వీరాజీయం

‘బాల్‌గేట్’ దోషులు ఇక ఇంటికే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యర్థి జట్టుని సతాయించి గెలుపు సాధించాలనే కుళ్ళు బుద్ధి క్రికెట్ ఆడే దేశాలన్నింటికీ కొద్దో గొప్పో వుంటుంది. కాని మరీ ఇంతలా కాదు. ‘కంగారూలు’ అనవసరంగా కంగారుపడ్డారు. కేప్ టౌన్‌లో వాళ్ళ పాపం బద్దలైంది. కెమరా కంటికి అడ్డంగా దొరికిపోయారు. క్రీడాప్రపంచం యావత్తు ముక్కున వేలేసుకుంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి సైతం తమ దేశానికి తలవంపులు తెచ్చిన ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోయాడు. ‘మీ దుంపలు తెగ.. గెలిస్తే గెలిచారు ఓడితే వోడారు గాని- దేశప్రతిష్ఠను దెబ్బతీస్తున్న ‘స్లేడ్జింగు’కి ఇకనైన స్వస్తి చెప్పండి’- అంటూ ఆయన బాధపడ్డాడు. మామూలుగా ఆస్ట్రేలియా అంటే ఎదుటి జట్టుని బ్యాటు,బంతితో మాత్రమేగాక- వేధింపులు, వేలాకోళాలు, వెటకారాలు చేసి ఎదుర్కొంటారని క్రికెట్ ఆడే చిన్న పిల్లకాయలకి కూడా తెలుసు. గాని మరీ ఈ లెవెల్‌కి వారు దిగజారిపోతారని అనుకోలేదు- అని ఆబాలగోపాలమూ బాధపడుతున్నారు.
తుమ్మినా దగ్గినా, చివరికి మనసులో మాట్లాడుకున్నా- రికార్డు చేసే నిఘా కెమరాలు పరివేష్టించి వున్న చోట- ఆస్ట్రేలియన్ కెప్టన్, అతడి డిప్యూటీ- ఇంతలా గడ్డి కరుస్తారని ఊహించడమే కష్టంగా వుంది. హుటాహుటిన దక్షిణాఫ్రికాకి వచ్చిన- క్రికెట్ బాస్- జేమ్స్ సదర్లాండ్- ముందు ఆ ముగ్గుర్నీ ఇంటికి తోలేయమన్నాడు- ఆ దుష్టత్రయం- ఆస్ట్రేలియా బ్యాట్స్‌మాన్- కేమారాన్ బాన్క్రాప్ట్; నాయకుడు స్టీవ్ స్మిత్; ఉప నాయకుడు డేవిడ్ వార్నర్. అసలు ఆట మధ్యలోనే స్మిత్‌ని పీకేసి- వికెట్ కీపర్‌కి- ‘నువ్వు చూసుకో..’ అని పగ్గాలు అప్పజెప్పేసింది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు నాయకత్వం. మామూలుగా అయితే వైస్ కెప్టన్‌ని పిలిచి బంతి అందిస్తారు. కాని అసలు శకుని మామ వార్నర్ అని తేలడంతో- వికెట్లతో పాటు దేశ ప్రతిష్టని కూడా కాపాడే భారాన్ని వికెట్ కీపర్ టీం పెయిన్ మీద పేశారు. అసలు ఈ ‘బాల్‌గేట్’ ఉదంతం గురించి అందరికి తెలిసిపోయింది ఆట జరుగుతూ ఉండగానే. కనుక మరోసారి ఉటంకించడం దండగ.
వెనకటికి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలని ఎదుర్కొన్న క్రికెటర్ మన అజయ్ జడేజా ఇలా చెప్పేవాడు... ‘మేము సినీస్టార్‌లకి ఏమీ తీసిపోము- వాళ్ళు ఒకటి రెండు కెమెరాల ముందు నటిస్తారు. మేము పధ్నాలుగు కెమెరాల ముందు ‘రీటేకు’లు అడగకుండా నటించగలం’ అని. అయితే, ఇక్కడ రీటెక్‌లు తీసుకోకపోయినా, అడుగడుగునా రీప్లేలు వుంటాయి.
