వీరాజీయం

నడ్డివిరిగే బరువులొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ గొప్ప బిజీగా వున్నారు. అభ్యర్థి, అతని ప్రత్యర్థి- ఆ ఇద్దరూ పరస్పరం తిట్టుకునే తిట్లను తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు.. వోట్లున్నవాళ్లు, లేనివాళ్లూ కూడా. ఎన్నికల కమిషన్ ముందే ఆర్డర్ వేసేసింది నేరాల చిఠ్ఠా పట్టుకొచ్చి యిచ్చి మరీ ఎన్నికలలో పోటీకి అనుమతి పొందాలని. పైగా రోజుకోసారి ‘అభ్యర్థుల నేరాల గుట్టు రట్టుచేసే వివరాలని వెల్లడి చేస్తూండండి అని హెచ్చరికలు కూడాను.
అసలు ‘కూటమి’ సభ్యుల నిజ స్వరూపం లాంటిది మచ్చుకి తెలియాలీ అంటే ‘నాన్ కూటమి’ సభ్యుల ‘కారు’కూతలు వింటూంటే తెలిసిపోతుంది. రంజుగా కాలక్షేపం అయిపోతోంది. వోటరు మహాశయుడు ఇరుపక్షాల పాండిత్యాన్ని ఎంజాయ్ చేసేస్తూ వుంటాడు. ఇక రుూ స్టేజ్‌లో తిట్లమీద సెన్సార్ వుండదు. అవతలి పార్టీవాడివి అన్నీ అబద్ధాలు అంటాడు ఇవతలి కూటమి ఆసామి. రైట్! ‘ఇవతలి పార్టీ చెప్పేవి అన్నీ పచ్చి అబద్ధాలు’ అంటూ కర్ణకోఠరమైన భాషలో -తెలుగులో- ‘అన్‌పబ్లిషబుల్’ అనగా- మాటల్లో చెప్పరాని బూతులు- చిచ్చుబుడ్డీల్లాగా ఇరుపక్షాలూ పరస్పరం విరజిమ్మేస్తూ వుంటాయి. కొత్త కొత్త పదజాలం సేకరించాలీ అంటే యిదే మంచి సమయం!
తమాషా ఏమిటీ అంటే పోటీలో వున్న పార్టీలు ఎదుటి పక్షం మీద చెప్పే కట్టుకథలు, పెట్టుకథలు జాగ్రత్తగా వింటే- అనగా సోషల్ మీడియాని ‘్ఫలో’ అయితే- చాలా కొత్తరకం లొసుగులు, లోపాలు బయటపడతాయి. ఎన్నికల్లో పబ్లిక్‌గా- డర్టీ లాంగ్వేజీ.. ప్రయివేటుగా ‘బ్లాక్ మనీ’-రుూ రెండూ ఉపయోగపడకపోతే- పోలింగూ, ఓటింగూ- ఆనక కౌంటింగూ అటు తర్వాత ‘క్రయింగూ’ రాణించవు.
‘క్రయింగ్’ అంటే ‘ఏడవడం’ అన్న అర్థమే రాదు. అవతలి వాడి మీద నిందలు, నిష్ఠూరాలూ వేస్తూ ‘అరవడం’ కూడా వుంది. ‘బెగ్గింగ్’ అంటే ఓట్లు అడగడం. ‘రిగ్గింగ్’ అంటే వోట్లను గోల్‌మాల్ చెయ్యడం. ఇది నిఘంటు ప్రవేశం చేసిన ప్రజాస్వామ్యయుత ‘పదరత్నాలు’. ఒక్కోసారి చెవులకు పోటు వచ్చేస్తుంది- ఈ పరస్పర దూషణ తిరస్కార ఛీత్కార దుర్మార్గ దారుణ ప్రచారాల ఘోర ఘోష వింటూంటే.. అలాంటప్పుడు ఏదైనా ‘వార్త’ కాస్త నోటికి రుచిగా వుండేది, అందేది, వుంటుందా? అని చూస్తే- ఇండియా, ఆస్ట్రేలియాతో ట్వంటీ ట్వంటీ సిరీస్‌ని సమం చేసేసింది. వోడిపోయినా కాసేపు చెడామడా తిట్టడానికయినా ఛాన్సు దొరికేది.. ప్చ్!
అట్టి తరి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అనగా- హెచఆర్‌డి వారు మొన్న సోమవారం అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకీ వర్తించే నీతి సూక్తిముక్తావళిని విడుదల చేశారు. అందులో భలే భలే.. ఆనందకరమైన ‘యివి’ వున్నాయి. ‘ఇవి’ అంటే ‘అవే’ తాఖీదులు, ఫర్మానాలూ వగైరా అన్నమాట!
