వీరాజీయం

శాడిస్ట్ రేపిస్టులకు సరియైన శిక్ష ‘ఉరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని చట్టాలు చేసినా- ‘చట్రాలు’ యింకా గట్టిగా బిగించినా, రుూ ఆధునిక కాలంలో కూడా కిరాతక, భయానక సామూహిక మానభంగాలు- తదనంతరం హత్యలు- యివి ఎక్కువైపోతున్నాయే గానీ అదుపు సాధ్యం కావడం లేదు. తెల్లారేపాటికి పత్రికలు పూర్తిగా తెరచి చూడకుండానే ప్రత్యక్షమయే ఘోరవార్తలు ఇవే!
మానభంగాలు, రోడ్డుప్రమాదాలు- రాను రాను వీటి సంఖ్య పెరగడమే కాదు జరుగుతున్న తీరు అత్యంత నీచం, భయానకం, విస్మయం కలిగించేవిగా కూడా వుంటున్నాయి. ఒక ప్రక్క సామాజిక ప్రగతి సంఘ జీవితంలో సాంకేతిక సదుపాయాల వినియోగం పెరుగుతూనే వున్నది. నిఘా నేత్రం రెండు పార్శ్వాలు గాక అనేక దిక్కులుగా- అనేక కోణాలతో పెరుగుతున్నది మరోప్రక్క.
వావీవరుసలు, ఉచ్ఛనీచాలూ, తరతమ భేదాలూ లేకుండా స్ర్తిని బలాత్కరించడంతో ఆగక- సామూహికంగా ‘రేప్’ చేసి, బాధితురాలిని ఉచ్చరించలేనంత నీచంగా హింసించి చంపేస్తున్న కేసులు ఎక్కువ అయిపోతున్నాయి. ఇక వీటిని పట్టుకోవడం, విచారించడం, శిక్షలు వెయ్యడం అనే ‘ప్రాసెస్’ తాపీగా, నత్తనడక నడవటం- మనసున్న మనుషులకు తీరని వ్యథ అయిపోతున్నది. ఉదాహరణకి ‘నిర్భయ’ కేసు చాలు. ఏడు సంవత్సరాల తర్వాత కూడా నేరస్థులు ముగ్గురు న్యాయ చట్టంతో ‘దోబూచు’లాడటం- మన చట్టాలలో లోపాలు, లొసుగులు చాలా వున్నాయని- అవి బయటపడి వెక్కిరిస్తున్నాయి. గ్యాంగ్‌రేప్, ఆ వెంటనే బాధితురాలి కిరాతక హత్య- సజీవ దహనం వగైరాలు రుూ కాలంలో జరగాల్సినవేనా?
‘దిశ’ అత్యాచారం, సజీవ దహనం తర్వాత జనం ‘షాక్’ నుంచి యింకా కోలుకోకుండానే తెలంగాణాలో మరొక కిరాతక, భయానక వినలేని గ్యాంగ్ రేప్ మరియూ హత్య జరిగింది. ఇది గత నవంబర్ 24న కొమరంభీమ్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్‌పటార్ గ్రామ సమీపంలో ‘సమత’ అనే వివాహిత స్ర్తి పైన గ్యాంగ్ రేప్, ఆపై ఆమెని హత్యచేయడం జరిగాయి. ముగ్గురు ముష్కర మృగాల్లాంటి శాడిస్టులు, కామ పిశాచాలు - మరొకసారి తలుచుకోలేనంతటి దుర్మార్గంగా ‘సమత’ను సర్వనాశనం చేశారు.
ఈ కేసును పోలీసులు చాలా తొందరగానే పట్టుకున్నారు. కోర్టులో కేసు మామూలుగా కాక తెలంగాణ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో శీఘ్రగతి పరిష్కారం చేయగల ‘్ఫస్ట్‌ట్రాక్’ కోర్టును స్థాపించి, పరిష్కరించమని కోరింది. ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ప్రియదర్శినిగారు అరవై ఏడు రోజులలోనే రుూ పాశవిక నేరాన్ని సాక్ష్యాధారాలతో పరిష్కరించడం మన న్యాయస్థానాల యొక్క చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని చెప్పాలి.
నేరస్థులు ముగ్గురికీ యింత పిసరు కూడా దయా, జాలీ చూపెట్టనక్కరలేదని జడ్జీ తన తీర్పులో పేర్కొంటూ- ‘చచ్చేదాకా ఉరితీయాలి’ అని ‘శిక్ష’ వేయకపోతే కోర్టు సరియైన న్యాయం చేయలేదనిపించుకుంటుందని- సెషన్స్ జడ్జిగారు ఎక్కడా శషబిషలు లేకుండా బల్లగ్రుద్ది తీర్పునిచ్చి - నేరస్థులైన షేక్ బాబు (30), షేక్ షహబుద్దీన్ (40), షేక్ ముగ్ధుం (30)లకు ఉరికంబమే సరియైనదని తన 66 పేజీల తీర్పులో వివరించారు.
