వీరాజీయం

విగ్రహ పరాభవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బతికున్నవాడికి సెంటర్‌లో దిమ్మ కట్టి దాని మీద బొమ్మ పెట్టకండిరా..’ అని అంటారు డఖ్ఖామొక్కీలు తిన్న పెద్దమనుషులు. అస్మదీయ జనాలకి సంతోషం వచ్చినా, తస్మదీయ మూకలకు ఆగ్రహం వచ్చినా పట్టలేరు. సంతోషం కలిగితే విగ్రహాల నెత్తిన డబ్బాలకు డబ్బాలు పాలు పోస్తారు. నిచ్చెనలు వేసుకుని ఎక్కిమరీ పూలమాలలతో ముంచెత్తుతారు. కానీ, ఆగ్రహం వస్తేనే ఇబ్బంది. విగ్రహాలను ఖండ ఖండాలుగా కోసి కాలవలో పారేస్తారు. ఇప్పుడు సాగుతున్న విగ్రహాల యుద్ధం వేరు. త్రిపురలో లెనిన్ మహాశయుడి అంతెత్తు విగ్రహం మేడేకి ఎర్రజెండాలలో మునిగి తేలేది. ఇపుడు అది కాస్త దిక్కులేనిది ఐపోయింది. ఆ విగ్రహం తునాతునకలైపోయింది. వెంటనే, త్రిపుర గవర్నర్, భాజపా నేత రామ్మాధవ్- ట్వీట్‌లు హర్షిస్తూ కొట్టడం మరో పరిణామం.. పాపం ఆ విగ్రహం చేసిన నేరం ఏమీ లేదు- కమ్మ్యూనిస్టు పాలకులే గత పాతికేండ్లుగా ఏమి చేశారో? పాపం! ఎగరేసిన ఎర్ర జెండాని కాషాయ రంగు మింగేసింది. దానికి లెనిన్ మాష్టారు తన బాధ్యత లేకపోయినా అభిమానులు వచ్చి క్షీరాభిషేకం లాంటిది చేస్తారేమో అని జాలిగా చూస్తూ వుంటే- గెలిచిన వారి అభిమాన జనాలకి ఒళ్లు తెలియలేదు. వాళ్ళ సంబరాలకు ఈ విగ్రహం అడ్డంగా వున్నట్లు అనిపించింది కాబోలు.. ‘ఎందుకయ్యా? పానకంలో పుడక లాగ నువ్విక్కడ?’ అంటూ వీరంగం వేశారు. అభిమానుల వెర్రి ఆవేశం ‘అత్తమీద కోపం దుత్తమీద చూపెట్టిన’ట్లు ముందుగానే అనుకున్నారేమో? ‘్భరత్ మాతాకీ జై!’అంటూ పారిపోయారు.
ఐనా, ఈ నెత్తురు చుక్క రాలని విధ్వంసకాండ ప్రతిధ్వని- ఎక్కడో దక్షిణాదిన కేరళలోని కన్నౌర్ జిల్లాలో వున్న పెరియార్ (పెద్దాయన) విగ్రహం మీదకి కూడా మళ్ళింది.. గాంధీ బొమ్మ మీద గెడ్డలు వేశారు. దానికి కారణం- తమిళనాడు భాజపా నాయకుడు హరిహరన్ శరణ్‌రాజా ఇచ్చిన ట్వీట్ అన్నారు పరిశీలకులు. ‘లెనిన్ తరువాత పెరియార్ రామస్వామి నాయకర్ వంతు - అన్నాడాయన- అక్కడ కూడా త్రిపుర సంఘటన మీద - భాజపా నాయకులు రామ్‌మాధవన్ సహా చాలామంది ఉలిక్కిపడ్డారు. బెంగాల్, యుపి, తమిళనాడు అలా ఇతర ప్రాంతాల ప్రాకుతూ వుంటే.. మోదిజీ ఈ దాడులను ఖండించడమే కాకుండా- హోంమంత్రిని పిలిచి, ‘కఠిన చర్యలు తీసుకో’ అని హుకుం జారీ చెయ్యడంతో మొత్తం - భాజపా చోటాలు గప్‌చిప్‌న సర్దుకున్నారు.
