వీరాజీయం

సీబీఐకి ఫర్మానా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి కుండలో పడిందట! అట్లాగా దేశ అత్యున్నత నేర పరిశోధనా సంస్థ- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్- సీబీఐ- ఇప్పుడు ‘పులుసు’లో పడ్డది. ‘ఇంటి గుట్టు లంకకి చేటు’ అంటారు. అలాగే ఈ సంస్థలోని అత్యున్నత అధికారుల మధ్య విభేదాలు ఒకవైపు కోర్టులో నానుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారాలన్నీ దేశం నలుమూలలా వెలువడే పత్రికలలో చిలువలు పలువలుగా, వేడి వేడి వార్తలై ఉదయిస్తున్నాయి.
దేశంలో ప్రతి చిన్న నేరానికీ- స్కామ్‌కీ- కుంభకోణానికి- అన్నింటికీ- సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి అంటారు. ఇప్పుడు, రుూ సంస్థ అధిష్టానం యావత్తూ ఎట్లా పనిచేస్తున్నది? టాప్ బాసులు ఎవరెవరు ఏమిటి? అన్నది తేల్చి చెప్పమనే ‘రగడ’ సుప్రీం కోర్టుకు చేరింది.
సీబీఐ చిన్నాచితకా సంస్థ కాదు. దీని డైరెక్టర్ నియామకం విషయంలో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని వుండగా, నిర్ణయం తీసుకోడానికి మరో యిద్దరు మాన్య సభ్యులుంటారు. అందులో దేశ అత్యున్నత న్యాయస్థానం- ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన సిఫార్స్ చేసిన న్యాయమూర్తి గానీ వుంటారు. ప్రతిపక్ష నాయకుడు దీనికి మూడో సభ్యుడు. అన్నీ బాగానే వున్నాయి రుూ సంస్థకి. అది వుంటున్న పదకొండు అంతస్తుల బిల్డింగ్‌లో చాలనన్ని సంక్లిష్టమైన కేసులున్నాయి. చాలినంత మంది సిబ్బంది కూడా లేరు. సి.బి.ఐ. వార్షిక బడ్జెట్ ఆరువందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల పైమాటే. అందులో దేశవ్యాప్తంగా- అవసరమయితే విదేశాలకు కూడా పోయి తీగలు లాగగల అవకాశాలూ, సదుపాయాలూ వున్న- 7,274 మంది సిబ్బందికి చోటు వున్నది. కాకపోతే ప్రస్తుతం అంతమంది జనాలు లేరు. ఓ పదిహేను వందల ఖాళీలు వున్నాయిట.
సాధారణంగా సి.బి.ఐ.కి అప్పగించిన కేసు అలా రుతువులూ, సీజన్‌లూ, మంత్రివర్గాలూ మారినా నానుతూనే వుంటుంది. బోలెడు పబ్లిసిటీ- అదేలెండి.. అందరికీ కాదు. ‘నిందితుల’కి ఝామ్మని ప్రచారం కూడా లభిస్తుంది. ‘‘ఎందుకింత జాప్యం?’’ అన్న ప్రశ్నకి ఎవ్వరి దగ్గరా ‘‘ఆన్సర్’’ దొరకదు. కానీ, యిటీవల దాని అత్యున్నత అధికారి - ఆస్థానా గారి పునాదులే కదిలాయ్. ఆయన మీదనే అవినీతి ఆరోపణలు చేసిన ఒక సామాన్య వ్యాపారి సుప్రీం కోర్టుకెక్కి లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. సదరు వ్యాపారికి ‘సెక్యూరిటీ’ ఇవ్వండి అన్నది, గోగోయ్ గారి సుప్రీం ‘బెంచ్’- అనగా ధర్మాసనం. కొన్ని ఇంగ్లీషు మాటలకి తెలుగు అనువాదం మన పెద్దలు అద్భుతంగా చేశారు. అందులో ‘బెంచ్’ అన్న దానికి ‘్ధర్మాసనం’ అంటూ సంస్కృతం స్టాటస్ యిచ్చారు. దానిదే మనకి యిప్పుడా ధర్మాసనం కూడా.
ఒక డి.ఐ.జి. స్థాయి అధికారి- మనీష్‌కుమార్ సిన్హా- నాగపూర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయబడ్డంతో- కథ రసవత్తర మలుపు తిరిగింది. సిన్హా పిటిషన్ పడేస్తూ వూహించని హ్యాండ్ గ్రేనేడ్‌లు పేల్చాడు. ప్రత్యేక డైరెక్టర్ ఆస్థానా గారి స్థానం భూకంపంలో వుంటే- యిప్పుడు ఆయన మీదగల ఆరోపణల కేసులో- జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్ ‘హ్యాండ్’ వున్నదంటూ ఆరోపించాడు.
