వీరాజీయం

‘కావవే వరదా’ అంటూ.. బెజవాడ బ్యారేజీ కేక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాన వచ్చినా, వరద వచ్చినా, కక్కు వచ్చినా, కల్యాణం వచ్చినా, ఏదొచ్చినా మనవాళ్లకు ఓ అలవాటు వుంది. దాన్ని ముందు రాజకీయం చేయాలి. గ్రామాలు మునిగాయి. కృష్ణానది ప్రవాహం వానలకి మరింతగా పెరిగింది. రాష్ట్రాల మధ్య పొంతన లేక పోలిటిక్స్‌లో ట్రిక్కులు ఎక్కువ వుండడం చేత- మరికొంత.. ఇలా దిగజారుడు తత్వంగా ఎక్కువైపోయింది. ఇదంతా ‘ఆబ్జటివ్ థింకింగ్’ లేకపోవడం చేతనే అన్నాడు- బెజవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర శివుని రథం పక్క అరవై ఏళ్ళుగా చక్రాలబండి మీద టిఫిన్, టీలు సప్లయి కేంద్రం నడిపి యిప్పుడు మూలకి జరిగిన సామాన్యుడైన ఓ పెద్దమనిషి. అక్కడ అంటే- కరకట్ట మీద కట్టడం అక్రమం అన్నారు. ‘మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉంటున్నది భవ్య కరకట్ట నివాసం. కాని అదేమిటి? అదేం ఆయన సొంతం కాదు. దానిమీద దృష్టిపెట్టి ‘తన్నుకు ఛస్తున్నారు’ అంటున్నారు విజయవాడ నగర వాసులు.
మొన్న శని, ఆదివారాలు యిద్దరు ముఖ్యమంత్రుల నివాస గృహాల మధ్య తిరిగొచ్చాను. గనుక అసలు సంగతులు కొంతలోకొంత అవగాహనకొచ్చాయి. వరదలొచ్చి క్రిష్ణమ్మ- ఆయకట్ట ప్రాంతం అంతా స్వైరవిహారం చేస్తూ, పులివేషం వేసుకున్న కాళికామాతలా చెలరేగిపోతూంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి యిద్దరూ అక్కడ లేరు. ఆ ‘స్పాట్’లో- సోమవారం నాటికి పరిస్థితి అదుపులోకి వచ్చిందిట! తాపీగా అంచనాలు, లెక్కలు, పరామర్శలు సాగుతాయింక. కాని ‘ప్రకాశం బ్యారేజీ’- ఆంధ్రకేసరి పేరుమీద కట్టిన నియంత్రణ గేట్లుగల జలాశయం- బాధతో మూలుగుతున్నది. అది ప్రారంభమయిన మా చిన్నతనంలో ‘సింహం’లా చాలా ‘స్ట్రాంగ్’గా వుండేది. అది కాస్తా యిప్పుడు చలికి, వానలకీ, ఇంటి పైకప్పుమీద ఇరుక్కుపోయిన పిల్లికూనలాగా గజగజ వణుకుతున్నది. దానిమీద కట్టిన యిరవై నాలుగు అడుగుల వెడల్పు ప్లస్ ఐదడుగుల వెడల్పుగల ‘‘్ఫట్‌పాత్’గల అతి ప్రతిష్ఠాత్మకమైన రోడ్డు వంతెన మీద భద్రత కోసం పోలీసు బలగాలను ఎన్నాళ్లుగానో కాపలా పెట్టారు. ఈ ప్రకాశం బ్యారేజి వంతెన ‘‘మంచం మీద కునుకు తీసుకుంటూ వుండి’’ చాలా కాలమైంది. ఏండ్లు గడిచిపోయాయి. దారి కట్టేసి వి.వి.ఐ.పిలకి, దలైలామా లాంటి అన్యమత నాయకులకి మాత్రం అనుమతి ఇస్తూ వచ్చారు. ఈలోగా ముక్కేదిరా? అంటే మెడ చుట్టూ చెయ్యి త్రిప్పి చూపించినట్లు- కనకదుర్గమ్మ వారధిని ఎక్కి కుమ్మేసి- దాన్ని ఆయుర్దాయాన్ని కూడా హరిస్తున్నారు. బ్యారేజి దిక్కుకుపోతే అక్కడ అన్నిరకాల వాహనాలకు, ‘‘చూపరులు’’ అనగా సైట్ సీయింగ్ మొబైల్ వీరులకు కూడా ‘‘దేవిడీమన్నా’’విధించారు. శనివారం నాడు అక్కడికి పోతే, వెనక్కి తిరిగి మళ్ళీ తాడేపల్లిలోని సీఎం గృహ ప్రాంతాన్ని దర్శిస్తూ వివేకానందుడి సూక్తులు తల్చుకుంటూ, రామకృష్ణామిషన్ మీదుగా సీతమ్మవారి పాదాల చెంతకి చేరాను. ఆ గట్టుకి, మెట్లకి శిరసాభిషేకం చేస్తూ నల్లని చిక్కని వరద నీళ్ళను చూస్తూ చలో ‘‘ఉండవల్లి’’అంటూ పోవాల్సి వచ్చింది.