బెంగాలీ, హిందీ ప్రాంతాలకి సందర్భ శుద్ధిలేకుండా అంబేద్కర్, బాపూజీల బొమ్మలకి ఇది అంటుకోడం విడ్డూరం. ఈ‘నేరం’ వేరు. త్రిపుర విగ్రహ భగ్నం వేరు.- ముఖ్యంగా అనూహ్యంగా గెలిచిన త్రిపుర కేసుని ప్రక్కకి పెట్టి చూడాలనుకున్నారు పెద్దలు. పెరియారు, గాంధీజీ వీళ్ళు సంఘ్ పరివార్ కాదు- కానీ అక్కడ వాళ్ళ బొమ్మల మీదకి దూకుడు మళ్ళింది. ఎందుకని?- పాపం హెచ్.రాజా ట్వీట్ మీదే అక్షింతలు పడ్డాయి. అక్కడ త్రిపురలో ‘మాదే ప్రతాపం ఇక ఇక్కడ- పెరియార్‌దే వంతు అన్నట్లుగా’ ధ్వనిస్తున్నట్లు రాజా మాట వున్నదని అంతా గ్రహించారు. ఈలోగా ఈ విగ్రహ పరాభవకాండ కలకత్తాకి ప్రాకింది. అక్కడ రాడికల్స్‌మని చెప్పుకున్న విద్యార్థి కుర్రాలు- శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ (జన సంఘం వ్యవస్థాపకుడు) విగ్రహానికి ఎర్రరంగు పూశారు. ఈ సంఘటనకి మమతాదీదీ కూడా రియాక్ట్ అయ్యింది. ఉద్యమకారుల డొక్కా చించుతానన్నది. ‘బెంగాల్‌లో విగ్రహ విధ్వంసక కల్చర్ లేదు’ అని కూడా అన్నది.
లెనిన్ బొమ్మమీద కొట్టిన చావుదెబ్బకి స్పందిస్తూ- సరే, ‘‘పల్టాయెం’’ (మార్చేద్దాం అని బెంగాలిలో అర్థం) అన్నాడు రామ్ మాధవ్‌జీ తన ట్వీట్లో. కాని ఇక్కడ శ్యాంజీ బొమ్మకి పరాభవం జరిగింది. రెండు ప్లస్ రెండు ఈక్వల్టు నాలుగు అన్నాడో కమ్యూనిస్ట్. భాజపా నాయకులూ వగైరా ముఖర్జీ బొమ్మని రిపేరు చేసి శుద్ధి చెయ్యడానికి గుంపుగా వెళ్ళినా, విగ్రహ విధ్వంస గుంపులు నాల్గుగంటలసేపు ప్రతిఘటించారు. దీన్నిబట్టి, ఈ బొమ్మల రాజకీయం కొనసాగుతుంది అనే అనుకోవాలి- కాకపోతే, ఈ చీడ- గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాల మీదికి యోగీగారి యుపిలోకి కూడా విస్తరించడం ఎలా జరిగింది? ప్రధానమంత్రి మేల్కొని- పార్టీని ప్రత్యర్థుల్ని కూడా తర్జన పెట్టి హెచ్చరించడంతో- పరిస్థితులు ప్రస్తుతానికి- అదుపులోకి వచ్చినట్లే. కాని పెరియార్‌ని అడ్డం పెట్టుకుని- అక్కడ ఎవరి మీద అయినా గెడ్డలు వేయడానికి ఫ్లడ్ గేట్లు లేచాయా? లేదా? లేనిన్ బొమ్మ భగ్నం చెయ్యబడటంలో కొంప మునిగింది ఏమీ లేదు అనే అంటున్నారు.