‘చిరు అధికారి’యే అయినా సిన్హా ఒక సింహగర్జన చేశాడు. అట్లా అదుపుతప్పి మలుపులు తిరుగుతూ వున్న సి.బి.ఐ. డొంకని కదిల్చే తీగెలు ఎక్కువ అయిపోతున్న తరి- చంద్రబాబు నాయుడు అను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి- ‘్ఢమాల్’న ఎంట్రీ యిచ్చాడు. ‘‘వెంటనే ఫైనాన్స్ మినిస్టర్ జైట్లీ లాగా ఆశావాది అయిపోయి- నాయుడి గారి మీద ఏదో సి.బి.ఐ. ఎంక్వయిరీ పడిపోతుందీ-’’అనుకోకండి! చంద్రబాబుగారే మరోసారి మోదీ మహాశయునికి ఎదురుగా ‘‘చక్రం’’ తిప్పాలనుకున్నాడు. తన సైకిల్ రెండు చక్రాలూ తెలంగాణలో రంగప్రవేశం కోసం పంపుకొట్టుకుని రెడీ అయిపోతూ వుండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - ‘‘సి.బి.ఐ.- తన అనుమతి లేకుండా ఆంధ్ర రాష్ట్రంలోకి రాకూడదు- ‘‘మే.. ఐ కమిన్?’’ అనడిగి- కేసు ఏమిటో, దాని కథాకమామీషూ చెప్పి మరీ- హోటల్స్‌లోనో, గెస్ట్‌హవుస్‌ల్లోనో- రూమ్స్ బుక్ చేసుకోవాలి’’ - అంటూ. ఎప్పుడూ రెండు వేళ్లు వూపేవాడు- యిప్పుడు పూర్తిగా- అరచెయ్యి విప్పి- ‘‘హాల్ట్’’ అంటూ ఆపేశాడు చంద్రబాబు.
‘‘ఈమధ్య ఆయనకి ‘హస్తం’ దోస్తీ ఎక్కువైంది-కదా, సార్?’’ అంటున్నాడో కొంటె స్టూడెంట్ ఒకడు. ‘సెక్షన్ 9’అని వొకటుంది. దాని క్రింద సి.బి.ఐ.-కి కేంద్ర పాలిత రాష్ట్రాల్లో చెప్పాపెట్టకుండా, దర్యాప్తు నిమిత్తం రెక్కలు కట్టుకుని వాలిపోయే హక్కు వున్నది సిబిఐకి. కాలక్రమంగా అదే ‘రూలు’ ఓ సంప్రదాయంగా- ఆనవాయితీగా- బడాబడా రాష్ట్రాలకి కూడా వర్తించింది తప్ప, న్యాయంగా చెప్పాలీ అంటే- సి.బి.ఐ. స్టేట్ గవర్నమెంట్‌కి చెప్పడం అవసరమేనంటున్నారు రాజకీయ విజ్ఞులు, పరిశీలకులూను.
సరే, ఒకప్పుడు- ‘బెంగాల్‌లో ఏమి జరిగితే, ఆంధ్రాలో మర్నాడు అది జరుగుతుంది’- అనేవాళ్లు. కానీ, యిప్పుడు ఆం.ప్ర. ముఖ్యమంత్రి ఏం చేస్తే అది బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అదేరోజు ఆ పని చేసేస్తోంది. పెట్రోలు ధర విషయంలో లాగే- సి.బి.ఐ.కి, ‘దేవిడీమన్నా’ విధించడంలో కూడా నాయుడుని ‘డిట్టో’ చేసింది మమతా బెనర్జీ. ఈ యిద్దరూ కలిసి- నాన్ భాజపా పార్టీలను పోగేసుకుని- ‘‘చలో పార్లమెంట్’’ అంటూ, 2019 ఎన్నికలకు పట్టుదలగా సన్నాహం అవుతున్నారు.
అట్టి తరి- రుూ రెండు రాష్ట్రాలూ కూడా బాగా కూడబలుక్కుంటున్నాయ్. కాకపోతే, సి.బి.ఐ.లో సంక్షోభానికి, ఆంధ్రా, బెంగాల్ ప్రభుత్వాలు- సి.బి.ఐ. ప్రవేశం మీద పెట్టిన ఆంక్షలకీ ఏమీ సంబంధం లేదు. అది మోదీ మహాశయునికీ, రుూ రాష్ట్రాల ముఖ్యమంత్రులకీ మధ్య యిటీవల ‘‘కోడిపుంజుల ఆట’’ లెవెల్లో సాగుతున్న ‘ఇగో’వార్ మాత్రమే!
‘‘లోగడ కర్ణాటకా, అస్సాం గవర్నమెంట్లు యిలాగే ‘నో ఎంట్రీ’ బోర్డులెట్టి సి.బి.ఐకి తీసెయ్యలేదా?’’అంటున్నారు ఆశావాదులు. సి.బి.ఐ. కేసులు- సి.బి.ఐ. అంతర్గత రగడల వల్లనే - ‘లేటు’అవుతున్నాయి గానీ, ఇలాంటి ఆంక్షలు ఫార్మాలిటీయే అంటారు కొందరు.
అవినీతిపరులకు రుూ విధంగా జరిగే ‘జాగు’(లేట్) కొంత వెసులుబాటునిస్తుందంటారు మరికొందరు. ఇప్పుడు ఆ కేసులు మరింత నత్తనడకన నడుస్తాయి అంటారు ఇంకా కొందరు. ‘‘రాష్ట్రం మీది అవినీతి కేసులు రాష్ట్రానికే చెప్పి ప్రొసీడవడం కూడా యిబ్బందే. కాని యిట్లా జరిగితే అవినీతిపరులకు రుూ ‘‘జాగు’’ ఎంతో వెసులుబాటునిస్తుంది’ అంటారు మరెందరో. మొత్తానికి ఇది నేటికి ఒక కొత్త రకం ‘పోరాటం’.
ఏ సార్ట్ ఆఫ్ కోల్డ్ వార్!

సెల్: 92900 99512