వీరాజీయం

అఖిలేష్ - మాయాజాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాయావతి పుట్టింరోజు అంటే అభిమానులూ భక్తులూ ఆమెకి పూలదండలు కాదు- రూపాయల దండలు వేస్తారన్నది లోకోక్తి. దృఢమయిన ఆమె మెడలు విరిగేలాగ కరెన్సీ నోట్ల గజమాలలు ధరిస్తేనే ఆమెకు ఆనందంగా వుంటుంది. ఏనుగు ఆమె పార్టీ ఎన్నికల గుర్తు. కానీ రుూసారి ఆమె అరవై మూడో జన్మదినోత్సవానికి భారీ ‘‘కేకు’’ ఒకటి తెప్పిస్తే- దానిని ఆమె ‘యిలా’ కోసి, అందరికీ తలో ముక్కా పంచిపెట్టే లోపల- బసపా కార్యకర్తలు ‘దాడి’- ఐ మీన్, కేకుమీద చేశారు. మొత్తం కేకుని ఆరగించేశారు.
ఒకనాడు మకుటం లేని మహారాణీలాగ, అతి కోలాహలంగా జన్మదినోత్సవాలు జరుపుకున్న బహుజనుల ఆరాధ్య దేవత రుూసారి జన్మదినోత్సవానికి ‘‘సైకిల్’’వైపు ఆశగా చూస్తున్న ‘‘ఏనుగు’’లాగ కనబడింది. ఆమెను అభినందించడానికి- కార్యకర్తలు, భక్తులు అనుయాయులకన్నా ముందు- నిన్నటిదాకా బద్ద శత్రువు అఖిలేష్ యాదవ్ దుశ్శాలువా, పుష్పమాలలు పట్టుకుని, తన సైకిల్‌ను- ‘‘అమ్మా! యిదుగో నా ‘సైకిలు’. ఎన్నికల్లో నీ ‘ఏనుగు’ ముందు అయినా, లేదా వెనుకనైనాసరే, పరిగెత్తిస్తాను’’- అంటూ, అమిత వాత్సల్యాను రాగాలతో శుభాకాంక్షలు చెప్పాడు.
అదే ఎన్నికల యుద్ధ నీతి. నిన్నటి శత్రువులు నేడు పరమ మిత్రులైపోతారు.
పెద్దదీ, కీలకమైనదీ అయిన ఉత్తరప్రదేశ్‌లో ఒక కూటమి ఏర్పడితే, అది కాంగ్రెస్ ‘‘హస్తా’’న్ని అందుకుని ఏర్పడుతుంది- అనుకున్న పరిశీలకులు- 2019 కొత్త సంవత్సరం మొదట్లో ‘ఖంగు’ తిన్నారు. మాయావతి, అఖిలేష్‌లు యిద్దరూ యు.పి.లో మాజీ ముఖ్యమంత్రులే. అలాగే మాయావతి పార్టీ, అఖిలేష్ యాదవుల పార్టీలు, లోగడ- రొటేషన్ మీద రాష్ట్రాన్ని ఏలుకున్న సంగతి, కొందరికయినా జ్ఞాపకం వుండే వుంటుంది.
ఇటీవల కాంగ్రెస్ హస్తాన్ని- ‘అభయ హస్తం’గా నమ్ముకున్న అఖిలేష్ యాదవ్ చిత్తుగా వోడిపోయి ‘మాజీ’గా నడిరోడ్డున పడటంతో- మరోసారి రాహుల్ గాంధీకి ‘జై’-అనడం కన్నా- దళిత వోట్ల ‘ఖజానా’ అయిన శ్రీమతి మాయావతిని ఆశ్రయించడమే ‘బెటరు’ అనుకున్నాడు.
అమితోత్సాహంతో అతను మాయావతిని సత్కరిస్తున్న దృశ్యాలు టి.వి. తెరల మీద చూసిన వాళ్లకి ఆశ్చర్యమేసింది. ‘‘వీళ్లేనా ఎదుటబడ్డా, లేక దూరంగావున్నా- పరస్పరం నిప్పులు చెరుక్కున్నదీ?’’ అని ముక్కున వ్రేలు వేసుకున్నారు.
ఈ మాయా, అఖిలేష్‌ల ఒప్పందం యిక్కడ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ‘‘దుబాయ్’’లో వున్నాడు. ఐతే మాయావతి గానీ, అఖిలేష్ గానీ ప్రధానమంత్రి కుర్చీ గురించి మాట్లాడలేదు. ఎన్నికలలో పార్లమెంటుకు చెరి 38 సీట్ల చొప్పున పంచుకుని పోటీ చెయ్యాలనుకుంటున్నామని మాత్రం ప్రకటించారు. కాకపోతే, రుూ యిద్దరు నాయకులూ రుూసారి - ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ నుంచే వస్తాడని- గంభీరంగా వేర్వేరు సందర్భాలలో ఉద్ఘాటించారు.
