వీరాజీయం

నిరంతర తాత్కాలికం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సీతాపతీ చాపే గతీ’ అన్నట్లు చివరికి అనారోగ్యంతో ఉన్న సోనియా గాంధీనే మరోసారి ‘తీన్ తేరా’గా ఉన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ‘పట్టుకోవమ్మా!’ అంటూ బలవంతంగా అధ్యక్ష స్థానంలో నిలబెట్టారు. అది నిలబడటం కాదు- ‘కూలబడటమే’. ఇందిరా గాంధీ కుటుంబంలో పెద్ద కోడలైన సోనియాను మరోసారి రాజీ పద్ధతిలో ‘కూకోబెట్టారు’.. అన్నారు సామాన్య కార్యకర్తలు ఎందరో. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహించి ‘నేను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను’ అన్నాడు రాహుల్ గాంధీ. అప్పుడు హుందాగా పార్టీ పెద్దలు- ‘‘మేం బరువైన హృదయంతో రాహుల్ రాజీనామాను శిరసావహిస్తున్నాం’’ అంటూ రాజీపడ్డట్లు నటించి- ఈ సోకాల్డ్ తాత్కాలిక అధ్యక్ష పదవిని మరో కుర్రాడికో, దళిత నాయకుడికో అప్పగిస్తే రాహుల్ ‘హీరో’ అయ్యేవాడు. నియమానికి కట్టుపడ్డ యువనేత అని అనిపించుకునేవాడు. కాని కాంగ్రెస్ పార్టీ నలభై అయిదు రోజులు అహర్నిశలు సస్పెన్స్ కొనసాగించి, జనాల్ని చావ గొట్టిందని అన్నాడు ఓ పొలిటికల్ వ్యాఖ్యాత.
2014 ఎన్నికల్లో చావుదెబ్బ తర్వాత కాంగ్రెస్ శ్రేణులు మేల్కొని మొదట పార్టీలో సిద్ధాంత వైరం కాకుండా- పరస్పర వ్యక్తిగత వైషమ్యాలు తొలగించడానికి ప్రయత్నం చేయవలసింది. ఐదు సంవత్సరాల కాలం- వందేళ్ల పార్టీ ‘పునర్ నిర్మాణానికి- పునర్‌జ్జీవనానికి’ చాలలేదంటే మోతీలాల్ నెహ్రూ నుంచి రాహుల్ వరకూ ఉన్న కాంగ్రెస్ పరంపరకు సిగ్గుచేటు కాదా? అని అడుగుతున్నారు పార్టీ అభిమానులు. మళ్లీ రాజ్యసభ సీటు కోసం ఉవ్విళ్లూరుతున్న మన్‌మోహన్ సింగ్ లాంటి వృద్ధ నాయకుడు- పదేళ్లపాటు తనను ప్రధానమంత్రి గద్దెమీద కూర్చోబెట్టి పార్టీని ‘నీరు’గారించిన సంగతి అందరూ జ్ఞాపకం పెట్టుకుని వుండాల్సింది. ఆ మధ్య రెండు రాష్ట్రాలలో గెలిచేసరికి ఆసేతు హిమవన్నగము ‘మాదే’ అన్నట్లు కాలయాపన చేశారు. ఇవాళ మళ్లీ పప్పులో కాలేస్తున్నారు. రాహుల్ ‘స్టామినా’కి గాని, దేశభక్తికి గాని వంక పెట్టనక్కరలేదు. అభిమన్యుడిని కురుక్షేత్ర యుద్ధంలో పారేసినట్లు ఆయనను పారేశారు. వెనుకటికి ‘బ్రాహ్మడు-మేక’ కథలో లా అయింది. అయ్యా బ్రాహ్మణోత్తమా! కుక్కని పట్టుకుని పోతున్నావయ్యా? అన్నట్లుగా అయింది. ఒక ‘నినాదం’ సరిగ్గా వాడితే చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది!
అసలు ‘లేని బోఫోర్స్’ ఉదంతంలో ‘రాజీవ్ గాంధీ చోర్ హై.. గలీ గలీమే షోర్ హై’ అంటే ఆ పాట చెల్లినట్లు ఇవాళ ‘‘చౌకీదార్ చోర్ హై’’ అన్న నినాదం పనిచేస్తుందని అనుకోడం పొరపాటు. గబ్బర్ సింగ్ టాక్స్- చౌకీదార్ చోర్ (అందులో మోదీ అనే మాట కూడా లేదు) అన్న రాహుల్ నినాదం చివరికి ‘బోర్‌డమ్’ అయింది.
