Others

యోగమా? యాగమా??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కేంద్రం మాకు సహకరించడం లేదు’- అన్న మాట ఇటీవల భాజపా అధికారంలో లేని రాష్ట్రాల నుంచి తెగ వినబడుతూనే వుంది. ఆంధ్రాలో ముఖ్యమంత్రికి, కేంద్రంలో ప్రధానమంత్రి మోదీకి మధ్య ‘లడాయి’ తారస్థాయికి చేరుకున్నది. కేరళలో సరేసరి.. కేంద్రం తమకు సహకరించడం లేదంటూ ఎర్రజెండాలు ఎగరేస్తూ మరీ గోల చేస్తోంది వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వం. ఒడిశాలో, పశ్చిమ బెంగాల్‌లో ఎక్కడా కేంద్రానికి సదరు రాష్ట్ర ప్రభుత్వాల ఏలికలకి పొత్తు కుదరటం లేదు. అది సహజమేగానీ, ఒక ఫెడరల్ సిస్టమ్‌లో వుండదగ్గ- కేంద్ర, రాష్ట్రాల మధ్య ‘పొందిక’ కూడా లేదు. అన్నిటికన్నా ముందు మమతా బెనర్జీ పాలనలోని బెంగాల్‌లో యింకా ఏ ‘కూటమి’ కుదురుగా ఏర్పడనే లేదు. కేంద్రంలో పరిపాలిస్తున్న భారతీయ జనతాపార్టీకి- అడుగడుగునా ఆటంకాలు, కష్టాలూ ఏర్పడిపోతున్నాయి. ‘మోదీ- షా’ల అపురూప సంగమంగా వున్న భాజపాకి స్పీడు బ్రేకర్లు, రాస్తారోకోలు పెట్టడానికి ఎన్ని ‘గట్స్’ వుండాలి?- అన్నాడో మోదీ వీరాభిమాని.
‘‘ఏమనుకుంటున్నారో ఏమో! రుూ మమతాబెనర్జీలు, చంద్రబాబునాయుళ్లు.. కేంద్రం చేతిలోనే వీళ్ల పిలక వుంటుంది. కేంద్రం దగ్గర మిలటరీ పోలీసులుంటారు. మర టాంకులుంటాయి.. తెలుసా?’’ అంటూ వీరావేశం ప్రదర్శించాడు ఒక యువకుడు. ‘కాషాయ రంగు, కమలం’ వాళ్ల సింబల్స్ అయినంత మాత్రాన వాళ్లంతా విరక్తులు, వియోగులు, యోగులు, సాధువులు అనుకోవద్దు’- అంటూ కొంత ఆందోళన ప్రకటిస్తున్నారు పునాది స్థాయి కార్యకర్తలు. వెనుకటి రాజుల కాలంలా కేంద్రంతో తమ రాజ్యాల బలగాలు పోరాడాలనే అభిలాష కూడా వుంది కొందరికి! ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ‘దీదీ’ సర్వకాల సర్వావస్థల యందూ- తెల్లని సీదాసాదీ చీర ధరిస్తూ- అతి నిరాడంబరంగా హవాయి చెప్పులు వేసుకుని నడుస్తూ- వైరాగ్య స్థాయి- జీవితం గడుపుతూ వున్నా- ముఖ్యమంత్రి పాత్రలో ఆమె జీవిస్తున్నప్పుడు మాత్రం రుూ సహనశీలం కనబడదు.
చంద్రబాబు తన రాష్ట్రంలోకి సీబీఐని ‘అనుమతి లేనిదే రాకూడదు’ అన్నాడు గానీ, ఇక బెంగాల్‌లోకి భారతీయ జనతాపార్టీ నాయకులకే పరోక్షంగా ప్రవేశాన్ని నిరోధిస్తున్నారు- అంటున్నారు ‘కమల దళం’ నాయకులు. చూడగా చూడగా యింకా ఏ ‘కూటమి’కీ ఒక రోడ్డు మ్యాప్ గానీ, ఒక కామన్ ప్రణాళిక గానీ ఏర్పడలేదు. ‘పశ్చిమ బెంగాల్‌లో భాజపాకి బెంగాలీ ఎదురుగాలి ముక్కూ మొహం వాచేలాగా ఎదురవుతున్నది. ఇటీవల బెంగాల్‌లో జరిగిన భారతీయ జనతాపార్టీ ‘ర్యాలీ’- అదీ మామూలు ర్యాలీ కాదుట! అమిత్‌షా, స్మృతీ ఇరానీలు విజృంభించి పాల్గొనటానికి సకల సన్నాహాలూ చేసుకుని వచ్చిన ర్యాలీలు- యించుమించు భగ్నం అయ్యాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తన గ్లామర్- టి.వి. తారగా వున్న ప్రజాకర్షణ, వాగ్ధాటి వగైరాలను యినుమడింపజేస్తూ - పశ్చిమ బెంగాల్‌లోని జార్‌ఘ్రామ్‌కు చెందిన ‘శాల్‌బుణీ’లో- బ్రహ్మాండమయిన ర్యాలీకి, నాయకత్వం వహించడానికి- మధ్యాహ్నం పనె్నండున్నర గంటల ముహూర్తం పెట్టుకున్నారు.