దక్షిణాఫ్రికా అదృష్టం బాగుంది మొన్న మూడో టెస్టులో- వాళ్ళు హీరోలు అయ్యారు- ఆస్ట్రేలియన్లు విలన్లు అయ్యారు. ఇంతకీ, ఈ గూడుపుఠానీని బయటపెట్టింది ఒక మాజీ క్రికెటర్. ప్రస్తుతం కామెంటేటర్‌గా వున్న ఫాన్నీ డివిల్లెరియస్. రవిగాననిచో.. కామెంటేటర్ గాంచు నేయ్యడన్ అన్నట్లు- ఫీల్డులో బొంక్రాఫ్ట్ పాంట్ జేబులో ఏదో పెట్టుకున్నాడు- అది ఉబ్బెత్తుగా కనబడుతోంది అని పసిగట్టాడు. దేశభక్తీగల మాజీ టెస్టు ప్లేయర్ గనుక గప్‌చుప్‌గా వ్యవహారం సాగించి కెమరామెన్ సారులు- ‘బంతిని వెంటాడే ముందు మీరు ఫీల్డింగులో వున్న కెమరూన్‌ని ఫాలో అవండి’ అన్నారు. అవతతల బంతిని ట్యాంపర్ చేసి- దాని స్వరూపంలో ఇతరులు సులువుగా కనుక్కోలేని మార్పులు తేవడానికి కమరూన్ బిజీగా వున్నాడు. కెమెరాలు లోపలి లాగులు కూడా చెక్ చేయగలవన్న సంగతి మరచిపోయాడు. జేబులో ఓ గరుకు టేపు చుట్టపెట్టుకొని వచ్చాడు. దాన్ని రహస్యంగా తీసి బంతికి కాస్త గరుకులు పడేలాగా రుద్దేవాడు. లోగడ కూడా ఇటువంటి తమాషాలు, కుట్రలు బౌలర్లు చేసే వారు- స్పిన్‌బౌలర్లు అలనాటి మస్కడ్ నుంచి గుప్తే దాకా బంతిని పాతదిగా చేసేద్దామని నేలకేసి తెగ రుద్దేసే వాళ్ళు- అలాగే స్పీడ్ బౌలర్లు పిర్రలకి, తొడలకి పెట్టి- బంతి ‘తళతళ’ మెరిసేదాకా రుద్దేవారు- తరువాత పిచ్ మీద రుద్దుడు బిజినెస్‌కి ఫుల్‌స్టాప్ పెట్టారు. చూయింగుగమ్ పూస్తున్నారు. గ్రౌండులో దాన్ని నమిలి నమిలి ఊస్తున్నారు అన్న ఆరోపణలున్నాయి. బడా క్రికెటర్లు.. మన ‘క్రికెట్ దేవుడు’ సచిన్ టెండూల్కర్ సహా కనీసం ఓ అయిదుగురు హేమాహేమీ ఆటగాళ్ళు కూడా అపనిందలు మోశారు. కాని ఇలా దొంగతనం చేస్తూ.. ఇదుగో సాక్ష్యం అంటూ వీరోచితంగా దొరికిపోయిన స్మిత్ లా, డేవిడ్ వార్నర్‌లా ఎవ్వరూ దొరికిపోలేదు.
