వీరాజీయం

‘‘ఆధార్’’ని ‘పుటంబెట్టి’ చూస్తున్న సుప్రీంకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోను మీద - పొట్టి సందేశాలు నాకు రావు. నేనేమైనా కుర్రవాణ్ణా? సెలెబ్రిటీనా? అనుకోనక్కర లేదు - నీకో ఫోను ఉండాలేగాని టెలికాం వాళ్లు ఇంగ్లీషులోను లేదా ఇంగ్లీషు అక్షరాలలో రాసే హిందీలోను -ఎస్‌ఎంఎస్‌లను ఎంతో మక్కువతో నువ్వు వద్దన్నా రోజూ - కొడతారు. ఏమిటి? ఇవాల్టి ఉల్లిపాయల ధరా, కోడిగుడ్ల ధరా కాదు - మీ మొబైల్‌ని ఆధార్కార్డుతో లింకి చేసు‘కోప్చే’సుకోవాలి. ఇది ఏలినవారి ఉత్తరువు - ఈ ఏడాది చివరిలోగా మీరు యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా - ముద్దుగా ‘యుడై’ అంటారు - వారు ఇచ్చిన - ఆధార కార్డు పట్టుకొని - దగ్గరలో వున్న టెలిఫోను డీలరునిగాని బిఎస్సెనె్నల్ వారి ఫోను అయితే వారి దగ్గరకు ఆధార్ కార్డు భద్రంగా పట్టుకుపోయి చూపించి - నిశానీ ఇచ్చి రావాలిగానీ, బద్ధకిస్తే - అంతేసంగులైపోతారహో... అంటుంది మెసేజ్. దిక్కుమాలిన ఫోను - ఇది మా బావ ఇచ్చాడో మా మేనమాన ఇచ్చినదో - అసలు మా పెద్దబ్బాయి - వాడు ఓ కొత్త అప్పోవో సొప్పోవో - సెల్ఫీ ఫోను కొనుక్కుప్పుడు - పాత ఫోనులో సిమ్మ్ కొత్తది కొని గుచ్చి ఇచ్చేడు కాబోలు - ఏమి జ్ఞాపకం వుంటుంది? మోదీజీ వచ్చిన దగ్గర నుంచి తెల్లారేపాటికి ఏమి రూలు పట్టుకొస్తాడో తెలీదు. పనె్నండు అంకెల కార్డు నెంబరు భట్టీయం వెయ్యగలమా? మావాడు, స్టేట్స్ వెళ్లాడు. ‘ఏమోనమ్మా.. అక్కడ ఆఫీసులో మా నాయుడు సిమ్ వేయించుకు రావయ్యా అంటే - తెచ్చాడు - ఇక్కడ అమెరికాలో వుండి ఎలా చెప్పనమ్మా - కావాలంటే సెల్ఫీ తీసుకుందాము అన్నాడు స్మార్ట్‌గా అక్కడ నుంచి, ఫోను ఒకేయే కాని - ఆధార్తో లింకేవా? అంటే చెప్పలేనమ్మ... అనేశాడు - అసలు ‘ఆనస్టగా’ చెప్పండి - ఎవరిచేతిలో ఫోను వాడిదే అనడం వున్నదా ఇవాళ? ఈ రోజుల్లో అదే మాయ - తీరా వెళ్లి ‘‘అయ్యా ఇది నా ఫోను - ఇది నా ప్రాణం - ఇదేజ,‘సారి!’ ఆధారం.. అని చూపెట్టబోతే.. సిస్టం హ్యాన్గ్ అయిచచ్చింది - కొంచెం ఆగాలి అంటాడు - మన ఫోను తన బల్ల మీద నుంచి ఈగని తోలేద్దామా అన్నట్లు చూస్తూ సదరు ఆసామీ - ‘అల్లా పెట్టమాకండి కొట్టేస్తారు..గట్టిగా పట్టుకోండి’ అని ‘ఇహీ’మంటాడు - ‘్థంక్స్ చెప్పవేం’, అన్నట్టు - మెడలో గొలుసులు త్రెంపుకు పోతారని జాగ్రత్తగా ఉంటామా? ఏటీఎం కార్డ్, ప్యాన్ కార్డు, క్రెడిట్‌కార్డు - ‘సుపర్మాల్’ వాడి బోనస్‌కార్డు ఇలా ఎన్ని కార్డులు, ఐడి కార్డు సహా జేబులో పెట్టుకుని ఛస్తాం అన్నాడు తూరుపుకేసి తిరిగి మావాడొకడు. అందులో ఒక్క నంబరు ఎక్కాలు వల్లెవేసినట్లు వల్లెవేసినా జ్ఞాపకం ఉండదు. 12 అంకెలు..
