పీఠం’. ప్రేక్షకులకి ఆటగాళ్లకి కూడ అలవాటు అయ్యేదాకా ఇది కొంచెం కష్టమే. డిఆర్‌ఎస్ రూల్స్‌కూడా మార్చేరు... ఈ కొత్త రూల్స్ మన స్టార్ బ్యాట్స్‌మెన్ మీద విరుచుకుపడినాయి. క్రికెట్ బ్యాట్‌ని బరువయినవి దళసరివి వాడే అలవాటున్న సచిన్ వివిఎస్ లాంటి వాళ్లకి ఇబ్బంది వుండేది. ఎందుకంటే బ్యాట్ దళసరి అంచు, వెడల్పు 40 మిల్లీమీటర్లు 67మి.మిలు మాత్రమే వుండాలి. కానీ ధోనీ బ్యాట్ మందం 45 మిమీ వుంటుంది. అలాగే వార్నర్ బ్యాటు మందం 85 మిమి.
బంగ్లాదేశ్ దక్షిణ ఆఫ్రికాల మధ్య శ్రీలంక పాకిస్తాన్‌ల మధ్య ఇప్పుడు పోటీలు కొత్త రూల్స్‌తో జరుగుతున్నాయి. ఫీల్డుమీద కధాకళి నృత్యాలు, పులివేషాలు ఇక సాగవు. అంపైర్లు నాలుగు వార్నింగులు (కార్డులు) ఇస్తారు. ఆనక బయటకు పొమ్మంటారు. చాలామంది బ్యాట్స్‌మెన్ అవుట్ కాగానే బ్యాట్ నేలకేసి కొట్టి అంపైర్ మీద నిప్పులు చెరిగే చూపులు సారించి పోయి, ఆనక డ్రెసింగ్ రూమ్‌లోకి విసురుగా వెళ్లి అక్కడవున్న టీవీ సెట్ మీద ఫర్నిచర్ మీద తమ ప్రతాపం చూపెడుతుంటారు. మొన్న కూడ మన టీము వరల్డ్ నంబర్ వన్ ఐపోయాక, ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు బ్రాడ్‌హాగ్, డీన్ జోన్సులు చెలరేగిపోయి ల్యాప్టాపులు, కంప్యూటర్లు వగైరా చితక్కొట్టేసారు. కాకపోతే ఇండోర్ ఒక కఫేలో షాపుఒకటి ఉంది. అక్కడ శివాలు వేస్తున్న బ్యాట్స్మన్ చితగ్గొట్టి కసి తీర్చుకోడానికి - కొంత ఫర్నిచరు, కంప్యూటర్లు, టెలివిజన్లు అవీ పెడతారు సినిమా సెట్టింగులాగ. వీళ్లు చితక్కొట్టిపోయాక వెనుకనుంచి పోయి వాళ్లు పైసలు వసూలు చేసుకుంటూ వుంటారుట.
క్రికెట్లో ఎన్ని మతలబ్లు, ఎన్ని కిరికిరిలు - ఇప్పటికే ఫీల్డింగులో అంపైర్ మధ్య మధ్య చెయ్యి హారతి పళ్లెంలాగ తిప్పేసి ‘పవర్’ ప్లే పెట్టేస్తుంటాడు. ఇప్పుడు బౌండరీ క్యాచ్ రూల్స్, నోబాల్ రూల్సు బాగా మారేయి. అంపైర్లకి వర్క్‌షాప్ కూడా జరిగింది. కావాలని బ్యాట్స్‌మెన్ ధారణ శక్తిని, ఏకాగ్రతని దెబ్బతియ్యడానికి కావాలనే వైడ్ బాల్స్ నోబాల్స్ విసురుతారు కొందరు. వాళ్ల ఆట కట్టేశారు. బ్యాట్స్‌మెన్‌కి అందకుండా విసిరితే ‘నో’ అని అరుస్తాడు అంపైర్ సారు.
బౌండరీ వద్దగాల్లోకి ఎగిరి ఫీల్డర్లు పట్టే క్యాచ్‌లు ఇటీవల తరచుగా కనిపిస్తున్నాయి. బౌండరీ దాటి గాల్లోనే దాన్ని లోపలికి తోసి మళ్లీ వాటిని అందుకుంటున్నారు. అయితే ఇందులో మార్పు చేసారు. ఇకపై ఫీల్డరు బంతిని తాకే సమయంలో కూడా అతను బౌండరీ లోపలే వుండాలి. లేదంటే బౌండరీగా పరిగణిస్తారు. ముఖ్యంగా రనౌట్ల విషయంలో బ్యాట్స్‌మన్‌కి ఊరట కలిగే విధంగా రూల్సు తయారు చేసారు. రొమ్ము చెక్కుకుపోయేలాగా శరీరం ఈడ్చుకుంటూ క్రీజులోకి దూసుకువచ్చి బ్యాటో చెయ్యో కాలో లోపల పడ్డాక, ఆంచు కొంచెం పైకి లేస్తే- రిఫరీ కామెరా- బంతి బెయిల్స్ని పడగొడుతున్నప్పుడు అలా క్రీజులో వుండిపోవాలి అంటుంది ఇంతవరకు- ఇకమీదట గ్రౌండ్ టచ్ చేసాక బ్యాట్ లేచినా నాటౌట్!
