వీరాజీయం

‘పాత ప్లాస్టిక్’తో కొత్త టిఫిన్ సెంటర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం ఎందుకు? జిందగీ కిస్‌కేలియే? అంటే.. ‘ఖానే కేలియే’ అన్నాడు కవి. తిండి తినడం కోసం కాకపోయినా బతకడం కోసం తినాలి. మహానగరాలలో ‘ఎంత చెట్టుకు అంతగాలి’ అన్నట్లు రుూ తిండి- ‘‘అవుట్ సైడ్ ది హవుస్’’ అనగా ఇంటి బయట కూడా దొరుకుతుంది. వంటింటి ఖానా కన్నా బయట హోటల్ ఫుడ్‌లో దాని రుచి దానికే వుంటుంది.
మహానగరం హైదరాబాద్‌లో, గ్రేటర్ హైదరాబాద్ ఏరియాగా.. హైటెక్ సిటీ, శిల్పారామం వగైరాలలో రెస్టారెంట్లకి ఎంత డిమాండ్ వుందో.. దారంటా, వారంటా వుండే టిఫిన్ కియాస్క్‌లకి.. అంత డిమాండ్ వుంది. తిండి కలవాడు కండ గలవాడు అవుతాడు.. ‘‘కండ గలవాడు మనిషోయ్’’ అన్నాడు అప్పారావ్‌జీ- ఆయన సంగతి వేరు. చాలా పల్చగా, బక్కగా వుండేవాడు. కానీ మహర్షులు, మహానుభావులు.. వాళ్లంతా అంతేకదా...
హైదరాబాదులో పది పనె్నండు వేల ‘క్లాసు’ రెస్టారెంట్లు వున్నాయి. కానీ అవి ఏ మూలకొస్తాయ్? చెయ్యి జాపితే బయటి ‘్ఫడ్’ అందాలి, సిటీ జనులకి అనగా మహానగర వాసులకి-సిటీలో ఎన్నో ‘టిఫిన్ బండ్లు’ వున్నాయి. కానీ అన్నీ మున్సిపల్ పన్ను చెల్లించవ్. ‘‘పానీపూరీ- సమోసా-లు మాత్రం- రుూ అనామిక చక్రాలబండిల మీదే రుచిగా దొరుకుతాయి’’ అని, వాటిని లొట్టలు వేసుకు తినేవాళ్లు నమ్మబలుకుతున్నారు. తెలుగువాడ- వాడు, తెలంగాణా అయినా, రాయలసీమ అయినా- పచ్చళ్లదాసు ‘‘మరి కాస్త చెట్నీ వెయ్యి’’ అంటాడు. టిఫిన్‌బండీ ఆసామి లేదా అమ్మాయి, ‘‘యిలా’’ మొహం చిట్లించుకుంటుంది. ‘‘మరో బోండా పడేయ్’’ అన్నా పడేస్తాను గానీ పచ్చడి నువ్వే మ్రింగేస్తే మిగతా కస్టమర్లు వెళ్లిపోతారు అని లోపల్లోపల అచ్చతెలుగులో తిట్టుకుంటుంది.
సదరు, ‘మొబైల్ కఫే’లవల్ల పొల్యూషన్ వాతావరణ కాలుష్యం, అపరిశుభ్రత- వగైరాలు వస్తాయి. వీటికి మనం పెట్టిన పేరు ‘మొబైల్ కఫే’ అయినా, వాటిని వాళ్లు ‘సెంటర్’ అని సమాధానపడి, కష్టమర్లను బట్టి- ఆయా సిటిజన్‌ల యిష్టదైవాలయొక్క లేదా- యిష్టనాయకుల పేర్లు పెడతారు. ఒక్కో టిఫిన్ బడ్డీ ఒక్కోరకం.. ఆలూ టిక్కీకీ, మిర్చీ బజ్జీకీ, రెడీమేడ్ బిర్యానీలకీ- ‘ఫేమస్’- అయితే పర్యావరణకి పరమ శత్రువులు రుూ అల్పాహార ఫలహార స్వర్గాలు. దీపం లేకపోతే లేక మంచినీళ్ల పంపు రాకపోతే మనం అల్లాడిపోయినట్లు- రుూ ‘‘టిఫిన్ సెంటర్’’లు లేని ఏరియాలో జనాలు అల్లాడిపోతారు.
