వీరాజీయం

మన ప్లాట్‌ఫామ్స్: వాటి ‘ఇంపూ’ ‘కంపూ’...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ప్లాట్‌ఫామ్స్ ఎంత మంచివి! కొందర్ని కలుపుతాయి. ప్లాట్‌ఫామ్స్ ఎంత చెడ్డవి! ఎందర్నో విడగొడతాయి- అంటాడు కవి.
ఈ రెండు సందర్భాలలోనూ కూడా ప్లాట్‌ఫామ్స్ అంటే అవి రైల్వే ప్లాట్‌ఫామ్సే అయి వుంటాయి.
మనది స్వచ్ఛ్భారతం అవ్వాలనుకుంటున్న స్వతంత్ర భారత్. ఇక్కడ రుూ రైల్వేస్‌ని- ‘్భరతీయ రైల్’ అంటా రు- జాతీయ భాషలో. కానీ, మనం అర్ధమయ్యేలాగా చెప్పుకోవాలంటే.. ‘ఇండియన్ రైల్వేస్’- అనాలి.
అహో! మన రైల్వే వ్యవస్థ చాలా పెద్దది! పబ్లిక్ సెక్టార్‌లో యింతకన్నా పెద్ద వ్యవస్థ, వుద్యోగులూ వున్న వ్యవస్థ వేరొకటి లేదుగాక లేదు. 1853 ఏప్రిల్ 16న పుట్టిన మన రైల్వే (163 సంవత్సరాలైపోయిందా అబ్బా!) నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మైన్మార్‌లకు కూడా కొన్ని రైళ్లు నడుపుతోంది. దీనికి 16 రైల్వే మండలాలు వున్నాయి. మాటలా? 7125 రైల్వేస్టేషన్‌ల మధ్య 71వేల మైళ్ల పొడుగున రైలు పట్టాలు- జనాల్నీ, సరుకుల్నీ ఆ చక్రాల మీదే దొంగల్నీ, ముష్టివాళ్లనీ కూడా అటూ, యిటూ మోస్తూ వుంటాయ్. ఏడువేలకు పైగా రైల్వేస్టేషన్లున్నాయి. అంటే ఒక్కో స్టేషన్‌కి, కొన్ని పట్టణాలలో పది, పనె్నండు ప్లాట్‌ఫామ్స్ వుంటాయి కదా?
అన్నట్లు ప్రయాణీకుల సంఖ్య రెండున్నర కోట్లు దాకా ప్రతిరోజుకి వుంటుంది. చాలా ‘గొప్ప’లున్నాయి మన రైల్వేస్‌కి. ఐతే, ప్లాట్‌ఫామ్స్ అనేసరికి, అదేదో నీచ ఉపమానం అన్నట్లు ప్రవర్తిస్తారు - మనవాళ్లు-
‘ప్లాట్‌ఫామ్ బ్రతుకయిపోయిందనుకో’- అనీ, ‘పరమచెత్త... ఇంత కంపా? ఇంతకన్నా ఏదయినా ప్లాట్‌ఫామ్ నయం’ - అనీ అంటాడు ఒకడు. టిక్కెట్ కొనకుండా ప్లాట్‌ఫామ్ మీదికి వెళ్లి, చుట్టాలికి టా...టా చెప్పి- రెండు రైలు ‘కానా’ల మధ్యనుంచి బయటికి వచ్చేసిన పెద్దమనిషి అతగాడు.