దేశంలో, 80 పార్లమెంట్ స్థానాలున్న యు.పి.లో రుూ- స.పా; బసపా, పార్టీలు కేవలం 78 స్థానాలకే ఎందుకు పోటీ చేస్తున్నట్లు? అంటే రెండు స్థానాలని కాంగ్రెస్‌కి మీదుగట్టారన్నమాట. ఆ రెండు స్థానాలూ కాంగ్రెస్ పార్టీయొక్క మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీకీ, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్‌గాంధీకీ చెందినవి. ‘‘ఈ యిద్దర్నీ నేరుగా భాజపాతో ముఖాముఖీ, పోరాటానికే వదిలేస్తున్నాం’’- అన్నారు. బహుశా రుూ అంశమే - దుబాయ్‌లో పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రాహుల్‌గాంధీగారికి కొంత ‘ఊరట’నిచ్చి వుంటుంది. ‘‘ఆ యిద్దరు నాయకుల పట్ల నాకు అపారమైన గౌరవం వుంది’’ అంటూ తన స్పందనని వ్యక్తం చేశాడు.
సరే! మేం మా యావత్ శక్తినీ ధారపోసి ఎన్నికలలో పోరాడుతాం. కాకపోతే ఒక ‘ఊరట’ వున్నది-’ అంటూ అంగీకరించాడు రాహుల్‌జీ. ‘‘ఆ ఇద్దరి పొత్తూ- మోదీ పార్టీని ‘యింటికి’ పంపడానికే కనుక- తనకేమీ వ్యాకులతని కలిగించటం లేదన్నాడు. ఇటీవల అయిదు రాష్ట్రాలలో ముక్కుబజ్జీ చేసుకున్న భాజపా రుూసారి ఢిల్లీనుంచి కూడా లేచిపోడం ముఖ్యం. తమ లక్ష్యంకూడా అదే కనుక మాయావతి కూటమి విషయంలో అంతగా స్పందించనని, గడుసుగా అన్నాడు- కాంగ్రెస్ పార్టీ అధినేత.
ఎన్నికలలో, ఏ సమయంలో ఏం జరిగినా జరగవచ్చును. ఈ ఘటబంధనాలు, ఘటశ్రాద్ధాలు పెట్టుకోడం ఎంతసేపు? మాయావతి కూడా మొన్నటి భాజపా ఘోర పరాజయాన్ని ఎత్తిచూపింది.
‘దీంతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా జనాలు తిరస్కరించాయి’ అంటూ ఆమె కాంగ్రెస్ పార్టీ మీద కత్తులు నూరింది.
చిత్రమేమిటీ అంటే, దేశంలో రుూసారి రకరకాల ‘ఫ్రంటులు’ పడగలెత్తడానికి బుసలుకొడుతున్నాయి. కొత్తకొత్త పేర్లతో ఫెడరల్ ఫ్రంట్, కాంగ్రెస్ భాజపేతర ఫ్రంట్, కాంగ్రెసేతర ఫ్రంటు- యిలాగ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇదంతా 2019 ఎన్నికలలో మోదీగారిని ఓడించడం అన్న ఉమ్మడి లక్ష్యంతో వున్నాయి కనుక కమ్యూనిస్టులు జాగ్రత్తగా తమ పావుల్ని కదుపుతున్నారు.
దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల మధ్య పొత్తుకుదరకపోడం ముఖ్యం. ఈ ప్రాంతీయ పార్టీల పరస్పర విరోధం భాజపాకి అందివచ్చే అవకాశం కనుక అమిత్‌షా, మోదీజీలు ఆ దిశలో పావులు కదుపుతున్నారు. కాని శ్రీమాన్ మోదీగారు కూడా కాస్త విచలితుడైనట్లు కనబడుతోంది. తమ పార్టీ కూటమిలోకి కాం.పా. మొదలైన ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వచ్చి చేరితే, ‘వెల్‌కమ్’ -అంటూ ఆయన యిటీవల ప్రకటించడం అందరూ గమనించారు.
మూడు రకాల సెంటిమెంట్లున్నాయిప్పుడు. ఈ మూడూ- ఒకటి ‘ట్రిపుల్ తల్లాక్’, రెండు ‘శబరిమలై’ మూడు ‘అయోధ్య’. వీటిని ఆయుధాలుగా వాడుకోడంలో ఎవరు ఎక్కువ చాకచక్యం చూపెడతారో వాళ్ల కూటమికి పరువుదక్కే ఛాన్సు మెరుగు అవుతుందని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు.
కాలం ఆగదు. పొలిటికల్ పార్టీలకయినా అది ఆగదు ఒక్క క్షణమయినా. ఉత్తరప్రదేశ్ కూటమిలో మరి కొన్ని చిల్లర పార్టీలు చేరతామని ఉబలాటపడుతున్నాయి. ‘‘పోయినసారి 80 స్థానాలకి 70 సీట్లు గెల్చింది కాబోలు భాజపా. మరి రుూసారి ఆదిత్యనాధ్ యోగీగారి ధర్మమా అని ఆ పార్టీ వణుకుతోంది’’- బాధగా అన్నాడో మోదీగారి అభిమాని.
ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో కె.సి.ఆర్; కె.టి.ఆర్‌లు జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. జగన్, పవన్‌లు- కె.సి.ఆర్, కె.టి.ఆర్;ల మోజులో ఎంత పడతారు? అన్నది చంద్రబాబుగారి ‘వర్రీ’. కాకపోతే ప్రస్తుతానికి తెలంగాణా నాయకులు మోదీనీ, చంద్రబాబునీ కూడా వోడించడమే ‘లక్ష్యం’అన్నట్లు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా-
‘ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్!’

సెల్: 92900 99512