దారంటా, వారంటా దొరికే ఫుడ్‌లో తినేవాడికీ, అమ్మేవాడికీ ‘‘థ్రిల్’’- ‘‘మజా’’-వగైరాలు వుంటాయి గానీ- పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదముంది’’- అని పొల్యూషన్ పండిట్స్ ఉవాచ. మహాలక్ష్మి నుంచి మారిలిన్ మన్రో పేరు దాకా పేర్లను ధరించాయి రుూ తిండి దుకాణాలు- ‘‘గలీజు చేయని గల్లీ వుండదు’’ అంటారు.. తిండి పుష్టి, కండ పుష్టి మరియు, జేబులో తగినంత ‘తడి’లేదా, ‘‘తైలం’’ లేనివాళ్లు..
కలకత్తా, ముంబయ్ నగరాలలో, రుూ టిఫిన్ సెంటర్లలో.. మన ప్రాంతంలో పానీపూరీ, ఆలూటిక్కీకీ వున్నంత డిమాండ్ మన మసాలా దోసెలకీ, మిరపకాయ పకోడీలకీ వుంది. కానీ కొన్ని మహానగరాలలో, తెలుగులో చెప్పాలీ అంటే- ‘‘ఎకోఫ్రెండ్లీ టిఫిన్‌కి ‘యాస్క్’లున్నాయి. అనగా వీటివల్ల పర్యావరణం ‘ఫ్రెష్’గానే వుండిపోతుందిట!!
ఈమధ్య ప్లాస్టిక్‌మీద నిషేధం వొచ్చింది. దీంతో పాత న్యూస్ పేపర్లకి, పొట్లాల నిమిత్తం మళ్లీ డిమాండ్ వస్తోందని ఓ యిల్లాలి ఆశ. టిఫిన్ సెంటర్లు నడిపేవాళ్లు- తానూ, భార్యా, లేదా గాళ్‌ఫ్రెండ్, కొండొకచో వర్కింగ్ పార్టనర్‌లను పెట్టుకుని, ఓ ‘‘వాష్‌బోయ్’’ని పెట్టుకొని- ఝామ్మని, కమ్మని వ్యాపారం సాగించేస్తారు. సర్వర్లు, బల్లలు, కుర్చీలు, వాష్‌బేసిన్లు- బిల్లుకాయితం ముక్కలు, గల్లాపెట్టి- వగైరా ఝంఝాటాలేమీ అక్కరలేదు. ఇంక లాభాలు అంటారా? అవి ఫైవ్‌స్టార్ హోటల్ వాళ్లకయినా రావేమో గానీ, రుూ అల్పాహార కల్పవృక్షాలు నిభాయించే వాళ్లకి అర్థరాత్రివేళకి చేతిలో గలగలాపడిపోతాయి. కానీ, వాళ్లకీ ‘‘ప్రోబ్లెమ్స్’’ వుంటాయి. చీమలు, ఈగలు, ఎలుకలు వగైరా ప్రకృతి బాధలు సరే- ముష్టివాళ్లు, ‘దాదా’లు, పోలీసులు, మ్యునిసిపల్- శానిటరీ స్ట్ఫా- రుూలా, రకరకాల సమస్యలుంటాయి. కానీ, కష్టమర్ సాటిస్‌ఫేక్షన్- అనగా భోజనప్రియుడికి కలిగే తృప్తి ముఖ్యం- యిది దండిగా దొరుకుతుంది.
అంచేత, వీటిని నిషేధించడం కాదు- వీటిని పర్యావరణ పరిశుద్ధతతోపాటూ- స్వచ్ఛ్భారత్ ఉద్యమానికి బాసటగా చెయ్యాలని- హైదరాబాద్ బల్దియా కూడా- ఓ యాభై ‘‘తిండి బండీ’’లను తయారించి- సమర్థులైన వారికిచ్చి- ఆరోగ్యం, తిండి మత్తు అండ్ ఎన్విరాన్‌మెంటల్ క్లెన్లీనెస్ అనగా- పరిసరాల పరిశుభ్రతని కాపాడాలని- కొత్తరకం టిఫిన్ ‘బడ్డీ’లను చేయించాలనీ- వాటిని హైటెక్ సిటీలోనూ, శిల్పారామం లాంటి జనం ఎగబడి వచ్చే ఆరామ ప్రాంతాలలోనూ ఏర్పాటుచేయాలని- ఓ యాభై లక్షల రూప్యముల ప్రాజెక్టు ఒకటి తయారుచేసి అమలుచేస్తున్నాయి.
