వీరాజీయం

ఎద్దు ఎప్పడూ.. ఒక పక్కనే పడుకోదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలొచ్చేశాయ్. ‘నెలగంట’ పెట్టి వారం దాటింది. భాజపా అధ్యక్షుడు అమిత్ షా హుబ్లీలో ప్రచారాన్ని మొదలెట్టి యడ్యూరప్పని గద్దెమీద కూర్చోబెట్టటానికి ఉపవాసదీక్ష చేసి మరీ ప్రొసీడ్ అయిపోతున్నాడు. 72 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది భాజపా అప్పుడే. కర్నాటక ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికలకి జోస్యం చెప్పే అసలు సిసలు ‘ప్రివ్యూ’ అంటున్నారు పొలిటికల్ పండిట్స్. కాంగ్రెస్‌కు ఉద్వాసన చెప్పమని ఓటర్లను అడగటానికి బిజెపి దగ్గర ఉన్న మంత్రం మోదీజీ మాత్రమే. కాని మోదీజీ ‘వీక్’ అయ్యాడంటున్నారు కిట్టనివాళ్ళు.
బీసీ కులానికి చెందిన మోదీని ప్రధానమంత్రిని చేయడం మా పార్టీ క్రెడిటే అనగల సత్తా ‘కమలనాథుల’కి వున్నది. గాంధీని, అంబేడ్కర్‌ని స్వీకరించడం సంఘ్ పరివార్ ఔదార్యమే. అంబేడ్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహించడం దళిత లీడర్స్ మరచిపోకూడదు. ఓకె.. కానీ వాళ్ళు వినొద్దా? ఈ మాటలు. నమ్మవద్దా నమో! నమో! యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి ‘దళితమిత్ర’ అవార్డు అందుకోవడం గొప్పే. ఇలాంటి ఉదార చర్యల ద్వారా దళిత సమూహాలను ఆకట్టుకోవడానికి బిజెపి గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే ‘ఘర్ వాపసీ’ పేరుతో మత మార్పిడి చేసుకున్నవారిని తిరిగి హిందూ మతాన్ని అవలంబించేందుకు బెదిరించడం వంటి చర్యలు చేస్తున్నారన్న ఆరోపణ కూడా వుంది. బడుగువర్గాల వారు హిందూమత పరిధిలోనే కొనసాగాలన్న ఒత్తిడిని కొందరు అంబేడ్కరిస్టులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఉన్నావ్, భీమా కొరెగాంలో సంభవించిన హింసాత్మక సంఘటనలు, గోరక్షణ పేరిట దారుణ దాడులు అంబేడ్కరీయులకు ఆగ్రహం తెప్పించాయి. అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం నిప్పుమీద నెయ్యి పోసినట్లు అయింది.
మితవాదాన్ని సంఘ్ పరివార్ శక్తులు అమలు చేస్తున్నాయని, భాజపాను దళితులు, మైనారిటీలు నమ్మడం లేదని యుపిలోనే ఎన్నో ఆందోళనలు చెప్పక చెబుతున్నాయి. బిజెపి ప్రభుత్వం అంబేడ్కర్‌కు ఎన్నడూ లేని గౌరవాన్ని ఇస్తోందని మోదీ అనడంలో పేచీ లేదు. కాని దళితుల పట్ల మోదీజీ అనుయాయులు విద్వేషపూరితంగా వ్యవహరించారన్న ఆరోపణ ఇపుడు తారస్థాయి అందుకుంది. ‘ఇవాళ దళిత భజన చేస్తున్నారు ఎందుకూ?’ అని అడిగాడో పెద్దమనిషి. ‘అందుకే’ అన్నాడో కొంటెవాడు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దళితుల్ని కీలక ఓటు బ్యాంకుగా బిజెపి వారు ఇప్పుడు గుర్తించారు కాని, సంఘ్ పరివార్ యాక్టివిటీస్ కొన్ని భాజపా అగ్రనేతలకు తలనొప్పిగా మారాయి.
2014 ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో దళితులు ఓటు వేసినందువల్లనే, కొత్త సామాజిక నియోజక వర్గాలను సొంతం చేసుకొని బిజెపి భారీ మెజారిటీతో కేంద్రంలో గద్దెకెక్కింది. కాంగ్రెస్ ఓటు ఖాతాల్ని మోదీజీ పార్టీ కొల్లగొట్టింది కాని ఇవాల్టి స్థితి చూస్తూ వుంటే- భాజపా ఆ వైభవాన్ని పోగొట్టుకుంటున్నదేమోనని అనుమానిస్తున్నారు పొలిటికల్ ఘనాపాఠీలు. ప్రస్తుతం దళిత సామాజిక సమూహాల్లో బిజెపిపై నమ్మకం సడలిందని మీడియా ఊదరగొట్టేస్తోంది.
