వీరాజీయం

రెండాకులెక్కువే చదివానంటున్న జయమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మే16న తమిళనాడు కురుక్షేత్రం మొదలవుతోంది. కనులున్న ధృతరాష్ట్రుడు లాంటి వాడు నల్లకళ్లద్దాల డి.ఎమ్.కే. బాస్ కరుణానిధి కొంతా ఇంటర్‌నెట్ వరాలు వెదజల్లుతూ- ‘‘మొబైల్ ఫోన్‌లు ఉచితం’’ అన్నాడు. ఋణాలు మాఫీ చేస్తానన్నాడు. వ్యవసాయానికి వేరే బజట్ పెడతానన్నాడు.
‘‘వోమ్మో...వోమ్మో...’’ అనిపించేటంతటి ఎన్నికల ప్రణాళికని పెడుతూ- ‘‘ఆఖరిసారి నన్ను ముఖ్యమంత్రిగా వెళ్లిపోనీండ్రా’’-అంటూ, పథకాలు పెడుతూ- అన్నింటినీ మించి- ‘‘ప్రొహిబిషన్ గ్యారంటీ’’- అంటూ జయలలితమ్మ మీద ఒక ఆటమ్‌బాంబ్‌నే ప్రేల్చాడు.
ఆచి, తూచి, ఆలోచించి- ‘‘నేను నీకన్నా ‘రెండాకులు’ ఎక్కువే చదివాను, పెద్దాయనా!’’అన్నట్లు, తన ఎన్నికల ‘మేనిఫెస్టో’లో జనాలకి ఒక ‘వరాల వరద’నే సృష్టించి పంపించింది. అంతా వై.ఫై.; ఇంటర్‌నెట్ మాయా‘హై’- అన్నట్లు ప్రజలకి అంతర్జాల స్వర్గం హామీయిచ్చింది- ‘అమ్మ’గా వాసికెక్కిన జయమ్మ! అక్కడ అన్నీ ‘అమ్మ’ బ్రాండే. సిమెంట్ నుంచీ మినరల్ వాటర్ దాకా ‘అమ్మ’ బ్రాండే. ఈసారి డి.ఎమ్.కే. ‘మొబైల్స్ ఫ్రీ’- అంటే- ‘‘స్మార్ట్ఫోన్స్ ఫ్రీ’యిస్తాం-’’అంటూ జయలలితమ్మ అన్ని పార్టీలకన్నా- ఆఖరున వోటర్ల మనసులో తాజాగా, వుండేలాగా- అరచేతిలో ‘పంచ రంగుల భూతల స్వర్గాన్ని’ సృష్టించి, ఆశపెడుతూ, వోటర్‌లు విని, గుండెలు బాదుకుని అలసిపోయేటన్ని కొంగ్రొత్త వరాలు ప్రకటించింది.
ఇంటింటికీ వంద యూనిట్లు కరెంట్ ఫ్రీ- ఆడాళ్లు స్కూటర్, మోపెడ్ లాంటి మోటారు శకటాలు కొనుక్కుంటే- సగం రేటుకే- కావాలంటే ఆటోలు కూడా లేడీజ్‌కి ‘్ఫస్టు’! ఎక్కడ పడితే అక్కడ వై.ఫై. ఫ్రీ అంటూ- ‘సూపర్ మాల్స్ మార్క్’ ప్రకటన లాంటి ‘మేనిఫెస్టో’ వదిలిపెట్టిందామె.
అవతల సోనియాగాంధీ పార్టీ- యివతల ద్ర.ము.క. పార్టీలూ బ్రహ్మాండంగా ర్యాలీలు నిర్వహిస్తున్న రోజునే, జయలలిత ఉచిత వరాల బాణాలు సంధించి- ర్యాలీలు భగ్నం చేసేటంత పని చేసింది. ‘‘ఆధార్‌కార్డ్ తాతలాంటి కార్డ్- ‘అమ్మ బ్యాంకు’ కార్డుయిస్తాను. ఇదొక కామధేనువు లాంటి కార్డు. బ్యాంకు కార్డులను తలదనే్న సదుపాయాల మాయాజాలం’’- అంటూ వివరించిందామె.
ఈసారి గవర్నమెంట్‌లోకి మళ్లీవస్తే, తమిళనాడు రాష్ట్రాన్ని యాదవ్ భారతదేశ ప్రజలు- ‘అమ్మ రాష్ట్రం’, ‘అమ్మ భూమి’ అంటూ పిలవాల్సిందే. జయలలిత- మం గళ సూత్రంకోసం ‘ఆడాళ్లకి’ నాలుగు గ్రాముల బంగారం యిస్తున్నాం యిప్పుడు. దీన్ని ఎనిమిది గ్రాములు- అంటే ఓ ‘కాసు’చేస్తాం అన్నదామె. ప్రసూతి శెలవు ఏకంగా తొమ్మిది నెలలుట! కొన్ని వరాలు- వో గ్రంథం అవుతాయి అన్నీ చెబితే- మచ్చుకి చూద్దాం.