నిర్భయ కేసును ఆమె ఎక్కువగా ఉటంకించడం గమనించాలి. ఏ న్యాయమూర్తి అయినా, తన వ్యక్తిగతమైన అభిప్రాయ ప్రమేయం లేకుండా, యిటువంటి కేసులో తీర్పు చెప్పాల్సి వుంటుందని ఈ తీర్పు పేర్కొన్నది. ఈ కేసు పరిష్కారంలో పోలీసులు ఆధునిక సాంకేతికతని (టెక్నాలజీని) బాగా వినియోగించుకున్నారు. ఇపుడు నిఘా కెమేరాలు తీసిన ఫొటోలలాగా- ఆధునిక టెక్నాలజీలో రక్తపరీక్షల ద్వారా కూడా రుూ గ్యాంగ్ రేప్ కేసులను పరిష్కరించాలన్న కొత్త మార్గదర్శకత్వం- ‘సమత’ కేసు చేస్తున్నదని, అడ్వొకేట్‌లు ఎందరో హర్షిస్తున్నారు. ఈ ముగ్గురి ‘రక్తం’ తీసుకుని- డిఎన్‌ఏ పరీక్షలు చేసి దీనిని హతురాలి చీర మీద, శరీరంమీదా వున్న నెత్తురు మఱకలను పరిశీలించి- సదరు డి.ఎన్.ఏలతో పోల్చి చూశారు. ఈ విధంగా ఈ ముగ్గురే ఆ నిస్సహాయురాలిని మానభంగం చేయడమే గాక- ముప్పుతిప్పలు పెట్టి హింసించడాన్ని నిర్ధారించగలిగారు. ఈ విషయంలో పోలీసుల కృషిని కూడా ఎంతగానో శ్లాఘించాలి..
బాధితురాలి వయసు ముప్ఫై సంవత్సరాలు. ఇద్దరు పిల్లల తల్లి. వీధులలో గంపనెత్తిన పెట్టుకుని అమ్ముకునే పేదరాలు. ముగ్గురు రేపిస్టులు ఆమెను రేప్‌చేసిన అనంతరం దారుణంగా గొంతు కోసి చంపేసి, శరీరాన్ని లింగాపూర్ మండలంలోని ‘ఎలాపటార్’ గ్రామం దరి పొదలలో పారేసి పారిపోయారు. నాలుగు రోజుల తర్వాత జనాగ్రహం, నిరసన ప్రదర్శనల కారణంగా- పోలీసులు నిందితులు నలుగుర్ని పట్టుకున్నారు. వాళ్ల దగ్గరనుంచి ఒక సెల్‌ఫోన్, ఆమెను చంపడానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ‘దిశ’ కసులో లాగా వీళ్లు బాధితురాలిని సజీవ దహనం చేయలేదు. దీంతో డిఎన్‌ఏ పరీక్షలు కీలకమైన సాక్ష్యాన్ని ఇవ్వగలిగాయి. నిందితుల తరఫున సాక్షులను తెచ్చుకోవడానికి కోర్టువారు అదనంగా మరోరోజు గడువిచ్చినా వారికి ఎటువంటి సాక్షులూ, సాక్ష్యం చెప్పడానికి లభించలేదు. ‘్ఫస్ట్‌ట్రాక్ కోర్టు’ ఏర్పాటువల్ల- టెక్నాలజీని వాడుకోవడంవల్లా ఇంత తొందరగా రుూ కేసు పరిష్కరింపబడి నేరస్థులు ముగ్గురికీ ‘ఉరిశిక్ష’ పడటం- సర్వే సర్వత్రా హర్షాతిరేకతని ప్రకటించింది.
సెషన్స్ కోర్టు ఉరిశిక్ష వేయొచ్చునా? హైకోర్టు రుూ శిక్షని తగ్గించే అవకాశాలుంటాయి- లాంటి చర్చలు - మీమాంసలు న్యాయవర్గాల మధ్య జరుగుతున్నాయి. జరగనివ్వండి.. కానీ ఈ కేసు జడ్జి అన్నట్లు- ‘బాధితురాలి ఆత్మకు మాత్రం శాంతి లభించింది’. ఈ కేసు నేరమనస్తత్వం గల మానసిక దుర్బలులకు, భయంకర శాడిస్టులకూ ఒక హెచ్చరికగా విస్తృత పబ్లిసిటీ ఇవ్వాల్సి వుంటుంది! అది మస్టు!
‘శాడిస్ట్ రేపిస్ట్స్ నెవర్ డిజర్వ్ మెర్సీ!’

veeraji.columnist@gmail.com 92900 99512