స్కూలు పిల్లల మీద- వాళ్ల ‘నడ్డి విరిగే బరువులు’ వెయ్యొద్దు. వాళ్లు ‘హమాలీ’లు కారు. వెయిట్ లిఫ్టర్లు కాదు. రేపు పెద్దయ్యాక సిమెంట్ బస్తాలు మోసే అవసరం వాళ్లెవ్వరికీ బహుశా రాదు అన్నట్లు స్కూలు బ్యాగులను- అందులోని సరుకులు అనగా బుక్స్, వాటర్ బాటిల్, టిఫిన్ బాక్సు, గేమ్స్ వున్న మొబైల్ డబ్బీ వగైరాలను ‘తూచి’ మరీ వాళ్ల వీపుమీదికి ఎక్కించాలి అని ఆదేశాలు హుటాహుటిన పత్రికల వారికీ, చానళ్ల వారికీ అందించేశారు ఏలినవారు.
అవతల 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్స్ లాంటి అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్లు ప్రస్తుతం జరుగుతూ వుండగా యిట్టి సమాచార ప్రసార భారమును ‘వేసుట’- పాడియే? అనుకుంటూ లోపల పేజీలకు-బైది బై మైనర్ విశేషాలకు పరిమితం చేసింది మీడియా! ‘‘అవునండీ! ఔను! ఇట్లా పిల్లకాయలకు హోమ్‌వర్కు యివ్వొద్దు. వాళ్ల తాత, బామ్మల, మమీ డాడీల తెలివితేటలకి- ‘గొడ్డుచాకిరీ’ లాంటి హోం వర్కులు చేసి ఇచ్చే ‘్భరం’ వెయ్యొద్దు అంటూ కోర్టులు మంత్రివర్గ కార్యాలయ కార్యదర్శులు-సోకాల్డ్ ఆదేశాలను జారీ చేశారు.
‘‘కానీ, యిటువంటప్పుడే బుర్రకి పని చెప్పాలి’’ అన్నాడు ఒక ఎన్నికల పక్షేంద్రుడు-నిన్నటిదాకా ‘కారు’ తోసుకుంటూ విర్రవీగాడు- ఇప్పుడేమో ‘సైకిల్’కి పంపు కొట్టుకుంటూ వుంటానని రెడీ అయ్యాడు. ‘మారిపోవురా కాలము’-
‘‘ఓ ఐడియా సార్! మన పార్టీ మ్యానిఫెస్టోకి యిపుడు ఒక చిన్న ‘తాజాకాలం’ అడిషనల్ షీట్ జోడించకూడదా?’’ అని అడిగాడు చోటా బాస్ ఒకణ్ని కలిసి ఆశగా..
‘‘మాకు పరిపాలన అందించండి. మేం రాంగానే- అదే గద్దెమీదికి ఎక్కంగానే ముందుగా స్కూలు బ్యాగులు బ్యాన్ చేసేస్తాం. లేదా ప్రతి స్కూలు దగ్గరా ఒక ‘వేయింగ్ మెషీన్’ అనగా బరువు తూచు కంప్యూటర్ మయ యంత్రమును పెడతాం. ఒకటిన్నర కిలోలకన్నా పది గ్రాముల బరువు ఎక్కువున్నా బ్యాగులను స్వాధీనం చేసుకుని- పిల్లల్ని మాత్రం లోపలికి ‘ఒగ్గుతాం’. సాయంకాలం పూట ఇండ్లకు పోయేటప్పుడు-పిల్లల్లో ఒకటి రెండు తరగతుల పిల్లల దరి బుక్సు చెక్ చేస్తాం. హోంవర్కు ఇచ్చినట్లు కనబడ్డదో, ఆ బుక్సుని ‘సీజ్’ చేస్తాం. ఆ స్కూలుకు సంజాయిషీ నోటీసులు యిస్తాం -అంటూ రేప్పొద్దున మీడియా సెంటర్లకి-హాట్ హాట్ సమోసా, మిర్చీ బజ్జీ, ఛాట్‌ల చేటలో సహా యించక్కా పోయి యిలా న్యూసు అనౌన్సు చేద్దామా?
అదట్లుండనిండు-ఎన్నికల బరిలో యిప్పుడే చీలి(క)కాలం ద్విగుణీకృత ఉత్సాహంతో దిగడినా ఇస్మంటి వేడి వేడి ఐడియాలు వస్తూనే వుంటాయి కదా? ఏలినవారు చెప్పారు- ‘చిన్న క్లాసులకి బుక్సు తగ్గించే నిమిత్తం కేవలం లాంగ్వేజీ, లెక్కలు తప్ప, సివిక్సు, సోషలు, సైన్సూ, కంప్యూటర్ సైన్సూ, వెబ్ సైటాలజీ హ్యూమన్ రైట్సాలజీ వగైరాలుండరాదు అని అన్నారు.