ఒకసారి క్లుప్తంగా కొత్త నిబంధనలు చూసేద్దాము/అలవాటు అయ్యేదాకా ఇది కొంచెం కష్టమే. డిఆర్‌ఎస్ రూల్స్ కూడా మార్చారుగా..కొత్త రూల్స్ మన స్టార్ బ్యాట్స్‌మెన్ మీద విరుచుకుపడినాయి.
* బ్యాట్స్‌మెన్ పరుగు పూర్తి చేసే సమయంలో ఫీల్డర్/కీపర్ వికెట్లు పడగొట్టడానికి ముందే అతని బ్యాట్‌గానీ, అతను గానీ క్రీజులో చేరి.. ఆ తర్వాత బ్యాట్ గాల్లోకి ఎగరడం లేదా బ్యాట్స్‌మెన్ నియంత్రణ కోల్పోయినా అతను సురక్షితంగా క్రీజులో అడుగుపెట్టినట్టే లెక్క. దానిని రనౌట్‌గా పరిగణించరు.
* ఇప్పటివరకు బ్యాట్స్‌మెన్ ఒక్కసారి మైదానం వీడితే అతడిని వెనక్కి పిలవడానికి లేదు. అయితే అతను నాటౌట్‌గా తేలితే ఇకపై తర్వాతి బంతి వేసే లోపు మళ్లీ వెనక్కు పిలుచుకోవచ్చు. ‘హ్యాండిల్డ్ ద బాల్’ (వికెట్లవైపు వెళ్లే బంతిని చేతితో ఆపడం) నిబంధనను పూర్తిగా తొలగించి దానిని ‘అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’లోకి కలిపేసారు.
* ఐసిసి లెవల్ 4 నిబంధన ప్రకారం మైదానంలో ఆటగాడు హద్దు మీరి దురుసుగా ప్రవర్తిస్తే అంపైర్ అతడిని మొత్తం మ్యాచ్‌లో ఆడకుండా తప్పించవచ్చు. ఉద్దేశపూర్వకంగా నోబాల్ వేసినప్పుడు, బ్యాట్స్‌మెన్ క్రీజు దాటి చాలా ముందుకు వచ్చి గార్డ్ తీసుకున్నప్పుడు చర్యలు తీసుకునే అధికారాన్ని అంపైర్లకు అప్పచెప్పారు.
* బౌలర్ బంతిని విసిరిన తర్వాత క్రీజులోకి చేరేలోపు రెండుసార్లు బంతి నేలను తాకితే దానిని నోబాల్‌గా పరిగణిస్తారు. పిచ్‌కు దూరంగా బంతి పడినా దానిని నోబాల్‌గానే ప్రకటిస్తారు. నోబాల్ కీపర్‌కు అందకుండా వెళ్లి బౌండరీని తాకితే బౌలర్ నోబాల్ మాత్రమే వేసినట్టు. బైస్‌ను అతని ఖాతాలో కలపరు.
* బ్యాట్స్‌మెన్ షాట్ కొట్టిన తర్వాత బంతి ఫీల్డరు లేదా వికెట్ కీపర్ హెల్మెట్‌కు తగిలి వచ్చినా సరే... ఫీల్డరు క్యాచ్ పడితే దానిని అవుట్‌గా తీసుకుంటారు. ఇప్పటివరకు అలావస్తే అది నాటౌట్‌గా వుండేది.
* అంతర్జాతీయ టి20ల్లో కూడా అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డిఆర్‌ఎస్)ను అమలు చేస్తారు. ఒక ఇన్నింగ్స్‌లో ఒక రివ్యూకు అవకాశం వుంటుంది. టెస్టుల్లో రివ్యూ చేసిన సమయంలో ‘అంపైర్ నిర్ణయం’ సరైనదిగా డిఆర్‌ఎస్ చూపించినపుడు జట్టు ఒక రివ్యూను పోగొట్టుకోదు. దీనివల్ల ఇకపై ఇన్నింగ్స్‌కు 2 రివ్యూలు మాత్రమే వుంటాయి. 80 ఓవర్ల తర్వాత అదనంగా మరో 2 రివ్యూలు చేరడం లేకుండా ఎత్తేసారు.
మొత్తానికి కొంత గందరగోళం అలవాటు తప్పదు. కాకపోతే ప్రేక్షకుడికి ఏమి కావాలి? అతనికి వినోదం కావాలి. పైసలు కిట్టుబాటు కావాలి అంతే..అన్నట్టు బ్యాట్ మందాన్నికొలిచే మీటర్లు కూడా పెట్టారు. అంపైర్‌కి మరో మోత ఇది. బ్యాట్‌పట్టినా క్రికెటర్ బంతిని విసిరినా కాసుల పంట లభిస్తుంది. కనుక వాళ్లకి అన్నీ ఓకే-క్రీడాకక్రులు-ఆటగాళ్లు- కడవంత గుమ్మడికాయ కత్తి పీటకి లోకువే అన్నట్టు అంపైర్ల ముందు ముసి ముసి నవ్వులతో పొలైట్‌గా జాగ్రత్తగా వుంటారు ఇకమీదట.
హోప్ న్యూ రూల్స్ విల్ నాట్ ఎఫెక్ట్ ది ఎంటర్‌టైన్‌మెంట్!

veeraji.columnist@gmail.com