వీరాజీయం

రంగులు మారుతున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కాంగ్రెస్ ముక్త్’ కాదు, ‘కాంగ్రెస్ యుక్త్ భారత్’ ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది- అంటూ ‘షాట్‌గన్’గా వాసికెక్కిన భాజపా బిహారీ బాబు శత్రుఘ్న సిన్హా అర్జెంట్‌గా ట్వీట్ చేశాడు. ‘మోదీజీ’ అంటూనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద విసుర్లు, చతుర్లు వేస్తూ- కొంతకాలంగా వార్తల్లో ప్రత్యేక ఆకర్షణగా నలుగుతున్న ఈ సినిమా నటుడు తన మీద విమర్శలు వస్తే మాత్రం- ‘ఖామోష్’ అంటూ అరుస్తాడు. అది అతని టిపికల్ డైలాగ్- లక్షలాది ప్రేక్షక అభిమానులున్న శత్రుఘ్న సిన్హా రాజకీయాలలోనూ దిట్ట!
అమిత్ షా, మోదీలు ‘నువ్వు షాట్‌గన్ బిరుదాంకితుడివి ఏమో గానీ, మేము ‘షాట్’ ఇవ్వడంలో నిపుణులం.. అంటూ చివరి క్షణం దాకా ఆగి, మొండిచెయ్యి చూపెట్టారు. పాట్నాసాహిబ్ నియోజకవర్గంలో ఈ నటుడికి తిరుగులేదన్న మాటని పార్టీ పక్కనబెడుతుందని అందరూ అనుకుంటున్నా- ‘శత్రు’ అనుకోలేదు. రాజకీయ కురువృద్ధులైన అద్వానీ, మనోహర్ జోషీలనే పక్కకి తీసిపెట్టిన భాజపా- మోదీ, షాలకి- శత్రుఘ్న మీద మరో ‘కాయస్థుడు’ లేకపోతే కదా!
ఎన్నికల కలహాలలో, దినదినం మారే రంగుల వలయంలో పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి ‘శత్రు’కులం- ‘కాయస్థు’కే చెందిన కేంద్రమంత్రి వున్నాడు. పాట్నా మకుటం, కేంద్ర మంత్రి కూడా అయిన రవిశంకర్‌కి కేటాయిస్తూన్నట్లు తెలియంగానే చిరకాల కాంగ్రెస్ పార్టీ ‘శత్రు’- తక్షణం కాంగ్రెస్ ‘మిత్రు’డై పోయాడు. క్రిటిక్స్‌ని ‘ఖామోష్’ (నోరుమూసుకోండి) అంటూ హెచ్చరించాడు.
‘కాంగ్రెస్ ముక్త్భారత్’ కాదు. ఆ నినాదానికి నూకలు చెల్లాయి- అంటూ ట్వీట్ చేశాడు. అవతల నుంచి బిహార్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ అయిన అఖిలేశ్ ప్రసాద్ సింగ్ విలేఖరులను పిలిచి నెలాఖరులోగానే ఢిల్లీకి పోయి- ‘షాట్‌గన్’- కాంగ్రెస్ కండువాను ఆ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ చేతుల మీదుగా- తన కంఠాన అలంకరింపజేసుకుంటాడని ప్రకటించాడు.
చాలా కాలంగా ‘బిహారీ బాబు’, ‘గుజరాత్ షా’ల మధ్య ‘చిచ్చు’ రగులుతునే వుంది. శివసేన ‘సామ్నా’ పత్రిక సంపాదకీయం,- శత్రుఘ్న సిన్హాను, మోదీని నేరుగానో, పరోక్షంగానో తిట్టని రోజు వుండదు.
ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు- ఢిల్లీలో ప్రత్యేక హోదా ‘ప్రదర్శన’ బ్రహ్మాండంగా నిర్వహించినప్పుడు- ‘షాట్‌గన్’ అక్కడికి ఒక పెద్దపులిలా వచ్చాడు. వెండితెర మీదనే గాక నిజంగానూ ‘పంచ్’ డైలాగులు పేల్చడంలో ఆయన దిట్ట. ఆనాటి ఉపన్యాసం- అటు హిందీలోనూ, యిటు ఇంగ్లీష్‌లోనూ కూడా బాంబులే కురిపించింది. ‘మోదీజీ.. మీ వ్యవహారం మీ స్థాయికి తగ్గట్టుగా లేదు’ అంటూ ఓ ప్రాంతీయ నాయకుడు శత్రు శిబిరం నుంచి విమర్శించడం- భాజపా నాయకత్వానికి ఒళ్లు అంతా కారాలూ, మిరియాలూ నూరి రాసుకున్నట్లే అనిపించింది. నాడే అనుకున్నారు- ‘శత్రు’ని మున్ముందు పార్టీ నాయకత్వం శత్రువుగానే భావిస్తుంది’ అని.
ఏది ఏమైనా పాట్నా సాహిబ్ సీటు మాత్రం శత్రుఘ్న సిన్హాకి రాదు. ఇండిపెండెంట్‌గా కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో తను పోటీచేస్తే- అది వేరే సంగతి. చాలాకాలంగా భాజపా అధిష్ఠానం నేతలు తనని పిలిచి బుజ్జగిస్తారేమోనని ఎదురుచూస్తున్న శత్రుఘ్న ‘కంగు’తినడం పెద్ద ఆశ్చర్యం కాదు. కాకపోతే జోషీ, అద్వానీలకే దిక్కులేదు. యశ్వంత్ సిన్హాకే గుర్తింపులేదు. షాట్‌గన్‌కి బెదురుతుందా?- మోదీ ప్రభుత్వం?’ అన్నారెందరో.
ఐతే, ‘శత్రు’ను యిటువంటి ప్రచార ఘట్టంలో వదులుకోడం ఒక సవ్యసాచి అయిన ‘స్టార్ కాంపైనర్’ను పోగొట్టుకోవడమే అవుతుంది. పైగా యివి సోషల్ మీడియా రోజులు. ‘ట్వీట్స్’ అనేవి నేరుగా సంధించే బాణాలు. ‘శత్రు’ తన శ్రోతలని మంత్రముగ్ధుల్ని చేయగలడు. రాహుల్ గాంధీ ప్రకటించిన - ‘ఇరవై శాతం ఆర్థిక సహాయం’ (పేదలకు) పథకాన్ని షాట్‌ఘన్ వేనోళ్ల పొగిడాడు. అది దేశ పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకుని ఆలోచించిన గొప్ప పథకం అంటూ, ‘మాస్టర్ స్ట్రోక్’ అంటూ తెగ పొగుడుతూ ‘ట్వీటేడు’ రుూ పాపులర్ విలన్ కమ్ హీరో.
ఇదే టైములో శత్రుఘ్న సిన్హా లక్నో వెళ్లి సమాజ్‌వాదీ పార్టీ అధి నాయకుడు అఖిలేశ్ యాదవ్‌ని కలిశాడు. దీంతో ‘శత్రు’ సమాజ్‌వాదీ పార్టీకి బాసటగా పోతాడనుకున్నారు. గానీ, తన సతీమణి పూనమ్ సిన్హాని లక్నోలో ఎన్నికల బరిలోకి దించాలనుకుని రుూ నటుడు అక్కడికి వెళ్లాడని అంటున్నారు. ‘ఖామోష్’ అన్నాడు బీహారి బాబు మళ్లీ. దీనికి తగ్గట్టు పాట్నా ఎయిర్‌పోర్ట్ వెలుపల భాజపా అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్‌కి వ్యతిరేకంగా, ‘గ్యోబాక్’ప్రదర్శనలు జరిగాయి. పార్టీలోపలి శక్తులే అంతర్గతంగా కొట్టుకుంటున్నాయి దీన్నిబట్టి అర్థం కాలేదా?