కాటన్ దొరగారి ధర్మమాని 1852లో కృష్ణానది మీద బెజవాడ వద్ద 1132 మీటర్ల పొడవున ఆనకట్ట కట్టారు. అయితే ఎత్తు ఐదు అడుగులే నిర్మించారు. ఎండాకాలంలో కట్టమీద చెప్పులు చేతబట్టుకుని అవతలి గట్టుకుపోవడం- ‘ఫెర్రీ’అనగా ‘‘బల్లకట్టుమీదు’’గా బండ్లూ, బస్సులు అవతలి తట్టుకి చేరడం- ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయి లీలగా. కృష్ణానదికి అద్భుతమయిన పదమూడు లక్షల ఎకరాల ఆయకట్టును ప్రసాదించే జలాశయం. బ్యారేజీ దాని రోడ్డువంతెనా వగైరా అన్నీ నాడు ఐదేళ్ళు కష్టించి నిర్మించారు. 1957 నుంచి యిది ఫుల్‌స్వింగ్‌లో సాగి, సాగి.. అరిగిపోయింది. కాని ‘‘క్రెస్టు గేటుల’’కి సోకాల్డ్ రిపేర్లతో ట్రాఫిక్ నియంత్రణతో పని ‘సాగస్తుండగా’ 2009లో వచ్చిన చరిత్రాత్మకమైన వరదలతో ఈ మొత్తం ‘‘సెటప్’’ చావుదెబ్బతిన్నది. కాని దానిమీద రోడ్డుకడ్డంగా ‘‘మంచం రిక్షాలకి మాత్రం దారిపెట్టేలాగా పెద్ద రోడ్డువంతెనను లాగిస్తున్నారు. బ్యారేజీ మీద పనె్నండు అడుగులు నీటిమట్టం వరకు జలాశయం తట్టుకుంటుంది. ఉధృతి ఎక్కువైతే ‘‘చేతులు ఎత్తివేయవలసిందే’’.. ఐ మీన్- గేట్లు ఎత్తివేయాలి. పైగా మూడు లక్షల క్యూసెక్కుల పైచిలుకు నీటిని మాత్రమే ఇది భరించగలదు. అంతకుమించి ఒత్తిడి పెరిగితే ‘‘క్రిందకి’’ఒగ్గేయాలి. క్రింద గ్రామాలు, పొలాలు మునిగిపోతాయి. ఆరులక్షల క్యూసెక్కుల జలాలు చేరితే ప్రమాద సూచికలు ఎత్తడం తప్పదు. పదకొండు లక్షల తొంభై క్యూసెక్కుల ‘‘ఇన్ ఫ్లో’’దాటితే క్రింది గ్రామాల మీదకి జలాల ‘‘దాడి’’ని వదిలివేయాలి. 2009లో వచ్చిన వరదలలో బ్యారేజీ నీటి మట్టం యించుమించు యిరవైనాలుగు అడుగులు చేరుకుంది. హాహాకారాలు ఎత్తిపోయారు. రోజుకి సరాసరి వంద టి.ఎం.సి.ల నీళ్ళను సముద్రంపాలు చేశారు. తప్పలేదు. గాని వరద నీళ్ళుపోతూ- జన వాసరాల మీద, పంట చేల మీద వాటి ప్రతాపం చూపిమరీ పోతాయి. ఆనక అధికారపక్షాలు, ప్రతిపక్షాలు అక్కడి గ్రామాల మీద పడి ‘‘జనాల’’్భవోద్రేకాలతో, బాధలతో ఓ ఆట ఆడుకుంటారు.
ఆదివారం నాడు మధ్యాహ్నం సీతానగరం సీతమ్మవారి పాదాల దగ్గర్నించి ఫొటో ‘లాగి’చూశాను. రైలుపట్టాల వంతెనకి చాలాదగ్గరగా ఉధృతంగా పోతున్నది కృష్ణవేణీ ప్రవాహం. అప్పుడు అలా వదలకపోతే నిజంగానే తెదేపా నాయకులు భ్రమపడుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి నివాసం- నిండా మునిగేది అన్నాడో కొబ్బరికాయల దుకాణం అబ్బాయి. 2009 తరువాత మొన్న ఆగస్ట్ 12న యిట్టి ఉపద్రవం లాంటిది వచ్చింది. అయితే రుూమధ్య పది సంవత్సరాల కాలంలో మన గవర్నమెంట్లు జనోద్ధరణకు- బ్యారేజీ భద్రతకు చేసిన ‘‘శుశ్రూష’’ ఏమిలేదు... ప్చ్!...
