వీరాజీయం

సంప్రోక్షణా? సంక్షోభమా??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుడి గుడికి శుద్ధి ఉంటుంది. కాని ‘దేవుడికి శుద్ధి’ అనే మాటకి అర్థమేమిటి? దేవుడే నిజానికి శుద్ధి.. ఆయన ఎదో పాపం లేదా పుణ్యవశానో.. విగ్రహంలో ప్రవేశించాడు.. ఆ విగ్రహం ఏడు కొండలపై కొలువైంది. ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా?-అని ఆక్రోశించి ఆవేదన చెందిన భక్తుల కోసం - అసలు మెట్లు ఎక్కనక్కరలేదు అంటూ -ఆ కొండలకు ఏడు దొంతరల వడ్డాణం తోడిగినట్లు రోడ్డు తొడిగి- చక్రాల మీద చేరుకొని ప్రతిఒక్క భక్తుడు తనకు లభించిన రీతిలో దర్శించుకుని -‘అబ్బా.. తలకు గుండ్లా’ ? అని అనుకోకుండా - దానితో పాటు గుండ్రని ఘుమ ఘుమలాడే లడ్డుండని పట్టుకొని - తేలికగా కొండ దిగిపోతున్నాడు. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న సైంటిస్టులు - ‘సైంట్లు’ కూడా -విమానాలెక్కి వచ్చి -వెంకన్న గుడి ముందర - తమ కేశసంపదని - దానితోనే అహంకార స్వాతిశాయాల్ని కాస్సేపు ప్రక్కన పెట్టి -మ్రొక్కి లేచి తృప్తిగా -తమ హోదాని స్థాయిని మరచి - సామూహిక సంతర్పణలో - ప్రసాదం తిని -వెళుతున్నారు. తిరుపతి కొండకి పో యోచ్చామని -శిఖర ఆరోహాణానందాన్ని పొందుతున్నారు. నమ్మకమే దేముడు అనుకున్నా- వెంకన్న మీద -విగ్రహం మీద -అదే కలియుగ దైవప్రత్యక్ష రూపమని నమ్మే అపారసంఖ్యలో జనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. వడ్డీ వ్యాపరస్తుడాయన.. అంటూ మురిసిపోయే భక్తకోటిలో -చాలామందికి తెలుసు- ఆ వడ్డీ సొమ్ములలోనుంచి -ఆసుపత్రులు -విద్యాలయాలు-మాత్రమే కాదు ఎన్నో జీర్ణోద్ధారణకు నోచుకోని... చిన్న చిన్న దేవాలయాలు కూడా లబ్దిపొం దుతున్నాయి. వడ్డీ వ్యాపారం చేసే ఎన్నో బ్యాంకులు ఈ దేవుడికి -బోలెడు వడ్డీ కడుతున్నాయి. అన్నమయ్య దగ్గరనుంచి సాధారణ భక్తుడి దాకా తనశక్తి ని బట్టి ఈ నిత్యకల్యాణ మూర్తిని -కీర్తించడంలోనే సంగీతం, సాహిత్యం కూడా నిత్య శోభితం అవుతున్నాయి. నిత్య నూతనంగా మనో మాలిన్య ప్రక్షాళన చేస్తున్నందున వెంకన్న.. అంటారు గోవిందా.. అంటారు - ముద్దుగా ప్రేమగా.. పామ రులకు గోవిందాయే తారక మంత్రం .. లేవడం,పడుక్కోడం అనేవి లేకుండా తిరుమల మీద ‘‘వెలసిన’’ ఈ విగ్రహానికి - తులసిదళం మొదలు వజ్రవైడూర్యాది అమూల్యమైన రాళ్లతో సహా అలంకారాలు - ముద్దు ముచ్చట్లు -పూపాన్పుల పవ్వలిమ్పులు -్భగాలు వైభోగాలు -సాగుతూనే ఉంటాయి.