అవును మరి. మన భారతీయ రైల్- ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధర పది రూపాయలు! ఎవడు కొంటాడు దుఃఖ పడకుండా? ఐతే, రుూ ప్లాట్‌ఫామ్సే లేకపోతే మనకి ప్రయాణాలే లేవు. మన ముష్టివాళ్లకీ, దొంగలకీ, కుక్కలకీ క్లాసయిన ఠికానా లేదు. కానీ అంతా ప్లాట్‌ఫామ్స్‌నే ‘పరమ చెత్త’ అంటూంటారు-
అందుకనే ఇండియన్ రైల్వే మంత్రి వర్గానికి- రైల్వే ప్లాట్‌ఫామ్స్ మీద- అందులో ‘ఏవి’ ‘యింపు’ అయినవి? ఏవి ‘పరమ కంపు’ అయినవి?’అని తెలుసుకోగల ఒక సర్వే చెయ్యబుద్ధయింది. కాని అన్ని ప్లాట్‌ఫామ్స్ చెయ్యగలరో, ‘్ఛస్తారేమో! అన్ని వేల శత, లోహ చక్రాల రథముల నిలయాల వేదికల మీద సర్వే అంటే... అందుకని అందులో కొన్నింటిని అనగా 407 స్టేషన్లని ముందు- వాటి వాటి ‘ఆరా’ తీయడానికి, రంగంలోకి ధైర్యంగా దిగారు. రోజుకో లక్ష మంది ప్రయాణీకులు పావనం చేసే ప్లాట్‌ఫామ్స్ ‘ఏ.ఒన్’ కేటగిరీ; ఓ యాభై వేల జనాలు త్రొక్కిపోయే ప్లాట్‌ఫామ్స్ ‘ఏ.టు’ కేటగిరీ అనుకున్నారు. రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వాళ్లని పిలిచి, నలభై ప్రశ్నలున్న ప్రశ్నావళిని వారికిచ్చి- వెయ్యి మార్కులకు అంచనాలు తియ్యమని యివ్వగా వారు ఒక ప్రయివేటు సంస్థ ద్వారా- రైలుబండ్లు ఆగీ, ఆగక, వచ్చేపోయే అన్ని ప్లాట్‌ఫామ్స్ మీద (ఎంపికయిన 47 స్టేషన్లకే పరిమితం) ప్రయాణీకుల్నీ, లైసెన్స్ కూలీలనీ యితర స్వచ్ఛ మరియు, స్వేచ్ఛా సిబ్బందిని పట్టుకుని ఆ క్వశ్చన్ పేపర్‌లోని ప్రశ్నలకి జవాబులు సంపాదించి- మార్కులువేసి, ర్యాంకుల్నిచ్చారు.
మొదటవారి టాప్ ప్రశ్న- మరుగుదొడ్లు, కంపు, గలీజు లాంటివి. వాటిమీదనే ఎక్కువమంది వినియోగదారులు (టికెట్‌లెస్ కూడా కలపాలి కదా?) ‘కంపు’కొడుతున్నాయ్ బాబోయ్’’- అంటూ స్టేషన్లమీద గట్టి తీర్పునిచ్చారు.
ఆ విధంగా సర్వే చేసిన ఫలితాల నివేదిక, రెండువేల పైచిలుకు ‘పుటల గ్రంథం అయింది’. తలక్రిందికా? (పెట్టుకోడానికి, దిండులా) చదవటానికా అది?’’అని మీరడుగుతారు కనుక, దానినట్లుండనిండు...
‘పరమోత్తమ’, ‘పరమచెత్త’ ర్యాంకులు సంపాదించిన పది మరియు పది స్టేషన్లను చూద్దాం.