అతి ప్రాచీన- అధునాతన పార్టీ అయిన కాంగ్రెస్‌ను నాడు ఇందిరా గాంధీ హైజాక్ చేసేసింది. 1978లో అట్లా నిలదొక్కుకోగల అవకాశం, ‘గట్స్’కూడా మరో వ్యక్తికో, శక్తికో సాధ్యం కాలేదు. తాతల నాటి కాంగ్రెస్ పార్టీలో లాలా లజపతిరాయ్, మదన్‌మోహన్ మాలవీయా, గోపాలకృష్ణ గోఖలే మొదలు మన ‘కాసు’, ‘నీలం’ రెడ్లదాకా చివరికి పి.వి.నరసింహారావు దాకా పార్టీలో చీలికలు ఏర్పడ్డప్పుడు దెబ్బతిన్నారు. కామరాజ్ నాడార్, నిజలింగప్ప, శంకర్‌దయాళ్ శర్మ లాంటి గొప్ప పేర్లు చరిత్ర గర్భంలో కలిసిపోయాయి. నలభై రెండేళ్ళు సాగిన ఒడుదుడుకులలో కాంగ్రెస్ కుదేలైంది. తను గద్దెమీద లేనప్పుడు కూడా గుజ్రాల్, చంద్రశేఖర్ ప్రభృతుల పాలనకి కొమ్ముకాసింది. కోడలుదిద్దిన కాపురం అంటూ మముబోంట్లు రాజీవ్ గాంధీ సతీమణిని సోనియామాతగా కీర్తించినా- ఈ మహోన్నత పార్టీ ‘‘నిరంతర తాత్కాలిక’ పరిస్థితుల్ని ఎదుర్కొన్నది.
సోనియామాత ఎన్నో ఒడుదుడుకులకు సాక్షి అయ్యింది. నిజమేగాని, పడవ వరదలో కొట్టుకుపోతూ వుంటే అలా ప్రవాహానికి ‘‘వాలు’’గా నడిపింది తప్ప ఎటువంటి ఆమె విప్లవాత్మకమైన మార్పులు తేలేదు. అనారోగ్యంతో ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీకూడా దీనస్థితిలో ఉండగా ‘మోదీజీ’ అవతరించాడు. వస్తూనే ‘గాంధీజీ’ని ‘హైజాక్’ చేశాడు. పటేల్‌ని మేఘాల ఎత్తున నిలబెట్టి ‘మావాడే’ అన్నాడు. లాలా లజపతిరాయ్, మదనమోహన్ మాలవీయ, తిలక్ మొదలయిన వారిని ‘దేశ ప్రతీకలు’అని, వారు ఒక పార్టీ సొత్తుకాదు అంటూ ఎత్తుకుపోవడం తరువాయి. రేపోమాపో అదీ జరుగుతుందేమో..?
మొన్నటి చావుదెబ్బకి ఒక్క రాహుల్‌జీయే కాదు బాధ్యుడు. ‘పాతతరం’ నేతలంతా బాధ్యులే. తటస్థంగా ఉంటూ సందర్భోచితంగా పార్టీనైనా ఒక విషయానికైనా క్రిటికల్ దృక్పథంలో మద్దతుయివ్వాలి మనం. పార్టీ శ్రేణులు ఆలోచించినట్లు మనం ఆలోచించం. ఈ విషయంలో మోదీ, అతని కుడి భుజం అమిత్ షా ఎట్లా భారతీయ జనతాపార్టీలోని ‘అతి ముదురు కేసుల్ని’ టాకిల్ చేశారో జాగ్రత్తగా ‘అకడమిక్‌గా’, ‘పొలిటికల్’గా ‘స్టడీ’ చెయ్యాలి. అంతెందుకు? ఆర్టికల్ 370 విషయంలో కాంగ్రెస్‌లో చీలిక రాలేదా? రాజ్యసభలో చీఫ్ విప్ ఎదురుతిరగలేదా? గులామ్ నబీ మాటకు విలువ యిస్తూనే..జ్యోతిరాదిత్య సింధియా, జనార్దన్ ద్వివేది, దేవేంద్ర హుడా లాంటివారు ఓపెన్‌గా ‘ట్వీట్స్’ కొట్టి, దేశ శ్రేయస్సుకు తాము కశ్మీర్ విషయంలో మోదీ తీసుకున్న చర్యలకు వత్తాసు చెపుతున్నాం అంటూనే దాన్ని సర్వ ‘‘సుముఖంగా చేసుండాల్సిం ది’’అన్నారు- అట్లా ‘‘ఆబోరు’’ దక్కించుకుంటూ- తాము ఆపలేని పనిని ఆమోదించటం అనే పద్ధతికి కాంగ్రెస్‌లోని యువతరం పూనుకుంటూ ఉంటే దానిని వృద్ధతరం ఓ ‘దారి’న పెట్టాలి. అయిదు కమిటీలు వేశారు అధ్యక్షుడి ఎన్నిక నిమిత్తం. ఏ ఒక్క కమిటీకి కనీసం సదరు కమిటీలోని ఒకర్ని తాత్కాలికంగా బాధ్యత తీసుకోవడానికి ఎన్నుకోలేకపోయారు. అయితే ఒక రకంగా సుస్థిరతను కాపాడారు. దిగ్విజయ్ సింగ్‌లు పోయినా, గులామ్‌నబీ అజాద్‌లున్నారు. తస్మాత్ జాగ్రత్తలు చెప్పుకుని ముందుకు నడవాలి, మూలాలు నిలబెట్టుకోవాలి.
లెట్ దెమ్ ఫోకస్ ఆన్ గ్రాస్ రూట్స్- ఐ సే..

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512