వీరాజీయం

ఇంగ్లీష్ టీమే అక్కడ ‘లార్డ్స్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదేం దూకుడురా.. బాబూ..! విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకొని దిగితే ఓ రికార్డు బద్దలయిందే.. నాలుగు వేల పరుగులు అమిత వేగంగా అరవై అయిదు ఇన్నింగ్స్‌లో లాగించేసాడు. కానీ అంత గ్రేట్ హిట్టర్ , మొన్న లార్డ్స్‌లో ఇంగ్లాండ్ టీమ్ మీద నాలుగో టెస్టు ఆడుతూ ముక్కు బజ్జీ చేసుకున్నాడు. తన బ్యాట్ సాధించిన రికార్డుల సంబరం చేసుకోలేక పోయాడు . టీము చతికిలబడి పోయింది. అరవై పరుగుల తేడా? నంబర్ వన్ టీముగా వాసికెక్కిన ఇండియాకి ఒక్కోటి ఒక్కో శూలమై గుచ్చుకుంది. కోట్లాది మంది క్రికెట్ ఫాన్స్ గాలితీసేసిన రబ్బరు బూరలైపోయారు. టెస్టు పాయె.. సిరీసు పాయె..
ఇంటి కాడ అందరూ పెద్ద పులులే, బయటకి పొతే పులివేషం వేసుకున్న పిల్లులు అయపోడం - ఇవాళ ఇంగ్లండులో చూశాం, మొన్న సౌతాఫ్రికాలో చూశాం. మా వూరు రా! దమ్ముంటే అనే పద్ధతిలోనే టీమిండియా ఇప్పటికి కొనసాగుతామంటే , ఫాన్స్ వీరపూజకి స్వస్తి పలకవలసిందే. క్రికెట్ పదకొండుమంది ఆడే టీమ్ గేమ్ అయినప్పుడు- అందరూ కాకపోయినా కొందరైనా -నిలకడగా ఆడాలి. అలా ఆడాలంటే టీమ్ నాయకుడి ప్రేరణ ఉండాలి. మొదటి ఓటమితో ఓవల్ టెస్టుకు గేట్ కలక్షన్స్ కూడా రావనిపిస్తోంది..
రూట్ గారి కుర్రాళళు వ్యక్తిగత రికార్డులు బెటర్ చేసుకోడానికి దాన్ని ఉపయోగించ వచ్చు. అవసరమైతే ఒక ద్రావిడ్ లాగా, మొన్నటి పుజారా లాగ జిడ్డు పట్టడం రావాలి. ఇరవై,అరవై ఓవర్ల ఆటలకి అలవాటు పడ్డ ప్రాణులకి - పది ఓవర్లు ఆడేసరికి - డ్రెస్సింగ్ రూము మీదకి మనసు పోతుందేమో? నాలుగు టెస్టులు ఆడిన రాహుల్ సగటు 14.1. వికెట్ కీపర్లు ఇద్దరూ బ్యాట్‌తో ఫ్లాప్. కార్తిక్ సగటు ఐదుంపావు పరుగులు.. ఇండియన్ టీమ్ లెజండరీ సునీల్ గవాస్కర్ దగ్గరనుంచి -వచ్చిన వారసత్వం-పోయింది. గెలవక పోయినా డ్రా చెయ్యడానికి -సత్తా వుండాలి. మన విరాటుడు ముప్ఫై తొమ్మిది మేచ్‌ల లో ఇరవైరెండు గెలిచినా - సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్ చేసినా - నీ టీము ఓడిపోతే నినే్న తిడతారు. అన్న సంగతి కెప్టెన్‌కి ఇరవయ్ నాలుగు గంటలూ స్ఫురణలో ఉండాలి. మన స్పీడు మాస్టర్లు - ఆరంభంలో పెద్ద వికెట్లని కూలదోసినా -చివర తోక.. పామై కరిచేస్తోంది. ఇంగ్లీష్ కుర్రాన్ , వోక్స్ లాంటి వారు మనకి లేరు .తోక ముడుచుకుపోతోంది మన వాళ్ళది.
అయిదు వికెట్లు ఓ సారి రాంగానే - క్రికెట్ లెజెండరీలుగా అయిపోరని టీములో సీరియస్‌నెస్ లేని కుర్రాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కోచ్ ది. నేను కపిల్ దేవ్‌లాగ ఆడలేను, నాలాగే నేను ఆడతానని హార్దిక్ పాండ్యా అంటే, హార్దిక్‌లాగ ఆడతాను అనే వాళ్ళని మీడియాకు దూరంగా పెట్టాలి.