భేష్! ‘‘ఎల్‌కెజికి కేజీన్నర సంచీ మొదలు పెద్ద క్లాసులకి అయిదు కేజీల బస్తా మాత్రమే అనుమతిస్తాం’’ అన్నారు. మరి వాటర్ బాటిల్స్, టర్కిష్ న్యాప్‌కిన్స్, స్మార్ట్ఫోన్ విత్ డేటాకార్డు వగైరాలు..?
‘విమాన ప్రయాణాలలో- అండర్ ది సీట్ బెల్ట్’’ లాంటి మినహాయింపులు యిచ్చి- పిల్లకాయలు బ్యాగుల్లో బరువైన పిజ్జా, బర్గర్, బిర్యానీ బ్యాగులు పెట్టుకోనిస్తారా?’’ అని అడక్కండి. ముంబయి హైకోర్టు వారు -యిదే స్కూలు బస్తాల, హోంవర్క్ మూటల భారంపై వచ్చిన ‘కేసు’మీద బల్లగుద్ది తీర్పు యిస్తూ-‘‘స్కూల్సుకి వాటర్ బాటిల్స్ తీసుకుపోరాదు. ఫ్యాన్సీ టిఫిన్ బాక్సులు, చక్రాలున్న స్కూలు బ్యాగ్సు, బండ్లలాంటివి తీసుకుపోరాదు’’ అంటూ ఆర్డర్ వేసింది.. అదేలెండి ‘తీర్పు’ చెప్పింది!
మారిన ప్రభుత్వ పాలసీని అనుసరించి, తదనుగుణంగా ఎల్‌కెజీ నుంచి పీజీ దాకా కేజీల భారాన్ని- ఎత్తివేయమంటున్నారు- బాసులూ - విజ్ఞులు మరియు విద్యాధికారులు! ‘‘టెక్ట్స్‌బుక్సు వద్దు, బౌండు నోటుబుక్స్ వద్దు, ఇంచక్కా పెన్‌డ్రైవ్‌ల్లోకి ఎక్కించేసి, దాన్ని బాలల జేబుల్లో పడేసి ఇస్కూలుకి తోలెయ్యండి’’ అంటున్నారు- న్యాయమూర్తులు! ఔరా! కానీ, ‘‘వారెవ్వా!’’ అనే డిజిటల్ యుగపు ‘యమ్‌బ్రహ్మలు’ ఎందరో వున్నారు మన దేశంలో. ఇప్పటికే ఇంగ్లీషు రూల్సు వున్న ‘పోష్ స్కూల్సు’లో మంచినీటి సదుపాయం వుండదు- వాటిర్ బాటిల్స్ తప్పక తెచ్చుకోవలెను లేదా వీలైతే డాలర్స్‌లో లేకపోతే, ఆ రోజు ‘మారకం రేటు’ చూసి రూపాయలతోనో ఫైన్ కట్టవలెను’’ అనే మాడరన్ స్కూల్సున్నాయి ఎన్నో!
డ్రెస్‌కోడ్, మ్యానర్స్ కోడ్ తప్ప మరే సదుపాయం లేకపోయినా బండెడు బుక్సూ, సూటూ, బూటూ, హ్యటూ వారానికి మూడు రకాలుగా వుండే స్కూళ్లకి ‘డిమాండ్’ పెరిగిపోయింది. ‘‘వాటర్ బాటిల్స్ మేం యిస్తాం. దానికి ఫీజు అదనం’’ అంటూ స్కూల్స్ అనౌన్సు చేస్తే ఎంతమంది మమీ డాడీలు -గొప్పయిపోతూ- వో గంట పర్మిషన్ పెట్టుకొని ‘్ఫజులు అదనం’ అన్న ‘యాప్’తో తంటాలు పడి, దాన్ని సదరు స్కూలు అకౌంట్‌లోకి లాక్కొని ‘పెయిడ్.. యూ గో’ అన్నంతవరకూ కొంపలోనే తగలడతారేమో?-‘‘స్మార్ట్ ఏజ్‌నా?’’ ఇది! ‘‘అంత కోపం వద్దుసార్- తాతగారూ! సారీ.. సీనియర్ సిటిజన్ గారూ’’ అంటున్నదో సాఫ్ట్‌వేర్ భామామణి.

మోర్ ది ఫీజ్.. మోర్ ద గ్లామర్!

వీరాజీయం...సెల్: 92900 99512