చిన్న తమాషా మాటలు... లక్ష్మీనారాయణ అనే టెక్నాలజీ పోస్టు గ్రాడ్యుయేట్ ఒకాయన ఆత్మల పరిశోధనా టెక్నాలజిస్టుగా మారేడు. ఆయనోసారి - చాలాకాలం క్రితం పత్రిక అఫీసుకు వచ్చి- నా బల్ల దగ్గరికొచ్చి కబుర్లు చెప్పాడు. ‘‘అసలు ఈ ఏడుకొండల వెంకన్న ఎవరు అనుకున్నారు? ఓ కొండ వాడు. తూరుపు కనుమలలో -తిరుగాడుతూ సాముద్రికం, ప్రశ్న గట్రా -చెప్పుకుంటూ అందంగా ఉండేవాడు. ఆడపిల్లలకి చెయ్యి చూసి - నీకో మంచి మొగుడొస్తాడమ్మాయా...’’ అని కొండ దేవర మాటగా నమ్మ బలికేవాడు. అట్లాగా పద్మావతి దేవిని కూడా వలలో వేసుకున్నాడు ట.. వెంకన్నకో సైన్యం వున్నదిట . అందులో ఎన్నో పవిత్ర ఆత్మలు - చిన్నదేవతలు దేవుళళూ - అంకిత భావంతో చేరి -‘‘శ్రీవారి ‘‘ ఆజ్ఞలు సశిరసావహిస్తారట- శ్రీవారంటారు - వెంకటేశ్వర స్వామిని- ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడంటారు.. కాని - ఆ ఇద్దరి మధ్య, పాపం !కాస్సేపు ఏకాంతం అనుభవించనిస్తారా? ఎంతసేపూ భక్తుల గోలే .. వాళ్ళ సరదాలే. అలంకారాలు భోగాలు.. వుయ్యాల్లో పెట్టి నిద్రపోనీకుండా చేస్తారు. సంద డిగా పవళింపు సేవలు .. ఇంత బిజీగా వుండే ‘‘గాడ్’’ మరొకడు లేడు సార్!.. అన్నాడో మిత్రుడు. అమెరికా నుంచి ఎగిరి వచ్చి - తన బిడ్డకి కొండమీద -పుట్టు జుత్తులు తీయిస్తూంటే- అబ్బా.. వెంట్రు కలా? అనడు స్వామి. తల నీలాల మీద విదేశీ మారక ధనం పో గేస్తాడు -ఈ శ్రీహరి. తిరుపతి మాడ వీధుల్లో స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు. నిత్య క ళ్యాణం పచ్చ తోరణం ఈ వేడుక.
తిరుపతిలో ఈ సందడంతా ఆపేసి- వచ్చే నెల పదకొండో తేదీ నుంచి పదహారో తేదీ వరకు -ఆలయంలో బాలాలయ అష్టబంధన మహా సంప్రో క్షణ చెయ్యాలన్నారు అర్చకులు. ఇది పనె్నండు సంవత్సరాలకోసారి చెయ్యాలి. దీన్ని ఎలా చెయ్యాలి? ఆగమశాస్త్ర ప్రకారం చేయవలె. ఆగమ శాస్త్రం అంటే సింపుల్ గా దేవుడి విగ్రహానికి ఎట్లా పూజాది కార్యక్రమాలు చెయ్యవలె అనే విషయాన్ని చెప్పేది. ఇక సంప్రోక్షణ అనగా -ఇది ఎట్లా చేస్తారు? జలం చిలకరించి - శుద్ధి చెయ్యడం దీనికో పధ్ధతి ఉంది. సదరు ఆగమశాస్త్రాన్ని చూస్తే అందులో వుంటుంది. పెనె్నండు సంవత్సారాలక్రితం ఏమిచేశారన్నది సులువుగా తెలుసుకోవచ్చు.. ధర్మకర్తలమండలి అంటూ ఒక్కటి గవర్నమెంట్ కనుసన్నలలో మెలిగేది -తన ఇష్ట ప్రకారమో .. లేక గద్దె మీదున్న ముఖ్య మంత్రి మనోభీష్టం మేరకో నిర్ణయంచి తీసకొనే చర్య కాదేమో అది.. అన్నది భక్తకోటిలో కలుగుతున్న సందేహం.. అదీ భక్తులకు ఆగస్టు లో నాల్గు రోజులు మొక్కులు చెల్లించకుండా - నిరోధిస్తాం అనడంతోనే -అందోళన రగిలింది.