దీని స్పెషాలిటీ ఏమిటనగా- వీటివల్ల పరిసరాలు పర్యావరణం, అన్నీ నీటుగా- స్వచ్ఛ్భారత్ జిందాబాద్ అంటూ పరిఢవిల్లుతాయి. వీటికి చెక్కలుగానీ, పలకలు గానీ, టార్పాలిన్ టాపులు గానీ వుండవు. (అబ్బే! అవి ఓల్డ్ మరియు ఏబ్రాసి- తట్టలుగదా!)
ఈ బడ్డీలు రెండు మీటర్ల వెడల్పులో, కొంచెం తక్కువగా మీటరుమీద ఎనభై సెంటీమీటర్ల ఎత్తున వుంటాయి. వీటిని రీసైక్లింగ్ చేసిన, పాత ప్లాస్టిక్ వస్తువులనుపయోగించి చేసిన రేకులతో- ముద్దులొలికే- అందాల ‘మందసా’లలాగా తయారు చేయిస్తున్నారు. ‘‘టూ బర్డ్స్ ఎట్ ఒన్ షాట్’’- అనగా, ‘‘ఒకే దెబ్బకి రెండు పిట్టలు’’ అన్నట్లు- పాత ప్లాస్టిక్ సామాన్లు వుండవు. ‘తుప్పు’ సమస్యలూ వుండవు. ఒక్కో బడ్డీకి లక్ష రూపాయల వ్యయం అవుతుంది. అది పురపాలకుల ‘ఖాతా’లోనుంచి వస్తుంది కదా...
ఇట్లాంటి ‘నయా బడ్డీలను, ఓ డెబ్భైదాకా సమర్థులైనటువంటి వారికి శిక్షణయిచ్చి మరీ శివారు భాగ ప్రాంతాలలో ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కో ‘బడ్డీ’ తయారీకి రెండు వేల పాత ప్లాస్టిక్ సీసాలు కావాలి. వీటిని యిండ్ల చుట్టూ తిరిగి కలెక్ట్ చెయ్యవచ్చు. కావాలీ అంటే, వీటితో ఒక ‘‘షీట్’’ చేయించి, ఆనక రుూ ‘బడ్డీలు’ చేయిస్తారు.
‘జాతీయ ఆహార ప్రమాణ రక్షణ సంస్థ’వారి ప్రమాణాలు పాటించి రుూ బడ్డీలలో - ప్లాస్టిక్ వస్తువులు లేకుండా, టిఫిన్‌లు చేసి అమ్ముతారు. పైగా- రుూ తిండి పదార్థాలను సప్లయ్ చేసేటందుకు ప్లాస్టిక్‌లా కనబడే ప్లాస్టిక్ కాని ప్లేట్లు, గ్లాసులు ఉపయోగిస్తారు. ఇవి కరిగిపోయి, మాయమయిపోతాయి గానీ- శతాబ్దాల తరబడి చెక్కుచెదరకుండా వుండే మెటీరియల్ కాదుట.
అంతా బాగానే వుంది. ఇటువంటి ‘పర్యావరణ చెలిమి’ ఉద్యమం బాగుంది. పాత ప్లాస్టిక్ వస్తువులకు గిరాకీ కూడా ఏర్పడుతుంది. ఉపయోగమూ వుంటుంది. కానీ అన్ని రంగాలలోనూ- అన్ని రంగుల ప్లాస్టిక్ బాటిల్స్‌ని నిషేధించి- వాటిని మార్కెట్‌లోకి రాకుండా ఎత్తేస్తారు కదా? అప్పుడు, రుూ బడ్డీలకు, ప్లేట్లకు, కప్పులకు- పాత ప్లాస్టిక్ సరుకు ఎట్లు లభించున్? అన్నది గోల్డెన్ డవుట్. అనగా అనుమానం!
‘‘డోన్ట్‌వర్రీ బీ హ్యాపీ ఫర్ నౌ!’’

veeraji.columnist@gmail.com 92900 99512