ఎత్తుకుపోతారు తెంపుకుపోతారు వెంటపడతారు వేధిస్తారు వెక్కిరిస్తారు - ఇన్సూరెన్సు కట్టు అంటారు, ఇలా మొత్తం మీద వెంటాడుతూనే వుంటారు - రెండువేల కాయితం చిల్లర వేట మరొకటి - రెండొందల కాయితం చూడలేదే అని బెంగ... ఏమి జనమెమేమిజీవనంబొ- అనుకుంటూ సామాన్యుడు - అల్లాడుతూ వుంటే - చిటుకు చిటుకు నొక్కేసి ప్రేమించుకుంటారు ‘‘యూత్’’ - పిజ్జాల్ దగ్గర్నుంచి బెడ్‌రోలు దాకా - ఇలాఇలా నొక్కేసి - తెప్పించేసుకుంటారు.. అట్టి తరి : మమతాబెనర్జీ లాగే మేమున్నూ అంటాము అన్నాడో అర్భక సిటిజనుడు - ‘‘మొబైల్’’కి నా ఆధారా కార్డు ఇవ్వ.. - లాక్కో నా ఫోను అన్నదామె.. మనం అనగలమా? బెంగాలీ వాళ్లమా? మనం.. ముఖ్యమంత్రులమా? అందుకని సుప్రీంకోర్టు అదుగో మనకి ఆపైన ఉంటుంది - పొల్యూషన్ అంటే భయం లేకుండా ఢిల్లీలో -. అటు చూడ సాగేరు మనబోంట్లు ఆశగా. ఆధారకార్డు అసలు రాజ్యాంగబద్ధమా? చెల్లుతుందా? లీగలా? అన్న మీమాంస లీగల్ పండిట్స్‌కే ఎక్కువైపోయింది.
మరీ దారుణమండీ.. చెన్నైలో మొన్నమొన్న రెండో క్లాసు పిల్లగాళ్లని ఆధార లేదని - పరీక్షకి రానివ్వడం లేదుట.. అన్నదొకామె రైతుబజార్లో - ‘అయ్యో మీరు అట్టా అంటున్నారా? పెద్దపిల్లలే - సెకండ్ ఇయర్ పిల్లలు పరీక్ష రాయబోతే, హాల్ టిక్కెట్టు చూసి కూడా - ఆధార్ కార్డ్ లేదా, పట్రా పో అని తిరగ్గొట్టారుట. హాల్ టిక్కెట్టు ఎందుకుట? మరి.. మరో సీనియరు సిటిజనుడు కోడలు తెమ్మన్న నక్కదోసకాయల కోసం వెతుక్కుంటూ చెప్పాడు - ఇవాళరేపు జనాభా అంతా దొంగలు, టెర్రరిస్టులుగా గవర్నమెంటు దృష్టిలో అనుమానితులైపోయామమ్మా.. అంటూ - ఆ ఇల్లాలికి బెండకాయలు ఏరిపెడుతూ చెప్పాడు. గ్రామాల్లో రేషనుకార్డు అట్టుకెళితే ‘‘తే - ఆధార కార్డు ఎక్కడ?’’ అంటున్నారుట - తిండిలేక ఆ పిల్ల హరీమన్నాదని, పేపర్లో వేశారు చూడలేదా... అడిగింది కూరలమ్మాయి. ఏదయినా కేసు అయితే ఆధార్‌ని తెమ్మని చెక్ చేయొచ్చేమోగాని ఇరవై నాలుగ్గంటలూ - టెక్కీలు మెళ్లో ఐడీ కార్డులు వ్రేలాడేసుకుని తిరుగుతున్నట్లు అంతటా తిరగాలి అంటే ఎట్లా? ఇది, పిడుగుకీ బియ్యానికి ఒకటే మంత్రమా.. అని ఒకరంటే, ‘మన రహస్స్యాలన్నీ, చైనా వాడికి, పాకిస్తానోడికి, ఎల్లిపోతాయంటగా?’ ప్రశ్న, కంప్యూటర్‌లో రహస్యంగా ఉంటాయి.. ఎట్ట తెలుస్తాయి?..ఒక జవాబు. ‘అదేదో లీకు - అయినయంటగా..’ ఇట్లా జనం చెప్పుకుంటూ భద్రంగా బంగారం, నగదుకన్నా జాగ్రత్తగా - ఈ కార్డులన్నీ కాపాడుకుంటూ తిరుగాడుతూ వుండగా ఐదుగురు న్యాయమూర్తులు - ఏదీ సుప్రీంకోర్టు జస్టిస్సులు - ఆధార్ కార్డు చెల్లుతుందా? లేదా? అని ఓ బెంచీ మీద కూర్చుని విచారించారు. బెన్చీ అంటే కుర్చీలు లేక కాదు - ధర్మాసనం అనడానికి నోరు తిరగక అట్లా బెంచీ అంటారు - ఒకటా? రెండా? ఇరవై ఎనిమిది వేరువేరు పిటిషన్లు వచ్చాయి - ఈ బెంచీ మీద పెద్దగా చీఫ్ జస్టిస్ దీపక్ మిగ్రాగారే కూర్చున్నాడు. ఇంకా న్యాయమూర్తులు ఏకే సిక్రీ, ఏఎం ఖాన్విల్కార్, చంద్రచూడ్, అశోక్‌భూషణ్‌లు మొత్తం గవర్నమెంటు లాయరుని కూడా కలుపుకుని, ఇరవై ఎనిమిది దావాలను వాదించవచ్చిన లాయర్ల వాదనని విన్నారు - వీళ్ల వాదనలో అందరిమాట ఒక్కటైనది - ఏమిటీ అంటే - ఆధార్కార్డును నెత్తిన రుద్దడం సుప్రీంకోర్టు ఆజ్ఞలను ధిక్కరించడమే అవుతుంది’ అన్నదే.. లోగడ ఆధార్కార్డు వినియోగం ఐచ్ఛికంగా ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది - అటు తరువాత - వ్యక్తి స్వేచ్ఛ గోప్యత రాజ్యాంగబద్ధమైనవి అని నిర్ధారించింది. అదీ తొమ్మిదిమంది ధర్మాసనం - అటువంటప్పుడు, మనదేశములో - ఐరిష్ స్కాన్స్, ఫింగర్ ప్రింటింగులాంటి బయోమెట్రిక్ విషయాలను భద్రపరిచే - సదుపాయములూ తక్కువ - లీకు అవడం నుంచి వాటికి రక్షణ కల్పించే చట్టమూ లేదు.. అందుచేత పౌరుడి ప్రయివసీని, వాడి గోప్యతాహక్కుని గాలికి వదిలేయడమే అవుతుంది కనుక - ఆధార్కార్డును - చట్ట మరియు రాజ్యాంగ నియతికి వ్యతిరేకమని తీర్పు చెప్పమని న్యాయవాదులు అందరూ అడిగారు - గవర్నమెంటు ముందరకాళ్లకి బంధం అన్నట్లు, మార్చ్ 31 2018 వరకు ఒక్క టెలిఫోను లంకెకి తప్ప మిగతా పథకాల లింకుకి గడువు పెంచుతున్నామని విన్నపం చేసుకుంది. మొబైల్ లింకుకి కోర్టువారే ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు మాత్రమే గడువు ఇచ్చారు. కనుక దాన్ని ఖాయం చేశాము అన్నారు ఏలినవారి న్యాయవాది గారు. ఒక్క రిజర్వు బ్యాంకు లాయరుగారు మాత్రం బ్యాంకు అక్కౌంట్‌కి అనుసంధానం అవసరం అని చెబుతూ, దేశంలో 54 కోట్ల బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి కాని రెండు లక్షల ఇరవై వేల ఫేక్ అనగా బోగస్ అకౌంట్లు వున్నాయి కనుక - ఆధార కార్డు లింకు పెట్టమన్నాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే, మొత్తం ఖాతాదారులందర్నీ అనుమానిస్తారా? డెబ్బయి