బై ది బై మన గోల మనకి వుంటుందిగా? దేశం మొత్తంమీద సికిందరాబాదు 23వ ర్యాంకు సంపాదించిందిటండీ! జయహో! కాకపోతే ‘ఏ ఒన్’ కేటగిరీ స్టేషన్లలో ఘనత వహించిన - అతిపెద్ద రైలుబండ్ల కూడలి. ప్రపంచంలోనే- అది సుదీర్ఘమైన ప్లాట్‌ఫామ్స్‌లో ఆరవ ర్యాంకు గలదీ అయిన బెజవాడ మాత్రం 45వ స్థానంలో వుండి పోయింది. వెంకన్నగారి వూరు- తిరుపతి 38వ ర్యాంకు కొట్టేసింది. ‘‘తిరుపతి ప్లాట్‌ఫామ్ వెలుపల వుండే కంపు- సర్వేలోకి రాదనుకుంటాను’’- అన్నాడో యాత్రీకుడు గుం డు తడుముకుంటూ. కాగా- మన ఎ.పి. యొక్క ఇంటర్ నేషనల్ సిటీ వైజాగ్‌కి 42వ ర్యాంకు దొరికింది. కానీ, నెల్లూరు ‘లెవల్ 2’లో టాప్ టెన్ స్టేషన్లలో ఐదో స్థానం చూరగొన్నది. భేష్!
ఈ సర్వేలలో లక్షాముప్ఫయి వేల మంది రాసిన జవాబులు తీసుకుని- లిఖిత పూర్వకంగా నమోదుచేశారు. కనుక రుూ సర్వేల ఆధారంగా ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధికి ప్లాన్ చేసే అవకాశాలుంటాయి అని ‘ఆశాజీవుల’ ఆశ!
అది సరే- మన ‘‘కాలమ్ రైలు’’ ఔటర్ దాకా వచ్చేసింది. టైమ్ చాలదు కనక ప్లాట్‌ఫామ్ ‘‘రీచ్‌యి’’పోతాం. సో... ‘టాప్స్’, ‘బాటమ్స్’ చెప్పి మిగతాది విజ్ఞులయిన ప్యాసింజర్లకే ఒగ్గేస్తాను. చెత్త స్టేషన్లన్నీ బీహార్, యు.పి. రాష్ట్రాలలోనూ- మంచి స్టేషన్లు ఓ అయిదు గుజరాత్‌లోనూ వున్నాయిట! దేశం మొత్తంమీద అతి శుభ్రమయిన, ఇంపయిన స్టేషన్ పంజాబ్‌లోని అమృతసర్ జిల్లా - బియాస్ నదీ తీర స్టేషన్ ‘‘బియాస్’’అని నిర్ణయించారు. భల్లే... భల్లే...! ఆ వరుసలో గాంధీగ్రాం (2) వాస్కోడగామా (గోవా) 3; జామ్‌నగర్ (4)(గుజరాత్) (4) కుంభకోణం (తమిళనాడు) (5) సూరత్ (గుజరాత్) (6) నాసిక్ రోడ్ మహరాష్ట్ర (7); రాజకోట్- గుజరాత్ 8; సేలం -9; కాగా అంకలేశ్వర్ 10; సరేనా?
ఇక చెత్తకంపు ప్లాట్‌ఫామ్స్ ర్యాంకింగ్స్ యిలా వున్నాయి. టాప్ బిహార్‌లోని మధుబాణి (పేరుగొప్ప వూరు కంపు) (2) బాల్లియా (బీహార్) 3; భక్తియార్‌పూర్ (బీ) (4) రాయచూర్ కర్ణాటకా 5; షాగంజ్ (యు.పి) (6) జంఘాయి (యు.పి.) (7); అనుగ్రహ నారాయణ్ (బీహార్) (8) సుగౌలీ (బీహార్) (9) ఆరా (మళ్లీ బీహార్) (10) ప్రతాప్‌గఢ్ (యు.పి).
అదండీ ఇండియన్ రైల్వేలో ఎంపికయిన 407 స్టేషన్లలోని ప్లాట్‌ఫామ్స్‌లో సర్వేచేసి వడపోత పెట్టిన తర్వాత మిగిలిన ‘ఇంపు-కంపు’గల ప్లాట్‌ఫామ్స్ కథ. ప్లాట్‌ఫామ్ ఏదయితేనేం? మన జర్నీ మొదలయినా- ఎండ్ అయినా అక్కడేగా?!...
సో, సీయూ... టా.. టా! హ్యాపీ జర్నీ!