రాను రాను కోట్లు ఆర్జించే కమ్మర్షియల్ గేమ్‌గా క్రికెట్ క్రీడ అయిపోయింది. క్రికెట్ పిచ్ మీదా- తెలుగు సినిమా మీద ప్రతీవాడు ఎక్స్‌పర్టే. ‘పిచ్’ బాలేదు- మనవాడికి గాలిలో బంతి స్పిన్ తిరగటం లేదు అంటాడో బాలుడు. పిచ్ మోసమ్‌గా తయారుచేసారు బంతి పడి లేచి నేరుగా బాట్స్మన్ నెత్తికి తగిలే లాగ చేశారు అంటాడో అభిమానుడు. కొత్త కొత్త రూల్స్ ఎన్ని పెట్టినా- ప్లేయర్స్ చూసీ చూడకుండా తన్నుకు చస్తారు- తిట్టుకు చస్తారు- అవన్నీ ఆల్ ఇన్ ది గేమ్ అనుకున్నా డ్రెస్సింగు రూములో కుట్రలు కొత్త ట్రెండు. అక్కడ సిసి కెమెరాలు ఉండవేమో! ఈ ఆస్ట్రేలియన్స్- ఇలా బాల్ రూపం మార్చే కుట్రని డ్రస్సింగు రూమ్‌లో చేసామని- మా టీములో సీనియర్లం ఒక యాక్షన్ టీం కలసి మారిపోయామని స్వయంగా కెప్టన్ స్మిట్ అదేదో ఘనకార్యం అయినట్లు చెప్పాడు.
అసలు రివర్స్ స్వింగు- ఉపఖండం పిచ్‌ల మీద వస్తుంది గాని మెత్తని పచ్చిక మెత్తలున్న విదేశీ పిచ్ల మీద బంతి అడుగడుగునా అడ్డం తిరగదనే అంటారు క్రికెట్ పండిట్స్. కాని మొన్నటి దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా టెస్టు పోటీలో- ఇరవై ఆరు, ఇరవై ఏడూ, ఇరవై ఎనిమిది ఓవర్లలో- అదేదో కొత్త అలవాటు అయినట్లు బంతి రివర్స్ చిందులు వేస్తూ ఉండడాన్ని గమనించి సంబంధించిన వాళ్లంతా మేలుకున్నా స్మిత్,వార్నర్‌ల జంటకి వొంటి మీద తెలివి లేదు. చిన్న పిల్లలు అంటారు- తుంటి ఆట ఆడి గెలిచి- గెంతులు గెంతకపోడం కన్నా దగ్గరలో వున్న మురిక్కాలువలో మొహం కడుక్కోడం బెటర్ అని. స్మిత్ టాప్ ర్యాంకర్, వార్నర్ మరో ఘతోత్కచుడు.. వీరి కర్మ కాకపోతే- దుప్లేస్సి టీము మీద కుట్రలు పన్ని గెలవాలి అనుకోవాలా? అన్నాడో హైబా ప్లేయరు. దొరికిపోయిన వెంటనే బంతికి ‘గరుకు పట్టించిన’ కేమరోన్ అన్న మాటలు ఇంకా జాలి గొలుపుతున్నాయి.‘నేను ట్యాంపర్ చేసిన ఆ బాల్‌ని అంపైర్లు- ఆడమని ప్లేయర్స్ చేతిలో పెట్టలేదు- అది అల్లాగే ఉండిపోయింది- దాని ఎఫెక్ట్ ఏమీ లేదు- రివర్స్ స్వింగు గిన్గూ అన్నీ మావల్ల ప్రతిభనే, అని కెమెరాలు దక్షిణాఫ్రికాలో ఆట గనుక వాళ్ళకే సహకరించి అసలు గుట్టుని బట్టబయలుచేసాయి. ఫాన్నీడివిల్లియర్స్‌ని, కెమెరామెన్‌ని సత్కరించాలి- స్మిత్ ‘కర్మ నిజంగా కాలింది.’ అదేదో మాస్టర్ స్ట్రోక్ అనుకున్నాడు. నేనే అసలు సూత్రధారుణ్ణి- మా వాడు నేను చెప్పిందే చేసాడు అన్నాడు. మేం ఓ కమిటీని వేసుకున్నాము, ఆలోచించాము అన్నాడు- ఆ ‘్థంక్ ట్యాంక్’లో తానూ మునిగాడు- అందర్నీ ముంచాడు- అవతల ఇండియన్ క్రికెట్ కార్నివాల్ బ్రహ్మాండంగా ముస్తాబు అయిపోతున్నది- పాపం స్మిత్, వార్నర్లు- ఇక్కడ కూడా గ్లామర్ వున్న నాయకులే.. కాని మొత్తం దేశ ప్రతిష్ట మంట గలిసింది. వీళ్ల భవిష్యత్తుని కాకి ఎత్తుకుపోయింది. బాట్ పట్టుకుంటే, బంతి విసిరితే కనకవర్షం కురిపించ గలిగి ఎంగిలి కూటికి ఆశపడ్డట్లు క్రికెట్ భ్రష్టకారులు అయ్యారు. - క్రీడాస్ఫూర్తిని- ప్రేక్షకుల కుతూహలాన్ని కూడా మంట గలిపేశారు.