ప్రస్తుత కాలంలో శాస్ర్తీయమైన మీమాంసకి,- ధర్మ సందేహానికి కూడా రాజకీయ రంగులే. పైగా ఇప్పుడు మాజీ ప్రధాన పూజారి వివాదగ్రస్తుడై - ఆరోపణలు కొండ ఎత్తున చేస్తున్న స్థితిలో ఏది సత్యం? ఏదసత్యం ? ఓ వెంకన్నా! అని పరితపిస్తున్న భక్తజనం సంప్రోక్షణ కాలంలో తమకి విధించబడ్డ దేవిడీ మన్నాని - ఊహించుకొని తల్లడిల్లిపోతున్నారు. మొత్తం 144 గంటల శుద్ధి కార్యక్రమాన్ని -అతిగోప్యంగా చేస్తామని అందులో భక్తుల మీద జాలి దలచి -ఒక 30 గంటల వెసులుబాటు -బోర్డు వారి దయా ధర్మ భిక్షగా కల్పిస్తామని టీటీడీ ఈవో సింఘాల్ -ప్రకటించడంతో కథ రసకందాయంలో పడ్డది. పైగా , ఇందులో ముఖ్యమంత్రి గ్రూపు - అలా కాని గ్రూపు ఉండటంతో - అదే వెంకన్న -, అందరి చేతులు చేతలు చూసి - జాతకాలు నిబద్ధిం చే -శ్రీవారు - విడీవీడని చిక్కుల్లో పడ్డాడు. దేముడు కూడా దాక్కొనే చోటు లేని ‘ క్లోస్డ్ సర్క్యూట్లో ‘ఇరుక్కొని వుండగా- ధర్మకర్తలు, వారికి అనుకూలంగా ఉన్న ఆలయ అర్చక,అర్చకేతర ఆసాములూ -సాములు అంతా - ఈ సంప్రోక్షణని పామర జనం అయిన భక్తకోటి చూడ కూడదని .. క్లోసెడ్ సర్క్యూట్ -కెమెరాలు ఆఫ్ చెయ్యాలన్న నిర్ణయం ఎందుకు? ఇన్నాళ్లూ ఒప్పుకున్న ఆగమ శాస్త్రం ఇప్పుడు మారిందా? గుడిని మూసేసి ఏవేవో కార్యక్రమాలు చెయ్యాలనుకోవడం ఎందుకు?
రాజకీయ రొంపిలో ఇరుక్కున్న తిరుమల తిరుపతి పాలనా పద్ధతులు సామాన్యజనంలో అనుమానాలను రేకేత్తి స్తు న్నాయి.. విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద మొదలు -ఆలయ మాజీ ప్రధాన పూజారి దాకా -అభ్యంతరం -మీడియా కడుపు చల్లగా చెలరేగి ఉడు కెత్తిస్తున్నారు. ఈ దశలో సీఎం చంద్రబాబు తన నిర్ణయంలో మార్పు చేసి, మళ్ళీ ప్రోగ్రామ్ తయారు చెయ్యమన్నారు. కాని ప్రజలలో- ఆలయాన్ని మూసేసి ఏవో చెయ్యకూడని పనులను చేస్తారేమో? అన్న అనుమానానికి ఆజ్యం పోసే వారి సంఖ్య కూడా ఉంది. నిజంగా దేముడి దర్శనానికి దూరం అయిపోతామనే నిజమైన భక్తులకి బెంగా భయం సైతం ఉన్నాయి.. అందుకనే దేవస్థానం పాలకులు ‘దారి’కి దిగి వచ్చి -తిరిగి సమా వేశమవుతున్నారు.. ప్రజలను వారి అభిప్రాయాలను తెలుపమని గడువిచ్చి మరీ అడుగుతున్నారు. కనుక కుండ బద్దలుకొట్టినట్లు చెప్పండి. దేముడి పెళ్లి పడకా నడకా సహా అన్నీ రికార్డు చేసే కెమేరాలకి ‘‘సడన్’ గా అపవిత్రత వచ్చిందా? .. సాములు- అడ్డబొట్టు వాళళు నిలువు బొట్టు వాళళు - తీర్థయా త్రలకు పోయారా? దీన్ని లిఖితపూర్వకంగా చెప్పాలి - పారదర్శకత అవసరాన్ని తెలియచెప్పండి భక్తులూ.. ‘సాములూ !.. మీ ఫండ్స్ ఏమీ పోవులెండి.. నిజం చెప్పండి.. మేము పామరులం.. ఆగమ శాస్త్రం ఏమి చెప్పింది? రహస్యంగా సంప్రోక్షణ చెయ్యాలన్నదా?.. భక్తులను దుఃఖపెట్ట మన్నదా? గుడికి శుద్ధి కాని దేవుడికి శుద్ధి కాదు.. శ్రీవారు అందరివాడు.. పాలకులు కేవలం సేవకులు.. సేవకుల పెత్తనం చెల్లదు. భక్తుల అభీష్టం నెరవేరాలి.. పాలకులలో మనోమాలిన్యత ఉన్నదేమో చూసుకుని అక్కడ సంప్రోక్షణ మొదలెట్టండి ముందు.

డెసిషన్ మస్ట్ బి బియాండ్ ఏ రీజనబుల్ డౌట్!
*

--వీరాజీయం.....92900 99512