ఏండ్లుగా బ్యాంకులే సాగలేదా? ఇది ఖాతాదారుల వౌలిక హక్కులకే భంగం అని సీనియర్ అడ్వొకేటు మీనాక్షి అరోరా - బల్లగుద్దారు. ఇదే మాట - సంజయ్‌హెగ్డే బలపరిచారు - దేశంలో ప్రజల ఇక్కట్లు - పేపరుల వెబ్సయిట్లు కోట్ చేస్తూ వాదిస్తూ వుంటే - పత్రికల వార్తలు వెబ్‌సైట్లలో వింతలూ - పరిగణనలోకి తీసుకోడమా? అనడిగారు - దీపక్‌మిశ్రా గారు. ఇదంతా విన్నాక, అన్నిరకాల అవసరాలకి, సంక్షేమ పథకాలకి - ఆధార కార్డు అవసరం అని గవర్నమెంటు అన్నచోట 2018 వరకు ఆ వూసు ఎత్తవద్దని తాత్కాలిక ఉత్తర్వులు వేశారు సుప్రీంకోర్టు వారు - మొబైల్స్‌కీ ఇదే గడువు అన్నారు - కాకపోతే, బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసేవారు మాత్రం కనీసం కార్డుకి అప్లికేషను పెట్టుకున్నాం సారూ! అని సాక్ష్యం పడేయ్యాలిట. సంక్షేమ పథకాల విషయంలో అవి రాష్ట్ర పరిధిలో వున్నవైనా ఆధారకార్డు, కావాలా? అంటే, జనవరి 17, 2018 వరకు మాట్లాడొద్దు - ఫైనల్గా అప్పుడు విచారిస్తం అన్నారు సుప్రీంకోర్టు వారు .. ‘‘ఓకే’’ అందాక వేధింపులు ఆగాలి. ఉదాహరణకి ఉత్తరాఖండ్లో యాభై మూడువేలమందికి - పాపం, అనాధలు అంటే విధవలు, వికలాంగులు పెన్షన్లు అందక క్రుంగి క్రుశిస్తున్నారని వార్తల్లో ఆర్తనాదాలు - వింటున్నాము - అటువంటి వాటిని పరిష్కరించాలి. ఎందుకు ‘ఆధారకా’ వాళ్లకి ఇవ్వలేదు? లేదా వాళ్లే తీసుకోలేద? అని పరిశీలించాలి. అడ్డ్రస్సులు మారతాయి - ఓడిపోయినా మంత్రులకు మాత్రం మారవా? అటువంటి సందర్భాల్లో చిరునామా కోసం మళ్లీ తిరుగుడు - పెట్టకుండా - ఓటు వేసినప్పుడు ఉంచిన నమ్మకమే వుంచి ఏలినవారు దయతలచాలి - సినిమాహాలులో కూడా ఓకే. శ్మశానంలో పంచభూతాలలో కలిసిపోవడానికి కూడా ‘ఆధర్’ కార్డు పట్రా అంటే? బ్రతికున్నవాళ్లు ఎలా ఛస్తారు..చచ్చినవాడు ఎలా తెస్తాడు? అధికారం ప్రజాస్వామికంలో సేవలకే గాని వ్యక్తి దాష్టీకానికి కాదు. అవసరమైతే మారాలి - ప్రజాసంక్షేమం పథకాలు దెబ్బతినకూడదు - కనీసం సుప్రీంకోర్టు పై ఏడాది ముక్కనుమ నాటిదాకా ఈ కార్డుని పుటంపెట్టి - కూలంకషంగా విచారించి - తుదితీర్పు ఇచ్చేదాకానయినా - వెసులుబాటునివ్వాలని - లెక్కల ప్రకారం చూస్తే ఆధార్ లింకు ఇంకా ఇవ్వలేని 34 శాతం జనాలు డిమాండ్ చేస్తున్నారు.
బెటర్, వెయిట్ అంటిల్ ద ఫైనల్ వెరిడిక్ట్ ఫ్రమ్ ది సుప్రీంకోర్ట్!

veeraji.columnist@gmail.com