ఆమధ్య కె.సి.ఆర్. వచ్చి యధేచ్ఛగా దానిమీద తిరుగుతూ, పచార్లు పర్యవేక్షణ చేస్తున్నపుడు ఓ ప్రెస్ కంట్రిబ్యూటరు, కుర్రాడు తన ప్రక్క వాడికి వినబడేలాగ- తెలంగాణ ముఖ్యమంత్రి బ్యారేజీ మీదకి నేరుగా వెళ్ళిపోతూ వుంటే తగిన ‘‘భద్రత’’కల్పించాల్సిన బాధ్యత కొత్త ముఖ్యమంత్రి మీద లేదా? అంటూ ‘‘కిసుక్కున’’నవ్వాడు. అలా వుంది ‘‘రోడ్డు వంతెన’’ దుస్థితి. మొన్న వరదలకి ‘ఆత్మహత్యలు’ చేసుకుందాం అనుకున్న వాళ్లని ప్రమాదం నుంచి నిరోధిస్తున్నాం’’ అంటూ పోలీసు అబ్బాయి ఒకడు ‘‘ఇహీ’’మన్నాడు. ‘‘ఏం ప్రెస్సు?.. అచ్చుతప్పుల ప్రెస్సు ‘‘పోస్టుమార్టం’’కోసం వస్తారుటయ్యా? మీరు ముందు జాగ్రత్తలుగా దానిని రిపేరు లాంటి అదనపు ఏర్పాట్లుచేయమని గట్టిగా మీడియా గోలెట్టద్దా? అని అడిగాడు. బెజవాడ వదిలేసి- అమెరికా వెళ్ళిపోయి ఓ నెల హాలీడేస్‌కు వచ్చిన సాఫ్ట్‌వేర్ పెద్దాయన ఒకడు- అంతా ‘‘బ్లేమ్‌గేమ్’’ ఇండియాలో అన్నాడు. అవతల సగంగా కడుతున్న ‘‘ఫ్లెయిఓవర్’’- ఎగిరే వంతెన రెక్కలు రాని మొద్దుపక్షిలాగా వెక్కిరిస్తూ కనబడ్డది. అది గవర్నమెంటు మారేదాకా పూర్తికాదేమో- అసలీ అమరావతి బోర్డర్‌లేవిటి? గ్రామ సముదాయాలను మనం అద్భుతమైన అమరావతి పేరెట్టి రిఫర్ చేయాలి.?
-‘‘అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించునారు అన్నాడు’’ రాయప్రోలు గారు. అట్లాగే ఇక్కడ అసెంబ్లీకి సమీపంలో బ్రహ్మాండంగా నిర్మాణం కొనసాగిస్తున్న ఎస్.ఆర్.ఎమ్., వి.ఐ.టి.(వెల్లూరు యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ) యూనివర్సిటీ సంస్థల బిల్డింగ్స్‌లో కొంత సందడి కనపడ్డది- ప్రయివేటుగా మరి-
చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన రెండువందల ఎకరాల భూమి ఐనవోలు, నీరుకొండ గ్రామ పంచాయితీల ప్రాంతంలోనే యిది వుంది కాబోలు ఇక్కడ ఇలాంటి గొప్ప ప్రయివేటు విద్యాసంస్థలు లేస్తున్నాయి. కనుక దీనిని అమరావతి అనాలేమో కాని- అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రాంతంలో ‘స్వీపర్స్’ మాత్రం మాకు క్వార్టర్సు వున్నాయన్నారు. మిగతా వాళ్ళకో? ఏమీలేవు. వాళ్ళు మోటారు కారులలో రాగలరుగా. కాలక్రమంలో గర్నమెంటులు మారుతూ వుండగా, వుండగా అవి వస్తాయి అన్నాడు ‘‘మా’’కారు డ్రయివర్..
పడగొట్టిన ‘‘ప్రజావేదిక శిథిలాలు’’- హెలిప్యాడ్ ఏరియా మాత్రం నీట మునిగిన చంద్రబాబు నివాసం చూశాక ‘అయ్యో’ హెరిటెజ్ భవనం లాగా ‘‘ఒగ్గేయ’’లేకపోయారా వేదికని అన్నాడు ఓ మోటార్ బైక్‌వాలా.-
అసలు సమస్య ఏమిటంటే? ముఖ్యమంత్రులు కాదు ముఖ్యం- బెజవాడ బ్యారేజీని, వరదల ఉపద్రవాన్ని ఎట్లా నిభాయించాలన్నది? ముఖ్యం-
‘‘విజయవాడ-గుంటూరు’’లను కలిపి హైద్రాబాదు సికింద్రాబాదు జంట నగరాల లాగా కొత్త రాజధానిని నామకరణం చేస్తే బాగుండేది. ఎందుకీ కలల సౌధాలు? ఎప్పటికి పూర్తిఅయ్యేను? ఈ సోకాల్డ్ అమరావతి స్వప్న సౌధాలు కాకపోతే అమరావతి నుంచి ఐరావతం దిగివచ్చినట్లు ఖర్చులు మాత్రం ‘‘వైట్ ఎలిపెంట్’’అనిపించుకుంటున్నాయని కొందరి ఆక్షేపణ. ‘విజయవాడ గుం టూరు’అన్న పేరైతే బాగుండేది కదూ? అన్నది జనవాక్యం. ఏదిఏమైనా ‘‘బ్లేమ్‌గేమ్’’ కాదు కృషా పరివాహక ప్రాంతం మీద టెక్నలాజికల్ దృష్టి ముఖ్యం.
స్టాప్ బ్లేమ్‌గేమ్స్.. స్టార్ట్ వర్కింగ్...!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512