రష్యాలోనే లెనిన్‌కి సమాధి కట్టేశారు. పైగా మన దేశంలో పెరియారు బొమ్మ అంబేద్కర్ బొమ్మ ఉండటానికి లెనిన్, మావో, హొచిమిన్‌ల బొమ్మలు ఉండటానికి - సంబంధం లేదు- లెనిన్ బొమ్మదాకా ఎందుకు? లెనిన్, స్టాలిన్‌ల పేర్లు- వెంకన్న సుబ్బన్న కన్నా ఎక్కువ పాపులర్ ఐన ఇటీవలి చరిత్ర వున్నది. చరిత్రని విస్మరించవలసిన అవసరం లేదు- నెత్తిన ధరించరాదు. తమిళనాడుకి ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్న స్టాలిన్ రేపుపేరు మార్చుకుంటాడా? కమ్మునిస్టు పార్టీలకి దేశంలో ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు వున్నది. అది వున్నంత కాలం వాళ్ళ నాయకుల విగ్రహాల్ని పార్టీ కార్యాలయాలలో పీఠం వేసి పెట్టుకోవడం మరీ ఫండమెంటల్ రైటే. తిరుమల దేవస్థానం లాంటి చోట అన్యమతస్థుల కొమ్ముకాచి, వాళ్ల ఉద్యోగాలకు భరోసా ఇవ్వడం ‘లీగల్’ అయిన దేశంలో లెనిన్ విగ్రహాలని వెంటాడి- కూల గొట్టాలనడం ఔచిత్యం అవుతుందా? ప్రశ్న అది కాదు. వాటిని మ్యుజియంలో పెట్టడం బెట్టర్.
బెజవాడలో ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషనుని కమ్యూనిస్ట్‌లు బాగా ఏలుకున్నారు. అప్పుడు ఏలూరు రోడ్డు కార్ల్‌మార్క్స్ రోడ్డుయింది. లెనిన్‌కున్న అతి పెద్ద బొమ్మ- రష్యాలో కూడా ఇంత లేదేమో?- బెజవాడలో లెనిన్ బొమ్మ- సెంటరు వెలిశాయి. ప్రెస్‌క్లబ్ రోడ్డులో మార్క్స్ ఎంగెల్స్ బొమ్మలు లేచాయి. ముసల్మాన్ల హయాంలో వాళ్ళు విగ్రహాలు పెట్టరు గనుక సరిపోయింది. సమాధులు గోరీలు మీనార్లు నిర్మిస్తే సరే ఊరుకున్నాము కదా?. కాని దేశం మొత్తం మీద ఒక్క దేవతా విగ్రహం బుద్ధ విగ్రహం కూడా కన్ను ముక్కుతో మనకి దక్కలేదు... రామసామీ నాయక్కర్ దేవుళ్లని- బ్రహ్మలనీ కత్తిగట్టి హింసించినా- ద్రవిద కజగం బ్రత్కింది.- పాయలుగా పెరిగింది దాని మాట ఏమిటి? తమిళనాట- ద్రవిడ కల్చర్ పాతుకుపోయింది. పంచెలు గాక లుంగీలు ధరించి తిరిగిన బ్రాహ్మలు పెరియార్ని ఉదారంగానే చూశారు. అదే మన అలవాటు. చూశారుగా - డీకే నుంచి డిఎమ్కే, అన్నా డిఎమ్కె అలా ద్రావిడ దళాలు విస్తరిల్లుతూనే వున్నాయి- టెంపుల్ కల్చర్‌కి పేరుగాంచిన ప్రజల ఔదార్యం (వి)చిత్రం- పెరియార్- కన్నడ బిజినెస్‌మాన్ కుమారుడుట- ఏజీయార్ తమిళుడు కాదుట... జయలలిత మాటేమిటి? అయినా ఒక్క బొమ్మని ఎవరూ ముట్టుకోలేదు- పైగా నిన్నటికి నిన్న రాష్ట్రంలో వున్న అన్ని పెరియార్, అతని శిష్యుల విగ్రహాలని కూడా కాపలా కాయమని హైకోర్ట్ ఉత్తరువు ఇచ్చింది.
