వీరాజీయం

తోక ముడిచిన అమెజాన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లేదురా ఇటువంటి భూమి ఇంకెందు! లేదురా మన వంటి వీరులెంకెందు’- అంటూ పొరపాటున ఏ స్కూలు వాళ్ళైనా పాడిస్తారేమో గానీ- ‘లేదురా మన వంటి జాతీయ జెండా యింకెందూ’- అన్నది- 1947 ఆగస్టు 14, అర్ధరాత్రి ఎఱ్ఱకోట బురుజుపైన మాత్రమే కాదు- ఇండియాలో యింటింటా పిల్లకాయల జేబులమీద ఎగిరిన తరుణం నుంచీ, జాతీయ భక్తిగీతాలలో- త్రివర్ణాంకిత పతాకం అంతర్భాగం అయిపోయింది.
చివరికి భారతదేశాన్ని చూడకుండా, విదేశీ గడ్డమీద పుట్టిపెరిగిన- భారతీయ మూలాలున్న పిన్నా- పెద్దా కూడా ఇండియాని చూడకపోయినా- ఇండియన్ నేషనల్ ఫ్లాగ్‌ని చూసి మురిసిపోతూ సెల్యూట్ చేస్తారు. అటువంటిది ఇండియాలో- మువ్వనె్నల జెండా రెపరెపలకి ఆబాల గోపాలం- కనుకొలుకుల్లోనూ విద్యుత్ కాంతులు మెరిసిపోవా? పోవాలి.. అలా పోకపోతే సదరు శాల్తీల్ని మూసెయ్యమన్న చట్టం వుంది. మూసెయ్యాలి!
జెండా వూంఛా రహే హమారా! ఎత్తుగా ఎగిరే మన జెండాయే మన పొగరు! ఈ మధ్యనే సుప్రీం కోర్టు చెప్పింది. ‘‘సినిమా హాల్లో మొదట ఈ జాతీయ జెండా రెపరెపలు, భేరీ నాద నేపథ్యభరితంగా చూపెట్టాలి’’ అని. అంతేనా? ఆ టైములో రెట్టింపు పైకానికి సీటు కొనుక్కున్న ప్రేక్షకుడైనా లేచి నిలబడాల్సిందేనని.
‘‘అటువంటిది మన దేశ పతాకాన్ని పోలిన బొమ్మని ముద్రించిన కాలిచప్టాలు (డోర్‌మేట్స్) తయారుచేసి- ఆన్‌లైన్ మీద అమ్మేస్తున్నారు. అంటే, అది తెలిసిన భారతీయుడికి రక్తం మరిగిపోదా? పోతుంది.. పోకపోతే, అది రక్తం కానే కాదు అంకుల్!’’ అన్నదో ‘ముగ్గుల’ భామామణి.
‘‘జాతీయ జెండా డిజైన్ ముగ్గుల్లో వేద్దామనుకున్నాగానీ, తొక్కేస్తారు అంతా, అని మానేశానంకుల్!’’ అన్నదొక జీన్ ప్యాంట్ అందాల బొమ్మ- అలాగే వంగి చుక్కల ముగ్గును సప్తవర్ణ శోభితంగా అలంకరించుకుంటూ.. బోగి నాటి ఉదయ దృశ్యం యిది!
‘‘ఔను! డోర్ ముందు- ‘తొక్క బుల్’ రంగవల్లికలంటూ లేని గల్లీలు రుూనాటికీ మన పట్టణాలలో కూడా లేవు- మార్నింగ్ వాక్‌ని వెచ్చగా ‘్ఫల్’ చేయించగల రంగవల్లికల మధ్య ‘స్మార్ట్’క్లిక్ చేస్తే- కనబడ్డ వార్త- అమెజాన్ డాట్ కామ్ ఆన్‌లైన్‌మీద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ డిజైన్‌తో తయారుచేసిన ‘కాలిపట్టాలు’ అదేనండీ! డోర్‌మ్యాట్స్ అమ్మకానికి పెట్టారన్న వార్త తగిలింది. ఈ ‘అమెజాన్’ ఆన్‌లైన్ మార్కెట్ అమెరికాలో 1994లో పుట్టింది. అనతికాలంలోనే అంతర్జాతీయ మార్కెట్‌ను కేవలం తీరూ తెన్నూ లేకుండా ‘ఆన్‌లైన్’గా ఆక్రమించేసుకున్నది. ఇండియాలో కోట్లాదిమంది అమెజాన్ డాట్‌కామ్ మీద అన్నీ కొనుక్కోవడానికి అలవాటుపడిపోయారు.
‘‘మా కోసం ఇన్ని చేస్తావ్.. నీకోసం ఏమీ కొనుక్కోవా?’’ అంటుందో ‘యాడ్ పాత్ర’- అమెజాన్ నుంచి వచ్చిన ప్యాకెట్‌ని అందుకుని యిప్పుకుంటూ అవతలి పాత్రతో. అలా అడ్జస్ట్ అయిపోయారు అమెజాన్‌కి ఇండియన్ ‘క్లాసు జనాలు’. కానీ, వాళ్లకి పోయినేడాది ఒక షాక్ తగిలింది. గణపతి, లక్ష్మి వగైరాల బొమ్మలతో వెబ్‌సైట్‌లలో ‘డోర్‌మ్యాట్’లు ప్రత్యక్షమైనాయి. గగ్గోలు, గందరగోళం పెట్టేసరికి ‘అఎమెజాన్’ వాటిని ‘తొలగిస్తున్నాం’ అంటూ ‘అడ్జస్ట్’ అయిపోయింది.