రవిశాస్ర్తికి, కోహ్లికి కెమిస్ట్రీ కలిసిందా? కోహ్లి దెబ్బకి కుంబ్లే మటాష్ అయ్యాడా? లేదా? ఇలాంటి కధలు ఇవాళ అభిమానులకి రుచించవు. అవి ఉబుసుపోక కబుర్ల రాయుళ్లకి వదిలెయ్యండి. మొదటి రెండు టెస్టులు - టెస్టు మ్యాచ్ వెనుకటి మాదిరి టాప్ ఆర్డర్‌తోనే ముగిసిపోదు అన్నది రుజువు చేసాయి. తోక కూడా గట్టి పోటీ ఇవ్వాలి. నాలుగో టెస్టు రోజున ఉదయం కోచ్ రవి శాస్ర్తి- ఓటెలివిజన్ చానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ - మా టీము టూరులో కూడా అద్భతంగా ఆడగల పటిష్టమైన జట్టు. ప్రత్యర్ధి ఎంత చెలరేగి ఆడినా రెండు వందల యాభై పరుగుల లక్ష్యమిచ్చినా- దుమ్ము లేపేస్తాం, గెలిచేస్తాం అని అన్నాడు. కానీ, నేను నేనే అన్న పాండ్యా ట్వంటీ-20 ఆట అనుకున్నాడు.. అవుట్! బంతి అవుట్ సైడ్ డి ఆఫ్ వస్తే మోకాలి ఎత్తున గాలిలో తాపీగా లేస్తే ప్రాక్టీసులో లాగ - సిక్స్ చేస్తాడట.!. లేకపోతె బ్యాటు ఊపుకుంటూ -పెవిలియన్కి ఎన్ని గజాల దూరం ఉన్నదో కొలుచుకుంటూ వెళ్లిపోతాడట. మరొకడు గల్లీ క్రికెట్ నుంచి కంట్రీ క్రికెట్ దాకా అరివీర భయంకరుడైనాను నేను అనుకుంటూ ‘ఆదిలోనే’ ఫస్ట్ బాల్ కి సిక్సర్ లేపుతాడు. అంతే..
టెస్టు మ్యాచ్ టెంపర్మెంట్ గురించి గవాస్కర్ లాంటి అనుభవజ్ఞులు చెబుతున్నా మన వాళ్లకి బంతిని చూసి, పిచ్‌ని ‘ స్టేడీ’ చేసే ఓపిక లేదు. అవతల బంతి విసురుతున్న ‘గెడ్డం సాయిబుగారు ఆమ్ఫాట్ అంటూ తిప్పుతున్న బంతి విన్యాసాన్ని - పరిశీలించి - ఆచితూచి ఆడి- బౌలర్ అలసిపోయాదాకా-షాట్లు అందుకోకూడదని తెలియదంటే ?.. వీడియోలు చూడవచ్చు- ప్రక్కనే ఉన్న పెద్దలను అడగవచ్చును. అశ్విన్‌కి వికెట్లు రాలేదు కాని ఓవర్ కి రెండు పరుగులకన్నా అతని స్పిన్ ని బ్యాట్స్‌మెన్ కొట్ట లేకపోయారు. ఆటను 124 కి మూడు వికెట్లే తియ్యడం మనకి పెద్ద దెబ్బ.
టెస్టు మ్యాచ్‌లో రోజుకి తొంభై ఓవర్లు ఆడాలి. అవసరం వస్తే వెనకటి సీఎస్ నాయుడ, విన్నూ మన్కడ్, సుభాష్ గుప్తేల మాదిరి అరవై, డెబ్భై ఓవర్లు వెయ్యాలి. స్పిన్నర్ల దేశం నుంచి వచ్చి -ఒక స్పిన్నర్కికి దొరికిపోయంది మన్ టీము. ఇలాంటి బ్యాట్స్ మన్ - కోహ్లి సేనలో ఉన్నారంటే- కోచ్ దీ తప్పే .. కెప్టెన్‌దీ తప్పే. వీరేంద్ర సెహవాగ్ కోపంతో రవిశాస్ర్తి మీద విరుచుకు పడ్డాడు. కరక్టే.
గవాస్కర్ అన్నాడు- ‘్ధమాగా ప్రశాంతంగా ఆడే ధోనీ స్థానంలోకి విరాట్ కోహ్లి వచ్చాడు. అతని ఆవేశం, దుందుడుకు స్వభావం లాభిస్తాయి అనుకున్నాం. ఈ కాలానికి అనుగుణంగా ఇంకా మంచి ఫలితాలు ఇస్తుందేమోనని అనుకున్నాం. కాని పరాయి గడ్డమీద మనవాళ్ళు మేకపోతులేనని తేలిపోయింది. విరాట్‌కి పాండ్యా మీద అంత నమ్మకం దేనికి? ముగ్గురు అతి చక్కగా మన ‘పేసర్లు’ పోటీపడి బంతులు మిడిల్ స్టిక్ మీదకి దిగ్గొడున్నారు.. శమీ, ఇశాంత్, బూమ్‌బూమ్రాలు చాలు అవతల ఒకడు, ఇవతల ఒకడు- జడేజా, అశ్విన్‌లు జమిలిగా చక్రం తిప్పేసే వాళ్ళు- జడేజా కూడా అంత హిట్టరే..’ అని.
కోహ్లి సేనకి కావలసినన్ని ఓవర్లున్నాయి. చీకటి, వాన లాంటివి లేవు.. అన్నీ బాగున్నాయి గాని అంచుకే తొగరు లేదు అన్నట్లు అయ్యింది మన టీమ్ పరిస్థితి. క్రికెట్ ప్రియుల దుఃఖాన్ని ఏమర్చడానికి తెరమీదకి కోచ్ రవిశాస్ర్తీ ప్రేమాయణం ఎక్కించాలనన్న పాచిక ఎవరిదో కాని పారలేదు. కోచ్‌మీద మాజీ క్రికెట్‌వీరులు కనె్నర్ర చేస్తున్నారు. కోహ్లి టీముని ఒక్క తాటిమీద నడిపించే దీక్ష బూనాలి. రవిశాస్ర్తీ పడక కుర్చీ కోచింగ్‌కు స్వస్తి చెప్పాలి. ఆట ముద్ర వేయాలి. కాని గత కీర్తికాదు.. ఈ మాట టీములో ప్రతి ఒక్కరికి తెలియాలి... లేదా దేశంలో బోలెడంత యంగ్ టాలెంట్ వుంది.. సీనియర్లకి హెచ్చరిక ఇది..
డెలివర్ గూడ్స్ ఆర్ బెటర్ క్విట్!