ఐతే, అడుగడుగునా భాజపా నాయకుల ప్రయాణ రథ చక్రాలకు ‘గాలి’పోతూ వుండటంతో, ఆమె జార్‌గ్రామ్ చేరడానికే పొద్దుపోయింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తాత్కాలికంగా నిర్మించిన హెలిపాడ్‌కు నలభై అయిదు కిలోమీటర్ల దూరంలో దిగిపోయింది. ఇదంతా మమతా బెనర్జీ ఆదేశాల మీద బెంగాలీ అధికార యంత్రాంగం కల్పించిన విఘాతమేనని- స్మృతీ ఇరానీతోపాటూ వున్న భాజపా జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ నమ్మకం. జిల్లా అధికార యంత్రాంగం పన్నిన పన్నాగం వల్లనే ఇరానీ వెళ్తున్న హెలికాప్టర్ అనుకున్న దగ్గరకాక- ‘కళాయికుండ’ విమానాశ్రయంలోనే దిగడిపోయింది. ‘బీరభూమ్’కి ఎగరాలి అది. అక్కడ మర్నాడు- ‘సూరి’, అనేచోట కేంద్రమంత్రి స్మృతితో అమిత్ షాకూడా పాల్గొనాల్సి వుంది. గానీ, ఇరానీ ర్యాలీ- రైలుబండ్ల ప్లాట్‌ఫారాల మీద ప్రకటిస్తూంటారే- ‘్ఫలానా రైలు నిరవధికంగా లేటు’- అని, అలాగ బాగా లేటయిపోయింది.
అంతేకాదు- భాజపాకి మకుటం లేని ‘షా’ అయిన అమిత్‌జీకి సుస్తీ చేసి- రెండు సభలను ‘రద్దు’చేసుకునే స్థితి వచ్చి- ఆయన తిరుగు ప్రయాణంలో వుండగా- ఇరానీకి ఇక్కడ బీర్ (వీర్ లెండి, బీరుకాదు) భూమిలో చుక్కలు కనపడ్డాయి! ‘‘అక్కడ మన వేదిక దగ్గరగానే హెలిపాడ్ నిర్మించారయ్యా!.. పద భారుూ’’ అంటే హెలికాప్టర్ చోదకుడు- ‘‘అమ్మా! అక్కడ పొలాల్లో నాగేటి చాలుల్లో హెలికాప్టర్‌ని రుూ మునిమాపువేళలో దించామో- అంతే సంగతులయిపోతామ్’’, అన్నాడు.
స్మృతి ఇరానీ గ్లామర్ వున్న నటి, అనర్గళంగా మాట్లాడగల ధీమంతురాలూ కనుక సరిపోయింది. పైగా జనం కాస్త అసహనం, అల్లరి మొదలెట్టేసరికి ఆమె బెంగాలీ భాషలో ‘‘బోర్... బోషో...’’ అంటూ లెక్చర్ దంచేసింది. అసలు అంతకు ముందు మరోసభ ఆమె లేకుండానే కొనసాగింది. మమతాబెనర్జీ నేరుగా యిటువంటి విఘాతాలు కల్పిస్తున్నదని అంటూ ఇరానీ నినద భీకరంగా నిందించేసరికి తృణమూల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అక్కడే వున్నాడు. అతనికి మండింది. అతను ‘మమతాసేన’లో చాలా గట్టివాడు- నవ్వేస్తూ అన్నాడు- ‘‘ఎందుకు అలా నోరు పారేసుకుంటారు? మా పార్టీ, మా ప్రభుత్వం ఏమీ అడ్డం పడటం లేదు. ఏర్పాట్లదేముందీ వాటివల్ల మాకేమి పోతుంది? మీకే గ్రహచారం బాగోలేదు. మీ తారాచంద్రబలం అధ్వానంగా వుంది. పోయి ఏదైనా యజ్ఞం చేయించండి’’ అంటూ ఎద్దేవా చేశాడు.
నిజానికి ఫిబ్రవరి నెలలో ప్రధానమంత్రి నరేంద్ర దాస్ మోదీ పర్యటన వుంది. అదీ ఫెయిలవుతుందేమో? దానికీ మేమే కారణం అంటారు మీ వాళ్లు’’- అన్నారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్లు. మొత్తానికి- ‘నోరుంటే తల కాస్తుంది’ అన్నట్లు స్మృతి గనుక- పైట బిగించి మైకు ముందు శంఖారావాలు ఒత్తుతున్నట్లు- జనాకర్షక ప్రసంగం చేసింది గానీ మరొకరైతేనా? జావకారిపోయేవారు. అద్సరే.. రేపో మాపో ‘నమో’తో అమిత్ షా కూడా బెంగాల్‌కు రావాల్సి వుంటుంది. దానికి గగనతలంలో- ఇలాతలంలో కేంద్ర బలగాలు ముందే వచ్చి- ఏర్పాట్లు గట్టిగా చేసుకోవాలేమో?! బైదిబై- కేసీఆర్ చండీయాగం చేసి ఘన విజయం సాధించాడన్న గాఢ నమ్మకం మిగతా పార్టీల నాయకులకు పురుగై దొలుస్తున్నట్లుంది. అందుకే భాజపాకి- ‘‘యజ్ఞం చేయండి- గ్రహదోషం పోతుంది’’- అన్న సలహా యిచ్చినాడు తృణమూల్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు. దీదీకి కూడా ‘్ఫలర్’ అందాలనుకున్నాడేమో అతగాడు.
‘యోగా’ ఆర్ ‘యాగా’? విచ్ ఈజ్ పవర్‌ఫుల్...?

సెల్: 92900 99512