భారతీయ జనతాపార్టీ ప్రచార రథాలు రుూసారి అంత జోరుగా సాగకపోవచ్చు. అద్వానీ, జోషీలను ప్రక్కకి నెట్టేయడం పాత కాలం నాయకత్వానికి నచ్చడం లేదు. అలాగే ఒక్క ఉమా భారతి తప్ప, రుూ విషయంలో అమిత్ షా ‘్భజన’ మరెవ్వరూ చెయ్యడం లేదు. ఆమె మాత్రం పార్టీ ఉపాధ్యక్ష పదవిని ఆశిస్తున్నందువల్లా, పాతకాలపు ‘కోపాలు’ కూడా వున్నందునా- అద్వానీని అవమానించడాన్ని సమర్థిస్తున్నదని కొందరు అంటున్నారు.
‘మెజారిటీ తగ్గినా ప్రభుత్వం మాదే వస్తుందన్న ధీమా ఉంది.. అది చాలు..’ అన్నాడో భాజపా కార్యకర్త. ఇదిలావుండగా తెలుగు రాష్ట్రంలో కొత్త పరిణామం ఒకటి అందర్నీ చకితుల్ని చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ చతురత రెండు రకాలుగా చాలా గట్టిగా వుంది. కాంగ్రెస్ ‘్భజపా ముక్త్భారత్’ అన్న మాట ఎట్లా వున్నా తెలంగాణలో తెలుగుదేశాన్ని ఎన్నికల వరకూ అయినా నిలదొక్కుకోకుండా చేయాలన్న పంతం కేసీఆర్‌లో బలంగా వున్నది. దీనికి ప్రతిగా తన శక్తినంతాపెట్టి తెలంగాణలో- తెదేపాకి ఉనికి, ఊతం వున్నాయి అని రుజువు చేసుకుంటూ చంద్రబాబు కూర్చుంటే- అవతల జగన్, పవన్‌లు రోజురోజూ ఒక్కొక్క కొత్త ప్రభంజనం సృష్టిస్తున్నారు. కనుక, పంతాలకు పోక- తెలంగాణలో కాంగ్రెస్‌కు వత్తాసు పలకడమే ‘బెటర్’ అనుకున్నాడు చంద్రబాబు.
నామినేషన్ల పర్వం అయింది కానీ అసలు ఘట్టం- ఉపసంహరణల సమయంలో వుంటుంది. బేరసారాలు అప్పుడు రకరకాలుగా సాగుతాయి. సామాన్య వోటరుకు, మీడియా వారికీ మాత్రం రుూసారి- కలహాల కోలాహాల హాలాహలంలో ఓ వినోదపు‘తేనె’చుక్క ప్రజాశాంతి పార్టీ అధినేత- కేఏ పాల్ ద్వారా లభిస్తోంది. గొప్ప కాలక్షేప నిధి పాల్.
జగన్‌మోహన్ రెడ్డి తన పార్టీ గుర్తు ‘్ఫ్యన్’ ప్రజాశాంతి పార్టీ గుర్తు అయిన హెలికాప్టర్‌కు దగ్గిరగా వున్నదనీ, ఆయనగారి ‘గుర్తు’ మార్చాలనీ కోరుతూ- ఈసీ దగ్గరికి పరిగెత్తాడు. దాంతో మండిపడుతున్న పాల్ మహాశయుడు ఓ ఎనిమిది నియోజకవర్గాలలో, అక్కడి వైకాపా అభ్యర్థుల పేర్లు లాంటి పేర్లుగల వాళ్లని పోటీకి నిలబెట్టి- జగన్ అనుకూల ఓటర్లకు కన్‌ఫ్యూజన్‌నీ, జగన్‌కి యాంగ్జయిటీనీ కలిగించాలనుకున్నాడు, కలిగిస్తున్నాడు. ఇలా నిత్యం రంగులు మారే కల్లోల సాగరం- ఎన్నికల రంగం!
ఇట్స్ టైమ్ ఫర్ వోటర్ టు థింక్ ట్వయిస్!

-వీరాజీveeraji.columnist@gmail.com 92900 99512