అక్కడ చేసిన ఘోరం- క్షమించరాని దేశ నేరం అన్నది ప్రపంచమంతా ఒప్పుకున్నారు. శిక్ష వాళ్లకి పడదా? జీవితకాలమా? బహిష్కరణ ఎన్నాళ్ళు? అన్నది మన తలకాయ నొప్పి కాదు. దేశ ప్రధాని కూడా తల వంచుకుని దక్షిణాఫ్రికాకి క్షమాపణ చెప్పవలసి వచ్చింది. ఇంక, ఈ భ్రష్ట ద్వయం పైకి ఎదిగి ఒరిజినల్ కీర్తి శిఖరానికి చేరడమే కష్టం. ఇండియన్ ఫాన్స్‌కి- వీళ్ళంటే పడిచచ్చే కుర్రాళ్ళకి, మన క్రికెటర్లు దేశభక్తులుగా క్రీడాస్ఫూర్తి దాతలుగా ఇకనైనా కంటికి ఆనుతారనే ఆశించాలి. ఇంగ్లండుకి అత్యంత ప్రతిష్టకారకమయిన- ‘‘చితాభస్మ కలశాన్ని’ గెలిచి జేబులోవేసుకున్న స్టీవ్ కర్మ కాలి ఇలా ‘టేపుకు’ దాసోహం అన్నాడు. అయితే వెంటనే తన సహచరులను- నేరం తన నెత్తిన వేసుకుని ఆదుకున్నాడు. అందుకు మెచ్చుకోవాలి. ‘కంగారూ’లందరూ బాగా కంగారు పడుతున్నారు- ‘ఈనగాచి నక్కల పాలు చేశారు మన బడుద్దాయిలం’టూ ఆస్ట్రేలియా ప్రెస్ ఈ టీమ్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. మొగుడు కొడితే మాదవ కబళం వాడూ తిట్టేడని- రాజస్థాన్ రాయల్స్- రహనాని పిలిచి పగ్గాలు అందించారు. వార్నర్ అనగానే హూ ఇజ్ దట్ ఫెల్లో.. అని నెవెర్మైండ్ అనేస్తున్నారు మన ఐపిఎల్ వాళ్ళు. ‘కళంకం లేని రాజకీయ నాయకులకు టిక్కట్లు ఇవ్వండి’ అన్న నినాదం లాగే- కల్తీ,కల్మషం, కళంకం లేని క్రికెట్ ఆటనే క్రీడాప్రియులు మన్నించి ఆదరించి తిలకిస్తారు- డోప్ టెస్ట్‌లో దొరికిపోయిన వాళ్లకి ఈ ‘సోకాల్డ్ సూపర్ క్రికెట్ స్టోర్స్ కి’’ తేడా ఏమిటి?
లెట్ దెమ్ హ్యాంగ్ దెమ్‌సెల్ఫ్స్- వుయ్ వాంట్ క్లీన్ ప్లే!

veeraji.columnist@gmail.com