బిజెపికి చెందిన ఐదుగురు దళిత ఎంపీలు- ‘అణగారిన వర్గాల సంక్షేమానికి మనమేం చేస్తున్నాం?’ అనే సవాల్‌ని మోదీపైనే సంధించడం మామూలు విషయం కాదు. ఎస్సీ,ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టానికి సవరణలను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ మాయావతికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. రానున్న కాలంలో కొత్త పొత్తులకి ఇది సంకేతం. అవసరం, అవకాశం రెండూ తొంగిచూస్తున్న తరుణంలో మోదీజీ నిరాహారదీక్ష గురించి జోకులు పేల్తున్నాయి. ‘ఉల్టే చోర్ కోత్వాల్ కో డాంటే’ అన్నట్లుగా ఉంది ఇది. దొంగే ‘దొంగా దొంగా’ అని అరిచినట్లుగా ఉందని అన్నాడో కమ్యూనిస్టు. పశు విక్రయాలపై నిషేధం, గోరక్షక దళాల పేరుతో విద్వేష మారణకాండ.. వాటిని నామమాత్రంగా ఖండిస్తున్నట్టు మరో ఆరోపణ. అదే ఒక ప్రచార ఆయుధం అవబోతోంది. యూపీ సీఎం యోగి ‘దళిత మిత్ర’ అవార్డు అందుకోవడం వంటి చర్యల ద్వారా దళిత సమూహాలను ఆకట్టుకోవడానికి బిజెపి గట్టిగా ప్రయత్నిస్తోంది.
మతమార్పిడులు చేసుకున్న దళిత, బలహీన వర్గాల ప్రజల్ని హిందూమత పరిధిలోనే కొనసాగేట్లు బిజెపి దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని అంబేడ్కరిస్టులు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు, పెళ్లి ఊరేగింపులు, జులపాలు పెంచిన వారిపై దాడులు, అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసం వగైరా అంశాలను ‘సాధారణ మత మితవాదం’ ముసుగులో సంఘ్ పరివార్ శక్తులు అమలు చేస్తున్నాయని దళితులు అభద్రతకు గురవుతున్నారు.
బీసీ కులస్థుడైన మోదీని ప్రధానమంత్రిని చేయడమే కాదు, అగ్ర కులాలు అతనికి బ్రహ్మరథం పట్టాయి. కొత్త సూర్యుడు వచ్చాడంటూ రాత్రీ పగలూ కూడా జేజేలు కొట్టారు. ఇవాళ ఇదంతా ఆత్మపరిశోధన ద్వారా నెమరువేసుకోవడం మోదీ అనుయాయులకి అవసరం. తప్పదు. ‘కాంగ్రెస్ రహిత రాజ్యం తేవాలి’ అంటే వోట్లు పడాలి- దానికి పాట్లు పడాలి.. కేవలం ‘వక్తృత్వ పటిమ’ సరిపోదు, ఈ ప్రయత్నం చాలదు.. తిట్టుకవిత్వం మూడేండ్ల పాతది అయిపోయింది. కొత్త ప్రణాళిక కోసం ఎదురుచూస్తున్నారు జనం. వాళ్ల సమస్యలు సుప్రీం కోర్టులో మగ్గడం గొప్ప సంగతి కాదు. పార్లమెంటులో తేలాలి.. పార్లమెంటును అటక ఎక్కించి, చేతిలో మొబైల్ పెట్టి ‘నగదు రహిత కొనుగోళ్ళు ఒక్కటే సంస్కరణ’ అనుట ధర్మమా? ‘యూ ట్యూబ్ జిందాబాద్’ అంటున్నారు నేటి యువత. ఆధార్ కార్డు అనుసంధానం అన్నింటికీ అంటున్నారు. పిడుగుకీ ఒక్కటే మందు అంటే ఎట్టా సామీ? అంటున్నారు సామాన్యులు. నువ్వు తినవు- ఓకె.. వద్దు.
అవినీతి ఎవరికి మాత్రం ఇష్టం? కాని మమ్మల్ని మా బువ్వ ప్రశాంతంగా తిననివ్వు.. కంటినిండా నిద్దురపోనివ్వు. చేదుమాత్రలు ఎక్కువై మింగలేకపోతున్నాం అంటున్నారు జనం. డబ్బు కన్నా ముఖ్యం మనస్సుకి స్వేచ్ఛా శాంతి.. అవే ఆధార్ కార్డులు.. అనుసంధానాలతో లభిస్తాయా? పని - పాటు వుండాలి, ఆనక ‘సాపాటు’.. ఇవే కావాలి సాబ్! అంటున్నారు ఓటర్లు..
బెటర్ ఫైండ్ అవుట్ ఎ న్యూ స్లోగన్ ఫర్ నౌ!
*