బ్రిటిషు వారు బ్రహ్మాండమైన బొమ్మల్ని వదిలిపోయారు. ఇవి పార్కుల్లోకి, మ్యూజియమ్స్‌లోకి వెళ్ళిపోయాయి. అలాగే మిగతావి వెళ్తాయి. గవర్నమెంట్లు మారినప్పుడల్లా విగ్రహాలు మారాలి అంటే అన్యాయం - కంచు బొమ్మలు పెట్టకండి- దిమ్మలు గట్టిగా కట్టి బొమ్మలు మార్చగలిగేలా ఏర్పాటు చేసుకోండి. లెనిన్ బొమ్మని త్రిపురలో మార్చాలి అంటే - ఇప్పుడు గుంపులు చేసిన పని తప్పు- కొత్త ప్రభుత్వమే దాన్ని మ్యూజియమ్‌లోకి మార్చాల్సింది- కలకత్తాలో34 సంవత్సరాల ఎర్రజెండా ఎవరు పీకేశారు? వీధి వీధికి పోయి బొమ్మలు మార్చారా? వోటరు జనం మార్చారు. వాళ్లపని వాళ్లు చేస్తారు- తమిళనాడులో వోటర్లు తప్ప ఎవ్వరూ విగ్రహాల్ని పడగొట్టలేరు. వోటర్లను తమ వేపు మళ్ళించుకోవడములో మోదీ మార్కు ట్రిక్స్ ప్రయోగించడం తప్పు కాదు. బొమ్మల విధ్వంసకాండ, విగ్రహాల రాజకీయాలు తప్పు. కేరళలో ఇలాంటివి రాణించవు. విగ్రహాలు గాని- విగ్రహ రాజకీయాలు గాని చెల్లవు. జంక్షన్లు వున్నంతకాలం కొండ గుర్తులుగా ల్యాండ్ మార్కులుగా విగ్రహాలుంటాయి. చిరునామాకి మోపు కదా!- నంది, పులి, ఆవు, లేడి, గుర్రం, గ్రద్ద చిలుక బొమ్మలు సెంటర్లలో పెడదామని జనం అనుకున్న రోజున విగ్రహాల ప్రాబ్లెం సాల్వ్ అయిపోతుంది. ట్రాఫిక్ ఐ లాండుకి, చౌరస్తాకి- గాంధీజీని, శివాజీని, మదర్ థెరెస్సాను, బోసుబాబుని కాపలా పెట్టడం కన్నా- కోడిబొమ్మా నెమలి బొమ్మా పెట్టడం బెటరు. పొలిటికల్ పార్టీలకి దిగులు తప్పుతుంది. సినిమా స్టార్స్ విగ్రహాలు పెడితే అభిమానులు కొట్టుకు చస్తారు. త్రిశూలం, కొడవలి, నాగలి, రాట్నం, సహజంగా వుంటే పెట్టవచ్చు కానీ ఎన్నికల సంఘం ఒప్పు ‘‘కోడ్!’’ మళ్ళీ ముసుగులు తొడగాలి. పోనీ రావి చెట్టు, మర్రి చెట్టు బొమ్మలు, మర చెంబు లాంటివి వుంటే వాటినే స్వీకరించాలి గుర్రం సెంటర్లో మీటింగు అని చెప్పాలి. అయ్యా రాజకీయ నేతలారా ఇలాంటివి వద్దు.
సే గుడ్ బై టు స్టాట్యూ కల్చర్... అండ్ బి హ్యాపీ!
*

veeraji.columnist@gmail.com