ఐతే, మళ్లీ ఇటీవల కెనడా ఆన్‌లైన్ మార్కెట్ వెబ్‌సైట్‌ల మీద ‘గూగుల్’ సాక్షిగా మన జాతీయ జెండాని పోలిన డ్యాష్.. డ్యాష్‌లు దర్శనమిచ్చాయి. మన అదృష్టం బాగుంది. విదేశాంగ మంత్రి ‘కిడ్నీ’ శస్తచ్రికిత్స తర్వాత, తన మంత్రిత్వ శాఖ బాధ్యతలలోకి వెంటనే రంగంలోకి దూకింది.
కాలక్షేపం కోసం అనుకున్న ‘ట్విట్టర్ డామ్- అనగా ట్వీట్స్‌కి శ్రీమాన్ మోదీ ధర్మమాని, అధికారిక వార్తలే కాదు- ‘ఆదేశిక’ సూత్రాలు కూడా ప్రసారం చేసే స్టాటస్ వచ్చింది! ‘‘ఇండియన్ ఫ్లాగ్ డోర్ మ్యాట్స్- కెనడా, అమెరికా, ఐరోపా దేశాలలోనే దొరుకుతున్నాయి. అయితే మాత్రం అమ్మకానికి అలా పెట్టడమా?’’ అని కొంతమంది అన్నారు. ‘ఎమెజాన్ (అమెజాన్ కాదు ‘ఎమెజాన్’ అని సవరించాడు వాళ్ళ డైరెక్టర్ ఒకడు) ఏది ఏమైనా, ఉచ్ఛారణ ఏదైనా- చిత్తశుద్ధి ఉండాలి. అది ముఖ్యం. ఉద్దేశం సరియైనది కావాలి. అదియే ముఖ్యం.
‘‘అడ్జెస్ట్ అవలేం. లేకపోతే- సుష్మాజీ వెంటనే ట్వీట్ చేసింది- ‘‘ముందా జెండా బొమ్మ వున్న డోర్ మ్యాట్స్ తీసెయ్. బేషరతుగా క్షమాపణ చెప్పు’’ అని, ట్వీట్‌నే ‘బ్రహ్మాస్త్రం’గా ప్రయోగించింది. నాలాంటి ఎందరో సామాన్యులు- ‘‘బాయ్‌కాట్ అమెజాన్ ఆన్‌లైన్ కొనుగోళ్లు’’ అంటూ ‘రుంజ’ వాయించేశారు. మామూలుగా అయితే మన విదేశాంగ శాఖ కార్యదర్శి కెనడా విదేశాంగ శాఖకి- మన దౌత్యవేత్త ద్వారా తెలుపడం - తరువాత మంత్రుల స్థాయికి- ఆనక ఫార్మాలిటీస్‌కి, పిదప ఆ గవర్నమెంట్ యంత్రాంగం- అమెజాన్ సి.ఇ.వోకీ రాయాలి. ఇదంతా ‘రెడ్ టేప్’ మీదుగా బండి నడిస్తే- లాభాలు చేసుకున్న ఆ కంపెనీ స్టాకు అయిపోతుంది అని తెలిశాక- ‘మేం వెబ్‌సైట్ మీద తీసేస్తున్నాం’ అంటారు- అదీ గడుసుతనం.
ఐతే, యివాళ మన సుష్మాస్వరాజ్ గారు ‘‘ఖబర్‌దార్! తక్షణం తీసేయ్. క్షమాపణ చెప్పు లేదా మీ వాళ్లకి వీసాలు కట్.. సమోసాలు కూడా తిననివ్వం’’ అంటూ తర్జని చూపెట్టింది. ‘అదీ మాడర్న్ స్పీడ్’ అంటే! ‘అదీ, అడ్జెస్ట్ కాకుండా చర్యలకి పూనుకోవడం’ అంటే.
మనకి 2015 నాటి చట్టం వుంది. ‘జాతీయ చిహ్నాలను వ్యాపారంకోసం, వినోదం కోసం వాడుకుంటే శిక్షార్హులు అవుతారు’ అని. దాన్ని మనం గౌరవించాలి. మన యిరుగు పొరుగు దేశాలు, సుదీర తీరాల దేశాలు కూడా పాటించాలి. జాతీయ జెండామీద గౌరవం ఒక సెంటిమెంటు కావాలి దేశంలో. ఒక స్టూడెంట్ ట్వీట్ చేశాడొకసారి- ‘‘కొన్ని లక్షలమందిని చంపిన నరహంతకుడు అశోకుడు. మరి ఆ అశోకుడి పేరు మీద అశోకచక్రం మనం ఎందుకు గౌరవిస్తున్నాం’’ అని.
నిజానికి, ఆ చిహ్నం ఒక చక్రం. దానిలోని రేకులు ప్రగతికి అంతరార్థ రేఖలు. వాటివల్లనే నాడు అశోకుడు కత్తిని పారేసి అహింసావాది అయినాడు. అలా.. అట్నుంచి ఆలోచిస్తే మంచిది.
మన జెండాని, మొదట మనం ప్రేమించడం, గౌరవించడం చేస్తే ఎదుటివాడు చచ్చినట్లు గౌరవిస్తాడు. ఇప్పుడదే జరిగింది. ‘‘ఆ (ఎ)మెజాన్’’ అపాలజీ యిచ్చింది. మనం ‘అడ్జస్ట్’ అయిపోదాం- అనుకుంటున్నాం.
‘ట్రై కలర్’ రుూజ్ అవర్ ‘ప్రైడ్’! *