తమిళనాడులో యించుమించు రెండు కోట్ల రేషన్ కార్డులున్నాయి. ‘‘రేషన్‌కార్డు చూపెట్టి- ఓ స్మార్ట్ ఫోన్ ఎత్తుకుపో’’ అన్నదామె. అంటే రెండు కోట్ల అమ్మ స్మార్ట్ఫోన్ యూనిట్లు కావాలన్నమాట. ఒక్కో ఫోన్ ఖరీదు ఒక వెయ్యి రూపాయలనుకోండి- రెండు కోట్ల వేల రూ.లు బొక్కసం నుండి ఖాళీ అన్నమాట! అలాగే గవర్నమెంట్ ఋణాల మీద- చదువుకున్న యువతీ యువకులకు ‘‘ఉద్యోగం యింకా రాలేదు’’ అంటే సదరు ‘‘ఋణం’’ మొత్తం మేం తీరుస్తాం’’- అన్నది అమ్మ.
‘‘ ‘కరుణ’ నిధిగా గల ఎంతటి వ్యక్తిఅయినా యింతటి అమ్మ హృదయాన్ని కలిగి వుండలేడుగా?’’అన్నాడో ఓటర్. ‘‘78 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు- ‘అప్పణంగా’ వంద యూనిట్లదాకా ‘ఫ్రీ’అంటే- ఏ మోదీలైనా తట్టుకోలేరు’’- అన్నదో ‘యాంకరు.’
పదకొండు, పనె్నండు తరగతుల విద్యార్థులకి ‘లాప్‌టాప్స్’ పూర్తిగా ఉచితం. అంతేనా? ఉత్త డబ్బాలు ఎందుకు? యుట్యూబ్ రాదు. మజామజా వెబ్‌సైట్లు పలకవు. అందుకని లాప్‌టాప్‌తోపాటు ఇంటర్‌నెట్ కనెక్షన్ ‘ఫ్రీ’-‘ఫ్రీ’అంటే, వోటు వేస్తేనే సుమా!
ఇలాంటి వరాలకు- చెయ్య జాబులేక- తొడగ చెప్పులు లేక- నిన్నటిదాకా, సారీ నేటిదాకా వున్న అర్భక జనాలు ఉక్కిరిబిక్కిరి అయిపోయి- ‘‘రెండాకులకే మా ఓటు’’- ‘‘అమ్మకే మా సేవలు’’-అంటూ, ‘అరవరా’? యువతులకు స్కూటర్లయితే- కాబోయే తల్లులకు ‘ప్రసూతి సహాయ పథకం’లో, యిప్పుడిస్తున్న పనె్నండువేల రూపాయలను పద్ధెనిమిది వేల రూపాయలదాకా చేసింది అమ్మ!
‘అమ్మలగన్న అమ్మ, జయమ్మా! నువ్వు కుటుంబ నియంత్రణ పథకానికే చావుదెబ్బకొడుతున్నావమ్మా!’’ అంటూ అరిచాడో కాం.పా. కార్యకర్త నీరసంగా.
అసలు అమ్మ అంటే ఎలా వుంటుందో ‘పురుచ్చి’, ‘తలైవీ’ని చూసి తెల్సుకోవాలి ఎవరైనా. ‘రైతు బాంధవి’గా జయలలిత- రైతులకోసం నలభై వేల కోట్ల రూపాయల పంట రుణాల నిధిని కేటాయించింది. రెండాకులు కాదు- మూడుపూలు, ఆరుకాయలూ కాయించారా రైతన్నలు. ‘‘కరెంట్ వర్రీవద్దు మరో 18,500 మెగావాట్ల విద్యుచ్ఛక్తి ఎలాగో అదనంగా సంపాయిస్తా- జనాలు ‘అమ్మ’పేరు మీద రంగురంగుల దీపాలెట్టుకోవాల్సిందే మీరు-’’ అంది.
అన్నట్లు జయమ్మ లేడీ సి.ఎమ్.లలో చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ కదా? అంచేత, అంబేద్కర్‌గారిని మర్చిపోతుందా? లేదు... అలా అనుకున్నవాళ్ల డిపాజిట్లు గల్లంతైపోతాయ్. ఐదు కోట్ల రూపాయలతో- ‘అంబేద్కర్ ఫౌండేషన్’ని పెట్టి- భీమ్‌రావ్ సాహెబ్ సందేశామృతాన్ని జనాలకి అందించగలనని ప్రామిస్ చేసింది. కాకపోతే ప్రొహిబిషన్ విషయంలో ఒక్కసారి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల నష్టం తట్టుకోలేము అన్న భయంతో జయమ్మ అంచెలవారీగా- ‘మందు బంద్’ చేస్తాం. అనగా- కరుణానిధిగారు వెంటనే- ప్రొహిబిషన్ విధిస్తానన్నాడు. (ఎంతమంది మగాళ్ల వోట్లు పడతాయ్?!)
మొత్తంమీద గ్రైండర్లు, మిక్సీలు, ఎనిమిది గజాల చీరలు, గ్యాస్ పొయ్యిలు, లెవెల్ నుంచీ- ‘ఫ్రీ’ జాబితా అంతా, హైటెక్ లెవెల్‌కి పెరిగిపోయింది. ‘అంతర్జాల మాయాజాలం’ విసిరింది అమ్మ వోటర్ల మీద. అన్నీ ‘గుగ్లీలే’ అప్పోజిషన్ మీద, పాపం!
లెట్ కరుణానిధీ ‘బ్యాట్,’ ఇఫ్ హీ కుడ్!